Showing posts with label జ్యోతిష్యం. Show all posts
Showing posts with label జ్యోతిష్యం. Show all posts

Sunday, 18 February 2018

హిందూ ధర్మం - 260 (జ్యోతిష్యం )



నవగ్రహాలకు పేర్లను పెట్టడాన్ని పరిశీలిస్తేనే, పురాతన భారతీయ నాగరికత వైభవం అర్దమవుతుంది.

సూర్యుడిని ఆదిత్యుడని అంటాము. ఆదిదేవ నమస్తుభ్యం అంటూ సూర్యాష్టకం ప్రారమంభమవుతుంది. సూర్యుడు లేనిదే ఈ విశ్వమే లేదన్నది మనకు తెలిసిన విషయమే.

కుజ గ్రహాన్ని భౌముడని అంటారు, అంటే భూమి పుత్రుడు అని అర్ధము. కుజ గ్రహం మీద కూడా భూమి మీద ఉన్నట్లే ఆక్సిజెన్, కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజెన్ మొదలైన వాయువులు ఉంటాయి. కానీ వాటి గాఢత వేరు. అక్కడ కూడా 4 ఋతువులు ఉన్నాయి. అక్కడ కూడా భూమిని పోలిన కొన్ని భౌమశిలావిన్యాసాలు ఉన్నాయి.

గురువు అంటే పెద్దవాడు అని అర్దం. మన సౌరకుటుంబంలోని గ్రహాల్లో అతి పెద్ద గ్రహం కనుక దానికి గురు గ్రహం అని పేరు పెట్టారు. దాన్నే ఆంగ్లంలో జూపిటర్ అంటున్నారు. ఈ విషయం నేటి శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకుంటారు. 

శని - శని అనే పదానికి "శనైః శనైః చరః" అనే వ్యుత్పత్తి ఉంది. అంటే నెమ్మది, నెమ్మదిగా చరిచువాడు, తిరుగువాడు అని అర్ధం. మన సౌరకుటుంబంలో సూర్యుని ఒకసారి చుట్టు రావడానికి అత్యంత సమయం తీసుకునే గ్రహం శనిగ్రహం. సూర్యుడిని చుట్టి రావడానికి భూమి ఒక సంవత్సరం తీసుకుంటే, శని గ్రహం 29 1/2 సంవత్సరాలు తీసుకుంటుంది. అందుకే దానికి శనైశ్చరుడు అని పేరు. శనీశ్వరుడు కాదు. నెమ్మదిగా తిరిగేవాడు కనుక శనైశ్చరుడు.

రాహు, కేతువులు ఛాయా గ్రహాలు. వాటికి ప్రత్యక్షమైన భౌతిక ఉనికి లేకున్నా, గ్రహణ సమయంలో వాటిని చూస్తున్నాము. ఛాయ అంటే నీడ. వాటిని అంటారు. రాహువు ఉత్తర lunar node ఐతే, కేతువు lunar node.

జ్యోతిష్య శాస్త్రాన్ని తప్పు పట్టే నాస్తికులు వేసే మొదటి ప్రశ్న- సూర్యుడు నక్షత్రము, చంద్రుడు భూమికి ఉపగ్రహము. అయినా భారతీయ జ్యోతిష్య శాస్త్రం వాటిని నవగ్రహాల్లో చేర్చింది. ఇది ఎంత అసంబద్ధం, ఇది చాలు జ్యోతిష్యం మూఢ నమ్మకమని చెప్పడానికి అంటారు. గ్రహం అనే సంస్కృత పదానికి ఆంగ్లంలో ప్లానెట్ సమానర్ధం కాదు. గమనము కలిగినదాన్ని గ్రహము అన్నారు. అది కూడా ఆకాశంలో కదిలేవి అని. అంటే ఈ భూమి మీద నుంచి మనం చూసినప్పుడు, వాటి కదలికలను చూడగలగాలి. అలాంటి వాటిని గ్రహాలు అన్నారు. అందుకే భూమిని నవగ్రహాల్లో కలపలేదు.

ఇక్కడితో జ్యోతిష్యం అనే అంకం సమాప్తము.

ఇంకా ఉంది...

Sunday, 5 November 2017

హిందూ ధర్మం - 253 (సృష్టి- జ్యోతిష్యం)



వేదాంగమైన జ్యోతిష్యం ప్రకారం ఈ సృష్టి 197.5 కోట్ల సంవత్సరాల క్రితం ప్రారమభమైంది. శ్రీ మద్భాగవతం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. వేదాంగ జ్యోతిష్యం ప్రకారం 2017 నాటికి ఈ సృష్టి ప్రారమభమై 197, 29, 49, 117 సంవత్సరాలు గడిచాయి. నిజానికి 20 వ శతాబ్దం మొదటి అర్ధభాగం వరకు పాశ్చాత్య ప్రపంచం, ముఖ్యంగా క్రైస్తవ, యూదు, మహమ్మదీయ మొదలైన అబ్రహం మతాల వారు ఇదే నమ్మేవారు. క్రైస్తవ ప్రభావం అధికంగా ఉన్న ఐరోపా (యూరోప్) లోని శాస్త్రవేత్తలకు సైతం ఈ సృష్టి కొన్ని వేల ఏళ్ళ క్రితం నాటిదని అంగీకరించేందుకు మనస్కరించలేదు.

ప్రముఖ మత పరిశోధకుడు, పండితుడైన హూస్టన్ స్మిత్ (మే 31, 1919 – డిసెంబర్ 30, 2016) అంటారు: " సనాతన ధర్మంలో అవ్యక్తం దేన్ని మినహాయించదు, అవ్యక్తం దేన్నీ మినహాయించకపోవటమే అనంతం- అనతమే భారతీయ ఆత్మ."

ఎల్లలు/ సరిహద్దులు లేని దాన్ని లేదా అంతటిని భారతదేశం తన ముఖం తిప్పి స్పష్టంగా చూసింది.................

పాశ్చాత్యం విశ్వం వయస్సు 6,000 ఏళ్ళు కావచ్చునని ఆలోచిస్తుండగా- గంగానదిలో ఇసుకు రేణువుల మాదిరిగా అనతమైన కల్పాలను, నక్షత్రవీధులను భారతదేశం దర్శించింది. ఈ విశ్వం ఎంత విశాలమైందంటే, ఆధునిక ఖగోళశాస్త్రం ఎటువంటి అలజడిలేకుండా అందులోకి జారిపోతుంది.

“The invisible excludes nothing, the invisible that excludes nothing is the infinite – the soul of India is the infinite.” 

“Philosophers tell us that the Indians were the first ones to conceive of a true infinite from which nothing is excluded. The West shied away from this notion. The West likes form, boundaries that distinguish and demarcate. The trouble is that boundaries also imprison – they restrict and confine.” 

“India saw this clearly and turned her face to that which has no boundary or whatever.” “India anchored her soul in the infinite seeing the things of the world as masks of the infinite assumes – there can be no end to these masks, of course. If they express a true infinity.” And It is here that India’s mind boggling variety links up to her infinite soul.”

“India includes so much because her soul being infinite excludes nothing.” It goes without saying that the universe that India saw emerging from the infinite was stupendous.”

While the West was still thinking, perhaps, of 6,000 years old universe – India was already envisioning ages and eons and galaxies as numerous as the sands of the Ganges. The Universe so vast that modern astronomy slips into its folds without a ripple.” - Huston Smith (source: The Mystic's Journey - India and the Infinite: The Soul of a People – By Huston Smith).
=======================

వేదాన్ని తొలుతుగా భగవంతుడు అగ్ని, వాయు, ఆదిత్యుడు, ఆంగీరసుడు అనే నలుగురు ఋషులకు ప్రకాశ పరిచినట్లు శతపధబ్రాహ్మణం చెప్తోందని దయానందులు పేర్కొన్నారు. ఈ నలుగురు ఋషులే మిగితా ఋషులకు చెప్పారు. ఆ తర్వాత వారు తమ పిల్లలకు, వారు వారి పిల్లలకు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మం ప్రకారం ఈ భూమి మీద ఉన్న సమస్త మానవజాతి కుల, వర్ణ, మత, జాతి, భాషలకు అతీతంగా ఋషుల సంతానం. జీవుల పూర్వ పుణ్యాలను, వారి తపోనిష్ఠను, ధర్మనిష్ఠను, కర్మఫలాలను అనుసరించి ఋషులను, సామాన్య మానవులను సృష్టింపజేశాడు భగవంతుడు. ఈ ఋషులనే ప్రజాపతులు అంటారు, వీరే మానవజాతికి మూలపురుషులు. ప్రజాపతులకు భార్యలు ఉన్నారు. వీరిని అనేకమందిని సృష్టినిచిన బ్రహ్మ మానవజాతిని కొనసాగించమని, సంతానం ద్వారా లోకంలో ధర్మం వర్ధిల్లేలా చూడమని ఆజ్ఞాపించాడు. బ్రహ్మ ఆజ్ఞానుసారం ఋషులు మానవజాతిని పునరుత్పత్తి చేశారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మానవులంతా ఋషుల సంతానమే అంటుంది హైందవ ధర్మం. ఈ మధ్య ఏసు క్రీస్తును ప్రజాపతి అంటూ మతమార్పిడి కోసం పన్నాగం పన్నుతున్నారు. ప్రజాపతులకు, ఏసుకు చాలా తేడా ఉందని గ్రహించాలి. ఏసుకు పెళ్ళి అయ్యిందని క్రైస్తవులు ఒప్పుకోరు, బైబిల్ లో ఏముంది అన్నది తర్వాతి సంగతి. ప్రజాపతులు యజ్ఞాన్ని, వైదిక దేవతలను అంగీకరించారు. ఏసు అంగీకరించట్లు క్రైస్తవులు ఒప్పుకుంటారా?...

ఈ సిద్ధాంతం కూడా భారతదేశంలో పుట్టిన మతాలను ఇతర మతాల నుంచి వేరు చేస్తుంది. జైన, బౌద్ధ మొదలైన మతాలు, హిందు ధర్మం, చైనాలో హిందు ధర్మం ఆధారంగా వచ్చిన మాతాలను తప్పించి పాశ్చాత్య ప్రపంచంలో ఉన్న మిగితా మతాలను అబ్రహామిక్ మతాలంటారు. వాళ్ళకి మూల పురుషుడు అబ్రహం అని చెప్తారు. దేవుడు ఆదాము, ఈవ్ అనే ఒక పురుషుడిని, ఒక స్త్రీని సృష్టించి, వారిని ఒక సుందరమైన ఉద్యానవనంలోకి ప్రవేశపెడతాడు. అందులో ఉన్న ఫలాలను స్వీకరించమని, ప్రకృతి అందాలను ఆస్వాదించమని చెప్తాడు కానీ ఒక వృక్షాన్ని చూపించి, దానికున్న ఫలాన్ని మాత్రం తినవద్దని, అది మంచి, చెడుల విచక్షణ జ్ఞానం కలిగించే ఫలమనీ, అది ముట్టుకుంటే మరణిస్తారని చెప్తాడు. ఇంతలో అక్కడికి సైతాన్ రావడం, ఈవ్, ఆదాము ఆ ఫలాన్ని తినడం జరుగుతుంది. ఫలితంగా వారికి లింగ విచక్షణ జ్ఞానం వస్తుందట. వారి మధ్య ఆకర్షణ మొదలవుతుంది, కామోద్రేకానికి దారి తీస్తుంది. ఈ విషయం దేవుడికి తెలిసి, వారిని శపిస్తాడు. పైగావారు చేసిన పాపానికి, వారి నుంచి పుట్టే సమస్త మానవజాతికి పాపం చుట్టుకుంటుందని అంటాడు. దాన్ని క్రైస్తవం Original sin  అంటుంది. తర్వాత ఆదాము, ఈవ్‌ల నుంచే మొత్తం మానవజాతి ఉద్భవించిందని, వారు చేసిన పాపం కారణంగా, పుట్టినవాళ్ళందరూ పాపులేననీ ఆయా మతగ్రంధాలు చెప్తాయి. అందుకే ఇతర మతగురువులు జనులను ఉద్దేశ్యించి పాపుల్లారా! అంటూ సంబోధిస్తారు. ఆయా మతగ్రంధాల ప్రకారం పుట్టినప్రతి వాడే పాపియే. అందుకే ఈ రోజుకీ మతమార్పిడి చేసే సమయంలో కూడా మీరంతా పాపులు, మా ప్రవక్త రక్షకుడు. అతడే సరైనవాడు, అతన్ని మాత్రమే పూజించండి అని వారంటారు.

To be continued ......

Sunday, 24 September 2017

హిందూ ధర్మం - 252 (14 లోకాలు)



ఇప్పుడు మనం వివరించుకున్న ఈ (Dimensional theory) పరిమాణ సిద్దాంతాల ఆధారంగా ధర్మంలో చెప్పినవి అర్దం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

దేవతలు ప్రత్యక్షం అయ్యారు, అదృశ్యమయ్యారు అంటాము. ప్రత్యక్షం అంటే కళ్ళకు కనిపించడం, అంటే దాని ఉనికి ఇంతకముందు కూడా ఉండి ఉండవచ్చు, కానీ అది ఇప్పుడు కళ్ళకు కనిపించేలా 'వ్యక్తమైంది' అన్నమాట. దృశ్యం అంటే చూసేది, అదృశ్యం అంటే చూడలేనిది. కళ్ళకు కనిపించిన ఆ దేవతా స్వరూపం తిరిగి కనిపించకుండా పోవటం అదృశ్యమవటం. ఇది కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే అన్యమతగ్రంథాలు దేవతలు ప్రత్యక్షమవుతారని ఎక్కడా చెప్పలేదు. ప్రవక్తను నమ్మటం వరకే వారికి చెప్పబడింది. కాబట్టి దేవుడెందుకు కనిపించడు అని ఒక హిందువు అడిగితే దానికి ఈ సమాధనం చెప్పచ్చు. అదే ఒక అన్యమతస్థుడు అడిగితే, వాళ్ళ దేవుడు ఈ సృష్టికి దూరంగా, ఎక్కడో ఉంటాడు కనుక కనిపించడు అని చెప్పాలి. 

ఇప్పుడు మనకు తలెత్తె ఒక సందేహానికి ఈ సిద్ధాంతం సమాధానమిస్తుంది. కార్యకారణాలతో కూడిన ఈ జగత్తులో (A world of cause and effect) మనం నివసిస్తున్నాము కనుక, అన్నీఇక్కడ జరిగినట్లే ఇతర లోకాల్లో జరుగుతాయని భావిస్తాము. కార్యం అంటే పని, లేదా కర్మకు ప్రతిఫలం, ఒక సంఘటన (Effect). కారణం అంటే దానికి కారణమైన విషయం (Cause). కారణం లేకుండా కార్యం ఉండదని చెబుతుంది సనాతన ధర్మం. 'విశ్వం పశ్యతి కార్యకారణతయా సస్వామి సంబంధతః' అంటూ దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఈ సిద్ధాంతాన్ని మనకు గుర్తు చేశారు ఆదిశంకరులు. నిజానికి ఈ కార్యకారణ సిద్ధాంతమే హేతువాదం. హేతువు అంటే కారణం. ఏదీ కూడా అకారణంగా, కాకతాళీయంగా, ఏదో అలా జరగదు (without any cause) అని చెప్పడం హేతువాదం. సనాతనధర్మం కూడా ప్రతి విషయంలో అలానే చెబుతుంది.. కానీ హేతువాదులమని చెప్పుకునే కొన్ని తింగరి మూకలకు ఈ విషయం అర్దంకాదు. ప్రతిదాన్ని ఊరికే, లోతైన అవగాహన లేకుండా ప్రశ్నించడమే హేతువాదం అనుకుంటారు. వారికి ధర్మం మీద ద్వేషం తప్ప, సత్యం మీద ప్రేమ లేదు. కొందరు సైంటిష్టులు కూడా కొన్ని సంఘటనలు కాకతాళీయంగా జరిగాయని చెబుతారు.... అన్నిటికి కారణముంటుందన్న వారే కొన్నిసార్లు అలా సమర్ధించుకుంటారు. కొన్నిసార్లు తమకు తెలియని వాటిని X-factor అంటారు....

