పూజానుక్రమ
- నిరూపణం
రుద్రదేవా! ఏ
పూజకైనా ఒక క్రమ విధానముంటుంది. దానిని వివరిస్తాను వినండి. సాధకుడు ముందుగా ఓం నమః
మంత్రంతో పరమాత్మను స్మరించాలి. తరువాత యం రం వం లమ్ అనే బీజాక్షరాల ద్వారా శరీరాన్ని
శుద్ధి చేసుకొని భగవానుడు చతుర్భుజుడునైన విష్ణువుని తనలోనే ఊహించుకోవాలి.
తరువాత కరన్యాస,
దేహన్యాసాలను చేసుకొని ఈ క్రింది మంత్రాల ద్వారా హృదయంలోనే యోగపీఠాన్ని పూజించాలి.
ముందుగా నొక
కమలాన్ని స్థాపించి అందులోని భాగాలలో దేవతలనూహించుకొని ఈ మంత్రాలను పఠించాలి.
ఓం అనంతాయ నమః
|
ఓం ధర్మాయ నమః
|
ఓం జ్ఞానాయ నమః
|
ఓం వైరాగ్యాయ
నమః ।
ఓం ఐశ్వర్యాయ
నమః ।
ఓం అధర్మాయ నమః
|
ఓం అజ్ఞానాయ
నమః |
ఓం అవైరాగ్యాయ
నమః ।
ఓం అనైశ్వర్యాయ
నమః |
ఓం పద్మాయ నమః
|
ఓం ఆదిత్య మండలాయ
నమః ।
ఓం చంద్ర మండలాయ
నమః ।
ఓం వహ్ని మండలాయ
నమః |
ఓం విమలాయై నమః
।
ఓం ఉత్కర్షిణ్యై
నమః |
ఓం జ్ఞానాయై
నమః |
ఓం క్రియాయై
నమః ।
ఓం యోగాయై నమః
|
ఓం ప్రహ్వ్యై
నమః |
ఓం సత్యాయై నమః
|
ఓం ఈశానాయై నమః
।
ఓం సర్వతోముఖ్యై
నమః ।
ఓం సాంగోపాంగాయ
హరేరాసనాయ నమః |
తరువాత సాధకుడు
కర్ణిక మధ్యలో అం వాసుదేవాయ నమః అంటూ వాసు దేవునికి నమస్కరించి ఈ క్రింది మంత్రాలతో
హృదయాది న్యాసం చేయాలి.
No comments:
Post a Comment