Tuesday 23 October 2012

మహిషాసుర మర్దిని

బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసిన మహిషాసురుడు తాను స్త్రీ చేతిలో మరణించలని వరం కోరుకుంటాడు.స్ర్తీలు అశక్తులు,తనని ఏమి చేస్తారులే అని భావించి అటువంటి వరం అడుగుతాడు.వరం పొందగానే మునులు,ఋషులు,స్త్రీలు,పిల్లలు,దేవతలు......ఇలా అందరిని బాధించడం మొదలు పెడతాడు.స్వర్గంలో ఉన్న ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమిస్తాడు.వాడి బాధలు తట్టుకొలేక దేవతలు శివ,విష్ను,బ్రహ్మలకు వారి బాధలను చెప్పగా,వాడిని సంహరించడానికి ఒక శక్తి స్వరూపిణి అయిన స్త్రీ ఉద్భవించాలని,అందుకోసం దేవతలందరూ తమ తమ శక్తిని ధారపోసి ఒక రూపాన్ని తయారు చెస్తారు.18 భూజలతో ఆవిర్భవించిన ఆ దివ్య శక్తికి తమ అయుధాలను ఇస్తారు.ఆ శక్తి అందరికి అమ్మ కనుక,తల్లి ప్రేమతో మహిషాసురిడిని తప్పు తెలుసుకొని,ప్రజలను భాదించవద్దని,స్వర్గాన్ని దేవతలకు అప్పగించమని చాలా రోజులు శాంతంగా చెప్తుంది.వాడు ఆ శక్తి అందానికి ముగ్ధుడయ్యి ఆమెను పొందాలని చూస్తాడు.తాను అందరికి తల్లినని,ఆ విధంగా భావించడం తప్పని ఎంత చెప్పిన వినడు.ఆ మహాశక్తి ఒప్పుకొలేదు,అందువల్ల ఆమెను బలవంతంగానైనా అనుభవించాలన్న భావనతో ఆమె మీద తన సైన్యాన్ని దండెత్తమని,ఆమెను సజీవంగా తీసుకురమ్మని చెప్తాడు.వచ్చినవారితో చాలా ప్రశాంతంగా అమ్మవారు మాట్లాడి,వారి మనసు మార్చే ప్రయత్నం చేసినా వారు మారక,యుద్ధం కోరి శక్తి చేతిలొ మరణిస్తారు.ఇలా అందరూ మరణించాక అమ్మ మహిషాసురిడితో యుద్ధం చేస్తుంది.

కాసేపు దున్నపోతుగాను,ఏనుగు గాను,సింహంగాను,మాములు మనిషి ఆకారంలో పోరాడి,అమ్మవారి సింహాన్ని గాయపరుస్తాడు కాని ఓడిపోతాడు.మళ్ళీ మహిషం అంటే దున్నపోతు రూపాన్ని ధరించి దాడి చెస్తాడు.అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న మహాశక్తికి విపరీతమైన కోపం వచ్చి,కన్నులు బైర్లు కమ్మే వెలుగుతో వాడి మీద దాడి చేసి వాడిని సంహరించి మహిషాసురమర్దినిగా పేరు తెచ్చుకుంది.


మనలో ఉన్న బద్దకం,అజ్ఞానమే మహిషాసురుడు.జంతువులు ఆలొచించలెవు కనుక వాటికి ఏది మంచొ ఏది చెడొ తెలీదు.అవి సుఖం కోసం ఏమైనా చెస్తాయి.ఆలోచించకుండా బలం(డబ్బు,శారీరక బలం మొదలైనవి)ఉంది కదా అని కేవలం ఆనందం కోసం బ్రతికే వారిని ఇక్కడ జంతువు(మహిషం)తో పొల్చారు.మనలో విద్య వల్ల కలిగే జ్ఞానమే ఆ మహాశక్తి.మనం మారుదాం అనుకున్న,మంచి అలవాట్లు చేసుకుందామన్న మనలో ఉన్న అజ్ఞానం మనల్ని మారనివ్వదు.అది రకరకాల రూపల్లో భయపెడుతుంటుంది.మనం మంచిగా మారితే మన ఉనికే ఉండదన్న భావన కలిగిస్తుంది.అదే మహిషాసురుడి వివిధ రూపాలు.మొదట "దున్నపోతు మీద రాళ్ళ వాన"అన్నట్లు అసలు ఎంత చెప్పిన మన మనసు మన మాట వినదు.మనం మరింత పట్టుదలతో మారుదామని భావించి,ప్రయత్నం చేస్తుంటే అది ఏనుగు వలె బలంగా అణిచివేయాలని,ఇంకా వినకపొతే సింహంలాగా భయపెట్టి మనల్ని మంచి వైపు మారకుండా చేయడానికి చుస్తుంది మనలో ఉన్న అజ్ఞానం.మనలో ఉన్న జ్ఞానం అనే శక్తితొ వాటిని సమూలంగా అంతం చేయడమే మహిషాసుర మర్దనం(ఇది ఒక్క రోజు కాదు నిరంతరం జరిగే ప్రక్రియ).అలా మన అజ్ఞానాన్ని అంతం చేసిన రోజున మనలో ఉన్న దైవత్వం మనకు తెలుస్తుంది.అదే మన పురాణం మనకు ఇచ్చే సందేశం.

కాకపొతే ఇవాళ మన దురదృష్టం అందరికి అమ్మ అయిన అమ్మవారికి కులం,ప్రాంతం అంటగట్టారు.ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం(aryan invansion thoery) తప్పని తెల్చాక కుడా,అమ్మవారు ఆర్య స్త్రీ అని పిచ్చి పిచ్చి వాదనలకు తెర తీసి జనాలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారు.అంతేకాదు రాక్షసుడికి కూడా ప్రాంతాన్ని,కులాన్ని అంటగట్టారు.దేవి భాగవతంలో కాని,పూరాణాల్లొ కాని ఎక్కడ లేని వింతవాదనలు వినిపిస్తూ,హిందూ యువతను హిందుత్వానికి దూరం చేయాలని,మత మార్పిడ్లు చేయాలని,2050 సంవత్సరానికి భారత దేశాన్ని ముక్కలు చేయాలని పధకం వేశారు.ఆ పధకాన్ని అమలు చెయడానికి భారతీయులనే పావులుగా వాడుకోవడం బాధించదగ్గ విషయం.

అందరిలో ఉన్న బుద్ధి మేలుకొవాలి,నిజానిజాలను గ్రహించాలి అని ప్రార్ధించండి.దేశ సమగ్రతను కాపాడండి.        

యా దేవి సర్వ భూతేషు బుద్ధి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

సర్వ జీవులలో బుద్ధి రూపంలో ఉన్న ఓ అమ్మ నీకు నా నమస్కారము. 

No comments:

Post a Comment