కార్యకారణ సిద్ధాంతానికి కర్మ సిద్ధాంతానికి సంబంధం ఉంది. భూత (past) కాలంలో చేసిన పనులకు వర్తమాన (present), భవిష్య (future) కాలాల్లో జరిగే వాటితో సంబంధం ఉంటుందన్నది ఈ కర్మసిద్ధాంతం చెబుతుంది. సనాతనధర్మానికి పునాది అయిన పునర్జన్మ సిద్ధాంతం కూడా దీని మీదే ఆధారపడి ఉంది.  అయితే ఈ కార్యకారణ సిద్ధాంతం అనేది 3-D  దాటితే భిన్నంగా మారిపోతుంది. 3-D World దాటినప్పుడు, (10-D లో) అసలు అక్కడ దేశకాలాల ప్రసక్తి లేదు. ఇంతకముందు ఉన్నది, ఇప్పుడున్నది, ఇంక ఉండబోయేది అనే మాటే లేదు. ఎందుకంటే నాకు ముందు ఏముంది అనే ప్రశ్నలో కాలం (time) ఉంది. కాలమే లేనప్పుడు ఇక దైవానికి ముందు ఏముంది? అనే ప్రశ్న ఎలా ఉదయిస్తుంది. అక్కడ ఉన్నది ఉనికి (existence) మాత్రమే. అదే సత్. అది కేవలం ఉనికి కాదు, చైతన్యంతో కూడిన ఉనికి, అందుకే అది చిత్. ఆ చైతన్యం ఆనందమయమైనది, కనుక అది ఆనందం. అదే సచ్చిదానందం, ఉపనిషత్తుల్లో భగవంతునిగా చెప్పబడిన తత్త్వం. సచ్చిదానందరూపిణీ అనేది లలితా సహస్రనామల్లో ఒక నామం. మనం 3-D నుంచి కాక, కాలాతీతంగా ఆలోచిస్తే, ఈ సందేహం తొలగిపోతుంది. నిజానికి ఆ సచ్చిదానందమైన ఉనికియే నీలో ఉన్న ఆత్మ కూడా. నీవు దాన్నుంచి వేరు కాదు. కాలంలో కొట్టుకుపోయే శరీరమే నీవనుకోవడం అసలు సమస్యకు మూలకారణం. ఇది వేదాంతం చెబుతుంది. క్వాంటం ఫిజిక్స్‌లో 4-D కి వెళ్ళినప్పుడు, జగత్తు అశాశ్వతమైన బోధపడుతుంది. (ఇది కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే అన్యమతాలకు క్వాంటం సిద్ధాంతం వ్యతిరేకమవుతుంది.)

ఇక భూలోకంలో పుట్టిన జీవులకు కర్మాధికారం ఉంది అని చెప్పడంలో ఆంతర్యం కూడా ఇక్కడే ఉంది. కార్యకారణం సిద్ధాంతం, దేశకాలాలు అనేవి ఈ 3-D జగత్తులో ఉన్నట్లుగా ఇంకెక్కడా ఉండవు. అక్కడి భౌతికశాస్త్ర ధర్మాలు (physical laws) వేరు..... అందుకే దేవతలకు కర్మాధికారం ఉండదు. పైగా వారి లోకనియమాలు వేరు కనుక, వారి ధర్మాలు కూడా వేరు. అవి తెలియకుండా ఏదో నాలుగు పురాణాలు చదివి, దేవతలను అపహాస్యం చేయడం మూర్ఖత్వం తప్ప మరేదీ అనిపించుకోదు.

ఇక్కడ వివరించడానికి ఇంకా చాలా అంశాలున్నా, ఈ అంశాన్ని మనం వేదాంగమైన జ్యోతిష్యాన్ని వివరించడంలో భాగంగా చెప్పుకున్నాం కనుక అది ఇక్కడకు ఆపివేస్తాను. ఇప్పుడు మనకు బయట కనిపించే చాలామంది చేసేది వ్యక్తిగత జాతకాల పరిశీలన. కానీ వేదాంగమైన జ్యోతిష్యంలో చెప్పబడింది ఇది కాదు. అన్నిలోకాల్లో జరిగే మార్పులను గమనిస్తూ, జరగబోయే సంఘటనలను దర్శించి, ఏ కాలంలో, ఏ ముహూర్తాన యజ్ఞయాగాది కర్మలు చేస్తే సమస్త లోకాలకు మేలు కలుగుతుందో, కీడు తొలగుతుందో పరిశీలించి ముహూర్తం నిర్ణయించడం దీనిపని. ఇది అందరికి తెలియని విద్య. ఇలాంటి వేదాంగ జ్యోతిష్యం తెలిసిన ఒక మహాపురుషుడిని (ఋషిని) నేను చూశాను.  

Scientific గా మన ధర్మంలోని అంశాలను చెప్పుకుంటున్నా, ఋషులు, భగవంతుడు అందుకు భిన్నంగా అనుకుంటున్నారు. హిందువులు ఈ అంశాలను కేవలం మనస్సు పని అయిన Logical thinking తో కాకుండా, అనుభవజ్ఞానంతో, హృదయంతో (beyond mind and intellect) తెలుసుకోవాలని, విశ్వాసంతో వీటిని దర్శించే స్థాయిని పొందాలని ఋషులు ఆశిస్తున్నారు. మనకు ఆ potential ఉందని కూడా ఋషులు గుర్తు చేస్తున్నారు.

To be continued.......

Sunday, 30 July 2017

హిందూ ధర్మం - 247 (అమెరికా = పాతాళ లోకం ??)

అయితే మహాభారతంలోని కొన్ని విషయాలను అనుసరించి కూడా అమెరికానే కొన్ని ఇతిహాసాల్లో పాతాళలోకంగా చెప్పారని మనం భావన చేయవచ్చు.

మయసభ నిర్మాణం గురించి మనకు తెలిసిందే. దాన్ని నిర్మించినవాడు మయాసురుడు. అతనే మయా/ మయాన్ నాగరికతకు ఆద్యుడని చెబుతారు. (ఆ వివరాలను మానం చాలా కాలం క్రితం వివరించుకున్నాము కూడా). ఈ మయా నాగరికత మధ్య అమెరికాలో వర్ధిల్లింది. వారికి మనకు లాగే వాస్తు శాస్త్రం ఉంది. నిజానికి మయుడు మనకు వాస్తు శాస్త్రంలో ఎన్నో విషయాలు నేర్పించాడు. ఒకసారి వి.గణపతి స్థపతి గారు దక్షిణ అమెరికా ఖండం పెరు దేశంలోని ఆండెస్ పర్వతాల్లో ఉన్న మచు పిచ్చు అనే పురాతన నాగరికత అవశేషాలను, ఇంకాస్, మయా నాగరికతలను పరిశీలించడానికి వెళ్ళారు. శిల్పకళ, నగరనిర్మాణం, వాస్తు శాస్త్రం మీద మనదేశంలో మయమతం అనే ప్రామాణిక గ్రంథం లభ్యమవుతుంది, అది మయుడు రాసిన గ్రంథం. అందులో 8/ 8 చతురస్రాలతో 64 ప్రమాణములతో (Units) ఉంటుంది వాస్తుపురుష మండలం. అక్కడ వారు గమనించింది కూడా అదే. అక్కడున్న నిర్మాణాలన్నీ ఆ వాస్తుపురుష మండలాన్ని కలిగి ఉన్నాయి. వారు అక్కడి ఇంకాస్ నాగరికతకు చెందిన పురాతన ఆవాసానికి ఉన్న గోడను పరిశీలించి, దాని మందం ఒక కిష్కు హస్తం ఉంది (అనగా 33 ఇంచులు). దక్షిణ భారతదేశంలో మయుడి వాస్తు శాస్త్రం ఆధార నిర్మాణాల్లో ఉండే ప్రమాణం (Standard) అది..... అక్కడి గైడ్, స్థపతితో ఇవి ఇక్కడ ఎలా నిర్మించారో తెలియదు, రాళ్ళను ఎలా మోసుకొచ్చారో తెలియదు అనగా, వారు పర్శీలించి, ఇదేమి తమకు కొత్త కాదని, భారతదేశంలో వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించే నిర్మాణాలకు భారీ శిలలను ఎలా తరలిస్తారో, అలానే వీటిని తరలించారని, అందుకు ఉదాహరన వాటిపై ఉన్న గుర్తులే నిదర్శనమని చెప్పారు.  

అర్జునుడు పాతాళలోకానికి చెందిన నాగ కన్య అయిన ఉలూపిని వివాహం చేసుకుంటాడు. ఆమె అమెరికా ఖండానికి చెందిన యువరాణి. ఇది మెక్సికోలోని అక్కడి కథల్లో కనిపిస్తుంది. వారు అర్జునిడిని చిలి పెప్పర్ మ్యాన్ గా చెప్పుకుంటారు. ఈ చిలి పెప్పర్ మ్యాన్ యుద్ధ విజేత మరియు 'తుల' అనే మహారాజు అల్లుడు అని వారు చెబుతారు.

మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడుతుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార చాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు, కొన్ని దురాచారాలయిన చేతబడులు (sorcism ) నమ్ముతారు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారత దేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం “the light of india” లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు ఆఖరికి మానవ బలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఇంచుమించి వారు పూజించే Quetzalcoatl ( పాలను మనం క్షీరం అని పిలుస్తాం, ఆంగ్లంలో milk అంటాం. అలాగే వారి పిలుపులో తేడా వున్నా వారి ఇతిహాసం మన కధనే చెబుతుంది) .

కలియుగం మనకు సా.శ.పూ.3102 లో మొదలైంది, అప్పటి నుంచి కలియుగ కాలమానం లెక్కిస్తున్నాము. మయా నాగరికతలో వారి క్యాలెండర్ సా.శ.పూ.3114 లో మొదలైంది. మన పంచాంగానికి, క్యాలెండర్ కు చాలా పోలికలు ఉన్నాయి.  మయా స్త్రీలు భారతీయ స్త్రీల మాదిరిగానే ఎడమముక్కు రంధ్రానికి ముక్కుపుడుక పెట్టుకుంటారు. వారి వద్ద కూడా మనకులాగే జ్యోతిష్యం, దూరశ్రవణం (telepathy) వంటి విద్యలు ఉన్నాయి. మయన్లు కూడా హిందువుల వలే దేవతల ముందు ఆహారం నివేదన చేసి అప్పుడు ఆరగిస్తారు. ఆహారంలో కూడా మనకు వారికి ఎన్నో పోలికలున్నాయి. హిందువుల వలె మెక్సికన్లు కూడా ప్రాథమికంగా శాఖాహారులు.

సూర్య సిద్దాంతాన్ని చదివితే, లాటిన్ అమెరికా ప్రాంతం పాతాళదేశమని అర్దమవుతుంది. అందులో 12 వ అధ్యాయంలో - దేవతలు అసురులు ఈ భూమి మీదే ఉంటారు. దేవతలు ఉత్తరార్ధగోళంలో, అసురులు దక్షిణార్ధగోళంలో నివసిస్తారు. ధృవాల చుట్టూ ఉన్న సముద్రం ఈ భూమిని రెండు పెద్ద ఖండాలుగా విభజించింది. దేవతల ఖండము, అసురల ఖండము (ఇప్పుడు మనం చూస్తే, ఆసియా, యూరోపు, అఫ్రికా భూభాగల మధ్య సముద్రం లేదు, అమెరిక (ఉత్తర, దక్షిణ) ఖండాన్ని మాత్రమే మిగితా ఖండల నుంచి సముద్రం వేరు చేసింది. సూర్యుడు ఉత్తరార్ధగోళంలో అంటే మేషరాశిలో ఉన్నప్పుడు మొదట దేవతలకు, దక్షిణార్ధగోళంలో ఉన్నప్పుడు అసురులకు మొదట కనిపిస్తాడు. సూర్యుడు భూమధ్యరేఖ దగ్గరున్నప్పుడు, సురలు, అసురులు పగలురాత్రుళ్ళను సమానంగా అనుభవిస్తారు. సూర్యుడు ఉత్తరార్ధగోళం వైపు పయనించగా, దేవతలు గ్రీష్మ ఋతువును చూస్తారు. అప్పుడు అసురులకు పెద్దగా సూర్యకిరణాల వేడిమి ఉండదు. ఎందుకంటే సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఉన్నాడు కనుక. అప్పుడు వారికి చలికాలం ఉంటుంది - ఇది గమనిస్తే పాతాళం దక్షిణ అమెరికా ఖండమని అర్దమవుతుంది. 
అయితే పాతాళంలో ఉండేవారంతా దుష్టులని ఎక్కడా చెప్పబడలేదు. అది మనం ఏర్పర్చుకున్న దురభిప్రాయం మాత్రమే. విభీషణుడు, ప్రహ్లాదుడు, బలి మొదలైనవారంతా కూడా రాక్షసులే. కానీ మంచివారు. రక్షణ కోసం బ్రహ్మవారిని సృష్టించాడు కనుక రాక్షసులను పేరు వచ్చింది. ఆ తర్వాతా వారు నివసించడానికి కొంత స్థలం కూడా బ్రహ్మదేవుడే ఇచ్చాడు. కానీ రక్షణ మరిచి, కొందరు దురాశతో దేవతలపై యుద్ధం చేయడంతో వారిని పరమాత్ముడు సంహరించాడు. అంతేకానీ ప్రతి రాక్షసుడు చెడ్డవాడు కాదు.

పితృలోకం దక్షిణంలో ఉందని చెప్తారు, మీరు గనక భూమికి ఆగ్నేయమూలకు వెళితే, అక్కడ అనేక నాగశిలలను ప్రతిష్టించి జనులు పూజిస్తుంటారు అంటారు పూజ్యగురువులు వి.వి.శ్రీధర్ గారు. నాగదేవతలకు పితృదేవతలకు సంకేతం. నాగుల గురించి మన సంస్కృతి చాలా చెప్పింది. వారిని నదులు, చెరువులకు రక్షకులుగా చెప్పింది. మలయేషియా కథల్లో నాగులను భారీ ఆకారంలో చూపుతారు. జావా, థాయిలాండ్ దేశాల్లో నాగులను దేవతలుగా, భూమికి క్రింద ఉండే లోకల వాసులుగా, సంపదలకు అధిపతులుగా భావిస్తారు. థాయిలాండ్ లో మన ఆదీశేషుని పోలిన ఐదుతలల నాగదేవత కూడా ఉంది. మెక్సికో లో నాగాల్ (Nagal) అనే పదం ఉంది. అది రక్షకులుగా ఉండే కొన్ని నాగదేవతల గురించి చెబుతుంది. కాంబోడియా రాజ్యాన్ని నాగులే స్థాపించాయని అక్కడి జనుల విశ్వాసం. 

ఇలా మన పురాణాల్లో చెప్పిన వివిధ లోకాలు ఈ భూమ్మీదే దర్శించడం ఒక కోణం మాత్రమే. ఇంతకముందు చెప్పిన విషయాలు, ఇక ముందు చెప్పబోయే విషయాలను సమన్వయం చేసుకుంటే, ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుంది. 

To be continued .........
ఇందులో కొంతభాగం Kiran Mva గారి రచన నుంచి సేకరణ

Sunday, 7 May 2017

హిందూ ధర్మం - 243 (14 లోకాలు)



మన పురాణాల్లో చతుర్దశ భువనాల (14 లోకాల) ప్రస్తావన ఉంది. పురాణాలు బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించాయి. ఇవన్నీ విరాట్‌పురుషుని (విశ్వరూపుని) శరీరంలోని అవయవాలని వేదం చెప్తోంది. భాగవతం రెండవ స్కంధంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది. మొత్తం పదునాలుగు లోకాలనీ, వాటిలో ఊర్ధ్వలోకాలు (పైనున్నవి) ఏడు, అధోలోకాలు (క్రిందనున్నవి) ఏడు అనీ చెబుతుంది భాగవత పురాణం.

లోకాల విభజన గురించి భాగవతంలో ఇలా చెప్పబడింది.

బ్రహ్మాండంలో కొన్ని అంతరాలున్నాయి. తత్వ పదార్ధాల సూక్ష్మ, సూక్ష్మతర అవస్థలను బట్టి ఈ భేదాలు ఏర్పడుతున్నాయి. క్రింది లోకాల కంటే పై లోకాలలో తత్వ పదార్ధాలు సూక్ష్మతరంగా ఉంటాయి. లోకాలు మూడని కొందరు, ఏడని కొందరు, పదునాల్గని కొందరు అంటుంటారు. లోకాలను బ్రహ్మాండ శరీరానికి అవయవాలుగా భావిస్తే

మొదటి భావన ప్రకారం విరాట్ పురుషుని కటి (మొల) నుండి పైభాగం ఏడు అవయవాలుగా, క్రింది భాగం ఏడు అవయవాలుగా మొత్తం పదునాల్గులోకాలు.

రెండవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, సువర్లోకం హృదయం, మహర్లోకం ఉరోభాగం, జనలోకం కంఠం, తపోలోకం పెదవులు, బ్రహ్మలోకం మూర్ధంగా బ్రహ్మాండ శరీరానికి అవయవాలు రూపొందాయి.

మూడవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, స్వర్లోకం శిరస్సుగా మూడే లోకాలు ఉన్నాయి.
బ్రహ్మాండపురుషుడే సమస్త లోకాలను భరిస్తాడు, పోషిస్తాడు, తనలో లయం చేసుకొంటాడు.

