Thursday 18 October 2012

అన్నపూర్ణ దేవి

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ద్యర్ధం బిక్షాన్ దేహిచ పార్వతి
మాతచ పార్వతి దేవి పిత దేవో మహేశ్వరః
భాందవా శ్శివ భక్తాస్చ స్వదేశో భువనత్రయం

ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణ దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు.

"అన్నంబ్రహ్మేతి వ్యజానాత్|అన్నద్ద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే|అన్నేన జాతాని జీవంతి|"
అన్నం పరబ్రహ్మస్వరూపం.అన్నం నుండే సమస్త జీవరాసి పుడుతోంది,జీవిస్తొంది(అంటే అన్నం తినడం చేత పోషింపబడిన తల్లిదండ్రుల శరీరంద్వారానే మన పుట్టాము.అన్నం తినక పోయి ఉంటే వారు జీవించి ఉండే వారు కాదు,మనం పుట్టి ఉండే వారం కాదు).
"ప్రాణోవా అన్నం|శరీర మన్నాదం|అధో అన్నేనైవ జీవంతి|"
ప్రాణాధారం అన్నం.మన శరీరమే అన్నం(అంటే మనం తిన్న ఆహారం ద్వారనే మన శరీరంలో రక్తం,మాంసం,శుక్ల మొదలైన సప్తధాతువులు ఏర్పడ్డాయని ఆయుర్వేదం చేబుతొంది).ఈ జీవరాశి బ్రతకడానికి అన్నమే సహకరిస్తొంది.
తదితర వ్యాఖలలో తైత్తిరీయోపనిషత్ అన్నం యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తొంది.

ఇక్కడ అన్నం అంటే కేవలం బియ్యం ఉడకబెట్టగా వచ్చిన పదార్ధం అని అర్దం కాదు.ఆహారం అని అర్దం.అటువంటి అన్నంలో మనం దైవత్వాన్ని చుశాం.

యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా|
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః||

అంటూ చండి సప్తశతిలో అమ్మవారిని ప్రార్దిస్తాం.అంటే సకల జీవాలలోను శక్తి రూపంలో ఉన్న అమ్మవారికి నా నమస్కారాలు అని అర్ధం.అటువంటి శక్తి ఎక్కడ నుండి వస్తోంది అంటే ఆహారం వల్లనే.అందువల్ల అన్నమే అమ్మవారిగా వేదకాలం నాటి మానవునికి కనిపించింది.ఆమే అన్నపూర్ణదేవి.

అంతే కాదు మనం బ్రతకడానికి ఏది సహకరిస్తొందొ వాటిని గౌరవించే సంస్కారం మనది.అందువల్ల అన్నాన్ని పూజిస్తున్నాం.

ఒక వస్తువును పూజించడము అంటే గౌరవించడమని అర్ధం.అన్నాన్ని వృధా చేయడము,చెత్తబుట్టులో పడవేయడమంటే అది అవమానించడమవుతుంది.అందువల్ల అహారాన్ని వృధ చేయకూడదు.

అంతే కాదు అహారం తినే సమయంలో కింద పడ్డా ఒక్కో అన్నం మెతుక్కు 10,000సంవత్సరాల నరకం అనుభవించవలసివస్తుంది,అందువల్ల అన్నం జాగ్రత్తగా తినండి.పవిత్రంగా తినండి అని శాస్త్రం చెప్పింది.

మొదట చెప్పబడ్డ శ్లోకం అందరికి అన్నం మాత్రమే దొరకాలని,అందుకోసమని అన్నపూర్ణదేవిని ఆరాధించమని చెప్పలేదు."జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం బిక్షాందేహిచ పార్వతి" అంటే అమ్మా,ఓ పార్వతి దేవి.మాకు అన్నం మాత్రమే కాదు జ్ఞానము,వైరాగ్యము కూడా మాకు ప్రసాదించు అని అర్దం.

No comments:

Post a Comment