Monday, 28 September 2015

హిందూ ధర్మం - 177 (వ్యాకరణం)

వ్యాకరణం అనే వేదాంగాలలో ముఖ్యమైనది. ఇది వేదానికి నోరు వంటిది. వ్యాకరణము అనే పదమే 'శబ్దోత్పత్తి, శబ్ద లక్షణములను తెలిపే ఉపకరణము' అనే నిర్వచనాన్ని ఇస్తుంది. వైదికమైన శబ్దములు ఎలా ఏర్పడ్డాయి, వాటి మూలం ఏమిటి, కొత్తగా ఉపయోగించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి, ఏ అక్షరాలను ఎలా కలిపితే, సరైన అర్దం వస్తుంది మొదలైన అనేకానేక విషయాల గురించి వ్యాకరణం వివరిస్తుంది. వ్యాకరణం గురించి అనేకమంది మహర్షులు వేల ఏళ్ళ క్రితమే వివరణాత్మకమైన గ్రంధాలను రాసినా, కాలక్రమంలో వాటిన్నంటిని భరతజాతి కోల్పోయింది. ప్రస్తుతం వ్యాకరణానికి 3000 ఏళ్ళ క్రితం పాణిని మహర్షి రాసిన అష్టాధ్యాయి గ్రంధమే సప్రమాణికం అయింది. దానికే పతంజలి మహర్షి మహాభాష్యం రాశారు. పాణిని అష్ఠాధ్యాయిలో వైదిక, అవైదిక పదాలను గురించి చర్చించారు. దీని పతంజలి మహర్షి రాసిన మహాభాష్యం ఎంత ప్రామాణికం అంటే ఎక్కడైన సూత్రాలు, వార్త్తికలు మరియు మహాభాష్యం మధ్య అభిప్రాయ బేధాలు కలిగితే, అప్పుడు మహాభాష్యంలో చెప్పబడ్డ దాన్నే ప్రామాణికంగా స్వీకరిస్తారు.

ప్రపంచంలో ఏదైనా పూర్తి సైంటిఫిక్ భాష ఉన్నదా? అనే ప్రశ్న ఉదయిస్తే, దానికి సంస్కృతం ఒక్కటే సమాధానం. సంస్కృతంలో ప్రతి పదం, అక్షరము ఎలా ఏర్పడిందన్న దానికి వివరణ ఉంటుంది. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ మాదిరిగా వ్యాకరణం సంస్కృతానికి శబ్ద ఇంజనీరింగ్ మరియు Science of word building.

ఇప్పటి పిల్లలకు మన పుస్తకాలలో పాణిని అనే పేరు కనబడదు. ప్రపంచంలో అందరు కంప్యూటర్ సైన్సు వారికి ఆ పేరు సుపరిచితం. ప్రపంచ భాషలలొ సంస్కృతమునకు గల ప్రత్యేక స్థానమునకు కారకుడు పాణిని. పంచతంత్రం ఆయనను ముని అంటుంది. ఆయన లేకపొతె నాటికీ నేటికీ భాషాశాస్త్రమే లేదు. ఆయన కాలం మూడు వేల సంవత్సరాలకు ముందే. పుట్టిన స్థలము గాంధారదేశము (నేటి వాయువ్య- పాకిస్తాన్). ఆయన వ్యాకరణ గ్రంధం 3959 సూత్రాల అష్టాధ్యాయి. భారతీయ తత్త్వ శాస్త్రములొ శబ్దమునకు, భాషకు ఉన్నతమైన స్థానము ఉంది. శబ్దాన్ని వాగ్దేవిగా, దేవతా స్వరూపముగా భారతీయులు ఆరాధిస్తారు.. వ్యాకరణమే అన్ని శాస్త్రాలకు మూలం.

