Friday 11 April 2014

హిందూ ధర్మం - 46

భారతీయ ధర్మం ప్రకారం మన దైవసంతానం. ఋషుల వారసులం. అంతేకానీ పాపులం కాదు. మనది ఋషుల డి.ఎన్.ఏ. వాళ్ళ గొప్ప మేధాశక్తి మన జన్యువుల్లో ఇంకా సజీవంగా ఉంది. ధూమాపానం, మద్యపానం డి.ఎన్.ఏ ను నాశనం చేస్తాయి. డి.ఎన్ ఏ స్వరూపాన్ని సంపూర్తిగా మార్చి వేస్తాయి. అట్లాగే మత్తు పదార్ధాలు కూడా. ఫలితంగా మేధాశక్తి, బుద్ధి శక్తి నాశనమవుతుంది, ఇంద్రియనిగ్రహం సడలిపోతుంది. కనుక ఇటువంటి దురలవాట్లకు దూరంగా ఉండడం ధర్మాచరణకు ఉండవలసిన లక్షణం.

అట్లాగే చెడు సాంగత్యం ఎప్పుడూ ఉండకూడదు. దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. ఈ లోకంలో అత్యంత దుర్లభమైనవి, దైవానుగ్రహం ఉంటే తప్ప లభించనవి మూడు ఉన్నాయి. ఒకటి మానవజన్మ, రెండవది మోక్షం పొందాలి, పరమాత్మను చేరాలన్న తపన, మూడవది మహాపురుషులు, సాధుపురుషులతో స్నేహం, సహవాసం. భాగవతులు, భవద్భక్తులతో స్నేహం చేయడం వలన మనలో భక్తి ఏర్పడుతుంది. గురువులు, మహాపురుషుల భోధనలు, మాటలు వినడం వలన చిత్తశుద్ధి కలిగి, మనసు భగవంతుని గురించి తీవ్రంగా తపిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కలిగి, ఆత్మ పరమాత్మలో ఐక్యం అవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చిన ఇటువంటి మహాపురుషులతో స్నేహం వదలకూడదు. అట్లా సత్ సాంగాత్యం చేయడం ధీః.

యోగా, ధాన్యం మొదలైనవి ఆత్మశుద్ధిని కలిగిస్తాయి, రోగాలను తగ్గిస్తాయి. ధాన్యం, యోగా వలన క్షీణించిన డి.ఎన్.ఏ తిరిగి పూర్వస్థితిని పొందుతుందని, డి.ఎన్.ఏ.లో లోపాలు సవరించబడతాయని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు తెలుసుకొన్నారు. ఈ ప్రక్రియలు బుద్ధిని వృద్ధి చేస్తాయి.

నిత్యం ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడం, శుద్ధ జలాలను త్రాగడం, శుద్ధమైన గాలిని పీల్చడం మొదలైనవి కూడా ధర్మాచరణలో భాగమే అన్నారు భారతీయ గురువులు. ఇటువంటి లక్షణాలతో జీవంచడం 'ధీః'.

To be continued..........

No comments:

Post a Comment