Friday 13 May 2016

ధర్మరక్షణలో అదే స్పూర్తి - విద్యారణ్య భారతీ స్వామి

1336 లో విజయనగరాన్ని స్థాపించిన రాజ గురువులు శ్రీ విద్యారణ్య స్వామి వారు హంపిలో విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానాన్ని (పీఠాన్ని) స్థాపించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ పీఠం ధర్మప్రచారానికి, ధర్మరక్షణకు ఎనలేని కృషి చేస్తోంది. చరిత్రలో ఎన్నో సార్లు దేవాలయాలు ధ్వంసమై పూజలు ఆగిపోతే, ఎంతో ధైర్యంతో ఈ పీఠం వారే అక్కడకు తరలివెళ్ళి తిరిగి పూజాదికాలు మొదలుపెట్టారు. ఒకప్పుడు నిజాం పరిపాలన కొనసాగుతున్న తరుణంలో, తెలంగాణా రాష్ట్రం వ్యాస మహర్షి ప్రతిష్ట అయిన బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయంపై ఆధిపత్యం చెలాయించి, పూజాదికాలు ఆపివేశారు. ఆలయాన్ని ముసివేశారు. అప్పుడు అక్కడి ప్రజలు, తమను ఏ పీఠం రక్షిస్తుందా అని విచారించి, హంపికి చేరుకున్నారు. అప్పటి పీఠాధిపతి మతోన్మాదులకు భయపడకుండా, వీరికి అభయం ఇచ్చి, తిరిగి ఆలయంలో నిత్యక్రతువులను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాసరలో నిత్యం పుజాది కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం విద్యారణ్య స్వామి పరంపరలో 46 వ పీఠాధిపతిగా శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతీ మహాస్వామి పీఠాధిపత్యం వహిస్తున్నారు. సంవత్సరంలో 8 మాసాలను పూర్తిగా భారతదేశంలో 8 రాష్ట్రాల్లో సంచార యాత్రకు కేటాయించి, ధర్మ ప్రచారం చేస్తున్నారు. అలనాటి విద్యారణ్యులు ఏడాదిలో ఒక్క రోజు కూడా విడువకుండా ప్రతి రోజు ఒక అలాయానికి కుంభాభిషేకం నిర్వహించారు. ఎన్నో ప్రతిష్టలు చేశారు. అదే స్ఫూర్తిని వీరూ కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో దాదాపు కొత్తగా నిర్మించబడిన దేవాలయం, పురాతన ఆలయాల పురరుద్ధరణ, కుంభాభిషేకం వీరు చేతుల మీదుగానే జరుగుతాయి. ఇన్ని చేస్తున్నా, స్వామి నిరాడంబరులు. మీడియాలో ఉండాలని కానీ, పేరుప్రఖ్యాతుల కోసం కానీ ఎన్నడూ ప్రాకులాడలేదు. మీడియాను ఆమడ దూరంలో ఉంచుతారు.

పొలీసులు సైతం భయపడే విధంగా నక్సలైట్ల ప్రంతాల్లో కూడా వీరు ఏ భయం లేకుండా వెళ్ళి, అక్కడ కూడా ధర్మప్రచారం చేయడమే కాక, అక్కడున్న ఆలయాలను పునరుద్ధరిస్తున్నారు. వీరు ఎక్కడకు వెళ్ళిన, వీరితో పాటు వీరు పీఠం కూడా తరలి వెళుతుంది. దానికి నిత్యం పూజాదికాలు నిర్వహిస్తారు. దలితవాడల్లోకి, పూరి గుడిసెల్లోకి సైతం వెళ్ళి, అందరిని అక్కున చేర్చుకుంటున్నారు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి. ధర్మ రక్షణ, గోసంరక్షణ, ఆలయాల పునరుద్ధరణ, దేశసేవ, పర్యావరణ పరిరక్షణ స్వామి వారి లక్ష్యాలు.

జై విద్యారణ్య! జై జై విద్యారణ్య!
http://hampividyaranyamath.org/

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః || 

3 comments:


  1. Interesting; any idea why/how he is 57th in the lineage of adhishankara ? from the referred website ->

    He is 46th in the lineage from Sri Vidyaranya (the 12th peethadhipathi) and 57th from AdiShankracharya

    According to you 1336 is the starting point of this parampara ?

    zilebi

    ReplyDelete

  2. ok got it

    http://hampividyaranyamath.org/index.php/jagadgurus

    zilebi

    ReplyDelete
  3. ప్రజలమేలు కోరేవారికి భగవదాశీస్సులుంటాయి

    ReplyDelete