Sunday 23 August 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (2)



ఆధ్యాత్మిక సత్యాల ప్రతిరూపం


వినాయకునకు సంబంధించిన ప్రతి చిన్న విషయం, ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడిస్తుంది. 


వినాయకుడి ముందు ఎందుకు కొబ్బరి కాయలు కొడతాం? దీనికొక కథ యుంది. ఒకనాడు నీ తలని బలీయవలసిందిగా తండ్రియైన పరమేశ్వరునే అడిగాడట. దానికి బదులుగా మూడు కన్నులున్న కొబ్బరికాయను శంకరుడు సృష్టించాడట. శంకరునకూ మూడు కన్నులు కూడా! అతని తలకు బదులుగా ఇట్లా కొబ్బరికాయలను కొడతాం.


దానిని నేలమీద కొడితే ముక్క చెక్కలవుతుంది కదా! అయితే ఆ ముక్కల్ని ముఖ్యంగా ఎవరేరుకుంటారు? 1941లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తోంది. నాగపట్టణంలో చాతుర్మాస్య దీక్ష అప్పుడున్నాను. కొబ్బరికాయలను కొడుతూ ఉండడం, పిల్లలు మూగడాన్ని చూసా: జనులు కిటకిటలాడుతున్నారు. చోటు లేదు, పొండి పొండని పిల్లలు పెద్దలు తరుముతున్నారు. ఒక పిల్లవాడు ముందుకు వచ్చి కాయను కొట్టిన తరువాత ఈ ముక్కల్ని ఏరుకోవద్దని అనడానికి నీవెవరని గద్దించాడు. అతని ధోరణి చూసి అతనన్నది సబబే అనిపించింది. 


కాయ బ్రద్దలైతే దానిలోంచి అమృతం వంటి నీరు వస్తుంది. ఇట్లా బ్రద్దలు కొట్టడం మన అహంకారాన్ని బ్రద్దలు కొట్టినట్లనిపిస్తుంది. ఇక స్వామి తల, ఏనుగు తల, అతడు స్థూలకాయుడు కూడా. పుష్టిగా ఉంటాడు. పిల్లలు బాగా తిని బొద్దుగా ఉంటే చూడడానికి ముచ్చటగా ఉంటారు కదా! అతని చేతిలో మోదకం ఉంటుంది. కడుపునిండా తినండని, తన మాదిరిగా పుష్టిగా ఉండండని సూచిస్తోంది ఆ ఆకారం.

No comments:

Post a Comment