Sunday 10 November 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 26 వ భాగము



15. వినయంతో పూజనీయమైన సద్గురువు పాదాలను ఆశ్రయించు. జీవితాన్ని కాపాడే సద్గురువు పాదాలకు నమస్కరించు. సద్గురు పాద పద్మాలయందు రక్షణ పొందు. పవిత్రమైన సద్గురువు పాదాలను పూజించు. పవిత్రమైన సద్గురుని పాదాలను ధ్యానించు. మనలోని మాలిన్యాలను తొలగించి పవిత్రతను చేకూర్చే సద్గురువు పాదాల యందు విలువైన బహుమతులు అర్పించు. దివ్యమైన సద్గురుని పాదసేవకు జీవితాన్ని అంకితమివ్వు. సద్గురుని దివ్యమైన పాదపద్మాల ధూళిరెణుగువులుగా మారు. ఇదే గురు భక్తి యోగము యొక్క రహస్యము.

16. సద్గురుని పవిత్రమైన పాదపద్మాలకు శరణాగతి చేయటమే గురు-భక్తి యోగము యొక్క పునాది.

17. గురు-భక్తి యోగ పథంలో కావలసినదల్లా నిజాయతీ మరియు దోషరహితమైన ప్రయత్నము.

18. గురువు యందు భక్తి కలిగి ఉండుట గురు భక్తి యోగము యొక్క ఆచరణలో అత్యున్నతమైన అంశము.

19. గురువు యందు విశ్వాసము కలిగి ఉండుట గురు-భక్తియోగంలో మొదటి మెట్టు.

20. శాస్త్రాల ఎందుకు నిష్ణాతుడైన బ్రహ్మ-నిష్ఠా గురువు యందు మనసా, వాచా, కర్మణా పూర్తి విశ్వాసము లేదా గుడ్డు విశ్వాసముతో ఉండుటయే గురు-భక్తి యోగము యొక్క సారము.

21. ఈ యుగంలో ఆచరించడానికి అత్యంత సులువైన మరియు ఉత్కృష్టమైన యోగమే ఈ గురు భక్తి యోగము.

22. గురుభక్తి యోగంలోని ఉన్నతమైన సూత్రం ఏమిటంటే గురువును భగవంతునిగా భావించాలి.

23. ఈ గురు-భక్తి యోగం యొక్క తత్వంలోని ఆచరణాత్మకమైన విషయం ఏమిటంటే తన ఇష్ట దేవతయే తన గురువని గుర్తెఱగాలి.

24. గురు-భక్తి యోగమనే ఈ పద్ధతి కళాశాలలో లేదా ఉపన్యాసాల ద్వారా కానీ బోధించబడేది, నేర్పబడేది కాదు. శిష్యుడు గురువు దగ్గర ఎన్నో సంవత్సరాలు జీవించి, తీవ్రమైన తపస్సు, క్రమశిక్షణ, బ్రహ్మచర్యం మరియు ధ్యానంతో కూడిన జీవనాన్ని గడపాలి.

25. గురు భక్తి యోగం అనేది అన్ని శాస్త్రాలకు మూలమైన శాస్త్రము.
26. గురు భక్తి యోగము అమరత్వాన్ని, అవధులు లేని ఆనందాన్ని, స్వేచ్ఛను, పూర్ణత్వాన్ని, సచ్చిదానంద స్థితిని, తరిగిపోని శాంతిని ప్రసాదిస్తుంది.

27. భక్తి యోగము యొక్క ఆచరణ ద్వారా బంధరాహిత్యము మరియు వైరాగ్యము ఏర్పడి కైవల్యము లేదా మోక్షము లభిస్తాయి.

