Wednesday 12 March 2014

హిందూ ధర్మం - 35 (అస్తేయం -2)

యజమాని విధించిన పరిధిని దాటి వస్తువులను వాడుకోవడం స్తేయం. ఎంతవరకు వాడుకునే స్వేచ్చ ఇచ్చారో అంతవరకే జాగ్రత్తగా వాడుకోవడం అస్తేయం.

ఈ సృష్టి ఆదిలో పరమాత్మ మనకు యజ్ఞం అనే ఒక ప్రకియను అందించి, మీరు యజ్ఞం చేసి దేవతలను (ప్రకృతిని) సంతృప్తి పరచండి, సంతృప్తి పడ్డ దేవతలు వర్షాలు కురిపిస్తారు, తద్వారా ఆహారం పండుతుంది, మీరు పండించిన ఆహారం స్వీకరించే ముందు అది దేవతలకు యజ్ఞంలో హవిస్సుగా సమర్పించి, ఆ తర్వాతే భుజించండి. అలా ఎవరు భుజించరో, వారు పాపాన్ని తింటున్నట్టే, వారు దొంగలు అన్నాడు గీతలో.

అందువల్ల ఈ ప్రకృతి వనరులను త్యాగబుద్ధితో వాడండి. అంటే ఇష్టం వచ్చినట్టు వాడి నాశనం చేయకండి, వృధా చేయకండి అంటుంది ఈశావాస్యోపనిషద్ .  హిందూ ధర్మానికి ఇతర మతాలకు ఇక్కడే పెద్ద తేడా ఉంది. హిందూ ధర్మం ప్రకృతిపై మనిషికి విశేష అధికారాన్ని అంగీకరించదు. ఈ సృష్టి మొత్తం భగవంతుని సొత్తు. ఆయన ఎంతవరకు అనుమతించాడో, అంతవరకే దీన్ని వాడుకోవాలి. ఇతర మతాల్లో అలా కాదు. ఈ ప్రకృతి, జంతువులు, పక్షులు, భూగోళం, ఖనిజాలు ఇవన్నీ మనిషి అనుభవించడానికి, దోచుకోవడానికి ఉన్నవే. అవి మనిషికి సర్వాధికారాన్ని కట్టబెట్టాయి. అందుకే ఆంగ్లేయులు ప్రపంచం మీద పడి దోచుకున్నారు, అమెరికాను, అఫ్రికాను, భారత్‌ను, ఇతర దేశాలను నాశనం చేశారు.

ఈ రోజుకు ప్రపంచంలో జరుగుతున్న అభివృద్ధిలో ఇది కనిపిస్తోంది. అభివృద్ధి అంటే అర్దం ప్రకృతి వనరులను పూర్తిగా ఖాళీ చేయడమే, ప్రకృతిని, జీవజాలాన్ని నాశనం చేయడమే, ఇష్టం వచ్చినట్టు భూమిని దోచుకోవడమే. ఇది పశ్చిమ దేశాలవారి భావజాలం. మనకూ అంటించిపోయారు. కానీ వేదం ఇందుకు వ్యతిరేకం. వేదం ఎప్పుడు ఈ జగత్తునకు అధికారి ఈశ్వరుడే. దీనిపై దోపిడి ..... పాపం అంటుంది. కానీ మనం ఎంతమేర ఆచరిస్తున్నాం?

To be continued...........

Originally published : 12-March 2014
Re edited 1st time : 04-March 2015

No comments:

Post a Comment