ఊర్ధ్వలోకాలు


  1. భూలోకం - సముద్రాలు, పర్వతాలు, నదీనదలాతో మానవులు, పక్షులు, జంతువులు మొదలైన జీవులతో సూర్యచంద్రుల కిరాణలతో వెలిగే లోకం. ఎందరో జీవులు నివసిస్తున్న కొన్ని కోట్ల లోకాల్లో ఈ భూలోకం ఒకటి మాత్రమేనని, ఇంకా ఇలాంటి తెలియని లోకాలు ఎన్నో ఉన్నాయని విష్ణుపురాణం చెబుతోంది.
  2. భువర్లోకం - భూలోకానికి పైన ఉండేది, సామాన్య మానవుడు వెళ్ళలేనిది. ఇక్కడ సిద్ధులు మొదలైన ఇతరలోక జీవులు నివసిస్తారు. భూలోకం ఎంత వైశాల్యం ఉంటుందో, ఇది అంతే వైశాల్యం ఉంటుంది. పితృదేవతలు కూడా ఈ లోకంలోనే ఉంటారని కొన్ని గ్రంథాల్లో కనిపిస్తుంది. 
  3. సువర్లోకం - భువర్లోకానికి పైన ఉండేది. ఇంద్రుడు మొదలైన దేవతలుండే లోకం. దీనినే స్వర్గం అని కూడా అంటారు.  
  4. మహర్లోకం - సువర్లోకానికి పైన ఉండేది. మహాత్ములైన ఋషులు, మునులు నివసించే లోకం. ఈ లోక వాసులు బ్రహ్మ కల్పానికి సమానమైన జీవిత కాలం కలిగి ఉంటారు. 
  5. జనలోకం - మహర్లోలోకానికి పైన ఉండేది. బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతాలు, శుద్ధమనస్కులైన ఇతర జీవులు ఉండే లోకం. 
  6. తపోలోకం - జనలోకానికి పైన ఉండేది. నిప్పు చేత కూడా దహించబడిన వైభ్రాజులు, అయోనిజులు ఉండే లోకం. 
  7. సత్యలోకం - తపోలోకానికి పైన ఉండేది. బ్రహ్మదేవుడు నివసించే లోకం. కొన్ని గ్రంథాల ప్రకారం ఇదే పరమపదము. కానీ కొన్ని గ్రంథాల ప్రకారం దీనికి పైన వైకుంఠం ఉంటుందని వర్ణించబడింది. భోగబుద్ధితో కాక త్యాగబుద్ధితో జీవించి, కర్మలను భగవంతునికి అర్పించిన మహాపురుషులు, సాధకులు, అంతిమకాలంలో ఈ లోకానికి వెళ్ళి, ఇక్కడున్న బ్రహ్మదేవుని నుంచి ఆత్మజ్ఞానం పొంది, పరబ్రహ్మంలో ఐక్యమవుతారని కైవల్యోపనిషత్తు మొదలనవి చెప్తున్నాయి. 
To be continued ...........

వికీపీడియా సౌజన్యంతో

Sunday, 23 April 2017

హిందూ ధర్మం - 242 (జ్యోతిష్యం- 22) (మన్వంతరాలు)

ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నాము. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది.

భాగవతం అష్టమ స్కందంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరం లోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.

14 మన్వంతరాల పేర్లు

స్వాయంభువ మన్వంతరము
స్వారోచిష మన్వంతరము
ఉత్తమ మన్వంతరము
తామస మన్వంతరము
రైవత మన్వంతరము
చాక్షుష మన్వంతరము
వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము
సూర్య సావర్ణిక మనవు మన్వంతరము
దక్షసావర్ణి మన్వంతరము
బ్రహ్మసావర్ణి మన్వంతరము
ధర్మసావర్ణి మన్వంతరము
భద్రసావర్ణి మన్వంతరము
దేవసావర్ణి మన్వంతరము
ఇంద్రసావర్ణి మన్వంతరము

1. స్వాయంభువ మన్వంతరము
తండ్రి - బ్రహ్మ
మనువు - స్వాయంభువు.ప్రథముడు
భార్య - శతరూప(అనంతి)
మనుపుత్రులు - ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి, నారాయణుని దర్శనము పొందాడు.
మనుపుత్రికలు -ఆకూతి(రుచి ప్రజాపతి భార్య),ప్రసూతి(దక్ష ప్రజాపతి భార్య),దేవహూతి(కర్ధమ ప్రజాపతి భార్య).
భగవంతుని అవతారాలు - కపిలుడు, యజ్ఞుడు - దేవహూతి కడుపున కపిలునిగా జన్మించి ధర్మ జ్ఞానాలను లోకాలకు ఉపదేశించాడు.దీనినే కపిలగీత అని అన్నారు. స్వాయంభువ మనువు చిరకాలం రాజ్యం పాలించి, విరక్తుడై రాజ్యాన్ని త్యజించి, భార్యయైన శతరూపతో బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాడు. సునంద నది ఒడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. క్షుధార్తులైన అసురులు, యాతుధానులు ఆ మనువును భక్షించడానికి వచ్చారు. నారాయణుడు ఆకూతి(స్వాయంభువ మనువు కూతురు) గర్భంలో యజ్ఞునిగా జన్మించి దుష్టులను సంహరించి త్రిదివాలను పాలించాడు.వేదశిరుడు అను విప్రుని కుమార్తెకు విభుడు అను పేరుతో అవతరించెను.
సప్తర్షులు - వశిష్ట, అత్రి, మరీచి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు
ఇంద్రుడు - రోచనుడు
సురలు - యామాదులు
ప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము మరియు వరహ అవతారము ఈ మన్వన్తరములొ జరిగినది.

2. స్వారోచిష మన్వంతరము
మనువు - స్వరోచికి వనదేవతయందు కలిగిన కుమారుడు.
మనువు పుత్రులు - చైతుడు, రోచిష్మదుడు, కింపురుషుడు
భగవంతుని అవతారాలు - విభువు - వేద శిరసునికి తుషతయందు విభుడనే పేరుతో అవతరించి, కౌమార బ్రహ్మచారియై, ఎనభై అయిదు మంది మునులచే వ్రతాన్ని ఆచరింపజేశాడు.
సప్తర్షులు - స్తంభుడు, దత్త, ,ఔర్యుడు, వశిష్టపుత్ర, కశ్యపపాణి, బృహస్పతి, చ్యవనాత్రి
ఇంద్రుడు - విపశ్చింతుడు
సురలు - తుషితాదులు
సురత చక్రవర్తి వృత్తాంతము

3. ఉత్తమ మన్వంతరము
మనువు - ప్రియవ్రతుని కొడుకు.స్వాయంభువమనువు మనవడు
మనువు పుత్రులు - పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు
భగవంతుని అవతారాలు - సత్య సేనుడు - ధర్మునికి సూనృత యందు సత్యసేనుడనే పేర అవతరించి సత్యవ్రతం అనుష్టించి దుష్టులను సంహరించి సత్యజితునికి సుఖాన్ని కూర్చాడు.
సప్తర్షులు - ప్రమాదాదులు (వశిష్టుని సుతులు); కౌకుంది, కురుంది, దలయ, శంఖ, ప్రవాహిత, మిత, సమ్మిత - (సప్త ఊర్జులు)
ఇంద్రుడు - సత్యజిత్తు
సురలు - సత్యదేవ శృతభద్రులు

4. తామస మన్వంతరము
మనువు - సురాష్ట్రుడు అనే రాజు వలన మృగి(లేడి)(ఉత్పలావతి శాపవశమున) కి జన్మించెను.
మనువు పుత్రులు - వృషాఖ్యాతి, కేతువు, జానుజంఘుడు, శాంతి, నరుడు, ప్రస్థలుడు, దృఢుడు మరియు కృతబంధువు మొదలైన పదుగురు పుత్రులు
భగవంతుని అవతారాలు - హరి - హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. (గజేంద్ర మోక్షము)
సప్తర్షులు - ధాత, జహ్నుడు, పృథుడు, కావ్యుడు, కపీవంశుడు, అగ్ని, అకపీవంశుడు
ఇంద్రుడు - త్రిశిఖుడు(శిబి)
సురలు - విధృతి తనయులు వైధృతులు (వేదరాశి నశించినపుడు ఆ తేజస్సును తమలో జీర్ణం చేసుకొన్నవారు)

5. రైవత మన్వంతరము
మనువు - దుర్దమునకు రేవతియందు పుట్టినవాడు.
మనువు పుత్రులు - బలుడు, బంధుడు, స్వయంభావ్యుడు, సత్యకుడు, అర్జున ప్రతినింద్యాదులు
భగవంతుని అవతారాలు - వైకుంఠుడు - శుభ్రునకు వికుంఠయందు వైకుంఠునిగా అవతరించాడు. రమాదేవి ప్రార్ధనను మన్నించి వైకుంఠాన్ని నిర్మించాడు.
సప్తర్షులు - హిరణ్యరోముడు, వేదశిరుడు, ఊర్ధ్వబాహుడు, దేవబాహుడు, సత్యనేత్రుడు, పర్జన్యుడు యదుధృడు
ఇంద్రుడు - విభుడు
సురలు - భూత దయాదులు

6. చాక్షుష మన్వంతరము
మనువు - చక్షుసుని భార్య అగు జృహతికి రిపుని వల్ల కలిగిన పుత్రుడు చాక్షుసుడు.
మనువు పుత్రులు - శతద్యుమ్నుడు, ఊరుడు, పూరుడు, తపస్వి శుచి, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, ప్రద్యుమ్నుడు మరియు అభిమన్యుడు మొదలైనవారు.
భగవంతుని అవతారాలు - అజితుడు, కూర్మావతారం - వైరాజునికి సంఖ్యాతియందు అకితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనము చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు. శివుడు కాలకూట విషము మింగాడు. లక్ష్మీ దేవి అవతరించింది. సాగర మధనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు.
సప్తర్షులు - విరజుడు, అతినాముడు, భృగుడు, నభుడు, వివస్వంతుడు, సుధాముడు, సహిష్ణుడు
ఇంద్రుడు - మనోజవుడు
సురలు - ఆప్యాదులు

7. వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము
ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు.

మనువు - వివస్వంతుడని పుత్రుడు వైవస్వతుడు.
తండ్రి - వివస్వంతుడు (సూర్య భగవానుడు)
తల్లి - సంజ్ఞ
భార్య - శ్రద్ధ అందుకే ఇతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.
మనువు పుత్రులు - ఇక్ష్వాకుడు, నాభాగుడు,ధృష్టుడు,సంయాతి,కరుషుడు,వృషధ్రుడు,వసుమంతుడు,నరిష్యంతుడు మరియు పృషపదుడు.
మనువు పుత్రికలు - ఇల(సుద్యుమ్నుడు).
భగవంతుని అవతారాలు - కశ్యపునకు అదితి యందు వామనుడిగా జన్మించి బలి చక్రవర్తి నుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
సప్తర్షులు - కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు
ఇంద్రుడు - ఓజస్వి
సురులు - వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు
ఈ మన్వంతరమున పరశురామ, శ్రీ రామ, బలరామ, శ్రీ కృష్ణ మరియు బుద్ద అవతారములు జరిగినవి, మరియు కల్కి అవతరిస్తారు.

8. సూర్యసావర్ణిక మన్వంతరము
రాబోయే మన్వంతరము

మనువు - సావర్ణి - విశ్వకర్మకు సంజ్ఞ, ఛాయ అను ఇద్దరు పుత్రికలు. వీరు వివస్వంతుని భార్యలయ్యారు. వివస్వంతునికి బడబ అనే మూడవ భార్య కూడా ఉన్నదంటారు. సంజ్ఞకు యముడు, యమి, శ్రాద్ధదేవుడు జనించారు. ఛాయకు సావర్ణి, తపతి, శనైశ్చరుడు కలిగారు. బడబకు అశ్వినులు జనించారు. వీరిలో సావర్ణియే కాబోయే ఎనిమిదవ మనువు.
తండ్రి - సూర్యుడు
తల్లి - ఛాయ
మనువు పుత్రులు - నిర్మోహ వారజస్కాదులు
భగవంతుని అవతారాలు - సార్వభౌముడు - వేదగుహ్య అయిన సరస్వతి యందు సార్వభౌముడనే పేర అవతరిస్తాడు. ఇంద్ర పదవిని పురందరుని నుండి బలికి అప్పగిస్తాడు. వైవస్వత మన్వంతరంలో వామనునికి మూడడుగుల వేల దానమిచ్చినందుకు ప్రతిఫలంగా బలికి ముల్లోకాల సార్వభౌమత్వం సిద్ధించనుంది. బలి ఇప్పుడు సుతల లోకంలో ఉన్నాడు.
సప్తర్షులు - అజర, అశ్వత్థామ, గౌతమ, శరద్వంత, కౌశిక, కాశ్యప, ఔర్వ .
ఇంద్రుడు - విరోచన సుతుడైన బలి
సురలు - సుతపసులు, విరజులు, అమృత ప్రభులు

9. దక్షసావర్ణి మన్వంతరము
మనువు - దక్షుని పుత్రుడు దక్ష సావర్ణి
మనువు పుత్రులు - ధృతకేతువు, దీప్తి కేతువు మొదలైనవారు.
భగవంతుని అవతారాలు - (ధర్మసేవ్యుడు?) భగవంతుడు ఆయుష్మంతునికి అంబుధార వలన ఋషభుడనే పేర అవతరించి అద్భుతునికి ఇంద్ర పదవిని ప్రసాదిస్తాడు.
సప్తర్షులు - మేథాతిధి, వసువు, సత్యుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, సవనుడు మరియు హవ్యవాహనుడు
ఇంద్రుడు - అద్భుతుడు(కుమారస్వామి)
సురలు - పరమరీచి గర్గాదులు

10. బ్రహ్మసావర్ణి మన్వంతరము
మనువు - ఉపశ్లోకుని సుతుడు బ్రహ్మసావర్ణి
మనువు పుత్రులు- భూరిషేణుడు మొదలైనవారు
భగవంతుని అవతారాలు - భగవంతుని అంశచే విశ్వసృజునికి విషూచియందు జనించి ఇంద్రునిగా ఉంటాడు. శంభునికి శక్తినిస్తాడు.
సప్తర్షులు - హవిష్మంతుడు, సుకృతి, సత్య, అపంముర్తి, నాభాగ, అప్రతిమౌజసుడు, సత్యకేతు
ఇంద్రుడు - శంభుడు
సురలు - విభుదాదులు

10. ధర్మసావర్ణిక మన్వంతరము
మనువు - దక్షసావర్ణి కుమారుడు
భార్యలు - కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ మరియు లజ్జ
మనువు పుత్రులు - సత్య ధర్మాదులు, శముడు, కాముడు హరుడు పదిమంది.
భగవంతుని అవతారాలు - సూర్యునికి ధర్మసేతువనే పేర జన్మించి వైధృతునికి త్రైలోక్య సామ్రాజ్యాన్నిస్తాడు.
సప్తర్షులు - భరద్వాజ, ఆత్రేయ, రామ, వ్యాస, దీప్తిమంత, బహుశృత, ద్రౌణి
ఇంద్రుడు - వైధృతుడు
సురలు - విహంగమాదులు

12. రుద్రసావర్ణిక మన్వంతరము
మనువు - రుద్రసావర్ణిక
మనువు పుత్రులు - దేవసుతాదులు
భగవంతుని అవతారాలు - సత్య తాపసుడు - సత్యతపసునికి సూనృత యందు అవతరిస్తాడు.
సప్తర్షులు - తపస్వి, సుతపసుడు, తపోమూర్తి, తపోనిధి, తపోధృతి, ధ్యుతి, తపోధనుడు
ఇంద్రుడు - ఋతధాముడు
సురలు - పరితారులు

13. దేవసావర్ణి మన్వంతరము
మనువు - దేవసావర్ణి
మనువు పుత్రులు - విచిత్ర సేనాదులు
భగవంతుని అవతారాలు - దేవహోత్రునికి బృహతియందు దైవహోత్రుడు అనుపేర అవతరిస్తాడు. దివస్పతికి ఐశ్వర్యం అనుగ్రహిస్తాడు.
సప్తర్షులు - నిర్మోహ తత్వదర్శనాదులు; నిర్మోహ, తత్వదర్శనుడు, నిష్ప్రకంప, నిరుత్సుక, ధ్రుతిమతుడు, అవ్యయుడు, సుతప
ఇంద్రుడు - దివస్పతి
సురలు - సుకర్మాదులు

14. ఇంద్రసావర్ణి మన్వంతరము
మనువు - ఇంద్ర సావర్ణి
మనువు పుత్రులు - గంభీరాదులు
భగవంతుని అవతారాలు - సత్రాయణునకు బృహద్భానుడు అను పుత్రునిగా జన్మిస్తాడు.
సప్తర్షులు - అగ్నిబాహ్యాదులు; అగ్నిబాహు, శుచి, శుక్ర, మగధ, గృధ్ర, యుక్త, అజిత
ఇంద్రుడు - శుచి
సురలు - పవిత్రాదులు

To be continued ................

