గత కొన్నెళ్ళుగా పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ భారత్‌ను కవ్విస్తోంది. ఈ మధ్య అయితే మరీ తెగించింది. పాక్ ఉగ్రవాదులు సరిహద్దు గ్రామాల్లో ఉండే పౌరుల మీద, సైనికుల మీద కాలుపు జరుపుతూ దాడులు చేస్తున్నారు. గత పదేళ్ళలో ఎప్పుడు పాక్ కాల్పులు విరమణ ఉల్లగించినా, కేంద్రంలో ఉన్న ప్రభుత్వ విధానాల వలన భారత సైన్యం తిరిగి స్పందించేది కాదు. స్పందించవద్దని, మౌనంగా ఉండమని అప్పటి ప్రభుత్వ ఆదేశం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తి స్చేచ్చనిచ్చింది. ఫలితంగా భారత సైన్యం పాక్ కాల్పులను ధీటుగా తిప్పికొడుతోంది. అయితే తిప్పికొడితే సరిపోదు. తగిన సమాధానమివ్వాలి. అది వేరే సంగతి. కానీ ఇప్పుడు పాక్ చేస్తున్నదేమిటంటే ఒక పక్క కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ, అటువైపు సైన్యం దృష్టి మరల్చి, ఇంకో పక్క అక్రమంగా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపుతోంది. భారతదేశానికి పాకిస్థాన్‌తోనే కాక, అనేక ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. అనేకశక్తులు భారతదేశాన్ని విఛ్ఛినం చేయాలని చూస్తున్నాయి. అందుకు పధకాలు వేసి అమలు చేస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఆ పధకరచన చేసిన శక్తులు విదేశివైతే, వాటిని అమలు పరుస్తున్నది మాత్రం భావదాస్యంలో కూరుకుపోయిన భారతీయులే. కొందరు సంఘసంస్కర్తలు గా, కొందరు దేశభక్తులుగా, కొందరు సేవాభావం ఉన్నవారిగా, రాజకీయనాయకులుగా, మతపెద్దలుగా ముసుగు వేసుకుని చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇంటలిజెన్స్ విభాగం సైతం పసిగట్టలేని విధంగా చాపకింద నీరులా దేశ విద్రోహ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే మనవాళ్ళే మనకు శత్రువులుగా పని చేస్తున్నారు. కొందరు తెలిసి చేస్తున్నారు, కొందరు తెలియక చేస్తున్నారు.
మరి ఇటువంటి సమయంలో దేశభక్తి కలిగిన పౌరులుగా దేశానికి మనమేం చేయగలం అనే ప్రశ్న ఉదయిస్తుంది. ముందు పౌరుల మనసు సంఘవిద్రోహ శక్తులకు లోబడకుండా ఉండాలి. అలా జరగాలంటే దైవబలాన్ని పెంచాలి.
అప్పుడు దైవీశక్తులు జనం యొక్క మనసును మంచిమార్గంలో, ధర్మమార్గంలో నడిపిస్తాయి. దుష్టభావాలను తగ్గిస్తాయి. సుబ్రహ్మణ్యస్వామి దేవసేనలకు అధిపతి. ఆయనే దేవతాసైన్యానికి నాయకుడు. ప్రతి రోజు ప్రతి పౌరుడు కనీసం 108 సార్లు శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రాన్ని జపించి ఆ శక్తిని దేశానికి ధారపోస్తే, భారతసైన్యానికి అంతులేని దైవబలం పెరుగుతుంది. సైన్యానికేకాదు ఇంటలిజెన్స్ విభాగం వారికి ఆ శక్తి సహాయపడి కుట్రలను భగ్నం చేసే శక్తిని, మేధస్సును ఇస్తుంది. దాంతోపాటు శత్రువుల మనసులో దైవీశక్తులు భయాన్ని కలిగిస్తాయి, ఫలితంగా శతృసేనల బలహీనపడతాయి. దైవీశక్తుల బలం పెరిగిందంటే దుష్టశక్తుల బలం క్షీణిస్తుంది.కనుక దేశభక్తి ఉన్న ప్రతి పౌరుడు కనీసం 108 మార్లైన జపం చేయండి. అంతకంటే ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. యుద్ధం వస్తే, చేయాల్సిందే. కానీ యుద్ధం చేసేది సైన్యం కదా, మరి మనమేం చేయాలంటే, దానికి సమాధానమే ఈ మంత్రజపం. ఇది చేయడం వలన దేశనికి రక్షణ కలగడమే కాక, మనం సంఘవిద్రోహశక్తులకు పావులుగా మారకుండా ఉంటాము. మనకూ రక్షణ కలుగుతుంది. ఇన్ని కోట్లమంది కోసం చేస్తున్నారు కనుక త్వరగా కర్మ తీరిపోతుంది.
ఇదే సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రం
ఓం తత్పురుషాయ విద్మహే
మహాసేనాయ ధీమహి
తన్నః షణ్ముఖః ప్రచోదయాత్

No comments:
Post a Comment