Friday 8 February 2013

గంగానదితో భారతదేశానికి స్వర్ణయుగం

గంగానదితో భారతదేశానికి స్వర్ణయుగం

అవును గంగానది భారతదేశానికి పునర్వైభవం తీసుకువస్తుందని మీకు తెలుసా? అయితే ఇది చదవండి.

భారత్ వ్యవసాయప్రధానమైన దేశం. మన దేశంలో వ్యవసాయం అత్యధికంగా ఋతుపవనాలు, నదుల మీదే ఆధారపడింది. మన దేశంలో ఉత్తరభారతంలో ప్రవహించే నదులు హిమాలయాల్లో ఉధ్భవిస్తాయి. హిమాలయాల్లో ఉన్న మంచుకరగడం వలన వచ్చే నీటి ప్రవాహంతో హిమనీనదులు సంవత్సరం మొత్తం నిండుగా ప్రవహిస్తాయి. మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో అంటే ఎండాకాలం హిమాలయల్లో మంచు ఎక్కువగా కరగడం వలన వీటికి ఈ కాలంలో వరదలు వస్తాయి. ఈ కాలంలో ఎంతో విలువైన వరద జలాలను నిలువ చేసుకునే సామర్ధ్యం లేక క్రిందకు విడిచిపెడతారు.

ఇందుకు భిన్నంగా, దక్షిణ భారతంలో నదులు ఎక్కువగా ఋతుపవనాల మీద ఆధారపడి ప్రవహిస్తాయి. అవి వర్షాల మీద ఆధారపడడం వలన జూలై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో వరద పోటెత్తుతుంది. కాని ఈ నదులు ఎండాకాలానికి దాదాపుగా ఎండిపోతాయి. ఒక చోట నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంటే, మరొక చోట నీరు లేక కరువుతో అలమటించే పరిస్థితి. ఒక చోట అతివృష్టి, మరోక చోట అనావృష్టి. దీనికి తోడు భారత్ లో విద్యుత్ లోటు ఎక్కువ.

దీనికి పరిష్కారం " జాతీయ నదుల అనుసంధాన విధానం ". అంటే మన దేశంలో ఉత్తరభారతంలో ఉన్న నదులను దక్షిణ భారతంలో ఉన్న నదులతో కాలువల ద్వారా అనుసంధానం చేస్తారు. ప్రతి నదికి అనేక కాలువలు త్రవ్వి, వాటి ద్వారా ఎండాకాలంలో హిమనీనదులకు వచ్చే వరద నీటిని ఆ సమయంలో నీరు లేక ఎండిపొయి ఉన్న దక్షిణ ప్రాంత నదులలోకి విడుదల చేస్తారు. తద్వారా అక్కడ వరద నష్టం తగ్గుతుంది, అత్యధిక శతం నీరు వృధగా సముద్రంలో కలువదు, అదే సమయంలో దక్షిణ ప్రాంతంలో ఉన్న పంటలకు నీరు అందించవచ్చు. అలాగే త్రాగు నీటి అవసరాలు కూడా తీర్చవచ్చు. ఇందులో గంగ కీలక పాత్ర పోషిస్తుంది.

గంగా, బ్రహ్మపుత్ర నదులు మన దేశంలో వచ్చే వరదలో 60% వాటా కలిగి ఉంటాయి. ఈ నదులను, వాటి ఉపనదులను, మిగితా నదులను ఒక దానితో ఒకటి కాలువల ద్వారా కలపాలనే తొలి ఆలోచన 100 సంవత్సరాల క్రితమే ఊపిరి పోసుకుంది. దీని గురించి మొదట ప్రస్తావించింది మన తెలుగు వ్యక్తి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు.            

ఏ ఏ నదులను అనుసంధానం చేస్తారు? దీని వలన మన దేశానికి లాభం ఎంత? దీనికి ఎంత ఖర్చవుతుంది?

జాతీయ నదుల అనుసంధాన విధానంలో మన దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ప్రవహిస్తున్న దాదపు 37 నదులను కాలువల ద్వారా అనుసంధానం (లింక్) చేస్తారు.

