Thursday, 30 September 2021

శ్రీ హనుమద్భాగవతము (41)



చివరకు భగవానుడైన శ్రీరాముడు ప్రసన్నుడై నాకు ఈ వానరము కావాలని మారాము చేసాడు. చక్రవర్తియైన దశరథమహారాజునకు జ్యేష్ఠపుత్రుడైన శ్రీరాముని కోరిక నెఱవేరకుండా ఎలా ఉంటుంది. భిక్షకుడు ఎంతటి మూల్యం తీసుకున్నా వానరము మాత్రము శ్రీ రాముని దగ్గర ఉన్డవలసినదే. భిక్షుకునకు కూడా ఇదియే ఇష్టము. తన ప్రభువు చరణాలకు సమర్పితము కావాలనే ఉద్దేశ్యముతోనే అతడు రాజద్వారము దగ్గర వచ్చాడు. నూతనజలధర (మేఘ) చ్ఛాయ వంటి తనువు గల శ్రీరాముడు తన కరకమలములతో వానరమును తీసుకున్నాడు. యుగయుగములనుండి ఉన్న ఆ వానరము యొక్క కోరిక నేటికి నెఱవేరినది. అది వివిధరీతుల నాట్యము చేసినది. ఇంతవఱకును పరమశివుడు వానర రూపమున తన్ను తాను నాట్యము చేయుంచుకొనుచుండెను. ప్రస్తుతం ఆయనే నాట్యము చేయుచున్నాడు. ఆయనను నాట్యము చేయించువాడు మునిమనో మానసమరాళమగు దశరథ కుమారుడే. ఆ వానరముయొక్క సుఖమునకు, సౌభాగ్యమునకు, ఆనందమునకు హద్దుయే లేకుండెను. అది వివిధరీతుల మనోమోహకములైన హావభావాలను ప్రదర్సితూ తన ప్రభువు ఎదుట నృత్యము చేయుటలో తన్మయత్వము చెంది యుంన్నాడు. భిక్షకుడు అదృశ్యమయ్యాడు. ఆయన కైలాసశిఖరమునకు వెడలినాడా లేక తన ప్రభువులీలను దర్శించుటకు మఱియొక రూపమును ధరింనాడా అనే విషయము తెలియలేదు.


ఇట్లు హనుమంతునకు తన స్వామియైనశ్రీ రాముని దగ్గర నుండు అవసరము కలిగినది. శ్రీరాముడు హనుమంతుని ఎక్కువగా ప్రేమించుచున్నాడు. ఆయన హనుమంతునిసమీపంలో కూర్చిన్నాడు, వానితో ఆడేవాడు. బంగారు వంటి అతని శరీరాన్ని తన కరకమలముతో నిమిరేవాడు. ఒకప్పుడు నృత్యము చేయుటకు వానికి అనుమతియిచ్చేవాడు, మఱియొకప్పుడు పరుగెత్తించి వస్తువు ఒకదానిని అతనిచే తెప్పించేవాడు. హనుమంతుడు తన ప్రభువిచ్చు ఏ ఆజ్ఞనైనా ఎంతో ఆదరము తోనూ, ఉత్సాహముతోనూ, సంతోషముతోనూ నెఱవేఱర్చును. అతడు అనేక విధాలుగా శ్రీ రాముని సంతోష పెట్టేవాడు.


ఇట్లా ఎన్నో సంవత్సరాలు అర్థ క్షణము వలె గడచి పోయాయి. విశ్వామిత్రమహర్షి అయోధ్యకు విచ్చెసాడు. ఆయనతో వెడలవలసిన అవసరము గలిగినపుడు శ్రీరాముడు హనుమంతుని ఒన్టరిగా పిలచి ఇలా పలికాడు. మిత్రుడవగు హనుమా! నేనీ భూమిపై అవతరించుటకు గల ప్రధానకార్యమిప్పుడు ఆరంభం కాబోతున్నది. లంకాధిపతియైన రావణుని దుశ్చేష్టలచే పృథివి వికలమైనది. ఇప్పుడు నేను వానిని వధించి పుడమిపై ధర్మమును నిలబెడతాను. ఈ కార్యమున నీవు నాకు సహాయపడాలి. దశాననుడు మహాబలియైన వాలితో స్నేహం చేసుకొన్నాడు.

Wednesday, 29 September 2021

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?



- సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు ‘మహాలయం’ పెట్టడం ఉత్తమమం. ఏ కారణంచేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థతిలో ‘మహాలయ అమావాస్య’నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే ‘సర్వ పితృ అమావాస్య’ అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ..వారి వారి తిథులతో సంబంధం లేకుండా ‘మహాలయం’ పెట్టాలి.

- క్రిందటి సంవత్సరం చనిపోయిన వారికి ‘చేత భరణి లేక భరణి పంచమి’ తిథులలో అనగా..మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

- భార్య మరణించిన వాడు ‘అవిధవ నవమి’నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ, గాజులు, పూవులు, చీర,రవికెలగుడ్డ పెట్టి సత్కరించి పంపాలి.

- చిన్న పిల్లలు చనిపోతే.. వారికి పన్నెండవ రోజున ‘మహాలయం’ పెట్టాలి. చిన్న పిల్లలు అంటే..ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే.., ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే ‘మహాలయం’ పెట్టాలి.

- ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ‘ఘట చతుర్థి లేక ఘాయల చతుర్థి’నాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.

మహాలయము పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, పవిత్రమును(దర్భలతో చేసిన ఉంగరము) ధరించి, శ్రధ్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. ఐదుగురు భోక్తలు ఎందుకంటే...


1.పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు. కనుక విష్ణుదేవతా ప్రీత్యర్థం ఒక భోక్త.

2.ఇది విశ్వేదేవస్థానం. విశ్వ, ఆర్ద్ర దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త.

3.ఇది పితృస్థానం. తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.

4.ఇది మాతామహస్థానం. తల్లి తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.

5.ఇది సర్వ కారుణ్యస్థానం. తండ్రి తరపు బంధువుల, తల్లి తరపు బంధువుల, గురువుల, స్నేహితుల, తక్కినవారి ప్రీత్యర్థం ఒక భోక్త. ఈ విధంగా మీ పురోహితుని సూచనానుసారం ఈ పితృకార్యాన్ని హోమ, తర్పణ, పిండప్రదానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. ఎందుకంటే.. ‘శ్రద్ధయా క్రియతే ధేయం ..శ్రాద్ధం’ అన్నారు పెద్దలు. అయిదుగురు భోక్తలతో ఈ పితృయఙ్ఞం జరిపించే ఆర్థికస్థోమత లేని పక్షంలో...కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి గానీ...మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు. మరొక్క విషయం. మనిషన్నాక బలహీనతలు సహజం. కనుక వివాహేతర సంబంధాల వల్ల జన్మించిన సంతానానికి మాత్రం ఈ పితృకార్యం చేసే అర్హత, అధికారం లేదు. శాస్త్రం ఆ వీలు కల్పించలేదు. కనుక మనకీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధివిధాన పితృకర్మలు నిర్వహించడం.., వారి పుత్రులుగా మన విధి, కర్తవ్యం, బాధ్యత. ఈ బాధ్యతను ప్రతి పుత్రుడు గుర్తించి, ఈ మహాలయ విధులు భక్తి, శ్రద్ధలతో నిర్వహించి పతృదేవతల ఆశీస్సులు అందుకుంటారని ‘తెలుగు వన్’


