Monday 4 November 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 23 వ భాగము



ఎనిమిదవ అధ్యాయము
సన్యాసులతో సంభాషణ

ఆపాతవైరాగ్యవతో ముముక్షూన్
భవాబ్ధిపారం ప్రతియాతుముద్యతాన్ ।
ఆశాగ్రహో మజ్జయతేఽన్తరాలే
నిగృహ్య కణ్ఠే వినివర్త్య వేగాత్ ॥

కేవలం వైరాగ్యం మాత్రమే కలిగి ఉండి, సంసార సాగరాన్ని దాటగోరే ముముక్షువులు, వారు కాంక్ష లేదా కోరిక అనేది తిమింగళం చేత పట్టుకోబడుతున్నారు. మరియు అది వారి మెడ పట్టుకొని బలవంతంగా మధ్యలోకి లాగి వారిని ముంచేస్తోంది.
వివేకచూడామణి

హరిః ఓం! బ్రహ్మమునకు నమస్కారములు! శ్రీ శంకరాచార్యులకు, మహాపురుషులకు మరియు సన్యాసులకు వందనాలు! దేహ అధ్యాస్యము (శరీర భావనను) స్వార్ధాన్ని, వాసనలను, అహంకారాన్ని, అభిమానాన్ని న్యాసము అనగా త్యజించినవాడే సన్యాసి. బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనత్కుమార ,సనత్సుజాతులు, దత్తాత్రేయులవారు, మరియు శ్రీ ఆది శంకరాచార్యులు నివృత్తి మార్గంలో అగ్రగణ్యులు, పథనిర్ణేతలు. ఈ సన్యాస ఆశ్రమానికి వారు మూల పురుషులు.

ఈ కాలపు ధోరణి

ఈ ప్రపంచానికి ఆర్థిక, సామాజిక, రాజకీయ, జాతీయ, మానసిక మరియు అలాగే ఆధ్యాత్మికతను ఉన్నతి కావాలి. ఆధ్యాత్మికతను ఏనాడు విస్మరించరాదు. అదే మూలము. అది ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ రోజులలో కర్మయోగాన్ని ఆచరించే నేతలు కేవలం కర్మ మీద మాత్రమే తమ దృష్టిని నిలుపుతున్నారు. ఆధ్యాత్మిక జీవనాన్ని వారు పూర్తిగా విస్మరిస్తున్నారు. ఎన్నో మఠాలకు చెందిన సన్యాసులు కూడా కేవలం సామాజిక సేవలోనే ఉన్నారు. కొందరు సన్యాసులకు పాడిత్యం ఉంది మరియు వారు కొంత కాలం గౌరవాన్ని పొందుతారు. వారు కూడా ధ్యాన పరమైన జీవితాన్ని అవతల పడవేసారు. జనుల మనసులో వారు నిజమైన మరియు దీర్ఘకాలం ఉండగలిగిన ప్రభావాలను చూపలేకపోతున్నారు, ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మిక శక్తి లేదా ఆంతరంగికమైన ఆత్మశక్తి అనేదు వారి వద్ద లేదు.

ఆధ్యాత్మికవేత్తలు, యోగులు, జ్ఞానులు మరియు సన్యాసులు తోకచుక్క వలె లేదా కార్తీకమాసంలో వచ్చే విదియ నాటి చంద్రునివలె బయట కనిపించి, వారి యొక్క శక్తిని జనులకు ధారపోసి, గొప్ప కార్యాలకు శ్రీకారం చుట్టి, ఆ క్షేత్రం నుంచి మాయం అవ్వాలి. ఆశ్రమాల్లో చాలాకాలం పాటు ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు నిర్వహించడం మరియు ఆశ్రమాలు స్థాపించడం అనేది చిన్న సన్యాసులు చేయాలి. ఇది ఉగ్రమైన, అగ్ని వంటి గొప్ప ఆధ్యాత్మికవేత్తల స్వభావానికి సరిపోదు. గంగా కేవలం ఏడాదిలోనే నాలుగు నెలల్లోనే ముంచెత్తినట్టుగా, వారు ఈ భూమిని ఆధ్యాత్మిక జ్ఞానం లేదా దివ్య జ్ఞానంతో ముంచెత్తుతారు.

