Friday 24 August 2012


కరారవిందెన పదారవిందం
ముఖారవిందెన వినివేశయంతం
వటస్య పత్రస్య పుటే శయానాం
బాలం ముకుందం మనసాస్మరామి

శ్రావణమాస కృష్ణపక్ష అష్టమినాడు దేవకిదేవి ఎనిమిదవ గర్భాన ఆ పరమాత్మ మధురలొ అవతరించాడు.అదే సమయంలొ రేపల్లెలొ యశొద కడుపున మహాశక్తి యొగమాయగా రూపం స్
వీకరించింది.వాసుదేవుడు మధురలొ జన్మించడం అంటే తాత్వికమైన అర్దం ఆయన మధురమైన ప్రదేశంలొనే కనిపిస్తాడని,దర్శనమిస్తాడని.ఎవరికి ఇచ్చాడు ఆ దర్శనం?నిర్మలమైన,సాత్వికమైన,మధురమైన మనస్సుతొ జీవిస్తున్న దేవికి వసుదేవులకు పుత్రసంతానంగా అవతరించి.అంటే అటువంటి మంచి మనస్సు కలిగినవారి హృదయంలొనే తన శక్తి ఉద్భవిస్తుందని.


ఆయన్ను వసుదేవుడు యమున నది దారి ఇవ్వగా అది దాటి రేపల్లెకు తీసుకువెళ్ళడు.నది ప్రవాహం ఆగదు.ఆగకుడదు.యమున యముడి చెల్లెలు.యముడు కాలానికి సంకేతం.యమున కూడా అంతే.అటువంటి యమున అంటే కాలం కూడా ఆ పరమాత్మకు లొబడి ఉంటుందని,ఆయన కోసం కాలం కూడా ఆగిపొతుందని అర్దం.

అలా వెళ్ళిన కృష్ణుడు అమాయకంగా,మంచిగా,ప్రశాంతంగా జీవనం సాగించే రేపల్లెకు చేరాడు.అంటే అటువంటి భక్తుల దగ్గరకు తానే చేరతాడు.యొగమాయ రేపల్లెలొ పుట్టిన వారి మంచితనానికి ముగ్ధురాలయ్యి వారి దగ్గర నుంచి కంసుడు ఉండే మధుర చేరింది.ఎంతటి మాయ అయిన భగవంతుడ్ని నమ్మిన వారిని ఎమి చెయ్యదని,తానే భగవదర్శనం కొరకు తప్పుకుంటుందని అర్దం.యా మా స మాయ అని సంస్కృతంలొ చెప్తారు.అంటే ఏది లేదొ అది ఉందనుకొవడం మాయ.కంసుడు దేవకి అష్టమగర్భం వల్ల మరణం సంభవిస్తుందని తెలుసుకొని,మరణాన్ని జయించాలి అనుకున్నాడు.మరణం రాకుండ ఆపగలను అనుకొవడం మాయ.అందుకే యొగమాయ మధుర చేరింది.ఎవరు అశాశ్వతమైన వాటిని ప్రేమిస్తారొ వారు మాయలొ పడ్డారని,మాయ వారిని ఆవరించడానికి వస్తుందని అర్దం.
 

కంసుడు ఆ చిన్నపిల్లను బండకు కొట్టడానికి ప్రయత్నించగానే ఆ పసిపిల్ల రివ్వున ఆకాశానికి ఎగిరి ఎనిమిది చేతులతొ యొగమాయ దర్శనమిచ్చి కంసుడ్ని చంపేవాడు పుట్టడం జరిగిపొయి
ందని చెప్పింది.కంసుడు చెరసాలలొ ఉన్న దేవకి వసుదేవులను విడిచిపెట్టాడు కాని మరణం నుండి తప్పించుకొవాలని ఇంకా మాయలొనే ఊగిసలాడుతూ ఆ పిల్లవాడిని చంపమని పూతన అనే రాక్షసిని పంపాడు.ఆమె అ పిల్లాడు ఎక్కడున్నడొ తెలియదు కనుక అందరు పిల్లలను తన విషం నిండిన పాలతొ చంపేయసాగింది.కృష్ణుడ్ని చూసి తనువు పులకరించింది ఆ రాక్షసికి.ఆమె ఆయనకు పాలు ఇవ్వడం మొదలు పెట్టగానె ఆ చిన్ని పాపడు ఆమె శరీరంలొ ఉన్న మొత్తం విషాన్ని ఒక్క గుక్కలొ పిల్చేసి ఆమె రక్తాన్ని కూడా పిల్చేయసాగాడు.ఆమె వదిలించుకున్న వదలక ఆమెను చంపి ముక్తిని ప్రసాదించాడు.