- చిన్న పిల్లలు చనిపోతే.. వారికి పన్నెండవ రోజున ‘మహాలయం’ పెట్టాలి. చిన్న పిల్లలు అంటే..ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే.., ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే ‘మహాలయం’ పెట్టాలి. - ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ‘ఘట చతుర్థి లేక ఘాయల చతుర్థి’నాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి. మహాలయము పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, పవిత్రమును(దర్భలతో చేసిన ఉంగరము) ధరించి, శ్రధ్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. ఐదుగురు భోక్తలు ఎందుకంటే... 1.పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు. కనుక విష్ణుదేవతా ప్రీత్యర్థం ఒక భోక్త. 2.ఇది విశ్వేదేవస్థానం. విశ్వ, ఆర్ద్ర దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త. 3.ఇది పితృస్థానం. తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త. 4.ఇది మాతామహస్థానం. తల్లి తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త. 5.ఇది సర్వ కారుణ్యస్థానo.


5.ఇది సర్వ కారుణ్యస్థానం. తండ్రి తరపు బంధువుల, తల్లి తరపు బంధువుల, గురువుల, స్నేహితుల, తక్కినవారి ప్రీత్యర్థం ఒక భోక్త. ఈ విధంగా మీ పురోహితుని సూచనానుసారం ఈ పితృకార్యాన్ని హోమ, తర్పణ, పిండప్రదానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. ఎందుకంటే.. ‘శ్రద్ధయా క్రియతే ధేయం ..శ్రాద్ధం’ అన్నారు పెద్దలు. అయిదుగురు భోక్తలతో ఈ పితృయఙ్ఞం జరిపించే ఆర్థికస్థోమత లేని పక్షంలో...కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి గానీ...మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు. మరొక్క విషయం. మనిషన్నాక బలహీనతలు సహజం. కనుక వివాహేతర సంబంధాల వల్ల జన్మించిన సంతానానికి మాత్రం ఈ పితృకార్యం చేసే అర్హత, అధికారం లేదు. శాస్త్రం ఆ వీలు కల్పించలేదు. కనుక మనకీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధివిధాన పితృకర్మలు నిర్వహించడం.., వారి పుత్రులుగా మన విధి, కర్తవ్యం, బాధ్యత. ఈ బాధ్యతను ప్రతి పుత్రుడు గుర్తించి, ఈ మహాలయ విధులు భక్తి, శ్రద్ధలతో నిర్వహించి పతృదేవతల ఆశీస్సులు అందుకుంటారని ‘తెలుగు వన్’ ఆకాంక్షిస్తోంది.


-Source and thanks.......యం.వి.యస్.సుబ్రహ్మణ్యం

Tuesday, 28 September 2021

మహాలయ పక్షాల ప్రాధాన్యత



భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదునైదు దినములనూ ‘మహాలయ పక్షములు’ అంటారు. మరణించిన మన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండప్రదానాది పితృయఙ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశిచబడిన ఈ పదునైదు రోజులనే ‘మహాలయ పక్షాలు’ అంటారు. వీటినే ‘పితృపక్షము’లనీ.., ‘అపరపక్షము’లనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశ్యము.


పితృదేవతలకు ... ఆకలా?


అనే సందేహం మీకు కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ‘ఆకలి’ అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.


అన్నాద్భవంతి భూతాని - పర్జన్యాదన్న సంభవః

యఙ్ఞాద్భవతి పర్జన్యో - యఙ్ఞః కర్మ సముద్భవః


అన్నము వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షము వలన అన్నము లభిస్తుంది. యఙ్ఞము వలన వర్షము కురుస్తుంది. ఆ యఙ్ఞము కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే....

అన్నం దొరకాలంటే .... మేఘాలు వర్షించాలి.

మేఘాలు వర్షించాలంటే....దేవతలు కరుణించాలి.

దేవతలు కరుణించాలంటే...వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యఙ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.


మరణించిన ప్రాణి ‘ఆత్మ’ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద ‘జీవాత్మ’గా అవతరించడానికి... అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.

మరణిచిన మన పితరులకు మోక్షం కలగాలంటే .. కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే ..పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకం లోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే ‘మోక్షం’ అంటే. రేపు మనకైనా ఇంతే.


తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?


అనే సందేహం తిరిగి మీకు కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృయఙ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమిటి? వారి గతి అథోగతేనా? అంటే..‘కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటివారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో, పిండప్రదానం యివ్వబడుతుంది. కానీ ఈ ‘మహాలయ పక్షాలు’ పదునైదు రోజులు మన వంశంలో మరణిచిన వారందరికీ మాత్రమే కాక, పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం మనకు ఉంది. దీనినే ‘సర్వ కారుణ్య తర్పణ విధి’ అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షాలు పదునైదు రోజులు మన పితృదేవతలు ‘మా వారసుడు పితృయఙ్ఞం చేయకపోతాడా.., మా ఆకలా తీర్చకపోతాడా’ అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయఙ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ...పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు. పితృయఙ్ఞం చేయని వారసుని వంశం.. నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు. వంశం నిర్వంశం కావడం అంటే... సంతానం కలుగక పోవడమే కదా. సంతనం లేనివారి గతి ఎలా ఉండుందో తెలుసుకున్నాం కదా. అందుచేత తప్పకుండా ‘మహాలయ పక్షాలు’ పెట్టి తీరాలి.


Source: తెలుగు వన్’ ఆకాంక్షిస్తోంది.

-thanks.......యం.వి.యస్.సుబ్రహ్మణ్యం

Monday, 27 September 2021

పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది?



స్వకులం పీడయేప్రేతః పరచ్ఛిద్రేణ పీడయేత్|

జీవన్స దృశ్యతే స్నేహీ మృతో దుష్టత్వమాప్నుయాత్|| - గరుడ పురాణం


ఈ శ్లోకం అర్థం ప్రతి ఒక్కరూ ఒక పలక మీద వ్రాసి నిద్రలేవగానే కనిపించే విధంగా పెట్టుకోవాలి. గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు చెప్పిన సత్యం ఇది. కడుపులో పెట్టుకొని పెంచి పెద్దచేసి ప్రాణాలు పోయిన తరువాత కూడా ఇంటి చూరట్టుకొని వేళ్ళాడిన పితరులను నిర్లక్ష్యం చేసి వారికి ప్రేత రూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులో చెబుతున్నాడు.


"ప్రేత రూపం విడిపించని కులాన్ని (కులం = వంశం) పితరులే నాశనం చేస్తారు. అది తామే స్వయంగా చేయవచ్చు. లేదా శత్రువుల చేత చేయించవచ్చు. శరీరం ఉన్నప్పుడు నా వాళ్ళు అనుకొని ప్రేమతో సాకిన పితరులే, ప్రేత రూపం విడిపించకపోతే ఆగర్భశత్రువులుగా మారి పీడిస్తారు."

ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడునికి చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టీ మహాలయ పక్షాలు, తిస్రోష్టకాలు, అమావాస్య ప్రాధాన్యత తెలుసుకొని పితరులను అర్చించాలి.


