Thursday 21 February 2013

విశ్వకర్మ జయంతి


|| ॐ || జై విశ్వకర్మ || ॐ ||

ॐ 23-2-2013, శనివార,మాఘ శుద్ధ త్రయోదశి.

ॐ మాఘశుద్ధ త్రయోదశిని విశ్వకర్మ జయంతిగా జరుపుతారు. విశ్వకర్మ వృత్తివిద్యలు, నిర్మాణ, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన విద్యలకు అధిపతి. ఈయన దేవశిల్పి.

ॐ పరమశివుడి ఆజ్ఞ మేరకు బంగారుమయమైన లంకా నగరాన్ని నిర్మించారు. శ్రీ కృష్ణపరమాత్మకు ద్వారకనగరాన్ని నిర్మించినది కూడా విశ్వకర్మే.

ॐ శ్రీ రామావాతరంలో శ్రీ రాముడు లంక చేరడం కోసం రామసేతును నిర్మించిన నలుడు, నీలుడు విశ్వకర్మ పుత్రులు. వాళ్ళు ఆనాడు కట్టిన రామసేతు లక్షల ఏళ్ళు గడిచిన ఈరోజుకి ఇంకా పదిలంగానే నిలిచి ఉంది.    

ॐ విశ్వకర్మ జయంతి రోజున అందరూ తమ వృత్తిపనుల్లో ఉపయోగపడే వస్తువులను విశ్వకర్మ చిత్రపటం ముందు పెట్టి పూజించాలి.ఈ రోజున పనిముట్లను పూజిస్తాం కనుక వాటిని వాడకూడదు. వృత్తిపనులను చేయకూడదు. బెంగాల్ ప్రాంతంలో విశ్వకర్మ జయంతిని చాలా వైభవంగా భజనలతో, నాట్యాలతో నిర్వహిస్తారు.

|| ॐ || జై విశ్వకర్మ || ॐ ||      

No comments:

Post a Comment