ఒక్కసారి మనం ఆ పరమాత్మకు ఏదైన సమర్పించినా లేక మనస్సుతొ ఆయన్ను చూసిన చాలు ఇక మొత్తం ఆయనే చూసుకుంటాడని,మనం విడిపించుకొవాలని చూసినా సరే ఆయన వదలక మనలొని చెడును మొత్తం పిల్చేసి ముక్తిని ఇస్తాడని తత్వతః దాగిన అర్దం.
అ పూతన శవాన్ని దహనం చెయ్యగానే మంచి సువాసనలతొ ఆ ప్రంతం నిండిపొయింది.ఒక్కసారి మనం ఆ భగవంతుని అనుగ్రహం పొంది ఆయన్ను మానసికంగా స్పృశించామా మన మనస్సు కూడా అలా సువాసనలా(మంచి అలొచనలు)తొ నిండిపొతుందని అర్దం.


కృష్ణుడి అల్లరిని భరించలేని యొశొద ఆయన్ను బందించాలి అని ఎన్ని మార్లు ప్రయత్నించినా రెండు అంగుళాలు తగ్గుతొందే కాని ఆ తాడు సరిపొలెదు.అంటే భగవంతుడ్ని బందించాలి అనుకొవడం,బందించగలను అనుకొవడం భ్రమ మాత్రమే అని అర్ధం.కష్టపడి ఆ విశ్వవ్యాపకుడిని బందించింది యొశొద.అంటే దేనికి లొంగని పరమాత్మ భక్తి మాత్రం లొంగుతాడని అర్దం.


కృష్ణుడు తన చిన్నతనంలొ సాందిపని మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నాడు.జగద్గురువు తానే అయిన గురువు యొక్క విశిష్టతను లొకానికి తెలియపరచడానికి,అలాగే ఎంతటి వాడైన గురువును గౌరవించాలని,సేవ చేయాలని లొకానికి చెప్పడానికి తను ఒక గురువు వద్దకు వెళ్ళాడు.


కుచేలుడు కృష్ణుని బాల్యస్నేహితుడు.పరమ దరిద్రంలొ బ్రతుకుతున్నాడు.కృష్నుడు రాజభొగాలు అనుభవిస్తున్నాడు.కుచేలుడు కృష్నుడ్ని కలవడానికి వస్తే సకల రాచమర్యాదలతొ సత్కరించి,బంగారు చెంబుతొ కాళ్ళు కదిగి ఆ నీటిని తలపై చల్లుకొని,తన భార్య రుక్మిణి సాక్షత్తూ మహాలక్ష్మీ తలపై చల్లి స్నేహానికి అసలు సిసలైన అర్దం చెప్పి ఈ కాలానికి మంచి సందేశం ఇచ్చిన మహానుభావుడు.రెండు గుప్పిళ్ళు అటుకులు అడిగి మరీ తిని ఆ కుచేలునికి సకల సుఖాలు ఇచ్చి తనకు కొంచం ఏదైన సరే మంచి మనస్సుతొ,అచంచలమైన భక్తితొ,ఏమి తిరిగి ఆశించకుండా ఇస్తే అది తీసుకొని వారికి అవసరమైనవి ఇస్తానని లొకానికి చాటిచెప్పాడు.
  

No comments:

Post a Comment