వ్యక్తి మరణానంతరం చేయవలసిన ప్రతి కార్యం గురించి గరుడ పురాణం చెబుతోంది. అవి శ్రద్ధగా చేయాలి. కేవలం దహన సంస్కారమే కాదు, ఆ తర్వాత పదుకొండు రోజుల వరకు ప్రతి రోజూ కర్మ నిర్దేశించబడింది. అవిగాక మాసికాలు, సంవత్సరీకాలు మొదలైనవి చెప్పబడ్డాయి. వాటిని ఖచ్చితంగా శ్రద్ధతో చేయాలి. ఆత్మహత్య, అకాలమరణం, ప్రమాదవశాత్తు మరణించవారికి మరికొన్ని ప్రత్యేక ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి. అప్పుడే మరణించినవారు ప్రేతరూపాన్ని విడిచి పైలోకాలకు వెళ్ళగలుగుతారు. లేదంటే ఆ కుటుంబాలను పితరులే నాశనం చేస్తారు. 

Sunday, 26 September 2021

కాకి నేర్పే అద్వైతం - కంచి పరమాచార్య



కాకి నేర్పే అద్వైతం


“మహాలయంలో మనం కాకులకు ఆహారం ఎందుకు పెడతాము? మన పూర్వీకులు కాకులుగా మారారా? అయితే ఇంతటి అల్ప పక్షిగా ఎందుకు మారారు? ఏదైనా పెద్ద స్థాయిలో ఉన్న పక్షిగా ఎందుకు మారలేదు?”  అని భక్తుడొకరు పరమాచార్య స్వామివారిని అడిగాడు.


స్వామివారు ఒకసారి చిరునవ్వి, “తమిళంలో మనం కాకిని ‘కాకా’ అని పిలుస్తాము. ఇక ఏదైనా ప్రాణిని మనం అవి చేసే శబ్దాలతో పిలుస్తామా? పిల్లిని ‘మ్యావ్’ అని, చిలుకలు కికి అంటాయి కాబట్టి వాటిని ‘కికి’ అని పిలుస్తామా? లేదు! కాకిని దాని అరుపుతో పిలుస్తాము. అదే దాని ప్రత్యేకత.


క అంటే కాపాత్తు (కాపాడు), రక్షించు అని అర్థం. కనుక నువ్వు కాకికి ఆహారం పెట్టి ‘కా కా’ అని పిలిస్తే, కాపాడు అని పితృదేవతలని అడిగినట్టు!


విరివిగా ఉంటాయి, ఏది పడితే అది తింటాయి కాబాట్టి కాకిని నువ్వు అల్ప పక్షి అంటున్నావు. కాకి ఎంత గొప్పదో ఇప్పుడు చెబుతాను విను.


అది బ్రహ్మముహూర్తంలో లేస్తుంది. కా కా అని అరచి నిన్ను నిద్రలేపుతుంది. ఒక్కోసారి కోళ్ళు సరిగ్గా సమయానికి లేవవు. కాని కాకి సరైన సమయానికి లేస్తుంది. అది కాకా అని అరుస్తూ నీ జపానికి సరైన సమయమైన బ్రహ్మముహూర్తంలో నిన్ను నిద్రలేపుతుంది.


అది పూజకు సరైన నిర్దేశం. అవును కదా?


అంతేకాక, దానికి ఆహరం దొరికితే ఇతర కాకులను పిలుస్తుంది. ఆహారాన్ని పంచుకుని తినండి అని మనకు తెలిపే వేరే ప్రాణుల్లో కనపడని ఒక ప్రత్యేకక లక్షణం కలిగినది.


మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు, మరలా కాకా అని అంటుంది. ఆ రోజు జరిగిన అన్ని విషయాలకు భగవంతునికి కృతజ్ఞతగా. అలాగే, కాకులు సూర్యాస్తమయం తరువాత ఏమీ తినవు. ఇది శాస్త్రములు చెప్పిన ఉత్తమమైన విషయం కూడా.


ఇది ఎంతమంది పాటిస్తున్నారు?


కనుక నాకు తెలిసి కాకి అల్ప ప్రాణి కాదు. అది మనకు ఎంతో నేర్పుతుంది. అందుకే పితృ దేవతలు కాకి రూపంలో వస్తారు. 

మరొక్క విషయం . . . కేవలం మహాలయంలోనే కాదు, ప్రతిరోజూ కాకికి ఆహారం పెట్టు.


కాకి మనకు అద్వైతాన్ని కూడా నేర్పుతుంది.


నువ్వు పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో సంతోషపడి ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది. అది తినడం చూడడం వల్ల నువ్వు కూడా ఆనందాన్ని పొందుతావు. కనుక ఇరువురు ఆనందంగా ఉంటారు. ఇద్దరూ భగవత్ స్వరూపులే!” అని తెలిపారు.


ఇది వినగానే ఆ భక్తుడు, అక్కడున్న వారందరూ స్వామివారికి నమస్కారం చేసి, అందరూ ఒక్కసారిగా “జయ జయ శంకర, హర హర శంకర” అని పెద్దగా పలికారు. 

పరమాచార్య స్వామివారి అద్భుతమైన అందమైన విశ్లేషణను మనమందరం పాటించి మన పూర్వీకుల ఆశీస్సులను పొండుదాము. 


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। 


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం 

Saturday, 25 September 2021

పితృకర్మల్లో శ్రద్ధ మరియు మంత్రం ప్రధానం



పితృకర్మల్లో శ్రద్ధ మరియు మంత్రం ప్రధానం. కర్మ చేయించే బ్రాహ్మణుడు అపరకర్మలు చేయడంలో నిష్ణాతుడై ఉండాలి. అతడు చదివే మంత్రాల వల్లనే తర్పణాదులను పితృదేవతలు స్వీకరిస్తారు. పితృకర్మలను అపరకర్మలు అంటారు. వీటిని చేసే బ్రహ్మణులకు కూడా ప్రాయశ్చిత్తం విధించబడింది. వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్నారని చాలామంది ఆరోపిస్తుంటారు. కానీ మనం అర్ధం చేసుకోవలసింది ఒకటుంది. పితృకర్మ చేయడానికి వచ్చే బ్రాహ్మణుని ఒంటి మీదకు పితృదేవతలు వస్తారు. అందుకే భోక్తలు చాలా ఎక్కువగా తింటారు. అలా తింటారని వారికి కూడా తెలీదు. పితృకర్మ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి ప్రాయశ్చిత్తంగా అతడు సహస్రగాయత్రి చేయాలి. ప్రాయశ్చిత్తం చేయని పక్షంలో ఆ బ్రాహ్మణుడు అనేక సమస్యలను ఎదురుకొంటాడు. విమర్శ చేసేవాళ్ళకి తెలిసింది కొంచమే, కానీ అపరకర్మలు చేసే బ్రాహ్మణుల జీవితంలోకి తొంగి చూస్తే అప్పుడు తెలుస్తుంది, అది ఎంత శక్తివంతమైన విషయం అనేది. రెండవది, పితృకర్మ చేసిన బ్రాహ్మణునకు సంతృప్తిగా భోజనం పెడితే, ఆ ఇంటి పితరులు సంతోషిస్తారు, ప్రేతశాంతి కలుగుతుంది. 