సేకరణ: వికీపిడియా

Sunday, 9 April 2017

హిందూ ధర్మం - 241 (జ్యోతిష్యం- 21) (కల్పాలు, వాటి పేర్లు)



కల్పం అంటే 4,32,00,00,000 సంవత్సరాలని, ఒక కల్పం బ్రహ్మదేవునకు ఒక రోజని చెప్పుకున్నాం. ఆ కల్పాల పేర్లు స్కాంద పురాణం, మత్స్య పురాణం, మహాభారతం మొదలైన గ్రంథాల్లో 30 పేర్ల వరకు చెప్పబడ్డాయి. అవి

మహాభారతంలో చెప్పిన ప్రకారం ప్రస్తుతం బ్రహ్మకు 51వ సంవత్సరంలో "శ్వేతవరాహ కల్పం" నడుస్తున్నది. మత్స్య పురాణం (290.3-12)లో 30 కల్పాల పేర్లు చెప్పబడ్డాయి. అవి

శ్వేత కల్పము / శ్వేత వరాహ కల్పము
నీలలోహిత కల్పము
వామదేవ కల్పము
రత్నాంతర కల్పము
రౌరవ కల్పము
దేవ కల్పము
బృహత్ కల్పము
కందర్ప కల్పము
సద్యః కల్పము
ఈశాన కల్పము
తమో కల్పము
సారస్వత కల్పము
ఉదాన కల్పము
గరుడ కల్పము
కౌర కల్పము
నారసింహ కల్పము
సమాన కల్పము
ఆగ్నేయ కల్పము
సోమ కల్పము
మానవ కల్పము
తత్పుమాన కల్పము
వైకుంఠ కల్పము
లక్ష్మీ కల్పము
సావిత్రీ కల్పము
అఘోర కల్పము
వరాహ కల్పము
వైరాజ కల్పము
గౌరీ కల్పము
మహేశ్వర కల్పము
పితృ కల్పము
వాయు పురాణం 21వ అధ్యాయంలో 28 కల్పాల పేర్లున్నాయి. తరువాతి అధ్యాయంలో మరో ఐదు కల్పాల పేర్లున్నాయి.

ఇప్పుడు మనం ఉన్నది బ్రహ్మదేవుని 51 సంవత్సరంలో, మొదటిదైన శ్వేతవరాహ కల్పంలో. అందుకే సంకల్పంలో 'శ్వేతవరాహ కల్పే' అని చెప్తారు. ఈ సమస్త జగత్తు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం నడుస్తున్నది కనుక నిత్యం చెప్పే సంకల్పంలో 'శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య' అని చెప్పుకుంటూ, కాలపురుషుడు, కాలస్వరూపుడు, కాలకాలుడైన ఆ శ్రీ మన్నారాయణుని స్మరించుకుంటాము.

అలాగె ప్రతి కల్పంలో బ్రహ్మదేవుడు ఒక మనువును సృష్టి చేస్తాడు. ఆ మనువు ఈ ప్రపంచాన్ని, అందులో జీవరాశిని సృష్టిస్తాడు. ప్రతి మన్వంతరము, ఒక మనువు జీవితకాలం వరకు ఉంటుంది, అనగా ఒక మన్వంతరం వయస్సు 30,67,20,000 సంవత్సరాలు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం నడిచే ఈ జగన్నాటకం ముందుకు సాగడానికి ప్రతి మన్వంతరం తర్వాత బ్రహ్మదేవుడు ఒక కొత్త మనువును సృష్టిస్తాడు. అది వారి పూర్వ పుణ్యాన్ని అనుసరించి ఉంటుంది. పూర్వ కల్పాలు, మన్వంతరాల్లో పుణ్యం చేసుకున్న జీవులు, తపస్సు చేసిన మహాత్ములు ఆ స్థాయికి చేరుకుంటారు. ప్రతి మన్వంతరము ఒక మనువు చేత పాలించబడుతుంది. ప్రతి మన్వంతరంలో శ్రీ మహావిష్ణువు ఒక కొత్త అవతారాన్ని స్వీకరిస్తారు, ఇంద్రపదవికి కొత్త ఇంద్రుడు వస్తాడు, సప్తఋషుల పదవులకు నూతనమైన వారు ఎన్నికవుతారు. బ్రహ్మ దేవుడి కాలమానంలో (31,10,40,00,00,00,000 సంవత్సరాల్లో) 5,04,000 మనువులు, బ్రహ్మదేవుని ఒక ఏడాదిలో 5040 మనువులు, బ్రహ్మదేవుని ఒక నెలలో 420 మనువులు ఉంటారని వేదాలు, ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి.

To be continued ..........

(సేకరణ: వికీపీడియా సౌజన్యంతో) 

Sunday, 2 April 2017

హిందూ ధర్మం - 240 (జ్యోతిష్యం- 20) (కాలగణన - 4)



1 కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు (17,28,000 + 12,96,000 + 8,64,000 + 4,32,000) = 1 మహాయుగం (43,20,000 సంవత్సరాలు)
1 మన్వంతరం = 71 మహాయుగాలు (71* 43,20,000 = 30,67,20,000 సంవత్సరాలు)
ప్రతి మన్వంతరానికి ఒక మనువు ఉంటాడు. అతడు దానికి పాలకుడు.
ప్రతి మన్వంతరం తర్వాత ఒక కృతయుగం కాలమానికి సరిపడా సంధికాలం ఉంటుంది. అనగా 17,28,000 సంవత్సరాలు సంధికాలం. ఈ సంధికాలంలో భూమి అనంతమైన జలరాశిలో మునిగి ఉంటుంది. ఇక్కడ జలరాశి అంటే నీరుగా భావించకూడదు. అప్పుడు సృష్టి అంతా శూన్యంతో నిండి ఉంటుందని గ్రహించాల్సి ఉంటుంది.

బ్రహ్మదేవునకు 1 రోజు = 14 మన్వంతరాలు+ 15 చరణాలు అనగా 1,000 మహాయుగాలు.

సూర్య సిద్ధాంతంలో 14 వ అధ్యాయం - మానాధ్యాయంలో కాలాన్ని 9 విధాలుగా విభజించి, దాన్ని మానం అన్నారు. అందులో అతి చిన్నదైన ప్రాణం (4 సెకన్లు) నుంచి అతి పెద్దకాలమానమైన పర (300000.04 సౌర సంవత్సరాలు) వరకు ఉంది.

ఇప్పటికి బ్రహ్మకు 50 ఏళ్ళు గడిచాయి. 50 ఏళ్ళ ముగింపులో గతించిన ఆఖరి కల్పానికి పద్మ కల్పం అని పేరు. ఇప్పుడు మనం బ్రహ్మదేవుడి 51 వ సంవత్సరంలో మొదటి రోజులో ఉన్నాము. దీనికి శ్వేత వరహా కల్పం అని పేరు. ఈ మొదటి రోజులో ఇప్పటికే 6 మన్వతరాలు ముగిసి, ఏడవదైన వైవశ్వత మన్వంతరంలో ఉన్నాము. అందులో కూడా 27 మహాయుగాలు గడిచి, 28 వ మహాయుగంలో  కృత, త్రేతా, ద్వాపర యుగాలు గతించి, ప్రస్తుతం కలియుగంలో ఉన్నాము.

ఈ 4,32,000 సంవత్సరాల కలియుగం నాలుగు పాదాలుగా విభజించబడింది. ప్రతి పాదానికి 1,80,000 సంవత్సరాలు. అందులో ప్రథమ పాదంలో ఉన్నాము. ఈ 28 వ కలియుగం క్రీ.పూ.3102 లో ప్రారంభమైంది. ఇప్పటికే బ్రహ్మదేవుడికి 50 ఏళ్ళు గడిచి, రెండవ 50 సంవత్సరాల్లో ఉన్నాం కనుక సంకల్పంలో ద్వితీయ పరార్ధం అని చెప్పుకుంటాము.

శ్రీ రాముడు ఈ మన్వంతరంలోనే 24 వ త్రేతాయుగానికి చెందిన వాడు. శ్రీ కృష్ణుడు 28 వ ద్వాపరయుగానికి చెందినవాడు. గతించిన కాలమానంలో మనకు అతి సమీప కాలంలో వచ్చిన అవతార పురుషుడు శ్రీ కృష్ణుడు ఇలా అనేక అవతరాలు అనేక మహాయుగాలు, వేర్వేరు మన్వంతరాల్లో, కల్పాల్లో వచ్చాయి. వాటి అన్నిటి గురించి మనకు వివరంగా అందించేవి పురాణాలు. .

అందుకే సంకల్పంలో
శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే అని చెప్పుకుంటాము.

To be continued ............

Sunday, 19 March 2017

హిందూ ధర్మం - 239 (జ్యోతిష్యం- 19) (కాలగణన - 3)




విష్ణుపురాణం కాలగణనం గురించి ఎంతో గొప్పగా వివరించింది.

2 అయనాలు = 1 మానవ సంవత్సరము లేదా దేవతలకు ఒక రోజు
4000+ 400+ 400 = 4800 దివ్య సంవత్సరాలు = 17,28,000 మానవ సంవత్సరాలు = 1 సత్యయుగం
3,000 + 300 + 300 = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు = 1 త్రేతా యుగం
2,000 + 200 + 200 = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు = 1 ద్వాపర యుగం
1,000 + 100 + 100 = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు = 1 కలి యుగం
4800 + 3600 + 2400 + 1200 దివ్య సంవత్సరములు = 12,000 దివ్య సంవత్సరములు = 1 మహాయుగం
17,28,000 + 12,96,000 + 8,64,000 + 4,32,000 మానవ సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు = 1 మహాయుగము

1000 మహయుగాలు = 1 కల్పము = బ్రహ్మదేవునకు 1 పగలు లేదా రాత్రి = 4,32,00,00,000 మానవ సంవత్సరములు = 4.32 బిలియన్ సంవత్సరములు
2000 మహాయుగాలు = 2 కల్పాలు = బ్రహ్మదేవునకు ఒక రోజు = 8,64,00,00,000 మానవ సమవత్సరములు = 8.64 బిలియన్ సంవత్సరములు
బ్రహ్మదేవునకు 1 మాసం = బ్రహ్మదేవునకు 30 రోజులు = 2,59,20,00,00,000 మానవ సంవత్సరాలు = 259.2 బిలియన్ మానవ సంవత్సరాలు
బ్రహ్మదేవునకు 1 సంవత్సరము = 30 రోజులు గల 12 మాసాలు = 3.1104 ట్రిలియన్ మానవ సంవత్సరములు
బ్రహ్మదేవునకు 50 ఏళ్ళు = 1 పరార్ధము
2 పరార్ధాలు = బ్రహ్మకు 100 ఏళ్ళు = బ్రహ్మ జీవితకాలం = 1 పర = 1 మహాకల్పం = 311.04 ట్రిలియన్ మానవ సంవత్సరములు
బ్రహ్మదేవుని 1 పగలు లేదా రాత్రిని 1000 భాగాలుగా విభజిస్తారు, వాటిని చరణాలు అంటారు.

4 చరణాలు = సత్య యుగము = 17,28,000 సంవత్సరములు
3 చరణాలు = త్రేతా యుగము = 12,96,000 సంవత్సరములు
2 చరణాలు = ద్వాపర యుగము = 8,64,000 సంవత్సరములు
1 చరణాలు = కలి యుగము = 4,32,000 సంవత్సరములు

ఇప్పుడు మనమున్నది ప్రస్తుతం ఉన్న బ్రహ్మగారి రెండవ పరార్ధంలో. అందుకే సంకల్పంలో అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే అని చదువుతారు. ఇప్పుడు ఆయన వయస్సు 51 సంవత్సరాలు.

To be continued ............

Sunday, 12 March 2017

హిందూ ధర్మం - 238 (జ్యోతిష్యం- 18) (కాలగణన - 2)



1 యామం- ఒక రోజులో 4 వ వంతు, 1/4 దినం≈ 3 గంటలు
1 యామం= 7½ ఘటిలు= 3¾ ముహూర్తాలు= 3 హోరలు
1 హోర= 1/24 రోజు
4 యామాలు= పగలు లేదా రాత్రి; సగం రోజు.
8 యామాలు = 1 అహోరాత్రము (పగలు+రాత్రి)
పక్షం = 15 రోజులు
శుక్ల పక్షం+ కృష్ణ పక్షం = ఒక చాంద్రమాన మాసం

పితృమానం

మానవులకు 15 రోజులు (1 పక్షం) = పితృదేవతలకు సగం రోజు
మానవుల 30 రోజుల కాలం = పితృదేవతలకు 1 రోజు
పితృదేవతల 30 రోజులు = పితృదేవతల 1 నెల = 30*30= 900 మానవదినములు
పితృదేవతలకు 12 నెలలు = 1 సంవత్సరం= 10,800 మానవదినములు
పితృదేవతల వయసు 100 సంవత్సరాలు (= పితృదేవతలకు 36,000 దినములు = 10,80,000 మానవ దినములు = 3000 మానవ సంవత్సరాలు)
దేవతలకు 1 రోజు = మానవులకు 1 సంవత్సరం
దేవతలకు 1 నెల/మాసం = దేవతల 30 రోజులు (మానవుల 30 ఏళ్ళ కాలం)
దేవతలకు 1 సంవత్సరం (దివ్య సంవత్సరం) = దేవతలకు 12 నెలల కాలం = 360 మానవ సంవత్సరములు
12,000 దివ్య సంవత్సరములు = దేవతల వయస్సు = 1 మహాయుగం

ఇక్కడ దేవతలంటే ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు ఇత్యాది దేవతలని అర్దం చేసుకోవాలి. శివ, విష్ణు, శక్తి మొదలైన వారు పరబ్రహ్మం యొక్క ప్రతిబింబాలు. పరబ్రహ్మం సనాతనము, ఎల్లప్పుడూ ఉంటుంది. మానవ జన్మ వలన కలిగిన సదవకాశాన్ని వినియోగించుకుని, శాస్త్రంలో చెప్పబడ్డ పుణ్యకర్మలను, తపస్సును ఆచరిచిన జీవులు, తమ పుణ్యకర్మ చేత స్వర్గం మొదలైన లోకాలను చేరుతారు. ఇంద్రుడు మొదలైన దేవతలుగా మారి తమ పుణ్య కర్మను అనుభవిస్తారు. భగవద్గీతలో చెప్పింటలు 'క్షీణే పుణ్యే మర్త్యలోకం విశ్మతి' అని, పుణ్యం క్షీణించగానే తిరిగి మానవ లోకంలో పుడతారు. గత జన్మలో చేసుకున్న పుణకర్మ వలన, వాసనల వలన ఉన్నతమైన సిరిసంపదలుకుటుంబంలో పుట్టి, తిరిగి ధర్మమార్గంలో నడుస్తారు.  

ఇంద్ర, వాయు, వరుణ మొదలైన దేవతలు మానవుల వంటి జీవులే. ఇంద్రాది నామాలను పదవులను సూచిస్తాయి. ఉదాహరణకు మన దేశానికి ప్రధాన మంత్రి పదవి ఉంది. ఆ పదవిలో కూర్చున్న వారు ఎవరైనా ప్రధానమంత్రి అవుతారు. అంతేకానీ ప్రధానమంత్రి అనేది జన్మతో వచ్చే పదవి కాదు. అలానే దేవలోకంలో కూడా. అయితే ఇక్కడే మనకూ, అన్యమతాలకు బేధం ఉంది. దేవ, యక్ష, కిన్నెర, కింపురుష మొదలైన ఊర్ధ్వలోకల జీవులు ఉన్నారని గుర్తించింది, వారికి కూడా ధర్మంలో స్థానం కల్పించింది కేవలం సనాతన ధర్మం మాత్రమే. ఆయా మతాలు స్వర్గం వరకే చెప్పగలిగాయి. కానీ సనాతన ధర్మం స్వర్గానికి భిన్నమైన లోకాలను సైతం చెప్పింది. అక్కడ ఇంద్రాది దేవతలు లేరు. పుణ్యకర్మను అనుభవించి, తిరిగి మర్త్యలోకంలో జన్మించడం లేదు. పునర్జన్మ సిద్దాంతానికి అవి వ్యతిరేకం. మనమున్న భూలోకంలో నిర్వహించబడే యజ్ఞయాగాది కర్మలు, ఇతర వైదిక కర్మలు కేవలం మానవుల మేలు కోసమే కాదు. ఇక్కడ జరపబడే కర్మలు అన్యలోక జీవులకు ఆహారాన్ని, శక్తిని ఇస్తాయి. ఇవి వారికి కూడా మేలు చేస్తాయి. అన్ని లోకాలను కాపాడతాయి. అందుకే హిందువులు, తమ ప్రార్థన చివరలో లోకాసమస్తాః సుఖినోభవంతు అంటారు. సమస్త లోకాలు సుఖంగా, క్షేమంగా ఉండాలని దాని అర్దం. ఇలా కోరేది కూడా సనాతన ధర్మమే. అన్యమతాల్లో తమ మతస్థులు బాగుండాలనే కోరుకుంటే, సనాతనధర్మం 'శతృబుద్ధిం వినాశాయ' - శతృవు కూడా బాగుండాలి, కానీ అతనిలోనున్న శతృత్వం నశించాలని కోరుకుంటుంది.

