Tuesday 25 August 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (4)



చంద్రుణ్ణి, సముద్రాన్ని, ఏనుగును ఎంత సేపు చూసినా ఇంకా చూడాలనే అనిపిస్తుంది. భక్తులకు ఆనందాన్ని కల్గించడం కోసం ఏనుగు తలతో సాక్షాత్కరించాడు. ఇది అందంలో దాగిన సత్యం. దీనిని ఆస్వాదించడంలో మనకు తృప్తి ఉండదని సూచిస్తుంది. ఆయన ఆనందం నుంచి ప్రభవించాడు. ఎప్పుడు? భండాసురుడు విఘ్న యంత్రాన్ని ప్రయోగించి అమ్మవారి సైన్యాన్ని అడ్డుకొనగా శంకరుడు అమ్మవారిని సంతోషంతో చూసాడు. అప్పుడు పుట్టిన వాడు స్వామి. ఇతడు విఘ్న యంత్రాన్ని ఛేదించి తల్లికి సంతోషాన్ని కలిగించాడు. విశ్వ సృష్టికి కారణభూతుడయ్యాడు అని ఒక కథ,

ఏ దేవతను కొలిచినా ముందుగా వినాయకుని ఆశీర్వచనాలు, అనుగ్రహాన్ని కోరుకుంటాం కదా. ఇతడే ప్రథమ దేవుడని, ఇతని పూజించాలని అనేవారిని గాణపత్యులని అంటారు.

గణేశుని ఎదురుగా చెవులను పట్టుకొని గుంజిళ్ళు తీస్తూ ఉంటారు. దానికొక చమత్కారమైన కథ ఉంది. మన స్వామి, విష్ణువు యొక్క మేనల్లుడు. ఒకమాటు కైలాసానికి విష్ణువు వచ్చినప్పుడు అతని చేతిలో నున్న చక్రాన్ని మ్రింగి వేసాడట. ఎలా తిరిగి పొందాలని ఆలోచించాడు విష్ణువు. వినాయకుడు నవ్వించడం కోసం రెండు చెవులూ పట్టుకొని, గుంజిళ్ళు తీసాడట. ఇది చూసి పకపకా నవ్వాడు గణపతి. చక్రం నోట్లోంచి ఊడి పడింది.

ఇట్లా చేతులు చెవులు మూసుకొనడాన్ని తమిళంలో తూప్పుకరణం అంటారు. సంస్కృతంలో ధ్రువీకరణ పదానికి వికృతి. అంటే రెండు చేతులతో చెవులను కొనుట. 

విఘ్నాలు లేకుండా ఉండడానికి బట్టి వినాయకుని కొలిచి సకల శ్రేయస్సులను పొందుదాం.

No comments:

Post a Comment