Sunday, 9 March 2014

మత మార్పిడులను అరికట్టాలి.

భారతదేశానికి హిందూ ధర్మానికి తేడా లేదు. భారతదేశనికి ఏదైనా గర్వకారణంగా చెప్పుకుంటే, దాని మూలం హిందూసంస్కృతిలోనే ఉంటుంది. హిందూ సంస్కృతిని పక్కనపెట్టి భారతదేశ గొప్పతనాన్ని గురించి చెప్పమంటే ఒక్క విషయం కూడా చెప్పలేరు. సున్నాను కనుక్కుని ఆర్యబట్టుడైనా, ఆయుర్వేద వైద్యశాస్త్రజ్ఞుడు శుశ్రుతుడైనా, మనం గొప్పగా చెప్పుకుంటున్న వారంతా హిందు విద్యావిధానంలో విద్యాభ్యాసం చేయడం వల్లనే, వేదవేదాంగాలను చదవడం వల్లనే అన్ని గొప్ప విషయాలను కనుగొన్నారు. భారతదేశ వైభవమంతా హిందూ ధర్మంలోనే ఉంది.

హిందూధర్మాన్ని, తమ మాతృభూమి భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం 800 ఏళ్ళుగా పొరాటం చేసిన ఘనత హిందువులకే దక్కుతుంది. మనం దేశం మీద పడ్డ అరబ్బులు ఎన్నో గ్రంధాలు తగలబెట్టినా, ఆంగ్లేయులు ఎన్ని ఆరచకాలకు పాల్పడినా హిందూ సమాజం తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంది. ఎంత మంది ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా, భారతదేశం ఏనాడు సంపూర్ణంగా విదేశియుల చేతిలోకి వెళ్ళలేదు. క్రైస్తవులైన ఆంగ్లేయులు అమెరికా వెళ్ళారు, అక్కడ ఉన్న రెడ్ ఇండియన్లను ఊచకోత కోసి, దోపిడికి పాల్పడ్డారు, తమ మతప్రచారం చేసుకున్నారు. ఆప్రికా వెళ్ళారు, అక్కడ కూడా అదే పరిస్థితి. 'మొదటవారు వచ్చినప్పుడు మా చేతుల్లో భూములు ఉన్నాయి, వారి చేతిలో బైబిలు ఉంది, రండి! కలిసి ప్రార్ధన చేద్దాం అన్నారు, అందరం కలిసి ప్రార్ధన చేశాం, కళ్ళు తెరిచి చూసేసరికి భూములు వాళ్ళ చేతిల్లోకి వెళ్ళాయి, బైబులు మా చేతిలోకి వచ్చింది' అని ఆప్రికా వాళ్ళే చెప్పుకున్నారు. మన దేశంలోనూ అదే జరిగింది. అంగ్లేయులు వచ్చేసరికి మన దేశంలో దళితుల వద్ద కూడా వందల ఎకరాల భూమి ఉండేవి, వాటిని లాక్కుని, వారిని పీడించి, పేదలను చేసి, స్కాటిష్ మిషనరీ దళిత అన్ని పదాన్ని ప్రయోగించి, తమ చేత మోసగింపబడ్డవారిని దళితులనీ, వారి పేదరికానికి, దరిద్రానికి కారణం వారి మస్థులైన అగ్రవర్ణ హిందివులేననీ, హిందువుల్లో భేదాభిప్రాయాలను సృష్టించే ప్రయత్నం చేశారు. బూటకపు ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని లేవదీసి, భారతీయుల్ని ఆత్మనూన్యతకు గురిచేసి, మతమార్పిడి చేసేందుకు కుట్రపన్నారు. అయినా అన్నిటిని తట్టుకుని భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.

కానీ అప్పటికి సంతృపి చెందని విదేశీశక్తులు, దేశాలు భారతదేశాన్ని ముక్కలు చేయడానికి, హిందు ధర్మాన్ని నాశనం చేయడానికి, తమ మత ప్రాబల్యాన్ని పెంచుకోడానికి, రాజ్యాధికారం పొంది భారతదేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టేందుకు ఎత్తులు వేస్తూనే ఉన్నాయి. దానికి ప్రధాన ఊతం మత మార్పిడిలే. ప్రతి ఏటా కొన్ని లక్షల మందిని మతమార్పిడి చేయాలని మిషనరీలు బహిరంగంగా టార్గెట్ పెట్టుకున్నాయి.