To be continued ..................

Source: https://en.wikipedia.org/wiki/Hindu_units_of_time

Sunday, 12 February 2017

హిందూ ధర్మం - 237 (జ్యోతిష్యం- 17 (కాలగణన))



ఇప్పుడు జ్యోతిష్యంలో మన ఋషులు కాలాన్ని ఎలా గణించారో, మామూలు వారు ఊహించని స్థాయిలో, 17 మైక్రో సెకన్ల నుంచి 311,040,000,000,000 ఏళ్ళ వరకు కాలాన్ని అతి సూక్ష్మంగా ఎలా గణించారో, ఆ వివరాలు చూద్దాం.

1 పరమాణువు- ఒక సెకన్‌లో 60,570 వ వంతు, 16.8 మైక్రోసెకను (1 మైక్రోసెకను= 1 సెకెనులో 10 లక్షల వంతు)
1 అణువు- 2 పరమాణువులు≈ 33.7 మైక్రోసెకను
1 త్రసరెణు- 3 అణువులు≈ 101 మైక్రోసెకను
తృటి- 3 త్రసరెణు≈ 1/3290 సెకన్లు; అనగా ఒక సెకనులో 3290 వ వంతు= 304 మైక్రోసెకను
1 వేధ= 100 త్రుటి≈ 47.4 మిల్లిసెకన్లు
1 లవం- 3 వేధలు≈ 0.14 సెకన్లు≈ 91 మిల్లిసెకన్లు
1 నిమేషం (కంటిరెప్ప కాలము)- 3 లవములు≈ 0.43 సెకన్లు (లెకలన్నీ దరిదాపుల్లో)
1 క్షణం- 3 నిమేషాలు≈ 1.28 సెకన్లు
1 కాష్టా- 5 క్షణాలు≈ 6.4 సెకన్లు
1 లఘు- 15 కాష్టాలు≈ 1.6 నిమిషాలు
1 దంఢ- 15 లఘువులు≈ 24 నిమిషాలు
1 ముహూర్తం- 2 దంఢలు≈ 48 నిమిషాలు
1 అహోరాత్రం- 30 ముహుర్తాలు≈ 24 గంటలు
మాసము- 30 అహోరాత్రాలు≈ 30 రోజులు
ఋతువు= 2 మాసాలు ≈ 2 నెలలు
అయనము= 3 ఋతువులు≈ 6 నెలలు
సంవత్సరము= 2 అయనాలు= దేవతలకు ఒక రోజు.
-----
1 త్రుటి= 29.6296 మైక్రోసెకన్లు
1 తత్పర= 2.96296 మిల్లిసెకన్లు
1 నిమెషం- 88.889 మిల్లిసెకన్లు
45 నిమెషాలు - 1 ప్రాణ= 4 సెకన్లు
6 ప్రాణాలు- 1 వినాడి- 24 సెకన్లు
60 వినాడి(లు)- 1 నాడి- 24 నిమిషాలు
60 నాడులు= 1 అహోరాత్రము
--------


ఆధునిక ప్రమాణాల ప్రకారం, 24 గంటలు అంటే ఒక పగలు, రాత్రి. మనం గమనించేది 1 నాడి లేదా దంఢం= 24 నిమిషాలు, 1 వినాడి= 24 సెకన్లు, 1 ఆసు/ ప్రాణం= 4 సెకన్లు ........ 1 తృటి= 1 సెకనులో 33,750 వంతు. అసలు ఇంత చిన్న కాలాన్ని మన ఋషులు లెక్కించడమే ఆశ్చర్యం కదూ.

సూర్య సిద్ధాతం కాలాన్నివాస్తవికంగాను, వ్యవహారికంగానూ చెప్పింది. Virtual భాగాన్ని మూర్తం అని, Practical భాగాన్ని అమూర్తం అని చెప్పింది. ప్రాణం (ఊపిరి) పీల్చుకునే కాలంతో మొదలయ్యేది సత్యమని, తృటితో మొదలయ్యేది నిత్యజీవితంలో అవసరంలేనిదని చెప్పింది. 1 ప్రాణం అంటే, ఆరోగ్యవంతమైన మనిషి 1 సారి ఊపిరి పీల్చి విడువడానికి పట్టే సమయం లేదా గురువక్షరం అనే 10 అక్షరాలను పలికే సమయం.

To be continued ..............

Source: http://www.sanskritimagazine.com/indian-religions/hinduism/concept-measurement-time-vedas/
https://en.wikipedia.org/wiki/Hindu_units_of_time
http://veda.wikidot.com/vedic-time-system

Sunday, 29 January 2017

హిందూ ధర్మం - 235 (గ్రీకు సాహిత్యంలో వైదిక ధర్మం)



మనకు, గ్రీకు నాగరికతకు మధ్య చక్కని సంబంధాలు ఉండేవి. గ్రీకులు మన నుంచి అనేకం తీసుకున్నారు. ముఖ్యంగా గ్రీకు కథలు సనాతన ధర్మ ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని రాసుకున్నవే. ట్రోజన్ వార్ అనేది స్కూల్ పాఠ్యపుస్తకాల్లో ఆంగ్లంలో ఉంది. ఆ ట్రాజన్ వార్ మహాభారతాన్ని ప్రేరణగా తీసుకుని గ్రీకులు రాసుకున్న కథ.

  • మహాభారతంలో పాండవులు 14 ఏళ్ళు వనవాసానికి వెళతారు. ట్రాజన్ యుద్ధం 14 ఏళ్ళు జరిగింది. మహాభారతం ప్రారంభంలో అర్జునుడు యుద్ధానికి సుముఖంగా ఉండడు. 
  • ట్రాజన్ యుద్ధంలో కూడా అకిల్లిస్, యుద్ధం చేయడానికి ఇష్టపడడు. అర్జునుడు, తన కుమారుడైన అభిమన్యుడి శవం మీద పడి రోదించి, ఆ తర్వాత రోజు జయధ్రథుడిని చంపుతానని శపధం చేస్తాడు. అచిల్లిస్ కూడా తన సోదరుడు పాట్రోకులస్ మృతికి రోదించి, మరుసటి రోజు హెక్టర్ ని చంపుతానని శపధం చేస్తాడు. 
  • ఘటోత్కచుడు, కౌరవుల సైన్యంపై రాత్రి సమయంలో దాడి చేసి, తీవ్రమైన వినాశనం కలిగిస్తాడు. అగ్నిని ఆయుధంగా వాడి, కౌరవ శిబిరాలను దగ్ధం చేస్తాడు. హెక్టర్ కూడా గ్రీకు సైన్య శిబిరలపై దాడి చేసి, వినాశనం కలిగిస్తాడు. అప్పుడు కూడా అగ్నినే ఆయుధంగా వాడతాడు. 
  • సంజయుడు యుద్ధాన్ని ధృతరాష్ట్రునకు చెప్తాడు. అలాగే ట్రాజన్ రాజుకు మంత్రి యుద్ధాన్ని వివరిస్తాడు. 
  • ధృతరాష్ట్రునకు 100 కుమారులు, ట్రాజన్ రాజుకు 68 పుత్రులు, 18 పుత్రికలు. 
  • అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కలిసి పాండవుల శిబిరం వద్దకు వెళ్ళగా, కృపాచార్య, కృతవర్మ, ద్వారాల వద్దనే ఉండిపోతారు. ఆశ్వత్థామ లోపలకు వెళ్ళి, ఉపపాండవులను చంపుతాడు. రక్తపాతం సృష్టిస్తాడు. అలాగే ట్రాజన్ నగరాన్ని గెలవటానికి ట్రాజన్ గుఱ్ఱం అన్నేది కుట్రపూరితమైన చర్య. అది కూడా ఎన్నో విఫల యత్నాల తర్వాత. చివరి రోజు రాత్రి దాని ద్వారా యుద్ధం చేస్తారు. (1)
క్రీ.పూ.300 వ చెందిన మెగస్థీనిస్, శ్రీ కృష్ణ కథలను గ్రీకుకు తీసుకువెళ్ళాడని, ఆయన్ను హెర్క్యులస్ అని పిలిచాడని, అలా కృష్ణుడు హెర్క్యులస్‌గా గ్రీకు సాహిత్యంలో చేరాడని చెప్తారు. మెగస్థీనిస్ భారతదేశమంతా పర్యటించి, అతను చూసినవి, విన్నవి 'ఇండికా' అనే తన గ్రంథంలో రాసుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఆయన ఇలా చెప్పుకున్నాడు, శౌరశేనోయి అనే భారతీయ తెగ ప్రత్యేకించి హెర్క్యులస్‌ని పూజించేది, మరియు వారికి రెండు నగరాలున్నాయి, మెథోర, క్లేసిబొర, నౌకయానానికి వీలుగా ఉన్న జొబరెస్ అనే నది.

గ్రీకులకు సంస్కృతం పలకడంలో అస్పష్టత కారణంగా తప్పుగా పేరలను పలికాడని అనేకమంది పండితులు పేర్కొన్నారు. ఎడ్విన్ ఫ్రాన్సిస్ బ్రయంట్ ఏమంటారంటే 'శౌరశేనోయి అనగా కృష్నునికి చెందిన యాదవ వంశపు శూరశేనులు, హెర్కులస్ అనేది హరే కృష్ణకు అపభ్రంశ పదం, మెథోర అనేది శ్రీ కృష్ణ జన్మస్థానమైన మధుర, క్లేసిబొర అనేది కృష్ణ పురం, జోబరెస్ అనేది యమునా నదికి అపభ్రంశం. (2)

To be continued .............



Sunday, 15 January 2017

హిందూ ధర్మం - 234 (జ్యోతిష్యం - 16)



వారి మీద మన ప్రభావం అధికంగా ఉండేది. మనకు వారానికి 7 రోజులు, వారు అదే తీసుకున్నారు. మనకు సంవత్సరానికి 12 నెలలు. కలియుగంలో అది చైత్రం నుంచి మొదలవుతుంది, ఫాల్గుణంతో ముగుస్తుంది. వారు కూడా 12 నెలల లెక్క తీసుకున్నారు. అందులో ఆ నెలలకు కాలక్రమంలో ఆగస్టస్ మొదలైన రాజులు పేర్లు పెట్టినప్పటికీ, సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు ఉన్న నెలల పేర్లకు అర్దం మాత్రం మారలేదు. ప్రస్తుత గ్రిగేరియన్ క్యాలెండర్‌కు పూర్వం, జూలియన్ క్యాలెండర్ ఉండేది, దానికి పూర్వం రోమన్ క్యాలెండర్ ఉండేది. వారు వీటికి ఏ ప్రాతిపదికన పేర్లు పెట్టారంటే సెప్టెంబరు అంటే 7 నెల (సప్త =సెప్టే) అని అర్దం. అక్టోబరు అంటే 8 వ నెల (అష్ట = అక్టో), నవంబరు 9 వ నెల (నవ = నవ), డిసెంబరు 10 వ నెల (దశ = డిసెం). ఇంతకీ ఇవి ఎవరికి? హిందువులకు. హిందువులకు చైత్రంతో సంవత్సరం ప్రారభమవుతుంది. అంటే మార్చి - ఏప్రిల్ మధ్య. అక్కడి నుంచి క్రమంగా లెక్కించుకుంటూ వస్తే, మనకు 7, 8, 9, 10 నెలలని మనము ఏది అంటూన్నామో, వారూ దాన్నే స్వీకరించారు. ఇంతకంటే ఋజువేమీ కావాలి? వారు మన దగ్గరి నుంచి జ్యోతిష్యం, కాలగణనం తీసుకున్నారని చెప్పడానికి.

మనము మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటాము. ఇప్పుడు సంక్రాంతి జనవరి నెల 14, 15 తేదీల్లో వస్తోంది. వివేకానంద స్వామి జన్మించింది మకర సంక్రాంతి రోజున, జనవరి 12, 1863 లో. అంటే అప్పట్లో సంక్రాంతి జనవరి 12. భూమి అయనగతి (Axial precession) కారణంగా sidereal zodiac అసలు స్థితిలో ప్రతి 72 ఏళ్ళకు 1 డిగ్రీ మార్పు వస్తుంది. అందువలన మకర సంక్రాంతి ప్రతి కొనేళ్ళకు (నిర్ణీత సమయానికి) ఒక రోజు ముందుకు జరుగుతుంది. దీనికి ఈనాడు శాస్త్రవేత్తలు చెప్పే శీతాకాల అయనాంతం (వింటర్ సొలిస్టిక్) కు సంబంధం ఉంది. ఇలా వెనక్కు లెక్కించుకుంటూ పోతే, చరిత్రలో ఒకానొక సమయంలో మకర సంక్రాంతి, వింటర్ సొలిస్టిక్ ఒకటే రోజున జరిగిన సందర్భం ఉంది.

The actual position of winter solstice in the sidereal zodiac changes gradually due to the Axial precession of the Earth, shifting westwards by approximately 1 degree in every 72 years. Hence, if Makara Sankranti at some point of time did mark the actual date of winter solstice, it would have been so around 300 CE, the heyday of Indian mathematics and astronomy

ఇది ముఖ్యంగా గ్రీకు సామ్రాజ్యం వర్దిల్లిన కాలంలో, అంతకు ముందు మహాభారత కాలంలో కూడా ఉండి ఉండవచ్చు. ఇలా లెక్కించుకుంటూ పోతే, పరాశర మహర్షి సమాజంలో మానవ దేహంతో సాధారణంగా తిరిగిన రోజుల్లో డిసెంబరు 25 న మకర సంక్రాంతి జరుపుకుందీ ప్రపంచం. మహాభారత యుద్ధం కేవలం సైనికులనే కాదు, మహర్షులను, వేద పండితులను, బ్రాహ్మణులను సైతం బలి తీసుకుందని, ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ధర్మ ప్రచారకులు లేక ధర్మ ప్రచారం సన్నగిల్లిందని అన్నారు మహర్షి దయానంద సరస్వతీ. తిరిగి భారతీయులు క్రీస్తు పూర్వం నాటికే గ్రీకులుతో వ్యాపర సంబంధాలు కలిగి ఉండి, అక్కడ కాలనీలు ఏర్పరుచుకోవడంతో మళ్ళీ అక్కడికి ధర్మ పవనాలు వీచాయి. అలా గ్రీకులు కూడా మన దేవతలనే తీసుకుని పూజించారు. భారతీయులు మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడిని పూజిస్తారు. దానినే గ్రీకులు స్వీకరించారు. అప్పుడు మకర సంక్రాంతి జరిగింది డిసెంబరు 25 న. వారు కూడా దాన్ని సెలవు దినంగా, పవిత్ర దినంగా భావించి సుర్యారాధన చేశారు. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం కుప్పకూలి రోమన్ సామ్రాజ్యం నిర్మితమైంది. వారు కూడా ఈ ఆచారాన్ని విడువలేదు. పైగా డిసెంబరు 17 నుంచి 25 వరకు సెలవు రోజు పాటించి, వారం పాటు పండుగ చేసుకున్నారు. ఆ తర్వాత క్రైస్తవం పుట్టింది. అది రోమన్, గ్రీకు నాగరికతలను, తనలో కొంత కలుపుకుని, కలుపుకోవడానికి విరుద్ధంగా ఉన్నవాటిని అవతల పారేసింది. గ్రీకు, రోమన్ నాగరికతలను పురావస్తు శాలలకు పరిమితం చేసింది. దీని గురించి రాజీవ్ మల్హోత్రా గారు అద్భుతంగా చెప్తారు. Digestion అనే concept ను సృష్టించి, దీన్ని విశదీకరించారు. అలాంటి సందర్భంలో రోమన్లు సూర్యుని కోసం నిర్వహించే పండుగలో Sun కు బదులుగా Son (As per Christian belief, Jesus is the son of God)ను తీసుకువచ్చింది. నిజానికి జీసెస్ పుట్టింది మార్చి, ఏప్రియల్ కాలంలో. ఆయన డిసెంబరు 25 న పుట్టినట్లు చరిత్రలో కానీ, బైబిల్ లో కానీ ఏ విధమైన ఆధారం లేదు. నిజానికి క్రిస్టమస్ పేగన్ల పండుగ. విగ్రహారాధన, చెట్లను, నదులను, జంతువులను పూజించడం బైబిల్ అంగీకరించదు. క్రిస్టమస్ ట్రీ అనేది కూడా స్థానికి జాతులు (హిందువులు!?) పూజించే వృక్షం. అక్కడి వారిని మతమార్పిడి చేసి, ఆ మతాన్ని నాశనం చేయడం కోసం, క్రైస్తవం, అక్కడి స్థానిక తెగల వారి ఆచారాలను కాపీ కొట్టింది. మా దగ్గర కూడా చెట్లను పూజిస్తారు, సరిగ్గా డిసెంబరు 25 నే మేము పండుగ చేసుకుంటాము అంటూ ............ ఇప్పుడు భారతదేశంలో వేంకటేశ్వర సుప్రభాతాన్ని పోలిన ఏసు సుప్రభాతం, ఆలయాన్ని పోలిన చర్చి నిర్మాణం, అందులో ధ్వజస్థంభం, సన్యాసులను పోలిన వస్త్రధారణ, క్రైస్తవులు కూడా ఏసు మాల ధారణ, వేదాలు, ఉపనిషత్తులు ఏసు ......... ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నట్లే అక్కడ చేశారు. వాళ్ళు మనలని కాపీ కొట్టడం కాదు, అనుకరించి, మీ దగ్గర ఉన్నవే మా దగ్గరా ఉన్నాయి, కనుక మారినా మీరేమీ నష్టపోరు అంటూ మార్చే ప్రయత్నం (మన ఆత్మ సిద్ధాతాన్ని అనుకరించలేరు, మూలాలను కాపీ చేస్తే క్రైస్తవమే అంతరిస్తుంది). ఇప్పుడు మనం అంటాం కదా, నదులన్నీ సముద్రంలోనే కలవాలి, మతాలన్నీ హిందూత్వంలోనే కలవాలి అని. బహుసా వాళ్ళు కూడా అప్పుడు అలా అనుకున్నారో లేదో కానీ ఇదే వ్యూహాన్ని క్రైస్తవులు అమలు పరిచి ఎన్నో మతాలను నాశనం చేశారు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి.

