వైదిక విజ్ఞానాన్ని రక్షిచడంలో ఛంధస్సు ఎంతో ఉపయోగపడుతుంది. యజ్ఞాల్లోనే కాక వైదిక గ్రంధాల యందు ఎటువంటి మార్పులు, చేర్పులు జరగకుండా చూడటం, జరిగినవాటిని పసిగట్టడం, దోషాలను దిద్దడానికి ఇది సహాయపడుతుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ. భారతదేశాన్ని అక్రమంగా తమ గుప్పిటలోనికి తీసుకున్న ఆంగ్లేయులు, తమ మత ప్రచారం కోసం ఈ దేశపు సంస్కృతిని, చరిత్రను నాశనం చేయడానికి ఎంతో ప్రయత్నించారు. అందులో భాగంగా చరిత్రను వక్రీకరించారు. సుమారు 3000 సంవత్సరాల చరిత్రను తొక్కేశారు. ఎందరో రాజులు, కవులు, శాస్త్రజ్ఞుల కాలాన్ని తగ్గించి వేశారు. అలాంటిదే ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రజ్ఞుడైన ఆర్యభట్టు విషయంలో జరిగింది. ఆర్యభట్టు కలియుగం 360 (క్రీ.పూ.2742)వ సంవత్సరంలో జన్మించనట్టుగా పురాణాలు నిర్ధారించాయి. ఆర్యభట్టు కూడా ఈ విషయాన్ని ఆర్యభట్టియం అనే గ్రంధంలో స్వయంగా తానే చెప్పుకున్నాడు. ఆర్యభట్టీయం కాలక్రమపాదంలోని ఈ శ్లోకాన్ని కోట వేంకటాచలం తమ 'భారతీయ శకములు' అనే గ్రంధంలో ఉటంకించారు.
షష్ట్యబ్దానాం షడ్భిః యదావ్యతీతాఃత్రయశ్చ యుగపాదాః
త్ర్యధికావింశతిరబ్దాస్తదేవ మమజన్మనః అతీతాః
కలియుగమునందు 6 సార్లు 60 ఏళ్ళు గడిచినప్పటికి నాకు 20 ఏళ్ళు .......... అని ఆర్యభట్టు చెప్పుకున్నాడు. అంటే ఆర్యభట్టు కలియుగం 337 లో జన్మించారు. కానీ ఈ విషయం బ్రిటీష్ వారికి మింగుడుపడలేదు. ఆ సమయానికి భారతదేశంలో ఖగోళశాస్త్రం అభివృద్ధి చెందిందని చెప్పడం వారికి నచ్చలేదు. వారు భారతీయుల కోసం రాసిన బానిస చరిత్రలో క్రీ.పూ. నాటికి ఇంకా వేదాల రచనే పూర్తి కాలేదు. అలాంటిది అప్పటికి ఖగోళ శాస్త్రవేత్త భారత్‌లో జన్మించాడని చెప్తే, వారి చరిత్ర తప్పని తేలుతుంది. కలియుగ ప్రారంభ కాలాన్ని క్రీ.పూ.1900 కు కుదించాలని అనుకున్న విలియం జోన్స్ వంటివారికి, ఋగ్వేదాన్ని క్రీ.పూ. 1200 వ ఏట రాసి ఉంటారని భావించిన మాక్స్ ముల్లరి కి, ఆర్య్భట్టు క్రీ.పూ.2742 లో జీవించారని చెప్పడం కొరకరాని కొయ్యగా, అంగీకరించకూడిన సత్యంగా కనిపించింది. అందువల్ల వారు కలియుగం క్రీ.పూ.3102 లో ప్రారంభం కావడం, ఆర్యభట్టు కలియుగం 337 లో జన్మించడం అసత్యమని ప్రచారం చేశారు. ఎందుకంటే పాశ్చాత్య మత విశ్వాసాల ప్రకారం ఈ ప్రపంచం యొక్క సృష్టి క్రీ.పూ.4004 సంవత్సరంలో మాత్రమే జరిగింది. అంతకముందు ఏమీ లేదన్నది వారి మతగ్రంధాల సారం. అందువల్ల 18 వ శత్బాదపు పాశ్చాత్య చరిత్రకారులు ఈ సృష్టి వయసు కొన్ని కోట్ల సంవత్సరాలని అంగీకరించలేకపోయారు. అందుకే లక్షలు, కోట్ల సంవత్సరాల క్రితం చారిత్రఘటనలను (పురాణాలను) కల్పితాలని ప్రచారం చేశారు. మనవారి మాటల కంటే ఆ తెల్లవారి మాటల మీదే అధికనమ్మకమున్న మనవారు కొందరు ఇంకో అడుగు ముందుకేసి, ఏకంగా ఆర్యభట్టీయంలోనే మార్పులు చేశారు. సుధాకరద్వివేది అనే వక్రీకరణకారుడు ఆర్యభట్టియంలోని శ్లోకాన్ని మార్చివేసి, ఆర్యభట్టును కలియుగం 3600 వ సంవత్సరానికి లాక్కొని వచ్చారు. పై శ్లోకంలో షడ్భిః - ఆరు చేత అనే పదాన్ని షష్టిః - అరవై అని మార్చేశాడు. క్రీ.శ.18 వ శతాబ్దంలో వ్రాతప్రతులను అచ్చువేయించి ఆయన చేసిన వక్రీకరణ, ఘోరమైన తప్పకు కారణమైంది. క్రీ.పూ.28 వ శతాబ్దికి చెందినవాడైన ఆర్యభట్టు క్రీ.శ.6 వ శత్బాది వాడనే భ్రమ వ్యాపించింది.
