Monday 18 February 2013

భీష్మాచార్యులవారి సనాతన ధర్మ నిబద్ధత

ఈ రోజు భీష్మాష్టమి.
భీష్మాచార్యులవారి సనాతన ధర్మ నిబద్ధత.

శ్రీ భీష్మపితామహుని వేద పరిజ్ఞానము, ఆ సనాతన ధర్మము పట్ల వారి నిబద్ధత తెలుపు ఒక కధ చెప్పుకుందాము. 

తన తండ్రి శంతనుడు పరమపదించిన పిదప భీష్మాచార్యులవారు తండ్రికి శ్రాద్ధ కర్మ నిర్వహిస్తున్నాడు. పిండప్రదానము చేయునపుడు ఆకాశమునుండి శంతనుడు పిండములు స్వీకరణార్ధము చేతులు మాత్రం చాచాడు. భీష్ముడు ఈ విషయము చూచి ఆ చేతులను త్రొసివేసి దర్భలమీదే పిండములను ఉంచుతాడు. అప్పుడు శంతనుని కంఠం "నేనే స్వయముగా వచ్చానుకదా! నా చేతికే ఇవ్వవచ్చును కదా!" అని పలుకుతుంది. అందుకు భీష్ముడు "తండ్రీ! పితృదేవతలకు పిండప్రదానము దర్భలమీదే చెయ్యమని వేదనిర్ణయము. కాబట్టి నా తండ్రి స్వయముగా పితృలోకములో నుండి వచ్చినా నేను వేదనిర్ణయమును తప్పలేను. ఇది ధర్మము." అని పలుకుతాడు. ఆయనకు వేదము పట్ల ఉన్న విశ్వాసమునకు, ధర్మనిబద్ధతకు దేవతలు మరోసారి ఆయనమీద పుష్పములు కురిపించి తమ ఆనందము, ఆమోదము తెలిపారు. (భీష్మప్రతిజ్ఞ చేసినపుడు ఒకసారి ఇలాగే దేవతలు ఆయనమీద పుష్పములు కురిపించారు.)

No comments:

Post a Comment