విషయంలోకి వస్తే, అలా గ్రీకు, రోమన్లు జరుపుకునే మకర సంక్రాంతి నేటి క్రిస్టమస్ అయ్యింది.

To be continued ...............

Sunday, 18 December 2016

హిందూ ధర్మం - 233 (జ్యోతిష్యం - 15)



ఆధునిక పరిశోధన కూడా ప్రకారం గ్రీస్, ఇతర నాగరికతలలాగే తనకంటే వైభవంగా విలసిల్లుతున్న నాగరికతల నుంచి జ్ఞానం తీసుకుని, తనలో కలుపుకుని, తన ఆలోచనలో భాగం చేసుకుందని స్పష్టం చేసింది. సోక్రటీస్‌కు ముందే గ్రీస్‌లో హిందువులు నివసించారని కొందరు పాశ్చాత్య చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గ్రీకులో సన్యాసానికి దగ్గరగా కొన్ని సంప్రదాయలుండటం గురించి Egypt మరియు Israel (1911) గ్రంధ రచయిత,  Professor Sir Flinders Patrie (1853-1942) అంటారు- క్రీ.పూ. 480 నాటికే పర్షియన్ సైన్యంలో ఎంతో పెద్ద సంఖ్యలో భారతీయ సేనలు ఉండటం, భారతదేశం మరియు గ్రీస్ మధ్య సంబంధాలు ఎంత వరకు వెళ్ళాయో చెప్తోంది. ఈజిప్ట్‌లోని Memphis అనే ప్రాంతంలో దొరికిన క్రీ.పూ. 5 వ శతాబ్దానికి చెందిన భారతీయుల modeled heads, భారతీయులు వర్తకం కోసం అక్కడ నివసించారని చెప్తున్నాయి. అందువల్ల నూతనమైన పాశ్చాత్య ఆధ్యాత్మికతకు భారతీయతే మూలమని ఎటువంటి కష్టం లేకుండా తేల్చవచ్చు.

సోక్రటీస్ శిష్యుడైన ప్లాటో, తన గురువు రచనలే కాక, కొన్ని తాను కూడా గ్రంధస్థం చేశాడు. అవన్నీ హిందూ సిద్ధాంతాలకు, ఉపనిషద్ బోధనలకు దగ్గరగా ఉంటాయి.  ప్లాటో కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మాడు. నిజానికి ఇది ప్లాటొ కంటే శతాద్బం ముందే జీవించిన పైధాగోరస్, భారతదేశంలో గంగా తీరంలో చదువుకున్న తర్వాత, అక్కడ ప్రతిపాదించాడని జెర్మన్ చరిత్రకారులు 17 వ శత్బాదంలోనే అభిప్రాయం వ్యక్తం చేశారు (ఈ విషయం ఇంతకుపూర్వ భాగాల్లో చెప్పుకోవడం జరిగింది). ఈ విధంగా ఈ రోజు పాశ్చాత్య ప్రపంచం తమ ఆలోచనకు మూలపురుషులుగా కొలుస్తున్న ముగ్గురి మీద సనాతనధర్మం యొక్క ప్రభావం ఉంది. కాకపోతే ఆ తర్వాతి వారు ఉపనిషత్తులను పరిశీలించని కారణంగా, వారి ఆలోచన వక్రమార్గం పట్టి ప్రపంచ నాగరికతల నాశనానికి దారి తీసింది. ఇది ఆ తర్వాత కూడా కొనసాగింది. క్రీ.పూ. 2 వ శత్బాదానికి చెందిన అఘతా క్లోస్ అనే గ్రీకు రాజు, శ్రీ కృష్ణుడు, బలరాముడి ముద్రలున్న వెండి నాణేలను ముద్రించాడు. ఇది అక్కడి పురావస్తుశాలలో చూడవచ్చు.

గ్రీకు రాయబారి, మెగస్తనీస్, భారతదేశ సౌభగ్యాన్ని గురించి వివరంగా రాసి పెట్టాడు. గ్రీకు పతనమైన రోమన్ సామ్రాజ్యం స్థాపించబడిన తర్వాత కూడా వాళ్ళకు, మనకు మధ్య వ్యాపారలావాదేవీలు, వాణిజ్యం ఏమాత్రం తగ్గలేదు. రోమన్లు, అప్పట్లో బ్రహ్మాండమైన నౌకాబల సంపన్న దేశంగా ఉన్న భారతదేశం నుంచి చేసుకునే దిగుమతుల నిమిత్తం, ఏడాదికి 5 కోట్ల సెస్టర్సులు (50,00,000 డాలర్లు) ఖర్చు పెట్టేవారని ప్లీనీ (క్రీ.శ. 1 వ శతాబ్ది) అంటాడు. ఆ తర్వాత అక్కడ క్రైస్తవ మతవ్యాప్తి పెరిగింది. క్రైస్తవంలో కూడా ఎన్నో ఆదర్శాలను సనాతన ధర్మం, బౌద్ధ మతాల నుంచి తీసుకున్నారని ఎందరో అభిప్రాయపడ్డారు. భారతదేశ సంపదల గురించి ప్రస్తావిస్తూ బైబిల్ ( II క్రానికల్స్ 9:21.10) అంటుంది, "తార్షీష్ ఓడలు, బంగారం, వెండి, దంతం, కోతులు, నెమళ్ళు మాత్రమే కాకుండా ఆల్గం (చందనం) చెట్ల కొయ్య, రత్నాలు కూడా సమృద్ధిగా, ఓఫిర్ (బొంబాయి తీరంలో ఉన్న సోపారా) నుంచి తెచ్చి సాలమన్ రాజుకు ఇచ్చాయని చెబుతోంది". ఆఖరికి పరమత 'దైవ' గ్రంధాల్లో కూడా హిందూదేశ వైభవం ప్రస్తావించబడింది. అంటే అప్పట్లో ఆ గ్రంధకర్తల మీద మన దేశ ప్రభావం ఎంతగా ఉండేదో గమనించవచ్చు.

To be continued .............

వివరాలకు క్రింది లింకులు పనికి వస్తాయి.
http://historydetox.com/pythagoras-plato-and-india/
http://www.hinduwisdom.info/India_and_Greece.htm
https://ramanan50.wordpress.com/2014/03/30/vedic-hinduism-in-germany-greece-russian-veda/

Sunday, 11 December 2016

హిందూ ధర్మం - 232 (జ్యోతిష్యం - 14)



మరి మనం గ్రీకుల నుంచి జ్యోతిష్యం స్వీకరించామా? వారు ఇక్కడి నుంచి తీసుకున్నారా? కలియుగం ప్రారంభంలో కొంతకాలం వరకు ప్రపంచమంతా సనాతన ధర్మమే వ్యాపించి ఉంది. మహాభారత యుద్ధం నాటికి వైభవోపేతంగా విలసిల్లింది. ఈ విషయం మీద మనం ఇదే శీర్షికన ప్రరురిచిన అనేక భాగాల్లో దానికి ఆధారాలు కూడా చూశాము. ఈ గ్రీకు, రోమన్ నాగరికతలు కూడా హిందూ ధర్మం నుంచి వేరుపడ్డవే. మహాభారత యుద్ధం తర్వాత యుగాంతం యొక్క ప్రభావం చేత ప్రపంచంలో అనేక మార్పులు సంభవించాయి. సరస్వతీ నది ఎండిపోయింది, అప్పుడు కొంతమంది ఈ భరతఖండం నుంచి పశ్చిమ దిశగా వెళ్ళారు. కొందరు ఈజిప్టులో స్థిరపడ్డారు. కొందరు ఇంగ్లాండ్, గ్రీకు దేశాల దిశగా మళ్ళారు. ఇంతకముందు యుగాల మాదిరిగా ఋషులు దేశపర్యటనలు చేసి ధర్మప్రచారం చేయలేదు, ఈ యుగప్రభావంగా. అలా అక్కడున్న సంస్కృతుల వారు సనాతనధర్మ మూల సూత్రాలకు దూరమయ్యారు. ఆస్ట్రేలియాలో కొన్ని స్థానిక తెగలున్నాయి. వారికి మనలా అగ్నిహోత్రం, యజ్ఞ ప్రక్రియ ఉంది. మంట రగిల్చి, దానిలో ఆకులు, కట్టెపుల్లలు వేస్తూ, హా!హా! అంటూ అరుస్తారు. వేదంలో చెప్పబడ్డ స్వాహా కారం కాలక్రమంలో అక్కడ అలామారింది, మూలగ్రంధాలతో సంబంధం తెగిపోయి. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంతేందుకు, గ్రీకులకు కూడా భారతదేశమే తమ గురువనే భావన బలంగా ఉండేది. క్రీ.పూ. 326 లో అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్రకు వచ్చాడు, కోటా వేంకటాచలం గారు నిర్ధారించిన చారిత్రిక ఆధారాల పరంగా, అలాగే గ్రీకు చరిత్ర ఆధారంగా.  

అలెగ్జాండర్ విశ్వమంతా జయించి వస్తానని తన గురువు అరిస్టాటిల్ వద్దకు వెళ్ళినప్పుడు నువ్వు ప్రపంచంలో ఏ దేశం మీదకైనా వెళ్ళు, కానీ భారతదేశం మాత్రం వెళ్ళకు, అక్కడికి వెళితే నీ ఆటలు సాగవు, నీ పనైపోతుంది అంటాడు. అయినా వినకుండా భారతదేశం మీదకు వస్తాడు, అది తెలుసుకున్న అరిస్టాటిల్, నువ్వెలాగో నా మాట వినకుండా భారతదేశం వెళ్ళావు, కనీసం అక్కడి నుంచి వచ్చేటప్పుడు నీతో పటు 5 వస్తువులు తీసుకురా!ఒకటి భారతదేశం మట్టి. ఎందరో ఋషులు, గురువులు, మహాపురుషులకు జన్మనిచ్చిన మట్టి అది. అక్కడ అనేకమంది ఆ మట్టిపై తిరిగారు. దాన్ని నీవు తీసుకువస్తే, నేను దాన్ని పవిత్రంగా భావించి పూజించుకుంటాను. అలగే గంగాజలం తీసుకురా. అది ఎప్పటికి పాడవ్వనిది, పవిత్రమైనది. మూడవది భగవద్గీత, నాలుగు భాగవతం తిసుకురా, ఐదవది, ముఖ్యమైనది, అక్కడి నుంచి ఒక గురువును తీసుకొనిరా. ఆయన్ను నేను గురువుగా చేసుకుంటాను అన్నాడు. అలెగ్జాండర్ మనదేశం మీద యుద్ధానికి రావడం, ఓడిపోవడం, ఇక్కడి బ్రాహ్మణులతో శాస్త్ర చర్చలు జరిపి, వాళ్ళ జ్ఞానానికి మెచ్చి, కొందరిని అక్కడికి తనతో పాటు తీసుకెళ్ళడం జరిగింది. దారిలో ఒక సాధువుకు చేసిన అపచారం కారణంగా, అతని శాపానికి గురై, ఆ శాపవశాత్తు తన మాతృభూమికి చేరకుండానే రోగం వచ్చి మరణించాడు గ్రీకువీరుడు. అలా అలెగ్జాండర్‌తో వెళ్ళిన బ్రాహ్మణ పండితులు గ్రీకువారికి జ్ఞానోదయం చేశారు. అంతేకాక అలెగ్జాండర్ భారతదేశం నుంచి పరాజయంతో తిరిగి వెళుతూ తనతో పాటు ఎన్నో ధార్మిక గ్రంధాలను తీసుకువెళ్ళాడు. అలా సనాతన జ్ఞానం గ్రీకు అంధకారాన్ని నశింపజేసింది.

ఈనాడు పాశ్చాత్య ప్రపంచం తన ఆలోచనా విధానానికి ముగ్గుర్ని మూల పురుషులుగా చెప్తుంది, ఒకరు సోక్రటిస్, రెండు ప్లాటో, మూడు అరిస్టాటిల్.   వాళ్ళే కాదు, మన దేశంలో అభ్యుదయవాదులుగా చెలామణి అవుతున్న కుహనా మేధావులు, నాస్తికులు కూడా వీరినే గురువులుగా భావిస్తారు. అరిస్టాటిల్ గురించి చెప్పుకున్నాం. మిగిలింది సోక్రటీసు, ప్లాటో. సోక్రటీస్‌కూ ఒక హిందు మునికి జరిగిన వాగ్వాదాన్ని గురించి 'యూసేబియస్'లో ఒక చోట ఇలా చెప్పడం జరిగింది. సోక్రటీస్ ఆ హిందూ మునిని అఘోర లేదా మార్కెట్ స్థలంలో కలుసుకున్నాడు. ఆ హిందూముని సోక్రటీస్ ను నీవేమీ చేస్తున్నావని, నీ తత్త్వం విషయ విస్తృతి ఏమిటని అడిగాడు. దానికి సోక్రటీస్ మానవ దృగ్విషయాల అనుశీలన అని జవాబిచ్చాడు, కాగా ఆ భారతీయుడు విరగబడి నవ్వాడు. దివ్య విషయాలను ఎరగనప్పుడు, మానవ దృగ్విషయాలను మనిషి ఎలా అనుశీలన చేయగలడని అంటాడు.

మనకు అర్దమయ్యేలా చెప్పుకోవాలంటే సోక్రటీసు 'నేను మనిషిని అర్దం చేసుకోవడం కొరకు మనుషుల్ని ప్రశ్నిస్తున్నాను' అంటాడు. అప్పుడా హిందూముని గట్టిగా నవ్వి, భగవంతుని/ ఆత్మను అర్దం చేసుకోకుండా మనిషిని ఎలా అర్దం చేసుకుంటారని అంటాడు. పాశ్చాత్య తత్త్వశాస్త్రాల్లో ప్రతిధ్వనించే గ్రీకు ఆదర్శం: 'మనిషి, నువ్వు స్వయంగా తెలుసుకో' (Man, Know thyself). హిందువు అనేది 'మనిషీ, నీ ఆత్మను తెలుసుకో' (Man, Know thy Self) అని. నేను ఆలోచిస్తున్నాను కనుక నేను ఉన్నాను (I think, therefore I exist) అనేది పశ్చిమ దేశాల్లో బాగా కనిపిస్తుంది. అది డెకార్ట్ (Descartes) అన్న వాక్యం. కానీ అది తాత్త్వికంగా చెల్లదు. భారతీయుడంటాడు నేను ఉన్నాను, కనుక నేను ఆలోచిస్తున్నాను (I Exist, therefore I think). ఎందుకంటే తార్కిక వివేచన శక్తులు మానవుడి పరమ సత్యాన్ని వెల్లడించలేవు. మానవ మనస్సు, అది గుర్తించే పరిణామశీల ప్రపంచంలాగే శాశ్వత పరివర్తనలో ఉన్నది. అంతిమ నిర్ణయాలను అది అందించలేదు. బుద్ధి సంబంధమైన సంతృప్తి అత్యున్నత లక్ష్యం కాదు, దేవుడిని అన్వేషించేవాడే 'విద్య'ను నిజంగా ప్రేమించేవాడు. విద్య అంటే మార్పు చెందని సత్యం (Absolute Truth). తక్కినదంతా అవిద్య. అంటే సాపేక్ష జ్ఞానం (Relative Knowledge).

To be continued .................

