Friday 24 August 2012

p
part-3
~ పార్ట్-1,2 చదివిన మాకు నమ్మకం లేదు భారతీయులు ఏన్నొ వందల సంవత్సారాలకు ముందే పర్యావరణ రక్షణుకు నడుం బిగించారని.మీరు అదంతా కల్పించి రాశారేమొ?
~ మేము కల్పించి రాయలేదు.మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే వాస్తు శాస్త్రం మీకు చక్కటి సమాధానం ఇస్తు
ంది.

~ మేము బాగా చదువుకున్నాం.వాస్తు మీద నమ్మకం లేదు.సరే మరి వాస్తు పర్యావరణహితమైన జీవనానికి ఏమి చెప్పింది?
~ కాస్త జాగ్రత్తగా ఆలొచిస్తూ చదవండి.వాస్తు ప్రకారం పడమర,దక్షిణం ఎత్తుగా ఉండాలి.తూర్పు,ఉత్తరం పల్లంగా ఉండాలి.ఇంట్లొని నీరంతా ఈశాన్యా దిశగా పారాలి.ఈశాన్యం పరిశుభ్రంగా,పవిత్రంగా ఉండాలి.అక్కడ బావి ఉండాలి.అక్కడ వెలుతురు బాగా ఉండాలి.ఈశాన్యంలొ తులసి మొక్కలు ఉండాలి.అవునా.
అంటే మనకు ఏమి చెప్తొంది వాస్తు.ఈశాన్యంలొ తులసి మొక్కలు పెంచాలి అంటే అక్కడ మట్టి ఉండాలి.అక్కడే బావి కూడా ఉంటుంది.పవిత్రం కనుక చెత్తచెదారం ఉండదు.
ఇంట్లొ మనం వాడుకున్న నీరు మొత్తం అక్కడికె చేరుతుంది పైన చెప్పిన వాస్తు ప్రకారం ఇల్లు కడితే.అక్కడ తులసి మొక్కల పెంపకం పేరున బండలు పరచకుండ చేశారు.పక్కన బావి ఎర్పాటు చేశారు.
అక్కడికి పారిన నీరంతా అక్కడున్న మట్టిలొ ఇంకిపొతుంది.శుభ్రత కారణంగా అక్కడ ఇంకే నీరు భూమిని కలుషితం చెయ్యదు.పక్కన బావి ఉంది కనుక ఆ బావిలొ ఊట బాగా వచ్చి బావి ఎండిపొదు.వర్షాకాలంలొ పడే వాననీటిని జాగ్రత్తగా ఇంకుడు గుంతల్లొకి పంపిస్తే భూగర్భజలాలు పెరుగుతాయి.రోజు వాడె నీరు కూడా ఇటుగానే పారుతుంది కనుక వాడుకున్న నీటి యొక్క ప్రతి చుక్కను తిరిగి భూమిలొకి పంపించడమే అవుతుంది.
ఎండిపొయిన బావులను ప్రక్కన ఇంకుడు గుంతలు ఏర్పాటు,ఎండిన బావుల్లకు జల కళ వచ్చేలా ప్రయొగాత్మకంగా అమలు చేసింది సేవ్ సంస్థ.
ఇది వాననీటి పొదుపు కాదా?వనరుల సంరక్షణ కాదా?
~ ఈ వాస్తు సూత్రాన్నే దేవాలయాల్లొ కూడా అమలు చేసి,కొనేర్లు తవ్వించి స్థానికులకు నీటి కరువు రాకుండ చేసిన మహొన్నతమైన సంస్కృతి భారతీయ సంస్కృతి,హిందూ ధర్మం.

ప్రకృతి రక్షణే గణపతి దీక్ష.పర్యావరణాను రక్షిస్తూ వినాయక చవితి జరుపుకుందాం. 

No comments:

Post a Comment