1) ఇందులో అతి పెద్ద లింక్ గంగా-కావేరి లింక్. గంగా జలాలను గంగానది నుండి సోన్, నర్మద, తాపి( తపతి), గోదావరి, కృష్ణ, పెన్నా నదులను కలుపుకుంటూ కాలువ ద్వారా కావేరిలోకి తరలిస్తారు. 2636 కిలోమీటర్లు ( 1650 ) మైళ్ళ అతి పోడవైన మానవనిర్మిత కాలువ ద్వారా జరిగే ఈ ప్రక్రియతో త్రాగునీరు, సాగునీరు ప్రధానమైన అంశాలు. వీటికి తోడు అతి పెద్ద కాలువ ద్వారా భారీజలవిద్యుత్ ఉత్పాదన, నౌకయానం, వరద నష్ట నివారణ, పర్యాటకరంగ అభివృద్ధి దీనిలోని ఇతర అంశాలు. ఈ కాలువ ద్వారా మళ్ళించిన నీటితో బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థన్ రాష్ట్రాలకు నీరు అదనంగా అందిస్తారు. అదే విధంగా 50,000 క్యూసెక్కుల గంగా మిగులు జలాలను ఏడాదిలో 150 రోజులు, నీటు లభ్యతను బట్టి అంతకంటే ఎక్కువరోజుల పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, జార్ఖండ్, చత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళ్ నాడులో ఉన్న కరువుప్రాంతాలకు నీటిని మళ్ళించే వీలు కలుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ను ప్రభుత్వం చేపడితే మనం కూడా పరమ పవిత్రమైన గంగ నీరు నిత్యం త్రాగే అవకాశం కలుగుతుంది.

2)అలాగే గంగా - బ్రహ్మపుత్ర లింక్ రెండవ అతి పెద్ద ప్రాజెక్టు. బ్రహ్మపుత్రా నది కరువుకాలంలో కూడా 3500-5000 క్యూసెక్కుల జలప్రవహాన్ని కలిగి ఉంటుంది. గంగా దిగువభాగంలో కరువుకాలంలో ఏర్పడే నీటి కరువును ఇది తీర్చి, ఈ ప్రాంత అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ గంగా-బ్రహ్మపుత్రా లింక్ 320 కిలోమీటర్లు. ఇది లింక్ కాలువ బంగ్లాదేశ్ మెదుగ ప్రవహించడం వలన బంగ్లాదేశ్ లో కూడా ఈ నీరు వ్యవసాయ, ఆర్ధిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇరు దేశాల మధ్య నౌకాయానానికి దారులు మరింతగా తెరుచుకుంటాయి. కాకపోతే ఇది అంతర్జాతీయ ఒప్పందం కనుక మన ప్రభుత్వాలు కాస్త శ్రమించాలి.

3)నర్మదా లింక్ కాలువ ద్వారా గుజారత్, మూఖ్యంగా కచ్చ్ ప్రాంత, అలాగే పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాలకు నీరు అందించవచ్చు.

4)500 కిలోమీటర్ల పొడవైన చంబల్ లింక్ కాలువను ఇందిరాగాంధీ కాలువకు అనుసంధానం చేస్తారు.

4)అలాగే దక్షిణ భారతంలో పడమ దిశగా ప్రవహించే నదులు వర్షాకాలంలో చాలా వరద నీటిని మోసుకుపోతాయి. ఈ నదులను మన దక్షిన భారతంలో తూర్పు దిశగా ప్రవహించే నదులతో అనుసంధానం చేయడం కూడా ఈ జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగం.

6)ఈ ప్రాజెక్టు లో భాగంగా మన గోదావరి నదిలో ఉన్న నీటిని కృష్ణలోకి మళ్ళించే ఆలోచన కూడా ఉంది.

దీని వలన కలిగే దేశానికి ప్రయోజనాలేమిటి? దీనికయ్యే ఖర్చు ఎంత?

నదుల అనుసంధానం వలన మన దేశంలో అధనంగా 3.5-3.9 కోట్ల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుంది. అనేక మంది మళ్ళీ వ్యవసాయ రంగంలోకి తిరిగివస్తారు. చాలా జలవిద్యుత్ కేంద్రాలు(Hyder Power Stations) ఏర్పాటు చేయడం వలన ఇప్పటికి అధనంగా 34,000 మిల్లియన్ కిలోవాట్ ల విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. గత 65 ఏళ్ళలో వెలుగు చూడని అనేక గ్రామాలు శాశ్వతంగా వెలిగిపోతుంటాయి.

