Wednesday 31 October 2012

సర్దార్ వల్లభాయి పటేల్(sardar vallabhai patel)

31 october-sardar vallabhai patel jayanti

31 అక్టోబరు సర్దార్ వల్లభాయి పటేల్ గారి జయంతి.భారత దేశ తోలి హోం మంత్రిగా పనిచేసి పని చేశారు ఈయన.మన దేశ చరిత్రలో హోం మంత్రిగా ఈయన కంటే గొప్పగా బాధ్యతలు నిర్వహించినవారు లేరు.ఈయనకు భారతదేశ ఉక్కుమనిషి(IRON MAN OF INDIA) అని బిరుదు.

భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర వహించి,స్వాతంత్రం తరువాత 565 సంస్థానాలను(565 princely states) భారత దేశంలో వీలినం చేసిన వ్యక్తి వల్లభాయిపటేల్.బలవంతపు విలీనం నెహ్రూకు ఇష్టం లేకపొయినా,నెహ్రూ యూరపు(europe) పర్యటనలో ఉండగా తనకున్న అధికారంతో హైద్రాబాదును నిజాం పాకిస్థాన్ కు అప్పగించాలని చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొని,ఆపరేషన్ పోలో(operation polo) పేరున మిలిటరీ చర్య జరిపి హైద్రాబాదు రాజ్యాన్ని(hyderabad state) భారతదేశంలో వీలినం చేసిన మహానుభావుడు.ఈయనే లేకుంటే హైద్రాబాదు పాకిస్థాన్లో భాగం అయి ఉండేది,లేదంటే స్వతంత్ర రాజ్యంగా ఉండేది అని చెప్పుకున్న,అందులో ఆశ్చర్య పడావలసిన అవసరం లేదు.అలాగే గుజారత్ లొని జూనాగర్హ్(junagadh) ప్రాంతాన్ని,లక్షద్వీప్ దీవులను(lakshadweep islands) పాకిస్థాన్ లో వీలినం కాకుండా భారత్ భూ భాగంలో కలిపిన వ్యక్తి.జమ్ము కాశ్మీర్ సమస్యను కూడా పరిష్కరించగలిగిన సత్తా ఉన్నా,నె హ్రూ కారణంగా చేయలేకపొయారు.                    

భారతదేశ తోలి ప్రధాని కావలసిన వ్యక్తి.1946లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి(congress presidency) ఎన్నికలు జరిగాయి.ఎన్నికల్లో గెలిచిన వారు అధ్యక్ష పదవితో పాటు ప్రధాన మంత్రిగా కూడా పనిచేయాలని తీర్మానించారు.గాంధీ 16 రాష్ట్రాల ప్రతినిధులను పిలిచి సరైన వ్యక్తిని ఎన్నుకోమని చెప్పారు.16లో 13 రాష్ట్రాల ప్రతినిధులు వల్లభాయి పటేల్ పేరును ప్రతిపాదించారు.గాంధీ నెహ్రూకు ఈ విషయం చెప్పి,సర్దార్ ను ప్రధాన మంత్రిని చేయాలన్న విషయం పై మీ అభిప్రాయం చెప్పండి అనగా,ఆయన తల దించుకోని మౌనంగా ఉన్నారు.నెహ్రూ కు ప్రధాని కావలన్న అలోచన ఉంది అని అర్దం చేసుకున్న గాంధీ సర్దార్ కు చిన్న కాగితం మీద ఏదో వ్రాసి ఇవ్వగా ఆయన ప్రధాన మంత్రి పదవికి పోటినుండి తప్పుకున్నారు.ఇది చాలు ఆయన గొప్పతనం చెప్పడానికి.

ఈ రోజు మనం చూస్తున్న మన భారతదేశం నిజానికి ఆయన కృషే.మన దేశ సమగ్రతకు(integrity),సమైక్యతకు(unity) పాటు పడిన ఈ మాహనుభావుడి జయంతిని మనము,మన ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు.    

jai hind          

సేకరణ:
http://en.wikipedia.org/wiki/Vallabhbhai_Patel
http://deshgujarat.com/2007/10/30/how-sardar-patel-did-not-become-first-pm-of-indiavideo/

No comments:

Post a Comment