Monday 24 August 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (3)


గణపతి ఎంత స్థూలకాయుడు అతని వాహనం, ఎలుక అంత చిన్నగా ఉంటుంది. మిగతా దేవతలకు ఏ ఏద్దో, సింహమో, గుఱ్ఱమో, పక్షియో వాహనంగా ఉంటుంది. వాహనాన్ని బట్టి దేవతల గొప్పదనం ఆధారపడుతుందా? దేవతను మోసే భాగ్యం వాహనానికే కనుక అంత స్థూలకాయుడూ ఎలుక వాహనంపై దానికి భారం అనిపించకుండా తేలికగా ఉంటాడు. భక్తుల హృదయాలలో తేలికగా అధివసించడా?

ప్రతి జంతువుకీ ఒక్కొక్క శరీరావయవంపై మక్కువ కలిగియుంటుంది. చమరీ మృగానికి తన తోకపై; నెమలికి తన పించం పై మక్కువ. మరి ఏనుగునకు దేనిపై మోజు? అది దంతాలను పరిశుభ్రంగా, తెల్లగా ఉంచుకొంటుంది. ఇక ఏనుగు తల ఉన్న గణపతి ఏం చేసాడు? అట్టి ప్రియమైన ఒక దంతాన్ని పెరికి ధర్మాన్ని ప్రవచించే భారతాన్ని రాయడానికి ఉపయోగించాడు. అందం, గర్వ సూచకమైన దంతాన్ని ధర్మన్యాయాలను ప్రవచించే భారతాన్ని లిఖించడానికి త్యాగం చేసినట్లే కదా! గజానునకు వ్రాయటానికి సాధనాలు కావాలా? దేనినైనా ఉపయోగించవచ్చును కదా! ప్రియమైన దంతాన్నే వాడడాన్ని గుర్తించండి. ఒక సందర్భంలో దంతంతోనే ఒక అసురుణ్ణి సంహరించాడు. అప్పుడది ఆయుధం. భారతం వ్రాసేటపుడది ఒక కలం. 

No comments:

Post a Comment