Friday 28 February 2014

హిందూ ధర్మం - 24

ఇంద్రియాలకు మనసుకు సంబంధం ఉంటుంది. 5 జ్ఞానేంద్రియాలు ప్రపంచం నుంచి జ్ఞానాన్ని తెలుసుకోవడంలో, అనుభూతి చెందడంలో ఉపయోగపడితే, మిగితా 5 కర్మేంద్రియాల ద్వారా మనిషి ప్రపంచంలోకి సంకేతాలను పంపుతాడు, వివిధ పనులు చేస్తాడు. ఒక వస్తువును మీ కళ్ళతో చూస్తున్నారంటే, మీ నయనేంద్రియం (కన్ను) ద్వారా మీరు చూస్తున్న విషయం, మీ మనసుకు చేరుతుంది. మీరు మంచి పాట వినడం అంటే, మీ కర్ణేంద్రియం (చెవి) ద్వారా, ఆ విషయం మీ మనసుకు చేరుతోందని కదా. అదే మీరు మాట్లాడుతున్నారంటే, మీ వాక్కు ద్వారా మీ మనసు ఈ ప్రపంచంలోకి కొన్ని ఆలోచనలను పంపుతోంది. జ్ఞానేంద్రియాల ద్వారా మనసు విషయాలను గ్రహిస్తే, కర్మేయింద్రియాల ద్వారా ప్రపంచం మీ మనసులో విషయాన్ని హ్రగిస్తుంది. అందుకే జ్ఞానేంద్రియాలు శరీరానికి ప్రవేశ ద్వారాలయితే, కర్మేంద్రియాలు బయటకు వెళ్ళే మార్గాలు అంటారు స్వామి పరమార్ధానంద సరస్వతీ. సులభంగా చెప్పుకుంటే, జ్ఞానేద్రియాల ద్వారా లోపలికి తీసుకుంటున్నారు, కర్మేంద్రియాల ద్వారా బయటకు సంకేతాలను పంపుతున్నారు, కర్మ చేస్తున్నారు.

To be continued...........

No comments:

Post a Comment