Tuesday 23 October 2012

దశహర

నిజానికి దసరా కాదు ఇది దశహర.దశకంఠుడైన రావణాసురుడుని శ్రీ రామచంద్రుడు వధించిన రోజు.

మనం సినిమాలో చూస్తున్న రామాయణానికి,సంస్కృత భాషలో వాల్మికి రాసిన రామాయణానికి చాలా తేడా ఉంది.మనం చూస్తున్న రామాయణంలో రాముడికి రావాణాసురిడికి మధ్య బాణాలతో యుద్ధం జరుగుతుంది.వాల్మికి మహర్షి రాసిన రామాయణంలో రామ-రావణ యుద్ధంలో అణుబాంబులను,నూక్లెయర్ మిస్సైల్స్,రాడార్లకు అందని విమానాలు వాడతారు.రావణ కూమారుడు ఇంద్రజిత్తు(మేఘనాధుడు)కి ఒక నూక్లెయర్ లాబొరేటరి ఉందని,ఎప్పటికప్పుడు అక్కడ పరిశోధనలు జరిగేవని కూడా ఉంది.రామాయణంలో 300 రకాలకు పైన మొక్కల ప్రస్తావన ఉంది.నదుల గురించి,ప్రకృతి గురించి,ఋతువుల గురించి,పక్షులు,జంతువుల గురించి,ఇలా ఒక్కటేమిటి మొత్తం మన దేశంలో ఉన్న పర్యqవరణం గురించి,జీవ వైవిధ్యం గురించి కూడా చెప్పారు.ఇవన్ని రాముడు తన వనవాస కాలంలో తిరిగిన ప్రదేశాల్లో ఉన్నవి.

శ్రీ రాముడు దేవుడని రామాయణంలో ఎక్కడా లేదు.ఒకసారి రామలక్ష్మణులు,వానర సైన్యం మీద మేఘనాధుడు నాగాస్త్రాన్ని ప్రయోగిస్తే వారిని విడిపించడానికి గరుత్మంతుడు వైకుంఠం నుండి వచ్చి విడిపించి రాముడికి నమస్కరిస్తే రాముడు మీరు ఎవరు మహానుభావా?నాకు ఎందుకు నమస్కరిస్తున్నావు అంటాడు.మీరే విష్ణువని గరుత్మంతుడన్నా రాముడు అంగీకరించడు.అందువల్ల రామాయణం చదువుతున్నప్పుడు అది ఒక సామాన్య మానవుడి చరిత్ర చదువుతున్నట్టుగా చదవాలి.

రావణాసురుడి గురించి వాల్మీకి రామాయణంలొ ఎక్కడ చెడ్డగా చెప్పలేదు.నిజానికి వాల్మీకి మహర్షి రామాయణాన్ని చాలా నిష్పాక్షికంగా రాసారు.కొన్ని చోట్ల రావణాసురుడిని పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి.రావణాసురుడు సంగీత విద్వాంసుడు,వేద పండితుడు,పరమ శివ భక్తుడు,బ్రహ్మ వంసంలోని వాడు,బ్రాహ్మణుడు.అతనికి చాలా మంచి లక్షణాలే ఉన్నా అతని వినాశనానికి ప్రధాన కారణం "లౌల్యము" అంటే స్త్రీలను అనుభవించాలన్న చెడు ఆలోచన.ఇంకా కొన్ని చెడులక్షణాలు.రావణుడి మరణం తరువాత అతని కోట నుండి ఎంతో అందమైన ఆడవాళ్ళు బయటకు వచ్చారని,వారిని చూసి లంక ప్రజలే ఇంత మంది రావణుడి చెంత ఉన్నారా?అని ఆశ్చర్యానికి గురాయ్యరని మనకు కనిపిస్తుంది.అంటే రావణుడు ఎంతోమంది చంపి వారి భార్యలను ఎత్తుకువచ్చి వారిని అనుభవించాడు.

రాముడి గురించి పొగిడింది,ఆయన గొప్పతనం చెప్పింది మారీచుడు.ఆయన ఒక రాక్షసుడు.రాముడి చేతిలో చంపబడ్డాడు.వాల్మీకి రామాయణంలో మారీచుడికంటే రాముడి గురిచి మరెవరూ అంత గొప్పగా చెప్పలేదు.

ఇవాళ మనకు సంస్కృతం రాకపోవడం వల్ల,మనకు రామాయణం తెలియకపొవడం వల్ల మన సమాజంలో రామాయణం గురించి కొత్త కొత్త వాదనలు పుట్టుకొస్తున్నాయి.

రామాయణాన్ని అనువదించే క్రమంలో అందరూ రామాయణంలో ఉన్న సైన్సును వదిలి అనువదించారు.నిజానికి ఎవరి కాలానికి తగ్గట్టుగా వారు అనువదించారని చెప్పాలి.ఒక కాలంలో రామాయణంలొ ఉన్న టెక్నాలజి లేదు కనుక వారికి అది అంత ముఖ్యమైనదిగా అనిపించక వదిలిపెట్టారు.అలాగే రాముడి భక్తులు రాసినప్పుడు రాముడిని రామాయణ ప్రారంభం నుండే దైవంగా చూపించడం,రావణాసురిడిని రాక్షసుడిగా చిత్రీకరించడం జరిగింది.అంతేకాని వాల్మీకి రాముడి తరుపున రాయలేదు.కేవలం ఒక దైవ కధ మాత్రమే కాదు.అందులో ఇంజనీరింగ్,కామర్స్,పరిపాలన,వైద్యం,పర్యావరణం వంటి అనేకానేక అంశాలు ఉన్నాయి.ఇప్పుడు వాటిని వెలికితీయవలసిన అవసరం భారతీయుల మీద ఉంది.రామాయణంలొ ఉన్న సైన్స్,పరిపాలన,సామజిక విలువలు,పర్యవరణ పరిరక్షణ,జీవ వైవిధ్యం గురించి వివరంగా మరొకసారి చెప్పుకుందాం.

అందరికి దసరా శుభాకాంక్షలు.    

No comments:

Post a Comment