Thursday 27 March 2014

హిందూ ధర్మం - 40 (శౌచం)

శౌచం కలిగి ఉండడమంటే అది కేవలం బాహ్యమైన శౌచం అవ్వకూడదు. రోజు స్నానం చేయడం వలన శౌచం రక్షించబడుతుంది అంటే అది అవివేకమే. ధర్మం ఎప్పుడు కేవలం బాహ్యమైన కర్మల గురించి చెప్పదు. శౌచం మానసిక శౌచం అవ్వాలి. గంగానదిలో స్నానం చేయడం మంచిదే. అలా అని మనసు నిండా కుళ్ళు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలతో నిండిన వ్యక్తి, స్వార్ధపరుడు గంగలో మునిగినా, మానస సరోవరంలో మునిగినా అతను శుద్ధిని పొందాడని చెప్పలేం! శౌచం ఆంతరంగికమై ఉండాలి. అంతఃకరణ (మనసు, బుద్ధి మొదలైనవి) శుద్ధి గురించే ధర్మం ప్రధానంగా చెప్తుంది. శౌచం అంటే మనసుయందు కూడా పవిత్రభావనలు కలిగి ఉండడం.

మడి కట్టుకుని పూజ చేస్తాం. మడి వెనుకున్న అర్ద్దం కూడా శౌచమే. మడి అంటే విప్పిన బట్టలను, ఇతర వస్తువులను తాకకుండా ఆ కాసేపు బాహ్యంగా పవిత్రంగా ఉండడం ఒక్కటే కాదు. మనసులో ఇతర ఆలోచనలను నిగ్రహంచడం మడిలో ప్రధానం. ఆ సమయంలో మనసులో భగవత్ ధ్యానం చేయడం, స్తోత్రాలు చదవడం చేయాలి. ఆ విధంగా చేసిన వంటనే నివేదనకు పనికివస్తుంది. మనం తినే ఆహారం మనసుపై ప్రభావం చూపిస్తుంది. మనం వంట చేసే సమయంలో ఏం ఆలోచిస్తామో అదే మన ఆహారంలో చేతి, శరీరంలోకి చేరుతుంది. వంట చేస్తున్న సమయంలో హింసను ప్రేరేపించే సన్నివేశాలు, మటలు గుర్తుకు తెచ్చుకోవడం వలన, చికాకుతొ చేయడం వలన అది తినేవారిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి అది విషంగా మారుతుంది కూడా. అందుకే వంటను మడితో చేసి, దేవునికి నివేదన చేసి భుజించమన్నారు. మంచి భావనలతో చేసిన వంట, మనసును మంచిదారిలో నడిపిస్తుంది. అదే పరమాత్మను స్మరిస్తూ చేస్తే, పరమాత్ముడు మరణంలేనివాడు కనుక, ఆ ప్రభావతో తినేవారికి అమృత తత్వం ప్రాపతిస్తుంది. అదే మడిలోని ప్రధానం ఉద్ద్యేశం కూడా. శౌచం యొక్క ప్రధానం ఉద్ద్యేశం ఇదే. అంతఃకరణ శుద్ధిలేని బాహ్యమైన ఆచారం వృధా అనే చెప్పాలి.

మనం నడుస్తున్నా, కూర్చున్నా, ఎల్లప్పుడు పవిత్ర భావనలతో ఉండడమే శౌచం. ఒకరిని చూసి కుళ్ళుకోకపొవడం, ఇతరుల అభివృద్ధిని చూసి ఏడువకపోవడం, ఒకరి గురించి చెడ్డగా మాట్లాడకపోవడం కూడా శౌచం క్రిందికే వస్తాయి.

To be continued..........  

No comments:

Post a Comment