దేవపూజా విధానం
- వజ్రనాభ మండలం విష్ణు దీక్ష, లక్ష్మీపూజ
రుద్రదేవా! ధర్మార్థకామమోక్షాలను
ప్రసాదించే సూర్యాది దేవతల పూజను వర్ణిస్తాను. వృషభధ్వజా! గ్రహదేవతల మంత్రాలివి :
ఓం నమః సూర్యమూర్తయే
।
ఓం హ్రాం హ్రీం
సః సూర్యాయనమః ।
ఓం సోమాయ నమః
|
ఓం మంగలాయ నమః
|
ఓం బుధాయ నమః
।
ఓం బృహస్పతయే
నమః ।
ఓం శుక్రాయ నమః
|
ఓం శనైశ్చరాయ
నమః |
ఓం రాహవే నమః
|
ఓం కేతవే నమః
|
ఓం తేజశ్చండాయ
నమః |
ఈ మంత్రాలను
చదువుతూ ఆసన, ఆవాహన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, యజ్ఞోపవీత, గంధ, పుష్ప ధూప,
దీప, నమస్కార, ప్రదక్షిణ, విసర్జనాది ఉపచారాలను సమర్పిస్తూ గ్రహాలను పూజించాలి.
No comments:
Post a Comment