అయితే కేవలం బ్రాహ్మణుడు నిష్ణాతుడై ఉంటే సరిపోదు. కర్మ చేయించుకునేవారు కూడా శుచీశుభ్రత, పితృకర్మల యందు భక్తి, విశ్వాసాలు కలిగి ఉండాలి. బ్రాహ్మణుడు సక్రమంగా మంత్రం చదివినా, చేయించుకునేవారికి శ్రద్ధ లేకపోతే పితరులు ఆ పిండాలను, తర్పణాలను స్వీకరించరు. ఆ కుటుంబాలను శపిస్తారు. 


కొందరికి వీలుపడదని వేరొకరితో పిండప్రధానాలు చేయిస్తారు. ఇది కూడా శాస్త్రం అంగీకరించదు. కర్మ చేసే అధికారం కర్తకు మాత్రమే ఉంటుంది. కర్త అనగా ఎవ్వరు శాస్త్రం ప్రకారం తల్లిదండ్రులకు కర్మ చేసే అధికారం గలవాడు. అది వెరొకరి ఇవ్వలేరు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప అన్ని వేళలా శాస్త్రం దాన్ని అంగీకరించదు. కనుక డబ్బులిస్తామూ కర్మ చేయండి అని అనకండి, వీలు కల్పించుకుని మరీ పితృపూజ చేయండి.

Friday, 24 September 2021

పితృపక్షాల్లో పితృదేవతలను తప్పక స్మరించాలి



పితృపక్షాల్లో పితృదేవతలను తప్పక స్మరించాలి. ఆ మాటకు వస్తే రోజూ ఒక్కసారైనా వారిని స్మరించాలి. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే ఉద్యోగ్యం, వ్యాపారాభివృద్ధి, వివాహం, సంతానం, కుటుంబంలో సఖ్యత మొదలైనవి ఉంటాయి. వంశం కొనసాగుతుంది.


బయట చాలా వింత పోకడలు కనిపిస్తున్నాయి. గతించినవారికి పిండాలు పెట్టడమేంటి, అది వారికి చేరుతుందా? ఇదంతా బ్రాహ్మణుల కుట్ర, బ్రాహ్మణులు పొట్ట నింపుకోవడం కోసం ఇవన్నీ చెబుతున్నారంటూ ప్రచారాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదు. పితృకర్మల్లో భక్తి,శ్రద్ధ, విశ్వాసాలు ప్రధానం. వీటికి తార్కికమైన వివరణల కోసం వెతకకండి.  


మహాలయ పక్షాల్లోనైనా పితరులకు పిండప్రధానాలు, తర్పణాలు వదిలి చూడండి. వచ్చే ఏడాదికి జీవితంలో ఎంత అభివృద్ధి కలుగుతుందో మీరే చూస్తారు. పితరుల పేరున అన్నదానం చేయాలనుకోవడం మంచిదే. కానీ అన్నదానం అనేది శ్రాద్ధానికి ప్రత్యామ్నాయం కాదు. దేనికదే. పితృకర్మ చేసిన బ్రాహ్మణునికి దక్షిణ తప్పనిసరిగా ఇవ్వాలి.


పితృకర్మలు చేసే బ్రాహ్మణుడు సైతం చక్కని పండితుడై ఉండాలి. యక్షప్రశ్నల్లో మనకు రెండు విషయాలు కనిపిస్తాయి. శ్రాద్ధానికి ఏది తగిన కాలము అని యక్షుడు అడిగితే, దానికి "ఉత్తమ బ్రాహ్మణుడు దొరికిన కాలామే శ్రాద్ధానికి తగిన కాలము" అని ధర్మరాజు బదులిస్తాడు. శ్రాద్ధం ఎట్లా చెడిపోయినదవుతుంది అని యక్షుడు అడగ్గా వేదము చదివిన బ్రాహ్మణుడు లేకుండా పెట్టిన శ్రాద్ధము వ్యర్ధమవుతుందని ధర్మరాజు బదులిస్తాడు.  


దేవకార్యాల్లోనైనా ప్రయత్నలోపం ఉంటే దేవతలు సర్దుకుంటారేమో గానీ పితృకార్యాల్లో మాత్రం శాస్త్రవిధిని తప్పక పాటించాలి. మాకు పిండప్రధానం చేసి ఆచారం లేదండీ అనడానికి లేదు. మీ ఇంట్లో ఇంతకమునుపు ఇటువంటి ఆచారాం లేకున్నా మొదలుపెట్టాలి. మీరు ఏ వర్ణం వారైనా తప్పనిసరిగా పిండప్రధానాలు చేయాలి, తర్పణాలు వదలాలి. ఏది చేసినా అది మీ కుటుంబ వృద్ధి కోసమేనని గమనించాలి.  

Thursday, 23 September 2021

శ్రీ హనుమద్భాగవతము (40)



సర్వలోకపావనుడగు శ్రీ రాముడు మహాభాగయగు కౌసల్యాదేవికి ప్రత్యక్షమయ్యాడు. ఉమానాథుడగు శివుడు అయోధ్యానగరవీధులలో సంచరింపసాగాడు. ఒకప్పుడాయన అయోధ్యాధిపతియైన దశరథుని రాజద్వారమున ప్రభువు గుణములను గానము చేయు సాధువురూపమున, మఱియొకప్పుడు భిక్షార్ధమై విరక్తుడగు మహాత్మునివేషమున దర్శనమిచ్చేవాడు. ఒకప్పుడు భగవానుని మంగళమయములైన నవతారకథలను వినిపించు ప్రసిద్ధ విద్వాంసునిరూపమున రాజ ప్రాసాదమునకు విచ్చేసేవాడు, మఱియొకప్పుడు త్రికాలదర్శియైన దైవజ్ఞుని రూపంలో దశరథునికుమారుడైన బాల రాముని జాతక ఫలమును చెప్పుటకు వచ్చేవాడు. ఇట్లాయన ఏదో ఒక నెపంతో శ్రీ రాముని సమీపమునకు వచ్చుచుండేవాడు. శంకరుడొకప్పుడు బాలుని ఎత్తుకొంటాడు. ఒకప్పుడు హస్తములోని రేఖలను చూసే మిషతో కోమలతమము దివ్యము అయిన శిశువు హస్తపద్మాలను నిమురుతాడు. మఱియొకప్పుడు తన జడలతో కమలములవలె ఎఱ్ఱనైన చిన్న చిన్న అరి కాళ్ళను తుడుస్తాడు. ఇంకొకప్పుడు దేవదుర్లభములు, సుకోమలములు, అరుణోత్పలసదృశములైన చరణములను తన విశాలనేత్రములతో స్పృశించి పరమానందమున మగ్నుడవుతాడు. మెల్లమెల్లగా కౌసల్యానందనుడు రాజద్వారము వఱకు రాసాగాడు.


ఒకనాటిమాట. పార్వతీవల్లభుడు 'భిక్షకుని' వేషమును ధరించి ఢమరుకమును మ్రోగించుచు రాజద్వారమును సమీపించెను. అతని వెంట నృత్యముచేయు సుందరమైన ఒక కోతి కూడా ఉంది. ఆ భిక్షకునివెంట అయోధ్యలోని బాలురసమూహము ఉండింది.


