Thursday 24 April 2014

హిందూ ధర్మం - 51 (సత్యం)

నిజాలు మాట్లాడే రోజులు కావండి ఇవి. ఇప్పుడు నిజాలు మాట్లాడేవాళ్ళు, నిజాయతీగా బ్రతికేవాళ్ళు సమాజంలో జీవించడం కష్టమని అనుకోను మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎవరి కోసం నిజాలు మాట్లాకుండా ఉండడమేమిటి? ఎవరి మెప్పుకోసమో అబద్ధాలు చెప్పడేమిటి? సత్యం అనేది ధర్మం. వ్యక్తిగతంగా ఆచరించవలసింది. మిమ్మల్ని భగవంతుని వద్దకు చేర్చేది సత్యమే. సమస్త స్మృతుల్లో చెప్పబడింది, ఋషుల చేత ఎలుగెత్తి చాటబడింది సత్యం. సత్యవ్రతాన్ని ఆచరించడం.

సత్య వద ధర్మం చర......సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం అంటూ విద్యాభ్యాసం ముగుసే సమయంలో గురువు శిస్యునికి భోధిస్తారు. సత్యాన్నే పలుకు, ధర్మాన్ని ఆచరించు ......... సత్యాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకు, ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టకు అని అర్దం. సమస్త విద్యల యొక్క ప్రాధాన సందేశం సత్యవంతులుగా బ్రతకడమే.

మంత్రానికి ప్రాణం సత్యం. ఎంత జపం చేసినా, ఎన్ని పూజలు చేసిన అబద్ధాలు మాట్లాడే వాడికి ఆ జపఫలితం రాదు, మంత్రం సిద్ధించదు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, నేను ఎప్పటి నుంచో మంత్రం జపిస్తున్నా కానీ ఫలితం లేదు లాంటి మాటలు చాలామంది మాట్లాడుతుంటారు. సత్యవంతుడు కానీవారికి మంత్రం పనిచేయదని గుర్తించరు.

అబద్ధాలు చెప్పడానికి నేర్పు కావాలేమో, తెలివి ఉండాలేమో, కానీ నిజాన్ని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. నిజాన్ని ఒప్పుకోలేకపోవడమే పిరికితనం. తెలివైనవాడు జీవితంలో పైకి రావచ్చు, అదృష్టం లేకపోతే పతనం కావచ్చు. కానీ ధైరవంతుడు జీవితంలో అన్నిటిని ఎదురుకుని నిలబడతాడు, గొప్ప స్థానానికి చేరుతాడు. ధైర్యమే బలం, పిరికితనమే బలహీనత. అందుకే స్వామి వివేకానందా బలమే జీవనం, బలహీనతే మరణం అన్నారు. నిజాన్ని అంగీకరించలేని వాడు నిరంతరం చస్తూనే ఉంటాడు. ధైర్యం బలాన్నిస్తే, సత్యం ధైర్యానిస్తుంది. సత్యవంతులే ధైరవంతులు, ధీరులు. అధ్యాత్మిక జీవితంలో పురోగతి సత్యపాలన మీదనే ఆధారపడి ఉంటుంది. కనుక జీవితంలో ప్రధానమైన లక్షణం సత్యవంతులుగా బ్రతకడం. అదే ధర్మం.

To be continued...........

No comments:

Post a Comment