Wednesday 20 November 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 28 వ భాగము



75. గురు భక్తి యోగాన్ని ఆచరించడం వలన లెక్కకట్టలేనంత ఆనందం కలుగుతుంది.
76. గురు భక్తి యోగాన్ని ఆచరించడం చేత సాధకులకు దీర్ఘాయువు మరియు సచ్చిదానంద స్థితి లభిస్తుంది.
77. మనసు అనేది సంసారం యొక్క మూలం వద్ద ఉంది. మనస్సే బంధానికి మరియు మోక్షానికి, సుఖదుఃఖాలకు కారణము. ఈ మనసును కేవలం గురు-భక్తి యోగము యొక్క ఆచరణ ద్వారా నియంత్రించవచ్చు.
78. గురు-భక్తి యోగాన్ని ఆచరించడం చేత అమరత్వము, సచ్చిదానందస్థితి, స్వేచ్ఛ, పూర్ణత్వము, బ్రహ్మానందం మరియు ఎల్లప్పుడూ ఉండే సుఖము లభిస్తాయి.
79.అనంతమైన సుఖానికి దారి భక్తి యోగము యొక్క ఆచరణతోనే మొదలవుతుంది.
80. సన్యాసం, తపస్సు, ఇతర యోగాలు, దానధర్మాలు మరియు పుణ్యకార్యాలు మొదలైన వాటి చేత ఏదైతే లభిస్తుందో అది గురు భక్తి యోగాన్ని ఆచరించడం ద్వారా మరింత వేగంగా లభిస్తుంది.
81. అల్పమైన ప్రకృతిని జయంచి ఉన్నతమైన దివ్యానందాన్ని పొందడానికి ఈ గురు భక్తి యోగం అనేది ఒక ఖచ్చితమైన శాస్త్రము.
82. కొందరు వ్యక్తులు ఈ గురుసేవా యోగాన్ని అల్పమైన యోగంగా భావిస్తారు. వారు ఆధ్యాత్మిక రహస్యం అపార్థం చేసుకున్నారు.
83. గురు-భక్తి యోగము, గురుసేవా యోగము, గురు శరణ యోగము మొదలైనవన్ని పర్యాయపదాలు. అవన్నీ ఒకటే అర్ధాన్ని చూపిస్తాయి.
84. అన్ని యోగాల్లోకెల్లా గురు-భక్తి యోగమే రాజు.
85. సచ్చిదానంద తత్వాన్ని చేరుటకు ఈ గురు భక్తి యోగం అనేది సులభమైన, ఖచ్చితమైన, వేగవంతమైన, ఖర్చు లేనిది, మరియు నిరపాయకరమైన మార్గము. గురు భక్తి యోగం ద్వారా మీరంతా ఈ జన్మలోనే భగవంతుని చేరుగాక.
86. గురు-భక్తి యోగాన్ని స్వీకరించి కోల్పోయిన దివ్యత్వాన్ని తిరిగి పొందండి.
87. గురు-భక్తి యోగాన్ని ఆచరించి అద్వైతానికి మరియు బాధలకు అతీతమైన తత్వానికి వెళ్ళండి.
88. శిష్యునకు పరమ శాంతిని ఆనందాన్ని మరియు ముక్తిని ఈ గురు భక్తి యోగము తన ఆచరణ ద్వారా ప్రసాదిస్తుంది.
89. కౄరమైన పులిని, సింహాన్ని లేదా ఏనుగును పెంచుకోవడం చాలా సులభము. నీరు లేదా అగ్ని మీద నడవడం చాలా సులభము. కానీ ఒక వ్యక్తికి గురు భక్తి యోగాన్ని ఆచరించాలన్న తపన లేకుంటే సద్గురువు యొక్క పాదపద్మాలకు శరణాగతి చేయడం చాలా కష్టము.
90. గురు-భక్తి యోగము అనగా గురువు సేవ ద్వారా మనస్సును నియంత్రించుకోని, దానిని మార్చుకోవడం.
91. గురువుకు బేషరతుగా సంపూర్ణ శరణాగతి చేయడమే గురుభక్తిని పొందడానికి నిశ్చితమైన మార్గము.
92. గురువుయందు ప్రస్నాతీతమైన విశ్వాసమే గురు భక్తి యోగానికి పునాది లేదా ఆధారము.
93. నీవు నిజంగా భగవంతునికి పొందాలనుకుంటే ప్రాపంచికమైన ఇంద్రియ విషయాల నుంచి ప్రక్కకు మళ్ళి, గురుభక్తి యోగాని ఆచరించు.
94. ఎటువంటి ఆటంకమూ లేకుండా నిరంతరం గురు-భక్తి యోగాన్ని పాటించు.

No comments:

Post a Comment