డమరుకము మోగసాగెను. కొద్దిసేపటిలోనే శ్రీ రామునితో కూడా నలుగురు సోదరులు రాజద్వారముకడకు

వచ్చారు. భిక్షకుడు డమరుకమును మ్రోగించెను. కోతి రెండు చేతులను జోడించినది, సోదరులతో గూడ శ్రీరాముడు నవ్వాడూ. 


వృషభధ్వజుడైన ఈశ్వరుడు తన యొక అంశతో శ్రీరాముని ఎదుట నృత్యము చేయుచుండేవాడు. తన రెండవ అంశతో స్వయముగా దానిని ఆడించేవాడు. నాట్యము చేయువాడు, చేయించువాడు ఆయనయే. శ్రీరామచరణానురాగియైనవాడు పార్వతీవల్లభుడు; వానరనాట్యముచే ముగ్ధుడై మాటిమాటికి చప్పట్లుకొట్టువాడు సమస్తసృష్టిని తన జగన్నాటకంతో ఆడించే శ్రీ మన్నారాయణుడు. ఇలా సమీరకూమారుడు అనేకమార్లు శ్రీరాముని దర్శించేవాడు.

Wednesday, 22 September 2021

శ్రీ హనుమద్భాగవతము (39)



శిశువురూషముతో నున్న శ్రీరాముని కలియుట


కర్పూరగౌరుడగు శివునిలోను, నీల కళేబరుడుగు శ్రీరామునిలోను అనన్యమగు ప్రేమగలదు. భగవానుడగు శ్రీ రాముడు మహేశ్వరుడు వాస్తవముగా ఒకే తత్త్వమై యున్నారు. వారిలో ఎలాంటి భేదము లేదనే విషయము సత్యమైనది. కనుకనే "గోవిందునకు నమస్కరించువాడు శంకరునకు కూడా నమస్కరిస్తాడు. అట్లే భక్తిపూర్వకముగా శ్రీహరి నర్చించు వాడు వృషభధ్వజుడగు శివుని కూడా అర్చింస్తాడు. విరూపాక్షుని ద్వేషించువాడు జనార్దనుని కూడా ద్వేషిస్తాడు. అట్లే రుద్రుని తెలుసుకోలేనివాడూ అనగా రుద్రరూపము తెలియనివాడు కేశవుని కూడా తెలుసుకోలేడు* 1 –


* -1 హే నమస్యంతి గోవిందం తే సమస్యంతి శంకరమ్ |

యేఽర్పయంతి హరిం భక్త్యా తేఽర్చయంతి వృషధ్వజమ్' || 

యే ద్విషంతి నిరూపాక్షం తే ద్విషంతి జనార్ధనమ్ |

'యే రుద్రం నాభిజానరతి తేన జానంతి కేశవమ్ ||

(రుద్రహృదయోపనిషత్  6_7)


అవ్యక్తుడగు ఈ విష్ణువును, మహేశ్వరుడైన నన్ను ఒకే విధముగా చూసేవానికీ పునర్జన్మ ఉండదని భగవానుడైన శంకరుడు స్వయముగా చెప్పాడు. *2  కాని రసమయము మధురము అయిన తమ లీలలను ప్రదర్శించుటకే శీఘ్రసంతుష్టుడగు శివుడు, మునిమనోరంజనుడగు కేశవుడు వివిధ రూపముల ధరించుచుందురు.

*2 యే త్వేనం విష్ణుమవ్యక్తం మాంచ దేవం మహేశ్వరమ్.... 

ఏకీభావేన పశ్యంతి వ తేషాం పునరుద్భవః ॥ (కూర్మపురాణము - ఈశ్వరగీత)

పాపతాపములు నివారించుటకు, ధర్మమును స్థాపించుటకు, ప్రాణుల హితము కొఱకు శ్రీ రాముడీ భూమిపై అవతరిస్తూ ఉంటాడు. అట్లే సర్వలోకమహేశ్వరుడైన శివుడు గూడ అవతరించుచుండును. అట్లాగే సర్వలోకమహేశ్వరుడైన శివుడు కూడా తనకు ప్రియమైన శ్రీ రాముని మునిమనోవెహకము, మధురము, మంగళమయమైన లీలలను దర్శించుటకు భూమిపై అవతరిస్తూ ఉంటాడు. ఆయన తన యొక్క అంశతో శ్రీరామునిలీలను సహాయము చేస్తాడు, మఱియొక రూపముతో లోకపావనమైన ఆయన లీలను దర్శించి సంతుష్టుడవుతూ ఉంటాడు, ఆ సమయముంలో ఆతని ఆనందానికి అవధులుండవు.

Tuesday, 21 September 2021

శ్రీ హనుమద్భాగవతము (38)

 


అత స్తస్యాం తిధౌ భక్తో వివాహోత్సవ మాచరేత్ |

మూర్తిం సువర్చలాయాశ్చ తథైవ చ హనూమతః ||

కారయిత్వా సువర్ణాద్యైః స్వగృహ్యోక్త విధానతః |

నృత్యగీతైశ్చ వాద్యైశ్చ శారయేచ యధావిధి ||

నృత్యం తు ద్వివిధం ప్రోక్త మేకం ద్రష్టుం మనోహరమ్ ||

అంగభంగాత్మకం చాన్య త్సర్వపాప ప్రణాశనమ్ |

వివాహే వాయుపుత్రస్య బ్రాహ్మణానపి భోజయేత్ ||

పూర్ణిమాయాం నాక బలిం వివాహావబృదం చరేత్ |

ఏవం యః కురుతే తస్య గే హే లక్ష్మీః స్వయం వసేత్ ||

భుక్యాభోగాన్యథా కామం హనుమల్లోకమాప్నుయాత్ ||

 

శ్రీ సువర్చలాంజనేయ వివాహ తిథియందు సువర్ణము మొదలగు శ్రేష్ఠలోహములతో మూర్తులను నిర్మించుకొని, స్వగృహములో విధానానుసారముగా నృత్యగీతాదులతో వాద్యములతో మనోహరముగా వాయుపుత్రుని కల్యాణ మహాత్సవం చేసి, బ్రహ్మజ్ఞానులకు సంతర్పణ గావింపవలెను. పిమ్మట అవబృథమును గావింపవలెను. అట్టిభక్తుల యింటి యందు శ్రీలక్ష్మీదేవి స్థిరవాసముండును. ఇహలోకమందు ఇష్ట సిద్ధులను పొంది వారు అంత్యకాలమందు శ్రీహనుమత్సాయుజ్యమును పొందుదురు.

 

శ్రీ ఆంజనేయుడు సత్యవ్రతుడు, బ్రహ్మచారులందు శ్రేష్ఠుడు. కావున ఈ కల్పాంతము వరకాయన గంధమాధన పర్వతాగ్రముపై శ్రీరామనామ సంకీర్తనము నందు సంలగ్నుడై ఉంటాడు. శ్రీ సువర్చలా దేవి ఈ కల్పాంతమువరకు పంపా తీరమున శ్రీ ఆంజనేయుని దివ్యనామజపంలో ఉంటుంది. భావి కల్పమున శ్రీ ఆంజనేయుడు విధాత (బ్రహ్మ) కాగలడు. సువర్చలా దేవి సరస్వతీ దేవి కాగలదు. అందువలన శ్రీ ఆంజనేయుని యోగిజనులు అస్ఖలిత బ్రహ్మచారియని కీర్తించారు.

