Saturday 26 September 2015

ఇండోనేషియాలో గణపతి గురించి 2 అద్భుత విషయాలు

ఇండోనేషియా ఇప్పుడు ముస్లిం దేశమైనా, వారు తమ హిందూ వారసత్వాన్ని, గతాన్ని గర్వంగా చెప్పుకుంటారు. ఆ విషయంలో ఎక్కడా సందేహించరు. ఇండోనేషియా కరెన్సీ మీద ముద్రించిన గణపతి చిత్రమిది. ఇదేకాక అక్కడ అనేక ప్రదేశాల్లో హిందూ సంస్కృతిని ప్రతిబింబించే ఆకృతులు, శిలాఖండాలను ప్రదర్శనకు ఉంచుతారు.

ఇండోనేషియా ప్రజలు గణపతిని విద్యలకు, జ్ఞానానికి, సంపదలకు అధిదేవతగా పూజిస్తారు. ఈ కారణంగానే అక్కడి ప్రఖ్యాత విశ్వవిద్యాలయమైన బన్‌డుంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోగో మరియు ట్రేడ్‌మార్క్ మహాగణపతే. ఆ విశ్వవిద్యాలయం చిరునామా కూడా గణేశ రోడ్ నెం.10, బన్‌డుంగ్, వెస్ట్ జావా. ఇదిగో ఈ చిత్రం చూడండి.

కావాలంటే మీరే ఆ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ పరిశీలించండి. http://www.itb.ac.id/
ఆ లోగో ని జాగ్రత్తగా గమనించండి. ఆగమాలు చెప్పిన గణపతి రూపమే దర్శనమిస్తుంది. వారు కూడా అదే అంటారు. గణపతి చేతిలోని విరిగిన దంతం త్యాగానికి ప్రతీకయట. విద్యార్ధులు విద్య కోసం సుఖాలను త్యాగం చేసి కష్టపడాలని ఇందులోని ఒక సందేశం. మిగితా ఆయుధాలు జ్ఞానానికి, స్థిరత్వానికి ప్రతీకలట.
జావా ఒకప్పుడు గాణాపత్యభూమి అని చెప్తారు. అక్కడ గాణాపాత్యం అధికంగా ఉండేది.


No comments:

Post a Comment