Tuesday 25 March 2014

హిందూ ధర్మం - 38 (అస్తేయం-5)

వేదం చెప్పినదానికి విరుద్ధంగా చెప్పడం, జనాన్ని తప్పు త్రోవ పట్టించడం, నమ్మించి మోసగించడం, వెన్నుపోటు పొడవడం వంటివి స్తేయం క్రిందికి వస్తాయి. వీటికి దూరంగా బ్రతకడం అస్తేయం.

ఇక అస్తేయం అన్నది కూడా త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. అంటే మనసులో కూడా మనది కానీ వస్తువులను దక్కించుకోవాలని కానీ, పొందాలనీ కానీ, అనుభవించాలని కానీ అనుకోకూడదు. అట్లాగే మాటల్లో కూడా. నాకు అది వచ్చి ఉంటే బాగుండేదండీ, వాడికి అంత ఆస్తి ఎందుకు, నాకు అందులో కాస్త ఇవచ్చు కదా, ఇలా మనం మనవి కాని వాటి గురించి బోలెడు మాటలు మాట్లాడుతాం. అవన్నీ మాట్లాడకపోవడం అస్తేయం. ఇక చేతల్లో. మనం దాని గురించి ముందే చెప్పుకున్నాం. ఒకరిని మోసగించాలనుకోవడం, ఒక వస్తువును దొంగిలించాలన్న ఆలోచన మనసులో చేసినా, అది దొంగతనం క్రిందకే వస్తుంది. కేవలమ బాహ్యప్రవర్తనే కాదు, ఆలోచనలు కూడా అదుపులు చేసుకోవాలని ధర్మం చెప్తుంది.

ఒకరికి సంబంధిచిన వస్తువు మీకు కావాలనీ మీ మనసు కోరగానే దాన్ని నిలువరించండి. నువ్వు చేస్తున్నది తప్పు. ఇతరుల వస్తువులను ఆశిచకూడదు, అది పాపం, అవసరమైతే మనం సంపాదించుకోవాలి అని చెప్పండి. ఈ అస్తేయం అన్న గుణం హిందువులకు ఉన్నది కనుక చరిత్రలో హిందూదేశం ఏనడు ఇతర దేశాలపై దండయాత్ర చేయలేదు, ఒకరి సంపదను కొల్లగొట్టలేదు.

తదుపరి లక్షణం శౌచం.

To be continued..........

No comments:

Post a Comment