సౌకర్యవంతమైన జీవనం యొక్క ఆకర్షణ

సన్యాసి లేదా గృహథు కూడా తన యొక్క సౌకర్యవంతమైన జీవనం కోసం ఆశ్రమాన్ని స్థాపించకూడదు. ఆశ్రమాన్ని స్థాపించిన సమయంలో ఎందరో సన్యాసులు చాలా పవిత్రంగా ఉండేవారు, అంటే నా అర్ధంలో వారు పేదవారిగా ఉన్నారు. ఒక్కసారి వారు ధనికులవ్వగానే, వారిని పొగిడేవారు, కీర్తించేవారు మరియు భక్తులు సరిపడినంత మంది దొరకగానే, నిస్వార్థ సేవ అనే ఆలోచన వెళ్ళిపోతుంది, స్వార్ధ ఆలోచనలు అనేవాటికి హృదయాల్లో చోటు లభిస్తుంది. వారు ఏ ఉద్దేశంతో ఆశ్రమాన్ని స్థాపించారో అది విచ్చిన్నం, నిష్ఫలం అవుతుంది. అప్పుడది కేవలం ధనాన్ని సంపాదించి పెట్టే వ్యవస్థగా మారుతుంది. జనులకు దాని పట్ల ఆకర్షణ ఉండదు. ఒక వ్యవస్థకు అధిపతి అయిన వ్యక్తి వైరాగ్యంతో కూడిన జీవనం గడుపుతూ, పూర్తిగా అన్నింటినీ త్యజించి ఉంటే అటువంటి ఆశ్రమం ఈ భూ ప్రపంచంలోనే శాంతికి, ఆనందానికి, సంతోషానికి కేంద్రబిందువు మరియు వేదిక అవుతుంది. అది కొన్ని లక్షల మంది జనులను ఆకర్షిస్తుంది. ఈ ప్రపంచానికి అటువంటి గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు అధిపతులుగా గల అటువంటి ఆశ్రమాల అవసరం ఉంది.

కొందరు యువ సన్యాసులు ముష్టి కాయను గింజలు స్వీకరిస్తారు. రెండు సంవత్సరాల్లో 120 విత్తనాలను మింగుతారు. సిద్ధాంత కౌముది మరియు న్యాయ శాస్త్రాన్ని మూడు సంవత్సరాలు అభ్యసిస్తారు. వారు నిజమైన సిద్ధులు అని భావిస్తారు మరియు ప్రాపంచిక మనసు కలిగిన వ్యక్తులతో స్వేచ్ఛగా కలుస్తారు/ విహరిస్తారు. ఇది ఎంతో తప్పు. ముష్టి కాయ లేదా ముషిణి చెట్టు గింజ నంపుస్కత్వాన్ని కలిగిస్తుంది. నపుంసకత్వం బ్రహ్మచర్యం కాదు. వారు త్వరగా పతనం అవుతారు. ఇది ప్రత్య్కేమగా చెప్పక్కర్లేదు. పెద్ద పెద్ద, మహా జ్ఞానులు మరియు గొప్ప యోగులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు విచక్షణారహితంగా, ఇష్టం వచ్చినట్లుగా భౌతిక ఆలోచనలు కలిగిన వ్యక్తులతో కలువకూడదు. రెండు చేపల మధ్య జరుతున్న కామకలపం అది చూసిన ఒక గొప్ప ఋషి మనస్సును ఉద్రేకపరచింది. స్త్రీ యొక్క గాజుల సవ్వడిలేదా అంచు కలిగిన మరియు రంగు రంగుల వస్త్రాలు సైతం మనస్సులో తీవ్రమైన ఉద్రేకాన్ని మనసులో కలిగిస్తాయి. వాటికి వాటి యొక్క సొంతమైన అపవిత్ర సాంగత్యం ఉంటుంది. కామం అనేది చాలా శక్తివంతమైనది. మాయ నిదూఢమైనది. కనుక ఓ సాధకులారా! జాగ్రత్త పడండి!

క్రమశిక్షణారహితులైన యువ సాధకులు, బ్రహ్మచారులు మరియు సన్యాసులు గృహస్థుల వద్ద సత్సంగం నిర్వహిస్తున్నామనే అనే ముసుగులో, వారి దగ్గరకు వెళ్ళడాంకి కారణం నాలుక మరియు రసేంద్రియం. ఓ సాధకులారా! కేవలం రన్సేంద్రియాన్ని సంతృప్తి పరచడానికి తల్లిదండ్రులను వదిలిపెట్టి, మీ ఆస్తులను సామాజిక హోదాను త్యజించి, సన్యాసం స్వీకరించారా? లేదా ఆత్మ సాక్షాత్కారం కోసం స్వీకరించారా? అది ఒకవేళ మీ రసేంద్రియాన్ని సంతృప్తిపరచడం కోసమే అయితే ప్రపంచంలో ఉంటూనే బాగా డబ్బు సంపాదించి ఆ పని చేసి ఉండవచ్చు. సన్యాస ఆశ్రమాన్నికి చెడ్డ పేరు తీసుకు రావద్దు. మీరు నాలుకను అదుపు చేయలేనప్పుడు, కాషాయాన్ని వదిలిపెట్టి, ప్రపంచంలోకి వెళ్లి, పని చేసి డబ్బు సంపాదించండి. కర్మ యోగం ద్వారా అభివృద్ధి చెందండి. నాలుకను నియంత్రించలేనప్పుడు మనస్సును నియత్రించడం సాధ్యం కాదు.

No comments:

Post a Comment