Friday 24 August 2012

శశివర్ణం అనే పదం వెనుక దాగిన తత్వాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాం శశి అంటే చంద్రుడు. చంద్రుడు వంటి వర్ణం కలిగిన వాడు ఒక అర్ధం.నిజానికి చంద్రునికి ఒక వర్ణం అంటూ ఉన్న అది సుర్యూని ద్వార వచ్చిందే,అంటే అది తనది కాదు మరి అలా పొల్చడంలొ గల ఆంతర్యం ఎమిటి????????????????????????????? సూర్య రశ్మిని గ్రహించి చంద్రుడు వెలుగు ప్రసరిస్తున్నాడు.పరమాత్ముడు చంద్రుడు అయితే భక్తి అనేది సూర్యుడు.మనకు వాడి ఎడల ఎంత భక్తి ఉంటే వాడు అంతగా ప్రకాసిస్తాడు అని శశివర్ణం లో దాగి ఉన్న అర్ధం. నిజానికి చంద్రుని వెలుగు శాశ్వతం కాదు కదా మరి ఆయనకు ఇది ఎలా ఆపాదించారు?మనకున్న భక్తి,నమ్మకం,విశ్వాసం అచంచలంగా ఉన్నప్పుడు ఓంకారుడు పున్నమి నాటి బింబం.అవి సడలినప్పుడు అసలు అతను కనిపించడు కదా. అంటే మనం అర్దం చేసుకొనలసినది ఒక్కటే.మన భక్తే,మన విశ్వాసమే వాడి యొక్క సాకార రూపాన్ని చూపే మహ మంత్రం. చంద్రుని వర్ణం కలిగినది లక్ష్మీ దేవి,ఎందుకంటే ఆమె చంద్రసహొదరి కనుక.ఈ శ్లోక పఠనంతో ఆమెను కూడా స్మరించిన పుణ్యం కలుగుతుంది. చంద్ర బింబం మొత్తం ప్రపంచానికి చల్లదనాన్ని ఇస్తుంది.ఆ పరబ్రహ్మ్మం కూదా ఈ విశ్వాన్ని చల్లగ చుసేవాడని భావం. చంద్రుడు ఓషధులకు అధిపతి.తన వెలుగులొనే మొక్కలు ఓషధి తత్వాన్ని తయారుచేసుకుంటాయి.అందరికి ఆయురారోగ్యాన్ని ఇస్తాయి.అదే విధంగా పరమాత్ముడు తన భక్తుల ద్వారా సమస్త విశ్వానికి సుఖశాంతులను ప్రసాదిస్తాడు. 'చంద్రమా మనసో జాతః' అని ఋగ్ వేద వచనం.దాని అర్ధం చంద్రుడు మనస్సును ప్రభావితం చేస్తాడని అని ఒక అర్ధం అయితే తాను ఈ భూమికి ఉపగ్రహం కనుక మన మనస్సులో భావలను, అలోచనలను నియంత్రించినట్లే ఋతువులను,సముద్రాలను నియంత్రిస్తాడని మరొ అర్ధం.మరిన్ని అర్ధాలు ఉన్న అవి ఇప్పుడు అసందర్భం కనుక ప్రస్తావించట్లేదు.ఈ శ్లొకంలో అయితే తనను సదా ధ్యానించడం చేత తన భక్తుల మనస్సును సదా తన ఆధినంలొనే ఉంచుకుంటాడని రహస్యార్ధం. నిజానికి హృదయం,మూత్రపిండాలు,కాలేయం కనిపిస్తాయి.కాని మనస్సు కనిపిస్తుందా? కాదు కదా.కాని అన్ని చెప్తుంది,చేయిస్తుంది.అలాగే దేవుడు కూడా కనిపించనప్పటికి అంతకు తానె కర్తగా ఉండి నడిపిస్తున్నడ లేదా? ఇప్పుడు మీకో అనుమానం రావచ్హు.వాళ్ళు శశి అనలేదే,శశివర్ణం అన్నారు మరి చంద్రుని గురించి ఎందుకు వివరించామని అనుకొవచ్హు.వర్ణం అంటె కేవలం రంగు అని మాత్రమే కాదు పని అని కూడ అర్ధం వస్తుంది.అందుకె గీతకారుడు 'చాతుర్వర్ణం మయా స్ర్పుష్టం గుణకర్మ విభాగసః' అని పలికాడు.చెప్పాల్సింది ఇంకా చాలా మిగిలే ఉన్న ఇంతటితొ ఈ 'శశివర్ణాం' అనే పదం యొక్క రహస్యార్ధన్ని ముగిస్తూ...............................

No comments:

Post a Comment