Thursday 21 November 2019

2 ఏళ్ళ పసివాడి ప్రాణాలు కాపాడిన కుక్క.

తాను గడ్డకట్టిపోతున్నా, కదలకుండా, అత్యల్ప ఉష్ణోగ్రతల్లో కూడా అలాగే ఉండిపోయిన కుక్క ఇదే. 


రోడ్డున పడేసిన 2 ఏళ్ళ పసివాడి శరీరాన్ని రెండు రోజుల పాటు చుట్టుకుని, చలి కారణంగా గడ్డకట్టిపోకుండా ప్రాణాలు కాపాడిన కుక్క.

కుక్కలు అనేవి అద్భుతమైన జీవులు. మానవులకు నిరంతరం తోడు ఉండటమే కాదు, అత్యవసర సమయంలో రక్షణకు కూడా వస్తాయి. ఒక పసిపిల్లావాడు ప్రాణాలు విడువకుండా ఉండేందుకు రెండు రోజుల పాటు, వాడి శరీరాన్ని చుట్టుకుని, తాను గడ్డకట్టిపోతున్నా, కదలకుండా, అత్యల్ప ఉష్ణోగ్రతల్లో కూడా అలాగే ఉండిపోయి రక్షించిన కుక్క గురించి చెప్పే ఉదంతమిది.
తాను గడ్డకట్టిపోతున్నా, కదలకుండా, అత్యల్ప ఉష్ణోగ్రతల్లో కూడా అలాగే ఉండిపోయిన కుక్క ఇదే.   

ఇది రష్యాలోని సైబీరియాలో జరిగింది. మొత్తం ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు గల్గిన ప్రాంతంగా ఇది ప్రసిద్ధికెక్కింది. బయట గడ్డకట్టుపోతున్న చలి. ఒక చిన్న ఇంటి ముందు రెండేళ్ళ పిల్లాడిని వదిలేసి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. ఆ ఇంటి ముందుండే కుక్క, వెంటనే అతడిని రక్షణకు పరిగెత్తింది. అతడికి వెచ్చదనం ఇవ్వడం కొరకు తన శరీరంతో పసివాడి శరీరాన్ని చుట్టి/ కప్పి, వెచ్చదనం ఇచ్చింది. ఈ సాహసోపేతమైన చర్య వలన ఆ పిల్లవాడు రెండు రోజులు బ్రతకగలిగాడు. రెండు రోజుల తర్వాత చుట్టుప్రక్కల వాళ్ళు ఆ కుక్కను గమనించి, దాన్ని పరీక్షించటానికి వెళ్ళగా, ఆ కుక్క క్రింద ఒక పసివాడు ఉండటాన్ని గమనించి, విస్మయం చెందారు. ఇద్దరు బ్రతికినా, ఆ అబ్బాయి శరీరంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో అతడు హైపోతర్మియాకు గురయ్యాడు. కానీ ఆ కుక్క చేసిన సాయంవలన అతడు బ్రతికి బట్టకట్టగలిగాడు. చివరకు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మను గుర్తించి, పిల్లవాడిని వదిలేసినందుకు శిక్షించారు.

మానవుల్లో మానవత్వం మంటగలుస్తున్నా, జంతువులే మనుషులకంటే గొప్పగా ప్రవర్తిస్తున్నాయని ఋజువు చేసే వేల సంఘటనల్లో ఇది ఒకటి.

Source: http://ketoanasa.online/home/dog-wraps-his-body-around-an-abandoned-2-year-old-child-for-2-days-to-keep-him-alive-in-freezing-weather-255.html?fbclid=IwAR1h1e9A5iCcDl0bf9cMS_nzOaEK132HD4oOTmrUkylYd-mOH4fqmmECbNY

No comments:

Post a Comment