Friday 22 November 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 29 వ భాగము



95. గురు-భక్తి యోగాన్ని పాటించడం చేత మాత్రమే వ్యక్తికి భయం తొలగి జీవితంలో అన్ని సందర్భాల్లోనూ ఆనందంగా ఉంటాడు.
96. గురు-భక్తి యోగాచరణ ద్వారా అమరమైన సచ్చిదానంద తత్వమైన ఆత్మను మీ లోనే తెలుసుకోండి.
97. మీ జీవితం యొక్క ఉద్దేశ్యము, లక్ష్యము మరియు ప్రయోజనంగా ఈ గురు భక్తి యోగాన్ని మార్చుకోండి. మీరు సచ్చిదానంద తత్వాన్ని చేరుకుంటారు.
98. గురు-భక్తి యోగం అనేది జ్ఞానానికి అనుబంధమైనది.
99. గురు-భక్తి యోగం యొక్క ముఖ్యమైన లక్ష్యం విచ్చలవిడిగా తిరిగే ఇంద్రియాలను నిగ్రహించి, చంచలమైన మనస్సును స్థిరముగా చేయుట.
100. గురు-భక్తి యోగం అనేది సనాతన హిందూ సంప్రదాయంలోని ప్రాచీన పద్ధతి. ఇది మానవుడిని సనాతనమైన ఆనందం మరియు భగవంతునితో ఐక్యము దిశగా తీసుకువెడుతుంది.
101. గురు-భక్తి యోగము అనేది ఆధ్యాత్మిక మరియు మానసిక అభివృద్ధికి చెందిన ఒక పద్ధతి/ వ్యవస్థ.
102. గురు-భక్తి యోగం అనేది మానవుడు సృష్టి యొక్క బంధనాల నుంచి విడిపించి, తన సహజ స్థితి అయిన దైవత్వానికి అతడిని చేరుస్తుంది.
103. గురుభక్తి యోగాచరణ శరీరాన్ని, మనస్సుని లోపాలు మరియు రోగాల నుంచి విముక్తి చేస్తుంది.
104. గురు-భక్తి యోగాచరణ ద్వారా వ్యక్తి భౌతికమైన మరియు మానసికమైన సమర్థతను, కార్యకుశలత పొందుతాడు.
105. గురు-భక్తి యోగం అనేది మానవుడిని బాధలు, కష్టాలు మరియు వృద్ధాప్యం విముక్తుడిని చేసి దీర్ఘాయువును మరియు ఎల్లప్పటికి ఉండే ఆనందాన్ని ప్రసాదిస్తుంది.
106. గురు-భక్తియోగము తనలో అన్ని రకాల భౌతిక మానసిక, ఆధ్యాత్మిక మరియు నైతికమైన క్రమశిక్షణ ఇముడ్చుకుని, తన మీద తనే విజయం సాధించి, ఆత్మసాక్షాత్కారానికి తోడ్పడుతుంది.
107. గురు-భక్తి యోగం అనేది మనస్సు యొక్క శక్తులు మీద నైపుణ్యాన్ని ఇచ్చే ఒకానొక శాస్త్రము మరియు కళ.
108. గురువును విశ్వాసం మరియు భక్తి అనే పుష్పాలతో పూజించండి.

No comments:

Post a Comment