ఆర్యభట్టు రాసిన శ్లోకం ఛంధోబద్ధం. అందువల్ల అందులో మార్పులు చేయడం అసాధ్యం. షడ్భిః అన్న పదానికి 6 చేత గుణించడం అనే అర్దముంటే, షష్టిః అనే పదానికి 60 అనే మాత్రమే అర్దం వస్తుంది. కానీ 60 చేత గుణించడమని మాత్రం రాదు. 60 చేత అని చెప్పడానికి షష్టిభిః అని ఉండాలి. కానీ అలా అని షడ్భిః బదులు షష్టిభిః అని మారిస్తే, పద్యంలో ఒక అక్షరం ఎక్కువైపోతుంది, అప్పుడు ఛంధస్సు దెబ్బతింటుంది. అందుకోసమే షష్టిః గా మార్చాడు ద్వివేది. కానీ టియస్ నారాయణ శాస్త్రి అనే జాతీయచరిత్రకారుడు దొంగను పట్టుకున్నారు. ఏజ్-ఆఫ్-ఆదిశంకర అనే తన గ్రంధంలో ద్వివేదిని కడిగేశారు శాస్త్రిగారు. దక్షిణభారతదేశంలోని వ్రాతప్రతులన్నింటిలో షడ్భిః అనే ఉంది కానీ, ఎక్కడా షష్టిః అనే లేదని నిరూపించి నిలదీశారు. ఇప్పటికి వందేళ్ళు గడించినా, ద్వివేది నుంచి కానీ, ఆయన మిత్రులు, అనునూయుల నుంచి కానీ సమాధానం రాలేదు. ఇలా ఒక్క అక్షరం కూడా మార్చడానికి లేకుండా, కొత్త అక్షరం చేరిస్తే పట్టుకునే విధంగా, ప్రతుల్లో మార్పులు చేస్తే, అర్ధరహితం అయ్యేవిధంగా ఉంటాయి ఛంధోబద్ధమైన రచనలు. ఈ విధంగా ఛంధస్సు వైదిక గ్రంధాలను కాపాడుతోంది.
ఈ మధ్య క్రైస్త్వ మిషనరీలు, ఇస్లాం మతమార్పిడి కారులు కూడా వైదిక రచనల్లో కొత్త శ్లోకాలను చొప్పించి, సనాతనగ్రంధాల్లో ఏసు, మహమ్మద్ ఉన్నారని మభ్యపెట్టి మతమార్పిడి చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. హిందువులందరి దగ్గర వేదాలు ఉండవు కనుక, వేదంలో ఫలాన చోట ఇలా ఉంది, ఫలాన చోట మా ప్రవక్త గురించి అలా ఉందని మాయమాటలు చెప్తున్నారు. కానీ వారు చూపిన శ్లోకాలను వైదిక ఛంధస్సు తెలిసిన పండితుని వద్ద చూపిస్తే, అసలు గుట్టు బయటపడుతుంది. వేదం మొత్తం ఛంధోబద్ధంగా ఉంటుంది. కానీ వీరు కల్పించిన శ్లోకాలకు ఛంధస్సు ఉండనే ఉండదు. ఆ శ్లోకాలు చదివిన పండుతులకు ఎక్కడ లేని నవ్వోస్తుంది. వైదిక ఛంధస్సు నేర్చుకోవడం చాలా కష్టం. కానీ మతమార్పిడి కోసం రక్తబలి, రక్తతర్పణం అంటూ కొన్ని శ్లోకాలని తయారుచేసి, వాటిని ఆ వేదంలో అక్కడ ఉంది, ఈ వేదంలో ఇక్కడ ఉందంటూ చెప్పి వేదాల్లో ఏసును చూపే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా బూటకం. వేదాల్లో ఏసు లేడు, మహమ్మద్ లేడు. ఇటువంటి అనేక విషయాల్లో తప్పులను పట్టుకోవడానికి, నిజానిజాలను తెలుసుకోవటానికి ఛంధస్సు ఇప్పటికీ ఉపయోగపడుతోంది.
To be continued ...........
ఈ రచనకు సహాయపడిన గ్రంధం - తంగేడుకుంట హెబ్బార్ నాగేశ్వరరావు గారి 'తరతరాల భరతజాతి. చరిత్రలొ వక్రీకరణలు... వాస్తవాలు'

No comments:
Post a Comment