Sunday, 4 December 2016

హిందూ ధర్మం - 231 (జ్యోతిష్యం - 13) (మనకూ, గ్రీకు, రోమన్లకు సారూప్యతలు)

మనం చూశాం కదా, మన సనాతన సంప్రదాయంలో వారాలకు నామాలను ఎలా నిర్ణయించారని. ఇప్పుడు ఒకసారి గ్రీకు, రోమన్ సంప్రదాయాలను పరికించి చూద్దాం. ఎందుకంటే ఈ రోజు మనం అనుసరిస్తున్న పాశ్చాత్య వారక్రమం కూడా మన జ్యోతిష్య శాస్త్ర లెక్కలతో సరిపోతున్నది. పైగా అది క్రైస్తవ సంప్రదాయానికి చెందినది కాదు, అసలు కొన్ని మతాలకు మనలా కాలగణన లేదు. ఈనాడు ప్రపంచం అనుసరిస్తున్న కాలగణనలో చాలా శాతం గ్రీకు, రోమన్ మూలాలు కలిగిందే. మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు? వారి మూలం ఎక్కడ ఉంది? వంటి అంశాలు పరిశీలిద్దాం.

పాశ్చాత్య క్యాలెండర్ మీద పరిశోధన చేసినవారి ప్రకారం వారాలకు రోమన్ దేవతల పేర్లను నిర్ణయించారు ఎందుకంటే ఇది రోమన్, గ్రీకు నాగరికతల నుంచి తీసుకున్న అంశం కనుక. దాన్ని జెర్మన్లు స్వీకరించి, అందులో కొన్ని అంశాలను మార్చి ఈ రోజు మనం పాటిస్తున్న ఆంగ్ల వారాల పేర్లు తీసుకువచ్చారు. ఒకసారి సారూప్యతలు (similarities) గమనించండి.

సన్‌డే అనే పదం dies solis అనే లాటిన్ పదం నుంచి వచ్చింది, దాని అర్దం సూర్యుని వారము అని. ఇది పేగన్లకు సెలవు దినము. (తమ మత ఆరాధన పద్ధతులకు, విశ్వాసాలకు భిన్నంగా ప్రకృతిని పూజించే సంప్రదాయం కలవారిని పేగన్‌ (Pagan) లుగా ముద్రవేసి, వారి మతం మార్చడమో లేదా పూర్తిగా ఆ నాగరికతను, జీవనవిధానాన్ని ఊచకోత కోసేవారు క్రైస్తవులు. అలా ప్రకృతిని ఆరాధించేవారిని పేగన్లు అనడం మొదలుపెట్టారు.) అలాగే ఇది వారి దేవునకు సంబంధించిన దినము.

మన్‌డే అనగా మూన్ (చంద్రునికి) కు చెందినది అని జెర్మన్ సంప్రదాయం చెప్తున్నది. ఇది dies lunae అనే లాటిన్ పదం అనువాదం. చంద్రుడిని దేవతగా పూజించే సంప్రదాయం అక్కడ కూడా ఉండేది.

Tuesday అనేది  Týr అనే దేవతకు సంబంధించినది. ఈయన యుద్ధానికి సంబంధించిన దేవత అని రోమన్ల విశ్వాసం. ఈయన గురించి జెర్మన్ పేగనిజంలో కూడా వర్ణన ఉంది. మనకు ఇది మంగళవారం. మంగళుడంటే కుజుడు, ఆయన భూమిపుత్రుడు కూడా కనుక భౌమవారమని పేరు వచ్చింది. మన జ్యోతిష్యంలో కూడా కుజుడిని యుద్ధానికి, తగువులకు, రక్తానికి కారకుడిగా చెప్తాము.

Wednesday అనేది Wodan (Odin) కు సంబంధించినది. లాంటిన్ లో దీన్ని dies Mercurii అన్నారు. ఈ దేవతను ఇంగ్లాండులో కూడా 17 శత్బాదం వరకు పూజించేవారు. వీరు సోల్స్ (Souls) కి మరణం తర్వాత మార్గదర్శనం చేస్తారని భావిస్తారు. బుద్ధికి సంబంధించిన  దేవతగా రోమన్ల విశ్వాసం. ఈయన కవితలు, సంగీతానికి సంబంధించిన దేవత. మన జ్యోతిష్యంలో ఇది బుధవారం. బుధుడు బాగుంటే విద్యలలో రాణిస్తారు. బుధుడి ధ్యానం చేత బుద్ధికి సంబంధించిన బాధలు తొలగుతాయని మనకు తెలిసిందే.

Thursday అనేది నోర్స్ దేవుడు Thor కు సంబంధించిన రోజట. లాంటిన్ లో దీన్ని dies Jovis అన్నారు. రోమన్లకు ముఖ్యమైన దేవుడు Jupiter, గురువుకు ప్రీతికరమైన రోజు. పురాతన రోమన్ల సంస్కృతిలో ఈయన దేవతలకు అధిపతి. మన జ్యోతిష్యంలో దేవ గురువు, బృహస్పతి.

Friday అనేది లాటిన్ పదం dies veneris అనువాదం. Venus అంటే శుక్రుడు. రోమన్లకు ఈయన ప్రేమ, అందం, శృంగారం, సంతానం, కోరికలకు చెందిన దేవత. మన జ్యోతిష్యంలో కూడా శుక్రుడిని పైన చెప్పుకున్న లక్షణాలకు అధిపతిగా చెప్తారు.

Saturday లో Saturn ఉంది. మూలాల్లోకి వెళ్ళకుండా చూసినా Saturn అంటే శని. మనకు శనివారమే వారికి Saturday. అయినా ఒకసారి పరిశీలిద్దాం. Saturday అనేది లాటిన్ పదం dies Saturni అనువాదం. రోమన్లకు ఈయన సృష్టి, ప్రళయం, సంపద, వ్యవసాయం, మోక్షానికి సంబంధించిన దేవత. మన జ్యోతిష్యంలో శని పూర్వ కర్మకు సూచిక. పుణ్య కర్మ ఉంటే ఆయన సంపదలను, సుఖాలను, అధికారాన్ని ఇస్తాడు, పాప కర్మ ఉంటే వాటిని నశింపజేస్తాడు.

To be continued ............

Source: https://en.wikipedia.org/wiki/Names_of_the_days_of_the_week
http://www.pantheon.org/miscellaneous/origin_days.html

Sunday, 27 November 2016

హిందూ ధర్మం - 230 (జ్యోతిష్యం - 12 (వారాలకు పేర్లు ఎలా నిర్ణయించారు?))

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండే కాలాన్ని అహస్సు అని, సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉండే కాలాన్ని రాత్రి అని అన్నారు ఋషులు. అహస్సు+రాత్రి కలిపితే, అహోరాత్రము, అంటే ఒక దినము (రోజు). అహర్నిశలు శ్రమిస్తున్నాడు అని అంటారు, అంటే పగలనల, రాత్రనక శ్రమిస్తున్నాడని అర్దం. అహర్నిశ అనేది కూడా రోజునే సూచిస్తుంది. ఆ అహోరాత్ర అనే పదంలో హోరా ను విడదీసింది మనవారే. ఒక రోజును తొలుత 24 హోరలుగా భాగించారు. లేదా ఒక రోజంటే 24 హోరలు అని అర్దం.

నిజానికి ఈ హోర పదం వైదిక జ్యోతిష్యంలో కనిపిస్తుంది. పరాశర మహర్షి హోరా శాస్త్రాన్ని రచించారు. అది బృహత్ పరాశర హోరా శాస్త్రంగా ప్రసిద్ధి. పరాశరుడు భగవాన్ వేదవ్యాస మహర్షి తండ్రిగారు. మహాభారత కాలానికి ముందువారు. అనగా క్రీ.పూ. 3000 ఏళ్ళ నాటికి ముందు నుంచి జీవించి ఉన్నవారు. వారి జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. వారి కంటే మునుపే లోమశ సూత్రాలు లేదా గర్గ హోరా మొదలైన గ్రంధాలు మనకు లభ్యమవుతున్నాయి. ఇంకా వెనక్కు వెళితే, భృగు మహర్షి రాసిన నాడి గ్రంధాలు, అగస్త్య మహర్షి రాసిన నాడీ గ్రంధాలు కనిపిస్తాయి. ఇంకా వెనక్కుడు వెళితే మనుస్మృతిలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలు లభ్యమవుతున్నాయి. గ్రహగతుల కాలం, మానవ జీవనానికి సంబంధం గురించి అందులో ప్రస్తావన ఉంది. దేవతలకు ఒక రోజు మానవలోకంలో 1 సంవత్సరానికి సమానం అని అందులో చెప్పబడింది. ఇది ఆనాటికే మనవద్ద ఉన్న శాస్త్రీయ దృష్టిని, సాంకేతికతను సూచిస్తోంది. ఈ హోరా అనే పదాన్ని యధాతధంగా లాటిన్ వారు స్వీకరించారు. ఈ హోరా అనే పదం నుంచి 'అవర్' (Hour) అనే పదం వచ్చింది. ఈ హోరా అనే పదం నుంచి కాలాన్ని అధ్యయనం చేసే శాస్త్రమైన హోరాలజీ (Horology) వచ్చింది.

ఈ హోరలను ఆధారంగా చేసుకునే వారాలకు నామాలను పెట్టడం జరిగింది. ఏ హోరలో సూర్యోదయం అవుతుందో, ఆ రోజుకు ఆ నామం పెట్టడం జరిగింది. ప్రతి హోరకు, కాలంలో దానికున్న లక్షణాలను అనుసరించి, ఒక గ్రహ నామం పెట్టడం జరిగింది. ఏ హోరపై ఏ గ్రహం ఆధిపత్యం కలిగి ఉంటుందనేది ఆ గ్రహం తన కక్ష్యలో రాశి చక్రం చూట్టు ఎంత వేగంతో తీరుగుతుందనే దాన్ని అనుసరించి ఎంతో ఖచ్చితంగా ఉంటుంది. శని అన్నిటికంటే తక్కువ వేగం కలిగినది కనుక అది మొదట వస్తుంది, ఆ తర్వాత గురువు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలు వస్తాయి.

ఆదివారంతో ప్రారంబిద్ధాం ఎందుకంటే సూర్యుడు ఈ భూమికి అత్యంత ముఖ్యమైన గ్రహం మరియు ఆత్మకారకుడు, జ్ఞానదాత. రోజులో 24 హోరలు ఉండగా, మొదటి హోర రవితో ప్రారంభమైనది కనుక దానికి రవి వారం అని పేరు, ఆయనే ఆదిత్యుడు, కనుక మనం ఆదివారం అంటున్నాం.  ఆదివారంలో సూర్యోదయానికి ఉండే హోరకు ఆధిపత్యం రవిది కాగా, తర్వాత శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఆ తర్వాత శని, గురువు, అంగారకుడు. ఇప్పటికి 7 హోరలు అయ్యాయి. మళ్ళీ 8 వ హోర రవిదే అవుతుంది. అ తర్వాత క్రమంగా 9 కి శుక్రుడు, 10 బుధుడు, 11 చంద్రుడు, 12 శని, 13 గురువు, 14 కుజుడు, 15 సుర్యుడు, 16 శుక్రుడు, 17 బుధుడు, 18 చంద్రుడు, 19 శని, 20 గురువు, 21 కుజుడు. ఇక్కడికి మూడు సార్లు ఈ వరుస క్రమం వచ్చింది. ఇప్పుడు 22వ హోరకు రవి, 23 శుక్రుడు, 24 బుధ హోర అయింది. 24 హోరలతో రోజు పూర్తవ్వగా, ఆ క్రమంలోనే తదుపరి హోర, 25 వ హోరకు చంద్ర హోర అవుతున్నది. అప్పుడే సూర్యోదయం అవుతోంది. అందువలన ఆ వారానికి ఇందువాసరమని, సోమవారమని పేరు. ఇందుడు, సోముడంటే చంద్రుడు. శివుడికే ఇందుకళాధరుడని, సోమశేఖరుడనే నామాలు ఉన్నాయి కదా. కుజుడు అంటే మంగళుడు, కుజ హోరతో మొదలైనవారం మంగళవారం, భౌమవారం, బుధహోరతో మొదలయ్యేది బుధవారం లేదా సౌమ్యవారం, గురు హోరతో ప్రారంభమయ్యేది గురువారం, శుక్రాధిపత్య హోర తో సూర్యోదయమైన వారం శుక్రవారం, సంస్కృతంలో భృగువారం, శనిహోరతో ప్రారంభమయ్యేది శ్థిరవారం, లేదా మందవారం, అదే మనం శనివారం అంటున్నాం. ఇలా ఈ చక్రం నిత్యం పరిభ్రమిస్తూనే ఉంటుంది. అలా మనకు వచ్చినవే ఈ 7 వారాలు. సప్తగ్రహాలకు సూచిక అవి. రాహూకేతువులు ఛాయా గ్రహాలు, జ్యోతిష్యంలో రాశి చక్రంలో వాటికి సొంతంగా ప్రత్యేక స్థానం ఉండదు. అందుకే ప్రతి రోజులో రాహువుకు ఆధిపత్యం ఉన్న కాలానికి రాహుకాలమని, కేతువు ఆధిపత్యం కలిగిన కాలాన్ని యమగండమని పిలుస్తున్నారు. ఏ హోరలే ఏ పని చేస్తే మంచిదనేది, ఏది చేయకూడదనేది కూడా జ్యోతిష్యం వివరించబడి ఉన్నది, కాని మనకు ఇప్పటికి అప్రస్తుతం.

To be continued .....................

ఈ రచనకు ఉపకరించిన వెబ్‌సైట్లు
http://www.hinduvedicastro.in/blog/how-the-west-stole-weekdays-from-india/
http://www.astrojyoti.com/horapage.htm

Sunday, 20 November 2016

హిందూ ధర్మం - 229 (జ్యోతిష్యం - 11)



తిధుల గురించి గత భాగాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు వారాల గురించి తెలుసుకుందాం. వారం అంటే 7 రోజులు. కాలమానాన్ని వారాలుగా విభాగం చేసి గణించిన ఘనత మన ఋషులకే చెల్లింది. నేడు ప్రపంచమంతా కాలగణనలో వారమంటే 7 రోజులుగానే స్వీకరిస్తోంది. ఈ పద్ధతి మన సనాతన సంస్కృతిలో సృష్ట్యాది నుంచి ఉంది. తిధికి, వారానికి తేడా ఉంది. తిధి చంద్రుని గమనంతో సంబంధం కలిగి ఉంటే, వారం (రోజు / Day) సూర్య సంబంధమైనది. ఉదయాద్ ఉదయం వారః అని అంటుంది శాస్త్రం. అంటే ఒక సూర్యోదయం నుంచి మరుసటి సూర్యోదయం మధ్య కాలమే వారం. ఇక్కడ వారమంటే రోజు అని అర్దం. ఏడువారాల నగలంటే వారంలో 7 రోజులు ధరించే ఒక్కో రకమైన నగలనే అర్దంవస్తుంది కానీ 7 ను 7తో హెచ్చిస్తే (7x7) వచ్చే 49 రోజులకు సరిపడే నగలని కాదు. ఈ ఏడువారాలు అనేమాట కూడా ఆ వారం నుంచి తీసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం సనాతంధర్మంలో జ్యోతిష్యం ఆధారంగా ఒక రోజు మారిందని లెక్కించాలంటే సూర్యోదయన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. సూర్యోదయం మార్పుకు సంకేతం. ఒక్క ప్రకృతిలోనే కాదు, ఈ భూమిపై జరిగే అన్ని క్రియల్లోనూ మార్పు సంభవిస్తుంది. సూర్యుడు హారిజోన్ దాటగానే శరీరంలో ప్రాణశక్తి పైకి వెళ్ళడం ప్రారంభిస్తుంది. ఊపిరిలో మార్పు కనిపిస్తుంది. అప్పటివరకు నిలకడగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా సనన్ని గాలులు వీయడం ప్రారంభవుతుంది. ఆ గాలులు ఎంతో శక్తిని, ఆరోగ్యాన్నిస్తాయి అంటుంది ఆయుర్వేదం. అందుకే సూర్యోదయానికి ముందే లేవాలి. అదేకాక ఆ సమయం శరీరశుద్ధికి ఎంతగానో అనువైనది, ఎందుకంటే ఆయుర్వేదపరంగా రాత్రి ముగుస్తున్న సమయం (సుర్యోదయానికి పూర్వం) వాతానికి చెందిన సమయం. అందుకే అప్పటికే లేచి మలమూత్ర విసర్జన ముగించాలి, తద్వార శరీరం లోపల శుద్ధి చేసుకోవాలి, ఆ తర్వాత స్నానం చేసి బాహ్యశుద్ధి చేసుకోవాలి, ప్రాణాయామది క్రియలు చేసి, ప్రాణశుద్ధి, సంధ్యావందానికి సిద్ధమై, జపం చేసి మనస్శుద్ధి చేసుకోవాలి. పసిపిల్లలు, జంతువులు, పక్షులు సైతం ప్రకృతిలో కలిగే ఈ మార్పును ముందే గ్రహించగలుగుతాయి, తమను తాము ఆ మార్పుతో సమన్వయం చేసుకోవడం కోసమే తెల్లవారుఝామునే మేల్కోంటాయి. కానీ అన్ని తెలుసనుకున్న, ఇంగ్లీష్ విద్యలు బాగా అబ్బిన చదువుకున్న 'అవిద్యావంతులు' మాత్రమే ఆ సమయంలో గురకపెట్టి నిద్రపోతారు. పైగా తమ ఇంట్లో పసిపిల్లలు ఆ సమాయనికి మేల్కోంటే, వాళ్ళని కూడా నిద్రబుచ్చి, ఆ పిల్లలకున్న ప్రాకృతమైన జ్ఞానం కంటే తమకున్న అజ్ఞానమే గొప్పదాని వాడి మీద కూడా రుద్దుతారు. పక్షులు, జంతువులు కూడా ఈ సమయానికి మేల్కొని తమ శరీరాలు బయట ప్రపంచంలో ఉండే ప్రాణశక్తిని గ్రహించేందుకు సిద్ధం చేసుకుంటాయి. ఇది విశ్వంలో సహజంగా ప్రతి రోజు కలిగే మార్పు.