 

శ్లో॥ జలాథీనా కృషి స్సర్వా-భక్త్యాధీనంతు దైవతం

సర్వం హనుమతోఽధీనం ఇతి మే నిశ్చితా మతిః |

 

వ్యవసాయము వర్షముపై ఆధారపడియున్నది. భగవంతుడు భక్తులకు ఆధీనుడై ఉంటాడు, కాని సకలము ఆంజనేయునకు ఆధీనమై ఉంటుంది. ఇది నా విశ్వాసమని శ్రీ పరాశర మహర్షి పలికాడు.

  

శ్లో॥ హనుమాన్కల్పవృక్షోమె-హనుమాన్మమ కామధుక్ |

'చింతామణిస్తు హనుమాన్ విచారః కుతో భయమ్ ||

 

ఆంజనేయస్వామియే "నాపాలిట కల్పవృక్షము. హనుమంతుడే నాక కామధేనువు, హనుమంతుడే సమస్తము ఇచ్చే చింతామణి. ఇందు ఎట్టి సంశయము లేదు. ఆయనను నమ్మిన వారికిక భయమెందుకు? అనగా భయము లేదని భావము. (శ్రీ పరాశరసంహింత – 6వ పటలము.)

Monday, 20 September 2021

ఇంతకీ మనమెవరు ?



శివుడిని ఇష్టదైవంగా కలిగినంత మాత్రాన శైవులము, నారాయణుని అర్చన చేస్తాం కనుక వైష్ణవులము, అమ్మవారి రూపాలంటే ఇష్టం కనుక శాక్తేయులం, గణపతి భక్తులం కనుక గాణాపత్యులమైపోము. శైవ గురువుల నుంచి మంత్రదీక్ష తీసుకుని, శైవాగమాల ప్రకారం శివార్చన చేస్తే శైవులం అవుతాము. వైష్ణవ గురువు వద్ద మంత్రదీక్ష తీసుకుని వైష్ణవ అగమాల ప్రకారం అర్చన చేస్తే అప్పుడు వైష్ణవులం అవుతాము. అదే శక్తి, సూర్య, గణపతి మరియు సుబ్రహ్మణ్యుని అర్చనలో కూడా అన్వయం అవుతుంది. అలాగే ఆయా కుటుంబాల్లో పుట్టినవారు ఆయా శాఖలకే చెందుతారు. మరి మనమంతా ఎవరము అనే ప్రశ్న తలెత్తుతుంది. 


దీనికి సమాధనం మనమంతా జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ప్రతిపాదించిన స్మార్తులము. ఎప్పుడైన చెప్పవలసి వస్తే మనది స్మార్త సంప్రదాయమని చెప్పాలి. స్మార్తులు అంటే ఎవరు? శృతులు (వేదాలను), స్మృతులను ఆధారంగా చేసుకుని, సర్వదేవతలను సమానంగా పూజించేవారు. మనకు శివకేశవ బేధం లేదు; ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే అహంభావన లేదు. ఏ దేవతను పూజించినా అన్ని ఒక్కడికే చేరతాయనే భావన మన అందరిలో నిగూఢంగా ఉంది. ఇష్టదేవతను కలిగి ఉన్నా, ఇతర దేవతలను తక్కువ చెయ్యము. ఎందుకంటే మన అందరిలో ఆదిశంకరుల తత్త్వము అనాదిగా నిండి ఉంది. అందుకే ఎవరైనా మనది ఏ సంప్రదాయం అని అడిగినప్పుడు శంకర సంప్రదాయమని, స్మార్తులమని చెప్పాలి. గురువు లేని వారందరీ గురువు ఆదిశంకరులు, సాక్షాత్తు శివుడే ఆదిశంకరులుగా అవతరించి సనాతన ధర్మాన్ని కాపాడారు. వారు జగద్గురువులు, ఈ లోకంలో గురువు లేనివారందరికీ ఆయనే గురువు. అందుకే మనం 


సదాశివ సమారంభాం అని చెప్పినా, నారాయణ సమారంభాం అని చెప్పినా,

వ్యాస శంకర మధ్యమాం

అస్మదాచార్య పర్యంతాం 

వందే గురు పరంపరాం అని చెప్తాము. 

అనగా సదాశివుడు/ నారాయణుడి నుంచి మొదలైన ఈ సంప్రదాయంలో, అనాదిగా కొనసాగుతూ వచ్చింది. అందులో వేదవ్యాసులవారు, ఆదిశంకరాచార్యుల వారి ద్వారా రక్షించబడింది. అక్కడి నుంచి పరమపరగా వస్తూ ఇప్పటి నా గురువు ద్వారా నాకిది అందింది. ఈ మొత్తం గురుపరంపరకు నమస్కారం అని భావము. (ఈ శ్లోకం రోజూ చదువుకోవచ్చు). 


ఆదిశంకరులు 6 మతాలను స్థాపించారు. మీ ఇష్టదేవతను మధ్యలో ఉంచి, మిగితా దేవతలను వారి చుట్టూ ఉంచి పూజించే సంప్రదాయం అది. దాన్ని పంచాయతనం అంటారు. ఆదిశంకరులు ప్రతిపాదించిన దాంట్లో వైష్ణవం కూడా ఉంది. ఈనాటికి శంకర సంప్రదాయంలో ఉన్న వైష్ణవులు గణపతిని, మహేశ్వరుడిని, అమ్మవారిని, సుబ్రహ్మణ్యుని తమ దేవతార్చనలో పూజిస్తారు, ఉపాసన కూడా చేస్తున్నవారు ఉన్నారు. శంకర సంప్రదాయంలోని శైవులు కూడా విష్ణువును అంతే భక్తితో ఆరాధిస్తారు. ఆదిశంకర సంప్రదాయంలోని ఏ మతంలో ఉన్నవారైనా ఇతర దేవతలను తులనాడరు. అదే ఇప్పుడు మనకు అనుసరణీయము. 

Sunday, 19 September 2021

గాణాపత్యంలోని సౌందర్యం ఏమిటి?



మన ధర్మంలోని కొన్ని సంప్రదాయాలు కొందరు దేవతలను ఒప్పుకోవు. పేర్లు చెప్పవలసిన పనిలేదు గానీ శివుడు, గౌరీ, గణేశుడు, సుబ్రహ్మణ్యుడు మొదలైన దేవతల ఆరాధన అక్కర్లేదని చెప్పే సంప్రదాయాలు కూడా మన ధర్మంలో కనిపిస్తాయి. అదేగాక ప్రతి మతము (సనాతన ధర్మలోని మతాలు - శైవ, శాక్తేయ, వైష్ణవ మొదలైనవి) తాము పూజించే దేవతయే పూర్ణమని, మిగితా దేవతలు కామ్యసిద్ధిని ఇస్తారే గానీ, మోక్షం ఇవ్వరని ప్రతిపాదన చేస్తాయి. కానీ గాణాపత్యంలోని సౌందర్యం ఏమిటంటే అది సకల దేవతలనూ సమానంగా చూస్తుంది. గణపతిని పూర్ణబ్రహ్మంగా ప్రతిపాదించినా; శివుడు, అంబిక, సూర్యుడు, విష్ణువు పరబ్రహ్మస్వరూపాలేనని ప్రతిపాదిస్తుంది. అన్యదేవతలను సైతం ప్రార్ధించాలని చెబుతుంది. ఈ రోజు ఏదైతే మన ధర్మానికి కావాలో అదే అందులో చెప్పబడింది. తాను పూజించే దేవతా మూర్తిని కీర్తిస్తూ, అన్యదేవతలను గౌరవించడం, తక్కువ చేయకపోవడం. 


