Sunday 10 February 2013

మన దేవాలయాలు-10

ఓం గం గణపతయే నమః
ఆదివారం-ప్రత్యేకం
మన దేవాలయాలు-10
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ప్రదక్షిణం గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం.
ప్రదక్షిణలు చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. వినాయకుడు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చూట్టు ప్రదక్షిణ చేసి గణాధిపత్యాన్ని పొంది, గణాధిపతి అయ్యాడు. గౌతమ మహర్షి గోవు చూట్టు ప్రదక్షిణ చేసి బ్రహ్మమానస పుత్రిక, మహా సౌందర్యవతి అయిన అహల్యను భార్యగా పొందాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలుంటాయి.

అయితే ప్రదక్షిణ వలన కలిగే ఫలితాలను సంపూర్ణంగా పొందాలంటే శ్రద్ధతో చేయాలి. ఫోన్ మాట్లాడుతూనో, పాటలు వింటునో,లేక ఏదో పందెంలో పరిగెత్తినట్టు పరుగులు తీస్తేనో, ప్రక్క వాళ్ళతో మాట్లడుతూనో, ప్రదక్షినలు చేస్తే ఒరిగేదేమి లేదు.

ప్రదక్షిన సమయంలో, మనం ఏ దైవం చూట్టు ప్రదక్షిణం చేస్తామో, ఆ దైవానికి సంబంధించిన శ్లోకాలనో, కీర్తనలనో, మంత్రాలనో పఠిస్తూ ప్రదక్షిణ చేయాలి. ఉదాహరణకు, శ్రీ వేంకటేశ్వర స్వామి చూట్టూ ప్రదక్షిణం చేస్తుంటే, "ఓం నమో వేంకటేశాయ " అనే నామన్ని ఉచ్చరించాలి. ఒకవేళ మనకు కీర్తనలు, పాటలు, మంత్రాలు ఏవి తెలియవనుకోండి, అప్పుడు "ఓం " కారాన్ని ఉచ్ఛరిస్తూ ప్రదక్షిణం చేయండి.

ఓంకారం చాలా శక్తివంతమైంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని దృవీకరించాయి. ఒక జెర్మన్ శాస్త్రవేత్త ఓంకారం మీద పరిశోధన చేసి, ఓం కారాన్ని కనుక గదిలో కూర్చుని, ఒక విధమైన స్వరంతో కనుక ఉచ్ఛరిస్తే, అక్కడ పుట్టే తరంగాలు, శక్తికి ఆ గది గోడలు బద్దలయిపోతాయని చెప్పారు.

ప్రదక్షిణం నిర్మలమైన మనసుతో చేయాలి. అలా చేయడం వలన మనకు మంచిమంచి ఆలోచనలు వస్తాయి. జీవితంలో మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటాం.        

దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ఓం శాంతిః శాంతిః శాంతిః
to be continued.............

No comments:

Post a Comment