శివరాత్రి యొక్క ప్రాశస్త్యం గురించి లింగ, శివ పురాణాల్లో చకట్టి కధ ఒకటి ఉంది. (సంక్షిప్తంగా)
ఒకానొక సృష్టి ఆరంభ సమయంలో విశ్వమంతా శూన్యంతో నిండి ఉంది. నిజానికి అసలు విశ్వమే లేదు. అంతటా పరబ్రహ్మం నిండి ఉంది. ఆ బ్రహ్మ పదార్ధానికి చలి, వేడిములు తెలియవు. ఆది, అంతములు లేవు. శూన్యమంతా నీటితో నిండి ఉన్న ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆ నీటిపై యోగనిద్రలో ఉండగా, అతని బొడ్డు నుంచి ఒక పద్మం ఉద్భవించింది. అనేక రేకులు కలిగిన ఆ కలువ పుష్పానికున్న కాడ వేల సూర్యుల కాంతితో వెలిగిపోతోంది. ఆ పద్మం యొక్క కణాల నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. అతనికి చుట్టూ పద్మం తప్ప ఏమి కనిపించడంలేదు. దాంతో 'నేనెవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేనేమి చేయాలి? నేను ఎవరి పుత్రుడిని? నన్నెవరు సృష్టించారు?" అంటూ ప్రశ్నలు వేసుకుంటూ, ఆ కలువపూవ్వు మొత్తం తన ఉనికిని గురించి తెలుసుకునేందుకు వెతకసాగాడు.
తన ఉనికి తెలుస్తుందేమోనని ఆ పద్మం యొక్క మధ్యభాగాన్ని చేరుకోవడం కోసం ప్రయత్నించాడు. ఆఖరున ఆ పద్మం యొక్క కాడ ద్వారా క్రిందకు దిగి, ఆ పద్మం చుట్టు తిరుగుతూ ఒక 100 ఏళ్ళు గడిపాడు. కానీ దానికి యొక్క మధ్యభాగం కనబడలేదు. తన ఏ కణం నుంచైతే పుట్టాడొ, ఆ కణం దగ్గరకే వెళితే తన ఉనికి తెలుసుకోవచ్చునని, ఆ ప్రదేశాన్ని వెతకడంలో మరో వంద ఏళ్ళు తిరిగినా, సమాధానం దొరకక అలసిపోయాడు, విశ్రాంతి తిసుకుంటున్నాడు.
ఇంతలో ఓ బ్రహ్మ! తపస్సు ఆచరించు అన్న మాటలు వినపడగా ఒక 12 ఏళ్ళు తపస్సు చేయగా, శ్రీ మహా విష్ణువు నాలుగు భుజములతో, శంఖు, చక్ర, గదా, పద్మాలను ధరించి దర్శనమిచ్చాడు. బ్రహ్మను మాయ కప్పేసింది. బ్రహ్మ విష్ణువును నువ్వెవరు? అని అడుగుతాడు. శ్రీ మన్నారాయణుడు 'ఓ పుత్రా! నిన్ను శ్రీ మహావిష్ణువు సృష్టించాడు' అంటూ పరోక్షంగా తన ఎవరో చెప్తాడు.
విష్ణువుతో 'నన్ను నీ పుత్రుడంటున్నావు? ఈ సమస్త జగత్తుకు నేనే విధాతనూ అంటూ వాదించాడు బ్రహ్మ.
నన్ను నీ పుత్రుడు అనడానికి నీకేం అధికారం ఉంది? అంటూ ప్రశ్నించగా, నన్ను గుర్తించలేదా, నేను నీ తండ్రిని, శ్రీ మహా విష్ణువును అంటూ శ్రీ మన్నారాయణుడు జవాబిస్తాడు. అది అంగీకరించని బ్రహ్మ విష్ణువుతో యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కాస్త, అస్త్ర శస్త్రాలు ప్రయోగించుకునే వరకు చేరింది.
To be continued............

logic ledu kadha lo,please
ReplyDelete