వేదాన్ని అర్దం చేసుకోవటానికి వైదిక సంస్కృతాన్ని ఔపోసన పట్టడం ఎంతో అవసరం. దానికి వ్యాకరణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక పదం గురించి వివరించినప్పుడు దాని మూలం గురించి, దానికి జత చేసిన అక్షరాల గురించి వ్యాకరణం వివరిస్తుంది. పదం యొక్క మూలాన్ని ప్రకృతిని అని, దానికి జత చేసిన దాన్ని ప్రత్యయము అని అంటారు. పాణిని వ్యాకరణం సూత్రాల రూపంలో ఉంటుంది. వీటినే పాణిని మహేశ్వర సూత్రాలు అంటారు. ఇవి మొత్తం 14.

మహేశ్వర సూత్రాలు: 1(అ,ఇ,ఉ,ణ్),2 (ఋ,ఌ,క్) 3 (ఏ,ఓ,ఙ్) 4 (ఐ,ఔ,చ్) 5 (హ,య,వ,ర,ట్) 6 (ల,ణ్) 7(ఞ,మ,ఙ,ణ,న,మ్) 8 (ఝ,భ,ఞ్) 9 (ఘ,ఢ,ధ,ష్) 10 (జ,బ,గ,డ,ద,శ్) 11 (ఖ,ఫ,ఛ,ఠ,థ,చ,ట,త,వ్) 12 (క,ప,య్) 13 (శ,ష,స,ర్) 14 (హ,ల్)
(అ,ఇ,ఉ,ణ్) = అణ్ - string notation to represent the above sequences
(అ,ఇ,ఉ,ఋ,ఌ,ఏ,ఓ,ఐ,ఔ,చ్) = అచ్ = అచ్చులు
(హ,య,వ,ర,ల,ఞ,మ,ఙ,ణ,న,ఝ,భ,ఘ,ఢ,ధ,జ,బ,గ,డ,ద,ఖ,ఫ,ఛ,ఠ,థ,చ,ట,త,క,ప,శ,ష,స,ల్)= హల్ = హల్లులు
వీటిని ప్రత్యాహారాలంటారు. పాణిని సూత్రాలను స్వల్పాక్షరాలలో చెప్పడానికి ఇది ఉపయోగించాడు.

శివుడు తాండవానంతరం ముక్తాయింపులో ఢమరుకం మీద పధ్నాలుగు అక్షరాల ధ్వనులు మ్రోగించాడు. అవే శివసూత్ర జాలంగా ప్రసిద్ధికెక్కాయి. ఢమరుకం లోంచి వెలువడిన పదునాలుగు అక్షర ధ్వనులతో పాణిని ప్రఖ్యాత వ్యాకరణం రచించాడు.
నృత్తావసానే నటరాజ రాజో సనాదఢక్కామ్ నవ పంచ వారమ్
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధానేతద్విమర్శే శివ సూత్ర జాలమ్||
नृत्तावसाने नटराजराजो ननाद ढक्कां नवपञ्चवारम्।
उद्धर्त्तुकामो सनकादिसिद्धादिनेतद्विमर्शे शिवसूत्रजालम् ||

బ్రహ్మ మానసపుత్రులైన సనకసనందనాది సిద్ధులు ఈ శబ్దాలను గ్రహించి పాణిన్యాదులకు ప్రసాదించారు. అందుకే అక్షరాభ్యాసంలో ఓం నమః శివాయ, సిద్ధం నమః అని వీరిని స్మరించడం జరుగుతుంది.
పతంజలి, భర్తృహరి పాణిని తరువాత వ్యాకరణాన్నీ, శబ్ద శాస్త్రాన్నీ అభివృద్ధి పరచినవారు. పతంజలి మహాభాష్యం పాణిని రచనకు భాష్యమేకాక, వ్యాకరణాన్ని తత్త్వ శాస్త్ర స్థాయికి తీసుకొని వెళ్ళింది. పతంజలి యోగదర్శనానికి ఆద్యుడు. భర్తృహరి రచన వాక్యపదీయము.

To be continued .....................

సేకరణ: Vvs Sarma

No comments:

Post a Comment