మన దేశంలో కొత్తగా 60,00 కిలోమీటర్ల జలమార్గాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. దీనివలన మన దేశంలో ప్రయాణం ఈ జలమార్గాల ద్వారా జరగడం డీజిల్, పెట్రోల్ వాడకం తగ్గిపోతుంది. పెట్రోల్, డీజిల్ దిగిమతికి కోసం ఉపయోగించే ఎంతో విలువైన కొన్ని కోట్ల విదేశీమాదకద్రవ్యం మనకే మిగులుతుంది. దీనితో మనం మన దేశంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరపవచ్చు.

దేశంలోని ప్రతి ప్రాంతానికి 24 గంటలు, 365 రోజులు త్రాగునీరు, సాగు నీరు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాజెక్టుతో మన దేశం ప్రపంచ ఆకలిని తీర్చే స్థితికి చేరుకుంటుంది. మరొక ముఖమైన విషయం నదుల అనుసంధానం వల్ల భారతదేశంలో రాబోయే 10,000 సంవత్సరాల వరకు కరువు పరిస్థితి ఏర్పడదు. ప్రపంచ దేశాలకు ఇక్కడి నుండి ఆహారపదార్ధల ఎగుమతి వలన మన దేశం ఆర్ధికంగా అభివృద్ధి చెందుతుంది. అత్యంత ధనిక దేశం అవుతుంది. పేదరికం సంపూర్ణంగా తొలగిపోతుంది. అతి కొద్దికాలంలోనే భారత్ అమెరికా, చైనాలను అందుకోలెనంత స్థితికి చేరుకుంటూంది.నిత్యం నీరు పారుతుండడం వలన దేశంలో భూమి సారవంతమవుతుంది, దిగుబడి పెరుతుంది.  అంటే ఎంతలేదనుకున్నా భారతదేశానికి 10,000 సంవత్సరాల పాటు స్వర్ణయుగంగా గడిచిపోతుంది.

చాలామంది ఈ ప్రాజెక్టుని ఎత్తిపోతల(Drift irrigation project) పధకం అనుకుంటారు. కానీ మహానుభావులు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారు ఎంతో ఆలోచించి ఈ అనుసంధాన ప్రక్రియ గ్రావిటి(gravity) ఆధారంగా జరిగేలా రూపొందించారు. అందువల్ల నీరు మళ్ళించడంలో దాదాపుగా విద్యుత్ అవసరం ఉండదు.

సాంస్కృతికంగా:
హిందువులకు నదులు పరమపవిత్రమైనవి. అందుకే ఉత్తరభారతంలో నదులకు ప్రతి సాయంకాలం హారతులిస్తారు. ఇందులో ముఖ్యమైనది గంగా హారతి. ఇది చూడడానికే అనేకమంది విదేశీయులు భారతదేశానికి వస్తారు. అటువంటి గంగ, యమున, ఇతర నదులు దక్షిణభారతంలో కూడా ప్రవహిస్తుంటే ఇక దేశామంతట అడుగడుగునా నదులకు నీరాజనం పడతారు హిందువులు. ఆ రమణీయ దృశ్యాన్ని తిలకించడానికి అనేకమంది  పర్యాటకులు ఆకర్షింపబడతారు. పర్యాటక అభివృద్ధి , తద్వారా అనేక కొత్త ఉద్యోగాలు పుట్టుకోస్తాయి.

ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయి. దేశంలో ప్రతి ఏటా ఏదో ఒకనదికి పుష్కరాలు జరుగుతూనే ఉంటాయి. అన్ని నదులు కలవడం వలన ఇక దేశమంతటా నిత్యం పండుగ వాతావరణం ఉంటుంది.

గంగనీటిని ఇతర నదులలోకి మళ్ళించడం వలన, గంగలో ఉన్న అనేక ఔషధ గుణాలు ఇతరనదులకు కూడా వస్తాయి. దేశంలోని ప్రతి నదీ జలం కూడా అమృతం అవుతుంది.

నదుల అనుసంధానానికి ఖర్చు ఎంత? ఇబ్బందులేమిటి?
భారతదేశ నదులు అనుసంధాన ప్రాజెక్టుకు దాదాపుగా 10 లక్షల కోట్లవుతుందని అంచనా. ఇది పూర్తవ్వడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. చాలా అటవీప్రాంతం మునిగుపొతుంది. అనేక మంది నిరాశ్రయులవుతారు. దానికి తోడు బంగ్లాదేశ్, పాకిస్థాన్ తో అంతర్జాతీయ ఒప్పందాలు అవసరం.

