Friday 24 August 2012

part-2
~ మట్టి విగ్రహాలను పూజించడంలొ ఇంకొక విశేషార్ధం కూడా ఉంది.మనం ఏమి చేస్తున్నాం.మట్టిని చెరువులొంచి తీసి,ప్రతిమగా మార్చి,వరసిద్ధి వినాయకుడిని ఆవాహన చేసి ,పవిత్రతను చేకూరూస్తూ,పూజించి తిరిగి దానిని ఏ చెరువులో నుండి తీసామొ అక్కడికె చేరుస్
తున్నాం.మనం పవిత్రంగా భావించే వాటిని పవిత్రంగానే విసర్జిస్తాం.కాబట్టి ఆ విగ్రహాలను పవిత్రమైన జలాల్లొ వదలాలి.అంటే మనం మట్టి తీస్తున్న చెరువు కలుషితం కాకుండ చూడాలి అనే కదా.హిందూ ధర్మం చెప్పింది చెరువులు,నదుల దగ్గర,చెట్ల నీడన మలమూత్ర విసర్జన చేయరాదని.ఈ కారణంగా ఆ చెరువులొ ఎటువంటి కలుషిత పదార్ధలు కలపరు.మరి నిమజ్జనం అయ్యాక కలిపితేనొ?దానికి ఒక పరిష్కారం చూపారు మన ఋషులు.ప్రతి సంవత్సరం ఆ మట్టినే వాడతారు.ఒకవేళ ఎదైన విషపదార్ధాలు ఆ నీటిలొ కలిపారా ఆ మట్టి కూడా కలుషితం అవుతుంది.కలుషితమైన ఆ మట్టిని మళ్ళీ ఏలా పూజిస్తారు?కలుషితమైన దానిలొనికి భగవంతుడిని ఎలా ఆవహన చేస్తాం?ఎక్కడ నుండి తీసిన మట్టి అక్కడే కలపాలి కదా.కాబట్టి ఈ వంకతొ చెరువులను కాలుష్యం బారినుండి తప్పించారు.ఇంకొక రహస్యం ఏ చెరువులొ అయితే వినాయక విగ్రహాన్ని విసర్జించామొ,అది ఒక పవిత్రమైన ప్రదేశంగా మారిపొతుంది.దాని పవిత్రతకు భంగం కలిగిస్తే పాపం వస్తుంది.ఇంత పెద్ద సామాజిక బాధ్యతను దాచారు ఒక్క మట్టి విగ్రహం అనే శాసనం వెనుక.మీరే ఒక్కసారి ఆలొచించండి,ఇది ఎంత గొప్ప విషయమొ.

~ నీటి నుండి ఉత్పత్తైన కరెంటు ఒక రాగి తీగల ద్వారా మాత్రమే సర్ఫరా చేస్తారు.అది దేని ద్వారా పాస్ అవుతుంది ఆ వస్తువునే వాడతారు.అంతేగాని కొత్తగా ఉంటుంది,భిన్నంగా ఉంటుందని ఏ రబ్బరొ,ప్లాస్టికొ వాడతారా?వాడరు.ఎందుకంటే వాటి ద్వారా కరెంటు పాస్ అవ్వదు కనుక.అలాగే మన చుట్టూ ఆ వినాయక చవితి సమయంలొ ఉండే పాజిటివ్ ఏనర్జి,విద్యుత్ అయస్కాంత తరంగాలను ఆ మట్టి మాత్రమే గ్రహించగలదని తెలుసుకొని మన మహర్షులు ఆ వినాయక చవితి రోజున మట్టి ప్రతిమలను పెట్టి ఆ విశ్వచైతన్య శక్తిని మనం ప్రతిమ అనే మీడియం ద్వారా పొందాలని మట్టి విగ్రహాలను మాత్రమే ఆరాధించమన్నారు.

పర్యావరణరక్షణే హిందూ సంస్కృతి.మన సంస్కృతి మనకు ఆత్మగౌరవం.మన సంస్కృతిని మనమే కాపాడుకొవాలి.మనమే ప్రపంచానికి సంస్కృతి గొప్పతనం చాటి చెప్పాలి.పర్యావరణప్రియమైన గణేశ ఉత్సవాలను మాత్రమే జరుపుకుందాం.

No comments:

Post a Comment