Friday 3 April 2015

గ్రహణం జాగ్రత్తలు

సూర్యగ్రహణానికి 12 గంటల ముందు నుంచి, చంద్రగ్రహణానికి 9 గంటల ముందు నుంచి ఆహారం తినకూడదు.

చిన్నపిల్లలు, ముసలివారు, రోగులకు సడలింపు. వారు మాత్రం గంట ముందు నుంచి ఆహారం తినడం నిషిద్ధం.

త్వరగా జీర్ణమయ్యే ఆహారం తినాలి.. తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది. గ్రహణసమయానికి ఆహారం అరిగిపోవాలి/ జీర్ణమవ్వాలి, కడపు ఖాళీగా ఉండాలి.

1980-83 మధ్య కాలంలో భారతదేశంలో గ్రహణసమయంలో పాటించే ఆచారాల మీద పరిశోధన చేశారు విదేశీయులు. ఆ తర్వాత ఆ ఫలితాలు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. వారి పరిశోధనలో తేలిందేమిటంటే హిందువులు గ్రహణ సమయంలో పాటించే ఆచారాలు ఎంతో శాస్త్రీయమైనవి, ఆరోగ్యప్రదమైనవి. గ్రహణ సమయంలో వచ్చే అతినీలలోహిత కిరణాలు మానవులకు చేటు చేస్తాయి. ఆహారపదార్ధాలను విషతుల్యం చేస్తాయి. అటువంటి ఆహారపదార్ధాలను స్వీకరించడం వలన దీర్ఘకాలంలో దుష్ఫలితాలుంటాయి. గ్రహణ కిరణాలు సోకకుండా ఉండేందుకు భారతీయులు వాడే ధర్భ ఎంతో శక్తివంతమైనది. అది భూమికి నిటారుగా నిలబడి పెరుగుతుంది. సూర్యశక్తిని అధికశాతం గ్రహిస్తుంది. గ్రహణ సమయంలో ఈ దర్భలను ఆహారపదార్ధాల మీద, నీటి బిందెలమీద వేయడం వలన గ్రహణ కిరణాల దుష్ప్రభావాన్ని అడ్డుకుంటుంది. ఒక రాగితీగ ఇంటిని పిడుగుపాటు నుంచి రక్షించిన చంధంగా దర్భ అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుందని వారి పరిశోధనలో తేలింది. వారు కొత్తగా చెప్పిందేమీ లేదు. ధర్మశాస్త్రం చెప్పిందన్నే ధృవపరిచారు.

ఇంట్లో ఉన్న పచ్చళ్ళ మీద, ఇతర ఆహార పదార్ధాల మీద దర్భలు వేయండి. అన్నం, కూర, పప్పు మొదలైన ఆహార పదార్ధాలు ఏవీ మిగల్చకూడదు.  గ్రహణసమయంలో ఆహారం స్వీకరించకూడదు. జైపూర్ లో జంతు ప్రదర్శనశాలలో జంతువులకు గ్రహణ సమయంలో మాంసం పెట్టి పరీక్షలు నిర్వహించారు. గ్రహణసమయంలో కౄరజంతువులు కూడా ఆహారం ముట్టుకోలేదు. (ఈ విషయాన్ని తొలి తెలుగు మహిళా జ్యోతిష్యురాళు, శ్రీమతి సంధ్యాలక్ష్మీగారు గోపురం కార్యక్రమంలో ప్రస్తావించారు.)

‪#‎గ్రహణం‬ తర్వాత తలస్నానం తప్పక చేయండి.

గ్రహణ సమయంలో వచ్చే కిరణాలు గర్భస్థ శిశువుకు మంచివికావు. అందువల్ల గర్భిణీ స్త్రీలు గ్రహణసమయంలో బయటకు రాకపోవడం మంచిది. కదలకుండా పడుకోవాలి, అటు ఇటు తిరగకూడదన్న నియమాలేమీ లేవు. ఏ విధంగా కూడా గ్రహణకిరణాలు సోకకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లో నిరభ్యంతరంగా తిరగవచ్చు. ఒకవేళ బయటకు వెళ్ళవలసివస్తే తెల్లని వస్త్రం శరీరమంతా కప్పుకుని, గ్రహణకిరణాలు శరీరం మీద పడకుండా ఉండేలా చూసుకోవాలి.

గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి. గ్రహణానంతరం నది లేదా కాలువలో స్నానం చేయగలిగితే శ్రేష్టం. గ్రహణం విడిచేవరకూ నిద్రించకూడదు. గ్రహణ సమయంలో స్త్రీపురుష సమాగమం తగదు. గ్రహణసమయంలో భగవన్నామస్మరణ చేయాలి, గురువు ఉపదేశించిన మంత్రాన్ని తప్పకుండా జపం చేయాలి. గ్రహణసమయంలో చేసే జపం, దానం, పూజ అనేక రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తాయి. మంత్రోపదేశం లేనివారు స్తోత్రాలు పారాయణ చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక సాధనకు గ్రహణం అత్యంత అనుకూలసమయం. భగవంతుడి స్తోత్రాలు, మంత్ర జపం చేయాలనుకునేవారు గ్రహాణానికి ముందు పట్టుస్నానం, గ్రహణం ముగిసిన తర్వాత విడుపుస్నాన చేయాలి. గ్రహణం తర్వాత ఇల్లు, పుజాగది శుభ్రం చేసుకుని, దీపారాధన చేయాలి. గ్రహణం అంటే భయపడిపోయేలా సినిమాల్లో చూపించారు, కానీ నిజానికి గ్రహణం అత్యంత పుణ్యసమయం, దాన్ని సద్వినియోగం చేసుకోండి.

Originally Published: Lunar eclipse October 2014
1st Edit: 03-April-2015

8 comments:

  1. ధన్యవాదములు చాల మంచి సలహాలు ఇచ్చారు. అందరు ఈ నియమాలు పాటించాలని కోరుకుంటున్నాము

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు, శివార్పణం అండి

      Delete
  2. చంద్రగ్రహణం రోజున పెళ్లి ముహూర్తం పెట్టవచ్చా

    ReplyDelete
    Replies
    1. గ్రహణంలో పెళ్లి చేసుకోవచ్చా

      Delete
    2. గ్రహణంలో పెళ్లి చేసుకోవచ్చా

      Delete
  3. పెళ్ళే పెద్ద గ్రహణం :)

    ఆ పై గ్రహణం లో పెళ్లి చేసుకుంటే మరీ ఏమీ కాదను కుంటా :) జేకే !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. తొలుత అవిఘ్నమస్తు అనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ అని అంటారు దాని అర్థమును వివరించగలరు

      Delete
  4. అసలు గ్రహణానికి మానవునికి ఈ ఏమిటి సంబంధం

    ReplyDelete