ముద్గల పురాణంలో కూడా ఇదే విషయం విశేషంగా ప్రస్తావించబడింది. ఉన్నది ఒకటే బ్రహ్మము. అది సర్వకాల సర్వావస్థల్లో సర్వత్రా వ్యాపించి ఉంది. దాన్ని నీవు ఏ రూపంతో ఉపాసిస్తే ఆ రూపంతోనే కోరికలు తీరుస్తుంది. అది నారాయణ, శివ, శక్తి, సూర్య, సుబ్రహ్మణ్య, చివరకు గణేశుడైనా సరే, మనస్సుకు, మాటలకు అతీతుడైన ఆ పరబ్రహ్మమే. సర్వదేవతలకు, సర్వ సృష్టికి మూలం అదే అని ముద్గల మహర్షి స్పష్టంగా చెప్తారు.


మనమంతా ఆదిశంకరాచార్యుల వారు ప్రతిపాదించిన మార్గంలో నడుస్తున్నాము. మనకు శంకరులు చెప్పింది కూడా ఇదే. ఇష్టదేవతను ప్రధాన దేవతగా పూజిస్తూ, ఇతరదేవతలను ఆవరణ దేవతలుగా అర్చించడం. అదే పంచాయతనంలోనూ కనిపిస్తుంది.

Saturday, 18 September 2021

సిద్ధి బుద్ధి అని ఇద్దరు పత్నులుండగా గణపతిని పత్నీహీనుడని, బ్రహ్మచారి అని ఎందుకు పిలుస్తారు?



సనకాది మునిచతుష్టయం గణక ఋషిని ఇలా అడిగారు - సిద్ధి బుద్ధి అని ఇద్దరు పత్నులుండగా గణపతిని పత్నీహీనుడని, బ్రహ్మచారి అని ఎందుకు పిలుస్తారు? 

 

దానికి గణక ఋషి ఇలా సమాధానమిచ్చారు - దీపంలో వత్తి వంటి వారు బుద్ధి మాత, దీపానికి పోసే తైలం వంటిది సిద్ధిమాత. ఈ దీపపు జ్యోతి సాక్షాత్తు గణపతియే. అగ్నితత్త్వం విశ్వమంతా వ్యాపించి ఉన్నా, అగ్నిని వెలిగించుటకు నూనెతో తడిచిన వత్తి కలిగిన ప్రమిద అవసరము.


బుద్ధి దేవి అనేది శుద్ధమైన జ్ఞానం కాగా, సిద్ధి దేవి మాయ. ప్రమిదలో ఉన్న వత్తి పూర్తిగా తైలాన్ని పీల్చుకుని కాలిపోయేవరకు అగ్ని జ్వలిస్తుంది. ఆ తర్వాత ఆ జ్వాల అగ్నితత్త్వంలో కలిసిపోతుంది. (దీపం కొండెక్కడం/ ఆరిపోవడమంటే అగ్ని అక్కడికి అంతమవ్వడం కాదు. సర్వకాల సర్వావస్థల్లోనూ విశ్వమంతా అగ్ని వ్యాపించి ఉంది. దీపప్రజ్వలనతో అది ఆ ప్రదేశంలో వ్యక్తమవుతోంది).


అలాగే మయామయమైన ఈ ప్రపంచంలో ఉంటూ, సత్యజ్ఞానంతో బ్రహ్మపథంలో ప్రయాణిస్తే, జీవాత్మ పూర్ణబ్రహ్మమైన గణపతిలో ఐక్యమవుతుంది. ఈ గణపతి ఈ సృష్టికి ముందూ ఉన్నాడు, సృష్టి తర్వాత కూడా ఉంటాడు. కానీ ఈ మాయ మరియు జ్ఞానం కలిసినప్పుడే గణపతి వ్యక్తమవుతున్నాడు. జ్ఞానం ద్వారా మాయ తొలగినప్పుడు ఉండేది గణపతి (బ్రహ్మం) మాత్రమే. ఆ స్థితిలో మాయా ఉండదు, జ్ఞానమూ ఉండదు, కానీ సచ్చిదానందుడైన గణపతి మాత్రమే ఉంటాడు. సిద్ధి (మాయ) మరియు బుద్ధి (జ్ఞానం) ద్వారా మాత్రమే గణపతి వ్యక్తమవుతున్నాడు. జీవ భావంతో  చూసినప్పుడు, గణపతికి  ఇద్దరు భార్యలు ఉంటారు. ఆత్మజ్ఞానం ద్వారా జీవునకు మాయ తొలగి జ్ఞానోదయమైనప్పుడు, గణపతిని సర్వవ్యాపిగా, పరతత్త్వంగా గుర్తిస్తాడు. అప్పుడు గణపతిని బ్రహ్మచారిగా భావిస్తారు.


వినాయక రహస్యం పూర్వభాగం 6 వ అధ్యాయం.

గణపతి అర్చనలో అత్యంత ముఖ్యమైన మూడు పువ్వులు



గణపతి అర్చనలో అత్యంత ముఖ్యమైనది, గణపతి త్వరగా సంతుష్టుడయ్యేది మూడింటితో. అవి గరిక, మందార పుష్పం మరియు శమీ పుష్పాలు.


దుర్వా గంధ మాత్రేణ సంతుష్ఠోసి గణాధిపః ||


గరిక పోచల వాసన తగలడంతోనే గణపతి సంతుష్ఠుడవుతాడు.


అయితే గరిక వాసన ఆయనకు ఎప్పుడు తగులుతుంది ? ముక్కుకు దగ్గరగా పెట్టుకున్నప్పుడు. అంటే గణేశుడి తొండానికి దగ్గరగా దుర్వా ఉంచినప్పుడు ఆయన సంతుష్ఠుడవుతాడు. అందుకే యోగిన్ద్ర మఠం (గాణాపత్య మఠం) పరంపరలో అర్చనా క్రమాన్ని ఈ విధంగా చెప్పారు.


ముందు అన్ని రకాల సుగంధ పుష్పాలతో అర్చన ప్రారంభించాలి. వాటి తరవాత ఎఱ్ఱని పుష్పాలు. తర్వాత బిల్వ పత్రాలు, బిల్వం మీద శమీ పుష్పాలు, వాటి మీద అర్క పుష్పాలు. జిల్లేడు పువ్వుల్లో నీలి రంగువి కనిష్టం, ఎరుపు మధ్యమం, తెలుపు శ్రేష్ఠం. కనుక నీలి అర్కపుష్పాల, వాటి మీద ఎఱుపు, ఆ తర్వాత తెల్లజిల్లేడు పూలు అర్పించాలి. వాటి మీద గరిక సమర్పించాలి. అందులోను పచ్చని దుర్వాలు, వాటి తరువాత శ్వేత దుర్వాలు అర్పించాలి.  


ఒకసారి దుర్వాలు అర్పించిన తర్వాత ఇక గణేశుడికి ఏదీ అర్పించకూడదు. దుర్వాల తర్వాత ఇక ఉత్తరపూజ అనగా ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి.   

