Monday 17 February 2014

బహుళ చవితి

ఓం గం గణపతయే నమః

కలియుగంలో త్వరగా ప్రసన్నమయ్యే దేవతలలో వినాయకుడు మొదటివాడు. భక్తులపాలిటి కల్పవృక్షం వినాయకుడు. కోరిన వెంటనే అడిగినవన్ని త్వరగా తీర్చుతాడు బొజ్జగణపతి. శివ పార్వతుల వలే గణపతి కూడా త్రినేత్రుడు (3 కళ్ళు కలవాడు), తలపై చంద్ర వంక ధరించి ఉంటాడు. నిత్యం కోలిచే వారికే సదా అనందాన్ని ప్రసాదిస్తాడు గణనాధుడు. అటువంటి గణపతికి అత్యంత ప్రీతికరమైనది చవితి తిధి. అందులోనూ ప్రతి మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే బహుళ చవితి గణపతి ఆరాధనకు ఇంకా విశేషమైనది. దీనికే సంకష్టహర చవితి అని పేరు. ఈ చవితికి ఉపవాసం ఉండి గణపతిని పూజిస్తే జీవతంలో ఉండే సంకటాలు తొలిగి విజయం తప్పకుండా సిద్ధిస్తుంది.

ఈ సంకటహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చవితిగా పరిగణిస్తారు. మంగళవారం సంకష్టహరచవితి చాలా పవిత్రమైన తిధి. ఈ అంగారక చవితి రోజున గణపతిని విశేషంగా పూజించండి. సంకటనాశన గణేశ స్తోత్రం పఠించండి. 'ఓం గం గణపతయే నమః' అనేది గణపతి మహామంత్రం. దాన్ని వీలైనన్ని సార్లు జపించండి. ఉదయమో, సాయంత్రమో గణపతి ఆలయాన్ని సందర్శించండి. గణపతికి 21 ప్రదక్షిణలు చేయండి. కుదిరితే గణపతికి గరిక, ఎర్ర పూలు సమర్పించండి. గణపతి అనుగ్రహాన్ని పొందండి. జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.

18-02-2014, చంద్రోదయ సమయం, రాత్రి 09:07 నిమిషాలకు (హైద్రాబాదు). అంగారక చవితి ఉపవాసం ఉండదలచినవారు రాత్రి 09:07 తరువాతనే భోజనం చేయాలి.

మీ మీ నగరాల్లో చంద్రోదయ సమయం కోసం ఈ వెబ్‌సైట్ చూడండి.
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html

ఓం గం గణపతయే నమః 

No comments:

Post a Comment