Friday 28 August 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (7)



మరొక భేదం ఉంది. ఇతడు పిల్లవాడు, ఆపైన బ్రహ్మచారి. ఏనుగుగా కనబడి, వల్లిని బెదిరించి సోదరుడైన సుబ్రహ్మణ్య స్వామితో వివాహమయ్యేటట్లు చేసాడు కూడా. వివాహం కానివారు, వినాయకుణ్ణి సేవించడమూ ఉంది ఏమిటి దీనర్థం? అతడు వివాహం చేసుకోకపోయినా, చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఇతరులకు వివాహం చేసే లక్షణముంది. ఇది దయను సూచిస్తోంది. అంటే మనలను ఉద్ధరిస్తున్నాడు. అతడు కదలకుండా మెదలకుండా ఉండి భక్తులను ఎత్తుపై కూర్చొండబెడుతున్నాడు. అంటే ఉద్ధరిస్తున్నాడు. లోగడ చెప్పిన అవ్వైయార్ తను కూర్చుండి తన తుండంతో ఆమెను కైలాసానికి చేర్చాడు కదా!

ఇట్లా భావించిన కొద్దీ క్రొత్త క్రొత్త ఊహలు మన మదిలో మెదులుతాయి. గణపతి మనం ఊహించని దానికంటె అపారమైన దయను వర్షిస్తాడు. 

పిల్లల్ని దేవుణ్ణి ఒక విధంగా చూస్తాం. పిల్ల ల్లో దేవుడున్నాడని అంటారు. పిల్లలు నలుమూలలా తిరుగుతారు. కానీ ఈ పిల్లవాడు తిరగకుండానే ముందు చెప్పిన అవ్వను ఉద్ధరించాడు. అవ్వైయార్ కదలలేని ముసలి వయస్సులో తమిళనాడంతా తిరిగి ధర్మప్రచారం చేసింది.

1 comment:

  1. timber flooring in hopper crossing
    When you start looking in the market, you will come across a vast range and variety of timber floors and in the diverse price range. Here are some of the most common and different types of timber floors available.

    ReplyDelete