భారతీయులు, హిందువులు ఇప్పటికైనా మేల్కోవాలి. దేశంలో జరుగుతున్న అక్రమ మతమార్పిడులను అడ్డుకోవాలి. ఇతర మతస్థుల మతాచరణను గౌరవిస్తూనే, వారినే ఆదరిస్తూనే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. తోటి హిందువులను రక్షించాలి. హిందువులు, జైనులు, సిక్కులు ఐక్యమవ్వాలి. భారతీయులైన మన ముస్లింలను, మన క్రైస్తవులను విదేశీ కుట్రల్లో పావులు కాకుండా కాపాడుకోవాలి. మత మార్పిడిలను అరికట్టాలంటే ప్రతి హిందువు హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలి, అన్ని కులాల వారిని ఆదరించాలి.

హిందూ ధర్మం శాశ్వతంగా వర్ధిల్లాలి.

జై శ్రీ రాం
జై హిందూ

10 comments:

 1. >>అంగ్లేయులు వచ్చేసరికి మన దేశంలో దళితుల వద్ద కూడా వందల ఎకరాల భూమి ఉండేవి

  Haaaa Haaaa Haaaaaaaaaaaaaaaaaaaaaaa Haa Ha

  ReplyDelete
 2. అదే నిజం, మీరు ఆంగ్లేయులు రికార్డులు పరీశీలించండి.

  ReplyDelete
 3. ఐతే దలితులు వందల ఎకరాల ఆసాములై వుండి, అంటరానివారుగా ఎలా ఐపొయారో చెప్పండి. ఆంగ్లేయుల రికార్డ్స్ కూడా ఇక్కడ పబ్లిష్ చెయ్యగలరు.

  ReplyDelete
 4. మీ రిప్లై కోసం ఎదురుచూస్తున్నాను..

  ReplyDelete
 5. మీరొక విషయం మర్చిపోతున్నారు. అంటరానితనానికి, దళితుల వద్ద భూములకు ఏ మాత్రం సంబంధం లేదు.
  ఈ వీడియో చూడండి.
  https://www.youtube.com/watch?v=nCb2creSdlM

  ReplyDelete
 6. ఐతే ఆంగ్లేయులు వొచ్చాకే మన దగ్గర అంతరానితనం, పంచమ వర్ణం పుట్టాయంటారు. నేను ఇంకా లొతుకు చర్చను తీసుకు వల్లడానికి సిద్దమే. మీరు కూడా సిద్దమైతే చెప్పండి. చర్చ మొదలు పెడదాము. కానీ చర్చ వితండవాదం కారాదు

  ReplyDelete
 7. మీరు రాజీవ్ దీక్షిత్ ఉపన్యాసాలు వినండి, ఎం.వి.ఆర్.శాస్త్రి గారు భారతదేశ చరిత్రకు సంబంధిచిన పుస్తకాలు చదవండి. ఆ తర్వాత చర్చిద్దాం. లేకపోతే చర్చ సరిగ్గా సాగదు.

  ReplyDelete
 8. మీరు పొరపడుతున్నారు.. దాదాపుగా ఈ మధ్య కాలంలో వొచ్చినవన్నీ చరిత్ర వక్రీకరణలే.. మీరు చదవాల్సింది ఆది గ్రంధాలు మాత్రమే. వుదాహరణకు, మొదటి రామాయణాన్ని వాల్మికి రాయలేదు. అది వెరే దేశాలనుంచి తీసుకోని మన నేటివిటి కి తగ్గట్టు మార్చుకొన్నది

  ReplyDelete
 9. మీరు ఇతర దేశాలవారు, ఇతర మతాలవారు రాసిన విషపు రాతలు, అబద్ధపు రాతల చేత బాగా ప్రభావితం అయినట్టు ఉన్నారు, రాముడి ఉనికి నిజమని ఋజువులున్న కాలంలో రామాయణం వేరే దేశం నుంచి వచ్చిందని మీరు అనడం ఎంత హాస్యాస్పదం. మీ మీద ఇతర మతాల ప్రభావం అధికంగా ఉందనుకుంటాను. మీకు పరమాత్ముడు సన్మార్గము చూపించుగాకా.

  ReplyDelete
 10. ఇక్కడ రాముని ఉనికి గురించి మట్లాడలేదు నేను..అలాగని ఇతరమతాలని కూడా నేనేం వెనుకేసుకు రావట్లేదు. సరే! మీరు నమ్మింది, లేదా మీకు తెలిసిన ఒకరిద్దరు రాసిన పుస్తకాలలోనే అంతా వుంది అనుకుంటే నెను కూడా వాదించనులేండి..

  ReplyDelete