Monday 21 April 2014

ఏప్రియల్ 22, ధరిత్రీ దినోత్సవం

సముద్రవసనే దేవి, పర్వత స్తన మండలే |
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వయే ||

సముద్రమును వస్త్రంగా అలంకరించుకుని, పర్వతములను స్తనములుగా కలిగిన ఓ విష్ణుపత్ని(శ్రీ మహా విష్ణు భార్యైన భూదేవి), నీ మీద నాకాలు మోపుతున్నందుకు నన్ను క్షమించు అని పై శ్లోకం అర్దం.

ప్రతి రోజు ఉదయమే నిద్రలేవగానే చదువాల్సిన రెండవ శ్లోకం ఇది. కాలు మోపడమే పెద్ద తప్పుగా భావించారు మన పూర్వీకులు. భూమిని తల్లిగా, భూమాతాగా సంబోధించిన మహోన్నతమైన భారతీయ సంస్కృతి మనది.

మన తాతాముత్తాతలు నడిచి, జీవించి, కలిసిపోయిన పరమ పవిత్రమైనది భూమి. దీనిని కలుషితం చేయడమంటే వారిని అవమానించడమే అన్నారు రెడ్ ఇండియన్లు.

సంస్కృత భాషలో గో శబ్దానికి చాలా అర్దాలున్నాయి. అందులో గో అంటే ఒక అర్దం భూమి. గోపాలకుడు (శ్రీ కృష్ణుడు) అంటే ఈ సమస్త భూగోళాన్ని పాలించేవాడు, రక్షించేవాడు అని కూడా అర్ధాలున్నాయి.

మన పురాణాలు, వేదాలు, ఇతిహాసాలన్నీ మనం భూమాతను అంతో గొప్పగా కీర్తించాయి. మన పూర్వీకులు అంతే గొప్పగా రక్షించుకుంటు వచ్చారు. మనం మన గత వైభవాన్ని మర్చిపోయాం, మన పూర్వీకుల మాటలను, సూక్తులను వదిలిపెట్టేశాం. పాశ్చాత్యదేశాల అభివృద్ధి నమూనా అందిపుచ్చుకున్నాం. అక్కడే వచ్చింది చిక్కంతా. వాళ్ళకు దోచుకోవడమే అబివృద్ధి, మనకు (భారతీయులకు) సంరక్షణే అబివృద్ధి. అందుకే వాళ్ళు సమస్త వనరులను నాశనం చేశ్తారు, మన పూజిస్తాం.

మారిన ఆలోచన విధానం, అభివృద్ధి నమూనా పర్యవసానం ఏమిటి?..................

భూమి మీద రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గత కొన్ని లక్షల సంవత్సరాల భూమి చరిత్రలో ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రతలే అధికం.

420 కోట్ల సంవత్సరాల భూగోళం గత 300 సంవత్సరాలలో గుడ్డిగా అభివృద్ధి పేరుతో చేసిన భీభత్సం కారణంగా రాబోయే 80 సంవత్సరాలలో బూడిద కాబోతోంది.

ఈ భూమి మీద ఉన్న సమస్త మానవజాతి అంతరించిపోతుంది, 2100 కల్లా ఈ భూమి మీద మానవుడు బ్రతికే పరిస్థితి ఉండదని పరిశోధనలు నోక్కి చెప్తున్నాయి.

మనం చేసే కాలుష్యం గ్లోబల్ వార్మింగ్(భూతాపం)కు కారణమవుతోంది. సమస్త భూగోళం వినాశనం దిశగా అడిగులేస్తోంది.

మన వారసులకు మనం చక్కటి ఆహ్లాదకరమైన భూమిని ఇవ్వవలసింది పోయి, శ్మశానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? ఇస్తే వాళ్ళు స్వీకరిస్తారా? భూగోళాన్ని పరిరక్షించే చర్యలకు ఎందుకు చేపట్టలేదని మనల్ని తిరిగి ప్రశ్నిస్తే? మనమేం సమాధానం ఇస్తాం?

ఏప్రియల్ 22, ధరిత్రీ దినోత్సవం మనకు ఈ విషయాలను గుర్తుచేస్తోంది. ప్రపంచదేశాలకు తమ పంధాను మార్చుకోమని చెప్తుంటే, మనకు మాత్రం మనం మరిచిపోయిన మన పూర్వసంస్కృతిని గుర్తుచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 172 దేశాలు ధరిత్రీ దినోత్సవం జరుపుతున్నాయి. మిగితా దేశాలకంటే భారతీయులకు భూమితో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. మన సంస్కృతి మనకు నేర్పింది పర్యావరణ పరిరక్షణే.  మన భూగోళాన్ని కాపాడుకోవడం కోసం చర్యలు చేపడదాం.

రండి మన భూమిని మనమే కాపాడుకుందాం.

No comments:

Post a Comment