అదే అర్దరాత్రి 12 గంటలకు ఏ మార్పూ కలగదు. పైగా అది నిశాచర జీవులు తప్ప మిగితా అన్ని జీవాలు తప్పక నిద్రించాల్సిన సమయం అంటుంది మన శాస్త్రం. ఆ సమయంలో శరీరం ఉదయం కోల్పోయిన శక్తిని పొందుతుంది, అలసిన శరీర భాగాలు తిరిగి శక్తివంతమయ్యేలా ఓజస్సు ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో జీవక్రియలన్నీ చాలా నెమ్మదిస్తాయి. అసలు ఆ సమయంలో మెల్కొనకూడదు. అలాంటిది రాత్రి 12 కు రోజు మారుతుంది అంటారు పాశ్చాత్యులు. ఎవరిదైనా పుట్టిన రోజు ఉంటే, వాడిని ఆ సమయం వరకు నిద్రపోనివ్వరు, లేదా నిద్రపోయినా, ఫోన్ చేసి, వాడి నిద్ర చెడగొట్టి శుభాకాంక్షలు చెప్తారు. అవి శుభాకాంక్షలా? లేక ఆరోగ్యానికి అశుభాకాంక్షలా? ఎవరికైనా ఒకరి మీద ప్రేమ ఉంటే, వాడు నిద్రపోతున్నాడు, లేపకండి, గట్టిగా శబ్దాలు చేయకండి అంటారు. అంతేకానీ ఇదేంటో, మనం ఎక్కడి నుంచి చూసి తలకు ఎక్కించుకున్నామో కానీ, ప్రాణస్నేహితుడని హాయిగా నిద్రపోతున్నవాడిని సైతం పుట్టిన రోజని ఆకాశం ఊడిపడ్డట్టు నిద్రలేపుతారు. న్యూ ఇయర్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అది ప్రపంచ తాగుబోతుల దినోత్సవం ............. అధికారికంగా ప్రకటించకపోయినా. జీవక్రియలు నెమ్మదించే సమయమని ముందే చెప్పుకున్నాం కదా, అయినా అలాంటి సమయంలో వీళ్ళు కేకులు తిని, మందు కొట్టి వేడుకలు జరుపుకుంటారు. ఆరోగ్యం నోట మన్ను కొడతారు, పటాసులు కాల్చి మిగితా జీవాల నిద్ర చెడగొడతారు. అది ఏ మార్పూ కలగని సమయం. కానీ వారికి రోజు మారుతుంది !? మారిందా? మారిందనుకుంటున్నారా?

అంటే మనం గమనించాల్సింది మన ధర్మంలో రోజు మార్పంటే నూతన శక్తి, నూతన ఉత్తేజం. మన ధర్మంలో మార్పు అంటే ఎవరో మనుష్యులు నిర్ణయించేది కాదు, ఈశ్వరుడు నిర్ణయించినది, ప్రకృతిబద్ధమైనది. పాశ్చాత్యులు వారి రోజు మార్పును నిద్రలోనో, మత్తులోనో ఆహ్వానిస్తే, హిందువులు మాత్రం దానికి సిద్ధపడి ముందే స్వాగతం పలుకుతారు. అది సుప్రభాతం.

To be continued .............

Sunday, 23 October 2016

హిందూ ధర్మం - 228 (జ్యోతిష్యం - 10)



తిధుల ప్రాముఖ్యత గురించి గత భాగంలో వివరించుకున్నాం. ఇప్పుడా తిధులకు, ఆయా సమయంలో ఆచరించే నైమిత్తికాలకు మధ్య శాస్త్రీయ సంబంధం చూద్దాం. ఒక్కో తిధి రోజు ఏకభుక్తం చేయాలని, ఫలానా తిధి నాడు ఉపవసించాలని మనకు ధర్మశాస్త్రంలో కనిపిస్తుంది. ఉదాహరణకు ఏకాదశినే తీసుకోండి. చంద్రుని గమనంలో, పూర్ణిమ నుంచి అమావాస్యకు, అమవాస్య నుంచి పూర్ణిమకు మధ్యలో 11 వ తిధి ఏకాదశి. ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరంగా ఉపవసించడం అందరికి తెలిసిందే.

ఆధునిక సైన్స్ ప్రకారం వాయు పీడనం (air pressure) అమావాస్య, పూర్ణిమల్లో తీవ్ర పరిమితుల్లో ఉంటుంది. దీనికి కారణం సూర్య, చంద్ర, భూ కక్ష్యల స్థానాలే. దీన్ని ప్రకృతిలో సముద్రం వద్ద గమనించవచ్చు. ఆ రెండు రోజుల్లో ఉధృతంగా ఉండే కెరటాలు, తర్వాత రోజు నుంచి మాములుగా ఉంటాయి. పీడినం తగ్గిందనడానికి సూచకంగా.

సైన్సు ప్రకారం, మనం తిన్న ఆహారం మెదడును చేరడానికి 3-4 రోజులు పడుతుంది. మనం ఏకాదశి రోజు ఉపవసించినా, అల్పాహారం తీసుకున్నా, ఆ ఆహారం అమవాస్య, పూర్ణిమ తిధులకు మెదడుకు చేరుతుంది. ఈ రెండు రోజుల్లో, భూమి పీడనం (pressure) అధిక స్థాయిలో ఉంటుంది, దాని కారణంగా అన్నిటి యందు సమతుల్యత లోపిస్తుంది, మానవుల ఆలోచనా విధానంలో కూడా.  మెడదకు పంపే ఆహారం కూడా చాలా తక్కువ ఉంటే, అధిక పీడనం కారణంగా మెడదు దారి తప్పి ప్రవర్తించే అవకాశం కూడా తగ్గిపోతుంది.

అలాగే చంద్రగతిలో వాతవరణ పీడనం ఏకాదశి తిధిన అత్యల్పంగా ఉంటుంది మిగితా తిధులతో పోల్చితే. అందువల్ల ఇది ఉపవసించి, ప్రేగులను శుభ్రం చేసుకోవటానికి చాలా మంచి సమయం. అదే ఆ తర్వాత రోజున పీడనం మళ్ళీ సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. కనుక ద్వాదశి రోజు ఉదయమే, సుర్యోదయం కాగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పారణ(భోజనం) చేసి ఉపవాస వ్రతాన్ని ముగించమని శాస్త్రం చెప్పింది. లేకుంటే కొత్త అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని. ఇలా ప్రతి శుక్ల పక్ష, కృష్ణ పక్ష ఏకాదశులకు ఉపవాసం చేయడం మన దేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇందులో ఎంతో శాస్త్రీయత కూడా ఉంది. చూడండి తిధులు, ఆ రోజు వాతావరణంలో ఏర్పడే మార్పులు, అవి శరీరం మీద చూపే ప్రభావాలను ఎంత చక్కగా గుర్తించో మన సనాతన ధర్మం. అలానే మన సంప్రదాయంలో ఎన్నో పండుగలకు, ఆ రోజుల్లో పాటించాల్సిన నియమాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఈ ఒక విషయంలోనే ఖగోళ, వాతావరణ, వైద్య, ఆధ్యాత్మిక శాస్త్రాల సమన్వయం, పరస్పర సంబంధం స్పష్టంగా కనిపిస్తోంది. శాస్త్రంలో ఒక చోట ఒక మాట చెబితే, దాని వివరణ వేరే శాస్త్రంలో ఉంటుంది. ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం వేరు కాదు. అన్నీ పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. ఆ సమన్వయం సనాతనం, అదే భారతీయం.

మనమొక విషయం గమనించాలి. ఏకాదశి రోజు ఉపవసించాలని చెప్పిన శాస్త్రమే కొందరికి మినహాయింపు ఇచ్చింది. బ్రహ్మచారులు, రోగులు లేదా ఔషధ సేవనం చేసేవారు, ముసలివారు, కాయకష్టం చేసేవారు, నిత్యం చెమట చిందించి పని చేసే రైతులు, కూలీలు ..... వీళ్ళు ఉపవాసాలు చేయవలసిన పనిలేదు. వారికి చేయకపోయిన దోషం ఉండదు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు, మారిన ఆహారపు అలవాట్ల ప్రకారం తరచుగా ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా శాఖాహారులైతే, తరుచుగా ఉపవసించకూడదని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. మనం తినే బియ్యంలో బలం లేదు, పాలు కల్తీ, కూరలకు ఎరువులు వేసి పండిస్తున్నారు, పర్యావరణం అంతా కలుషితమైపోయింది. ఉపవాసం చేయమని చెప్పిన శాస్త్రమే బలమైన ఆహారం కూడా స్వీకరించమని చెప్పింది. ఏమి తినాలో, ఎలా పండించినవి, ఎలా వండుకుని తినాలో కూడా చెప్పింది. అవేమీ చేయకుండా తరుచూ ఉపవాసాలు చేయడం శ్రేయస్కరం కాదు.

To be continued ...................

Sunday, 9 October 2016

హిందూ ధర్మం - 227 (జ్యోతిష్యం - 9)

జ్యోతిష్యం నిత్యజీవితంలో భాగం. తిధులు నిత్యకృత్యాలకు ఎంతో అవసరం. అటువంటి తిధుల నిర్ణయంలోనే ఎంతో శాస్త్రీయత ఉంది. చంద్రుడి వృద్ధి, క్షీణతల అనుసరించి తిధి నిర్ణయం జరిగింది. చంద్రుడికి మొత్తం 16 కళలు ఉన్నాయని ఋషులు గుర్తించారు. అందులో పూర్ణిమ రోజు చంద్రబింబం పూర్తిగా కనిపిస్తే, అమావాస్య రోజు అసలు కనిపించదు. పూర్ణిమ అంటే పూర్ణంగ్ ఉన్న చంద్రుడు. అమావాస్య అన్న పదంలోనే ఎంతో శాస్త్రీయత దాగి ఉంది. అమా+వాస్య - అమా అంటే కలిసి, వాస్య అంటే వసించడం/ ఉండటం. చంద్రుడు, సూర్యుడు ఒకే రేఖ మీద ఉండటం వలన, సూర్యుని కాంతి కారణంగా చంద్రుడు కనిపించడు. అందువలన ఆ రోజు చంద్రదర్శనం ఉండదు. కాబట్టి దాన్ని అమావాస్య అన్నారు. అదే ఆధునిక సైన్స్ చూడండి. దాన్ని న్యూ మూన్ డే అన్నారు. అసలు ఆ రోజు చంద్రుడే లేడు, ఇంకా న్యూ మూన్ ఏంటీ? ఎంత అసంబద్ధంగా ఉంది ఇది. అయినా మన పిల్లలకు అదే చెప్పాలి మరి. ఎందుకంటే మనవి మూఢనమ్మకాలు, వారిది సైన్సు కదా!

అమావాస్య నుంచి మొదలుపెడితే, పూర్ణిమ వరకు చంద్రుడు వృద్ధి చెందుతాడు. వెలుతురును పంచుతాడు. కనుక దాన్ని శుక్ల పక్షం అన్నారు. పూర్ణిమ తర్వాత నుంచి అమావాస్య వరకు చంద్రుడు క్షీణిస్తూ, అమవాస్యకు అంధకారం ఉంటుంది. కనుక దాన్ని కృష్ణ పక్షం అన్నారు. కృష్ణ అంటే నలుపు వర్ణం, చీకటి. అయితే కృష్ణ పక్షమైనా, శుక్ల పక్షమైనా, అష్టమి తిధిలో చంద్రుడి కళ ఒకేలా ఉంటుంది. 16 లో సగం కనుక ఆ రోజును అష్టమి అన్నారు. దీనికి ప్రాముఖ్యం కూడా ఉంది. 16 కళల్లో నాలుగువంతును చవితి / చతుర్థి అన్నారు. క్షీణించిన చంద్రుడి చిన్న బింబం కనిపించే మొదటి రోజును మొదటి కళగా ప్రతిపదా అన్నారు, అదే పాడ్యమి. రెండవ రోజు ద్వితీయ, మనం విదియ అంటున్నాం, మూడు తృతీయ, నాలుగు చవితి, ఐదు పంచమి, ఆరు షష్ఠి, ఏడు సప్తమి, ఎనిమిది అష్టమి, తొమ్మిది నవమి, పది దశమి, పదకొండు ఏకాదశి, పెన్నుండు ద్వాదశి, పదమూడు త్రయోదశి, పదునాలుగు చతుర్దశి. ఈ రెండు పక్షాలని కలిపితే వచ్చేది మాసం (నెల). మాస అనే పదానికి అర్దం కూడా చంద్రుడే. పూర్ణిమలో పూర్ణ్+మా ఉంది, పూర్ణ్ అనగా సంపూర్ణం అని, మా అంటే చంద్రుడి అని అర్దం. ఇలా ఏ తిధి పేరు చూసినా, అది ఎంతో శాస్త్రీయంగానే ఉంటుంది. అది ఊరికే పెట్టిన పేరు కాదు. ఆ పేరు యొక్క అర్దం అంతరిక్షంలో ప్రత్యక్ష నేత్రాలకు కనిపిస్తూనే ఉంటుంది ఏనాటికైనా.

ఇక్కడ రెండు రకాల పద్ధతులను అవలంభిస్తారు. ఉత్తరభారతంలో పూర్ణిమ తరువాత వచ్చే పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 30 తిధులను మాసంగా పరిగణిస్తారు. దక్షిణ భారతంలో అమావాస్య తర్వాత వచ్చే శుక్ల ప్రతిపద నుంచి అమావాస్య వరకు మాసంగా గణిస్తారు. ఏది ఎలా చేసినా, పండుగులు, ఉత్సవాలు అన్నీ ఒకే రోజున చేసుకుంటాం. ఇది మన ధర్మంలో అంతర్లీనంగా ఉన్న ఐక్యతకు, సమన్వయానికి నిదర్శనం.

మన పండుగలన్నీ తిధులను అనుసరించే ఉంటాయి, ఒక్క సంక్రాంతులు తప్ప. అవి మాత్రమే సౌరమానం ఆధారంగా జరుపుకుంటాము. గ్రిగేరియన్ (ఆంగ్ల) క్యాలెండర్లలో డేట్‌లకు, హిందువులు పాటించే తిధులకు - నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలా డేట్‌లు పెద్ద అసంబద్ధం, అవి అలా ఏర్పడ్డయనాడానికి కాగితం మీద మనం రాసుకున్న గీతలు తప్ప, ఖగోళంలో వేరే ఏ ఇతర సాక్ష్యాలు ఉండవు. ఈ రోజు మనం నెలకు 30, 31 రోజులు అంటూ పాటిస్తున్నాము, రేపు ఇంకేవరో వచ్చి నెలకు 60 రోజులు పెట్టవచ్చు, ఇంకొకడు 90 అనచ్చు. అప్పుడు ఒక వ్యక్తి ఆశ్వీయుజ పూర్ణిమ నాడు జన్మించాడనుకుందాం. ఇప్పుడు అతను ఏదో డేట్ రోజు జరుపుకుంటే, అప్పుడు అతను ఇంకెప్పుడో జరుపుకోవలసి వస్తుంది. అతడు పుట్టిన రోజు జరుపుకున్న దానికి ఖగోళంలో ఏ విధమైన నిదర్శనం ఉండదు. అదే మన సంప్రదాయంలో చూసుకుంటే, ఎవరు ఎన్ని మార్చినా, చంద్రుడు అశ్విని నక్షత్రంలో పూర్ణిమ రోజున ఉదయించడం ఖగోళ సత్యం. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. అతను పుట్టిన సమయంలో ఉన్న గ్రహగతులు మొదలైనవే ప్రత్యేకమే కావచ్చు, కానీ అతను పుట్టిన తిధి మళ్ళీ కనిపించడం అన్నది యదార్ధం. మన పండుగలన్నీ అలా జరుపుకునేవే కదా. మన గణన ఎంత శాస్త్రీయంగా ఉందో ఆలోచించండి.

To be continued ...................