28. గురు భక్తి యోగాన్ని ఆచరించడం వలన శిష్యుని యొక్క మనోభావాలు మరియు కామోద్రేకం నియంత్రించబడతాయి, అతడు బయట ప్రకృతి యొక్క ప్రలోభాలను తట్టుకొని, మనసును క్షోభ పెట్టే విషయాలను నిర్మించగలుగుతాడు మరియు అజ్ఞానాంధకారం యొక్క ఆవలి ఒడ్డుకు చేరడానికి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే పాత్రతను ఇస్తుంది.

29. గురువు-భక్తి యోగం యొక్క ఆచరణ వల్ల అమరత్వము, ఉన్నతమైన శాంతి మరియు ఎడతెగని ఆనందము లభిస్తాయి.

30. గురు-భక్తి యోగము యొక్క ఆచరణ వలన భయం, అజ్ఞానం, చెడు ఆలోచనలు, మనస్సు యొక్క గందరగోళం, రోగము, ఆందోళన నిరాశ మొదలైనవి నిర్మూలించబడతాయి.

31. గురు-భక్తి యోగం అనేది వ్యక్తిగతమైన అహంకారము, భావాలు, సంకల్పాలు, అవగాహనస్థాయి, అనంతత్తవ్వానికి దగ్గరగా మార్చుతుంది.

32. గురు-భక్తి యోగంలో చెప్పబడిన సాధనలు చాలా సులువుగా ఉంటాయి మరియు నిర్భయత్వం అనే అవతలి ఒడ్డుకు ఖచ్చితంగా చేరుస్తాయి.

33. గురు-భక్తి యోగము గురువు యొక్క అనుగ్రహం పొందడానికి పాటించే ఒక గట్టి క్రమశిక్షణతో కూడిన పద్ధతి.

34. ఎటువంటి ఫలాపేక్ష లేకుండా గురువుకు సేవ చేయడము మరియు గురువు యొక్క పాదపద్మాల యందు భక్తి పెరుగుతూ ఉండడం అనేది గురు భక్తి యోగం నేతత్వంలోని అంతర్గతమైన సాధన.

35. నైతికమైన క్రమశిక్షణ మరియు గురువు యందు భక్తి మొదలైనవి లేని వ్యక్తి గురు భక్తి యోగాన్ని పాటించినప్పటికీ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందలేడు.

36. గురుభక్తి యోగమే కర్మ యోగము, భక్తి యోగము, రాజయోగము, హఠయోగము మొదలైన ఇతర అన్ని యోగాలకు పునాది.

37. ఎవరైతే గురు భక్తి యోగ పథం నుంచి తప్పుకున్నాడో, అతడు మరింత అజ్ఞానంలోకి, మరింత అంధకారంలోకి మరియు మరణానికి వెళుతున్నాడు.

38. గురు భక్తి యోగాన్ని ఆచరించడం వలన జీవితం యొక్క పరమ లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారానికి స్పష్టమైన నిశ్చితమైన మార్గం ఏర్పడుతుంది.

39. గురు భక్తి యోగము అందరూ ఆచరించవచ్చు. మహాత్ములందరూ, మహా మేధావులందరూ గురు భక్తి యోగాచరణ ద్వారా ఎంతో గొప్ప కార్యాలను ఒనరించారు.

40. గురు భక్తి యోగంలో యోగాలను మిళితమై ఉన్నాయి. గురు భక్తి యోగాన్ని స్వీకరించని/ ఆచరించని వ్యక్తి మరింత కఠినమైన ఇతర ఏ యోగాలు పాటించే లేడు.

41. ఆచారోపాసన ద్వారా గురు కృపను పొందడానికి గురు భక్తి యోగము అనే ఈ పద్ధతి అత్యధిక ప్రాముఖ్యతనిస్తుంది.

42. వేదాలు మరియు ఉపనిషత్తులు ప్రాచీనమైనది ఈ గురు భక్తి యోగము.


43. జీవితంలోని అన్ని బాధలను మరియు చుక్కలను తుడిపివేసే మార్గాన్ని బోధిస్తుంది గురుభక్తి యోగము.

No comments:

Post a Comment