Sunday 14 October 2012

నవరాత్రులు

పండగ లేదా పూజ పేరున ఇంటిముందు ఆవుపేడతో అలికి శుభ్రంచేయడం,గడపకు పసుపు రాయడం వంటివి చేస్తారు.ఆవు పేడ,పసుపు క్రిములను నాశనం చేస్తాయి.ఆవుపేడలొ యాంటి-రేడియేషన్ గుణాలు ఉన్నాయి.మనం మన ఇంటి పైకప్పును ఆవుపేడతో అలికితే రెడియషన్ ప్రభావం నుండి తప్పించికోవచ్చు.కాకపొతే అది దేశవాళి ఆవు అయ్యి ఉండాలి.జన్యమార్పిడి చేసిన జెర్సి ఆవు పేడ పూసిన పండి పేడ పూసిన ఒకటే.గడపకు రాసిన పసుపు బయటనుండి వచ్చే క్రిములను సమూలంగా నాశనం చేస్తుంది.

గడపకు బంతి తొరణాలు కడతారు.బంతి పువ్వులు నుండి వెలువడే వాసన దోమలను దరిచేరనివ్వదు.బంతి యాంటి-బయాటిక్,యాంటి-సెప్టిక్.దానిని అన్ని గదులకున్న గడపలకు,కీటికీలకు అలంకరిస్తారు.గాలి వీచినప్పుడు,వాటి వాసన ఇల్లంతా వ్యాపించి ఇంట్లొ ఉన్న సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది.బయటనుండి క్రిములను ఇంటిలోనికి రానివ్వదు.అందుకే బంతి పూలు కడతారు ప్రతి శుభకార్యానికి హిందువులు.

ఇక మామిడి తోరణాలు విషయానికి వస్తే మామిడి ఆకులు యాంటి-వైరల్ లక్షణాలు కలిగి ఉంటాయి.అలాగే వాటికి ఆక్సిజెన్ అధికంగా విడుదల చేయగల శక్తి ఉంది.చెట్టు నుండి తెంపిన తరువాత కూడా అవి ఆక్సిజెన్ విడుదల చేయగలవు,కార్బన్-డై-ఆక్సైడ్ ను పీల్చుకోగలవట.ఎక్కువమంది అతిధులు పూజసమయంలో వస్తారు కనుక ఇబ్బంది లేకుండా అలా అలంకరిస్తారు.మీకు ఇప్పటికే అర్ధమయ్యి ఉంటుంది వాటిని ఎందుకంత విరివిగా పూజల్లో వాడమన్నారో.  

పండగ పేరున నియమబద్ద జీవితం గడుపుతాం.పూజ చేసే ప్రదేశంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెడతారు.ఆవుపేడ ఇంట్లొకి క్రిమికీటకాలను రానివ్వదు.అలాగే ఆవుపేడ యాంటి-బ్యాక్టీరియల్ గా పని చేసి రోగకారక క్రిములు రాకుండా చేస్తుంది.

ఈ 9 రోజులపాటు అమ్మవారికి 9రకాల నైవేద్యాలు నివేదన చేయాలని,అవి తయారుచేసే విధానం,వాటిలో వాడవలసిన పదార్ధాలు అన్ని వివరంగా చెప్పబడ్డాయి.ఇవన్ని కూడా చాలా పుష్టికరమైన ఆహారం,రోగనిరోధకశక్తిని పెంచే శక్తికూడా ఉన్నటువంటి ఆహారం.ఈ నవరాత్రి సమయంలో ఇంట్లో చేసే ప్రతి ఆహార పదార్ధాన్ని కూడా దుర్గాదేవికి నివేదిస్తాం.అందువల్ల వాటిని శుభ్రంగా,పవిత్రంగా తయారుచేస్తాం.సగం రోగాలు మనం ఆహారం తయారుచేసే సమయంలో శుభ్రత(వ్యక్తులైనా,వంట పాత్రలైనా)పాటించకపోవడం వల్లె వస్తాయి.

ఏ పూజకైనా ఈ కాలంలో వచ్చే పండ్లను పూజించే దేవిదేవతలకు నివేదిస్తాం.ఆ విగ్రహలేమి నైవెద్యం తినవు.ఒకవేళ నిజంగా తింటే అసలు మనము నైవెద్యం పెడతామా?ఆఖరున వాటిని మనమే భుజిస్తాం.రోగనిరోధక శక్తి పెరిగి రోగాలు రాకుండా ఉంటుంది.మరొక విషయం అన్ని సృష్టించిన పరమాత్మకు ఇష్టమైనవి,ఇష్టంలేని పదార్ధాలు ఉంటాయా చెప్పండి?మనకు ఏ కాలంలో ఏవి ఆరోగ్యాన్ని కలిగిస్తాయో ఆ ఆహార పదార్ధాలనే నెవేదనగా పరమాత్మ అడిగాడు.

అమ్మవారి పూజలో అత్యంత ముఖ్యమైనది ధూపం(సాంబ్రాణి,గుగ్గిలం).ఏ అమ్మవారి పూజ చేసినా ధూపం ఉండాల్సిందే.ధూపం గాల్లో ఉన్న క్రిములను నాశనం చేయడంతో పాటు తేమను తగ్గించి క్రిములను పుట్టకుండా చేస్తుంది.  

ఇక ఇన్ని జాగ్రత్తలు పాటిస్తే ఏ రోగం వస్తుంది చెప్పండి?

ఈ విషయాలు మన మహర్షులు ఏనాడో కనుక్కుని మనకు అందించినవి.ఆధునిక శాస్త్రవేత్తలు తిరిగి ధ్రువీకరించినవి.కాకపొతే మన పూర్వికులు మహర్షులమీద నమ్మకంతో వాటి వివరణలు తెలుసుకోకుండానే వాటిని ఆచరించారు.మనం మూఢనమ్మకాలని ఆచరించడం  మానుకున్నాం.  
     

No comments:

Post a Comment