జరిగే మేలుతో పోల్చినప్పుడు ఇదంతా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. స్విస్ బ్యాంకులో 72 లక్షల కోట్ల నల్లధనం మన భారతదేశానిది ఉంది. అదంతా వెనక్కు తెస్తే, ఈ ప్రాజెక్టు లాంటివి 7 కట్టచ్చు. మన దేశంలో కొత్తగా 70 కోట్ల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. భారత్ ప్రపంచంలో సంపన్న దేశమవుతుంది. ఇవన్నీ ఈ చెత్త రాజకీయనాయకులు చేయరు. అందుకే యువత రాజకీయాల్లోకి రావాలి.

15 సంవత్సరాల సమయం పడుతుందంటే మన రాజకీయనాయకులు ముందడుగు వేయరు. వారికి అధికారం కావాలి. అది పూర్తెయ్యే సమయానికి  ఎవరు అధికారంలో ఉంటారో తెలియదు. అది చేపట్టినా ప్రజలు తమకు ఓటు వెస్తారనే నమ్మకం వాళ్ళకు లేదు. అందుకే అది ఇంకా అలా మూలనపడి ఉంది. అందుకే, ఓటు బ్యాంకు రాజకీయలను ప్రజలు సమర్ధించకూడదు.

అటవీప్రాంతం ముగిపోతుందని చెప్తున్నా, కాలువలు తవ్వి నీరు మళ్ళించడంలో కొంత నీరు అడవులకు కూడా చేరుతుందని, వృక్షసంపద మరింత పెరుగుతుందని కొందరు చెప్తున్నారు. ఇక నిర్వాసితుల విషయానికి వద్దాం. శ్రీ శైలం జలాశయం నిర్వాసితులకే ఇంకా ఫలితాలు దక్కలేదు. రాజకీయనాయకులు న్యాయం చేస్తామని మ్యానిఫేస్టొల్లో పెట్టడం తప్ప అది అమలు చేస్తారా? అంటే అది లేదు. పేదరికం అంతం చేస్తాం అంటారు. కానీ నిజంగా పేదరికాన్ని నిర్మూలిస్తే వీరి ఓటు బ్యాంకు దెబ్బతింటుందని ఆ పని చేయరు. ఒప్పందాలు విషయానికి వస్తే పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలకు నష్టం జరగదని భారత్ భరోసా ఇవ్వాలి. వారికి కూడా ఇది ఉపయోగకరమని వివరించాలి. కాని మన దేశ సమస్యలనే చర్చించుకునే సమయం మన రాజకీయ నాయకులకు లేదు. ఇక ఇతర దేశాలతో చర్చలేంటి?

వీటికి పరిష్కారం దేశభక్తి, హిందు ధర్మం పట్ల గౌరవం, ఆధ్యాత్మికత ఉన్న యువత రాజకీయల్లోకి రావాలి. మన దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి.

ఇక గంగ విషయానికి వద్దాం. చాలా మంది, హిందువులు నదులను, చెట్లను, చేమలను పూజిస్తారని హేళన చేస్తుంటారు. మన దేశ భవిస్యత్తును మార్చగల శక్తి మన నదీమతల్లులకే ఉంది. మనకు వాటి విలువ తెలుసు కనుకే మనం పూజిస్తున్నాం. దానికి తోడు మనకు కృతజ్ఞత భావం ఎక్కువ. మన జీవనానికి ఆధారమైన పంచభూతాలను(ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి) కి కృతజ్ఞతగా హారతులిస్తున్నాం. అంతేకాదు, మన హిందువులకు దైవం ఎక్కడొ వేరే లోకం లేదు. మన చూట్టు అంతా వ్యాపించి ఉన్నది. ఆ దైవమే నీటిలోను, చెట్టులోనూ, పుట్టలోనూ ఉంది. అందుకే మన వాటిని పూజిస్తున్నాం.

ఏవరైనా మీరు నదులను ఎందుకు పూజిస్తారు ? అని అడిగితే, మేము కేవలం నదులను పూజించడం లేదు, వాటిలో ఉన్న దైవత్వాన్ని పూజిస్తున్నాం. వాటి అధ్భుత శక్తికి నీరాజనమిస్తున్నాం అని సమాధానం చెప్పండి. నలుగురికి మన ధర్మ విశిష్టత తెలియజేయండి. ధర్మాన్ని ఆచరించండి.   

No comments:

Post a Comment