Friday 22 February 2013

వరాహ జయంతి


|| ॐ || ఓం శ్రీ పరమాత్మనే నమః || ॐ ||

ॐ 22-2-2013, శుక్రవారం, మాఘ శుద్ధ ద్వాదశి, వరాహ జయంతి

ॐ నవగ్రహాలను, భూమిని దైవంగా కొలిచే సంస్కృతి మనది. గ్రహాల్లోనూ, నక్షత్రాల్లోనూ, ప్రకృతిలోనూ, ఈ సమస్త భూగోళమంతా దైవశక్తులతో నిండిపోయిందని మన ధర్మం చెప్తోంది. ఒకానొక సమయంలో కొంతమంది రాక్షస స్వభావం కలవారు భూభాగం క్రింద ఉన్న సహజవనైన చమురును అధికంగా బయటకు తీయడం వలన భూగోళం తనపట్టు తప్పింది. భూభాగం క్రుంగిపోయింది. దానికితోడు అంతరిక్షంలో తన కక్ష్య నుండి ప్రక్కకు జరిగింది. దీనితో మన భూమిని నిత్యం రక్షిస్తూ ఉండే ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు మొదలైన దేవతలందరూ భయబ్రాంతులకు గురై, శ్రీ మహావిష్ణు వద్దకు పరుగు పరుగున వెళ్ళి భూగోళాన్ని కాపాడమని వేడుకున్నారు.  

ॐ వారి ప్రార్ధనలు మన్నించి శ్రీ మహావిష్ణువు, తన భార్యైన భూదేవిని రక్షించడానికి వరహ ఆవతారం స్వీకరించారు. తన కోరల మీద భూమిని నిలిపి, అంతరిక్షంలో తన కక్ష్యలో తిరిగి నిలిపారు. అలాగే క్రుంగిపోయిన భూభాగాన్ని తిరిగి మామూలు స్థానానికి తీసుకువచ్చారు. ఈ విధంగా చేయడం వలన స్వామిని ఒక హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఎదురించాడు. వాడిని హతమార్చి స్వామి తిరిగి అంతర్ధానమయ్యారు. అది మాఘ శుద్ధ ద్వాదశి నాడు జరిగిందని శ్రీ మద్భాగవతంలో ఉంది. అందుకే ఈ రోజు ఆదివరహా మూర్తిని అర్చించాలి, ఆయనకు కనీసం నమస్కరించాలి.

ॐ భూమి మీద సహజవనరులు ఉన్నాయి. అనేక నిధినిక్షేపాలు, లోహాలు భూమిలో ఉన్నాయి. వాటిని విపరీతంగా, సంపూర్తిగా వాడకోవడం వలన జరిగేది వినాశనమే. అదే చేశారు ఆ రాక్షసులు. అందుకే భూమాత తన పట్టు తప్పి, ప్రక్కకు జరిగింది. తన భూమిని కాపాడుకోవడానికి శ్రీ మహావిష్ణువు వరహ అవతారం ఎత్తి, వారిని చంపవలసి వచ్చింది. ఇప్పుదు కూడా ప్రపంచంలో అదే జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్రగర్భంలో ఉన్న సహజవాయువును, చమురును అతిదారుణంగా మొత్తం బయటకు తీసివేస్తున్నారు. రాబోయే 10-20 సంవత్సరాలలో ఈ భూమి మొత్తం ఏ వనరులు లేకుండా మిగిలితుందని నివేదికలే మొత్తుకుంటున్నాయి. ఇటువంటి సమయమలో ఈ వరహ మూర్తి కధను మనం గుర్తుపెట్టుకుని మన భూమిని, సహజవనరులను కాపాడుకోవలసిన అవసరం ఉంది. లేకుంటే శ్రీ మహావిష్ణు ఆగ్రహానికి గురికావలసి ఉంటుంది.

|| ॐ || ఓం శ్రీ పరమాత్మనే నమః || ॐ ||    

courtesy : http://www.krishna.com/lord-varaha-krishna-boar-incarnation 

|| ॐ || ఓం శ్రీ పరమాత్మనే నమః || ॐ ||    

1 comment:

  1. వరాహ జయంతి లేదా వరాహ ద్వాదశి చైత్ర బహుళ త్రయోదశి అండీ , మీ వ్యాసా హెడ్డింగ్ని సవరించండి

    ReplyDelete