Friday, 17 September 2021

గాణాపత్యం - గురుమండలం



గాణాపత్యం కూడా ఒక విస్తారమైన మతము. మహారాష్ట్రలో ఇప్పటికీ గాణాపత్యులు ఉన్నారు. గాణాపత్యంలో మొత్తం 64 మంది గురువులతో గురుమండలం ఉంది. గణపతి మంత్ర ద్రష్ట గణక ఋషి. దత్తాత్రేయుడు, గౌడపాదాచార్యులు మొదలైన వారు ఈ పరంపరలో కనిపిస్తారు.  


వినాయక రహస్యం అనే ఒక గొప్ప గాణాపత్య గ్రంథం ఉంది. అందులో భవిష్యవాణి ఈ విధంగా చెప్పబడింది. "కలియుగంలో ఒక వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత, గాణాపత్యంలోని పరమగురువైన గణక ఋషి ప్రయాగ వద్ద గౌడపాదులుగా అవతరిస్తారు. ఆయన తన శిష్యులకు జ్ఞానబోధ చేసి మోక్షమార్గం చూపుతారు. ఆయనకు సాక్షాత్తు శివుడే ఆదిశంకరులుగా అవతరించి గొప్ప శిష్యునిగా మారుతారు. అద్వైతవేదాంతాన్ని, వేదసారాన్ని వ్యాప్తి చేయడంలో ఈయన కీలకుడవుతాడు. 10 ఉపనిషత్తులకు వ్యాఖ్య రాసి మహావాక్యాల యొక్క సారన్ని బోధ చేస్తారు."  


గౌడపాదుల బోధలకు సమానమైనవి మనకు ముద్గల పురాణంలో సైతం కనిపిస్తాయి. ఇలా గణేశ భక్తులకు అద్వైత సంప్రదాయ రక్షణ మరియు వ్యాప్తి అనేది ముఖ్యమైన కర్తవ్యం. 


అయితే గాణాపత్యంలో బుద్ధుడిని కూడా గురుమండలంలో ఒక ఆచార్యునిగా గౌరవిస్తారు. గణపతి సహస్రనామంలో కూడా జైన, బౌద్ధ మతాల రూపంలో కూడా గణపతి ఉన్నాడని ప్రస్తావన కన్పిస్తుంది.  


ఓం శ్రీ గణేశాయ నమః 

Thursday, 16 September 2021

సర్వలోక గణపతి నామాలు



స్వానందలోకం అనేది కళ్ళకు కనిపించే పాంచభౌతికమైన లోకం కాదు. అది ఒక ఆధ్యాత్మిక స్థితి అయినప్పటికీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వలోకమహేశ్వరుడైన గణేశుడు అనేక లోకాల్లో అనేక రూపాల్లో కొలువై ఉన్నాడు.


గణపతి ఏర్పాటు చేసుకున్న మొదటిలోకం చింతామణి. అది దేవతల ఊహకు సైతం అందని ప్రదేశంలో ఉంది. 

కైలాసానికి తూర్పు దిక్కున మలజాత అనే పేరుతో గణేశుడు ఉంటాడు, దాన్ని స్వర్గస్వానందం అంటారు.

భూలోకంలో మోర్గావ్ క్షేత్రంలో బ్రహ్మకమండలు నదీ తీరంలో మయూరేశ్వరుడనే పేరుతో నివసిస్తున్నాడు.

మణిమయమైన నాగలోకంలో శేషాత్మజుడుగా, విష్ణులోకమైన వైకుంఠంలో పుష్టిపతిగా, మణిద్వీపంలో ద్వారాపాలకుడు మహాగణపతిగా, బ్రహ్మలోకంలో బ్రహ్మదేవునకు గురువుగా శారదేశుడనే పేరుతో గణపతి ఉన్నాడు.

ఇంద్రలోకంలో గణపతి కునితాక్షునిగా, అగ్నిలోకంలో రూపవినాయకునిగా, యమలోకంలో కాలునిగా, నైఋతి లోకంలో చండోద్ధండునిగా పూజలందుకుంటున్నాడు.

వరుణలోకంలో పాశపాణి, వాయులోకంలో ధూమ్రుడు, కుబేరునిలోకమైన అలకాపురిలో స్వర్ణాకర్షణ గణేశునిగా, కైలాసంలో శివగణాలకు అధిపతియై హేరంబగణపతిగా పిలువబడుతున్నాడు. 

దైత్యలోకంలో ద్విముఖునిగా, గంధర్వలోకంలో చందనునిగా, భూతలోకంలో ఘుర్ణితాక్షునిగా, సూర్యలోకంలో గణసూర్యునిగా గణపతి వసిస్తున్నాడు. స్కందలోకంలో షణ్ముఖునిగా కొలువై ఉన్నాడు. 

ఆయన ఎక్కడ ఉంటే అది స్వానందలోకం. తమను నరకంలో అగ్నికీలల యందు పడవేసినా, డండనాథుని రూపంలో గణేశుడినే దర్శిస్తామని గాణాపత్యులు అంటారు. గణపతియే సర్వమూ, సర్వమూ గణపతియే. ఇది పరమసత్యాన్ని ఋజువు చేయుటకే ఆయన అన్ని లోకాల్లో, అంతటా ఉంటాడు. గాణాపత్యుడు ఏనాడు కూడా స్వానందలోకం నుంచి క్రిందకు జారడు.


ఓం శ్రీ గణేశాయ నమః 

Wednesday, 15 September 2021

గణపతిని ప్రసన్నం చేసికొనుటకు 3 మర్గాలు


గణేశునికి గరిక అత్యంత ఇష్టం అని తెలుసు కదా. ఒకసారి గరికను సమర్పించిన తర్వాత ఇక ఏమీ సమర్పించకూడదని చెప్పుకున్నాము. అంటే గరిక అనేది గణపతి ఆగమాల్లో ఉత్కరిష్టమైనది. భక్తుని దగ్గర ఏమీ లేకున్నా కేవలం గరికను సమర్పించి వేసుకుంటే చాలు, కార్యం సిద్ధిస్తుంది. అయితే విష్ణు ఆరాధనలో తులసిని ఏ విధంగానైతే ప్రసాదాల మీద, తీర్థం యందు వేస్తారో, అలాగే గాణాపత్యంలో గణపతికి నివేదించే పదార్ధాల మీద గరిక పోచలు వేయాలి. 


శివునకు బిల్వం సమర్పించిన విధంగానే గణపతికి రెండు దుర్వాలు చొప్పున సమర్పించాలి. ఒక దుర్వాన్ని ఎప్పుడూ అర్పించకూడదు. 


గాణాపాత్యులు తమ దేవతార్చనలో తులసిని ఎన్నడూ వాడరు. కారణం గణపతి పూజలో తులసి పనికిరాదన్న గణేశుడి శాపం. కేవలం వినాయక చవితి రోజున మాత్రమే తులసిని గణపతికి అర్పించాలి. అది కూడా మిగిలిన 20 రకాల పత్రాలు లభ్యమైనప్పుడు మత్రమే, 21 వ పత్రిగా తులసిని అర్పించవచ్చు.


ఇక గణపతిని ప్రసన్నం చేసుకోనుటకు మరొక మార్గం కొబ్బరికాయ కొట్టడం. త్రిపురాసుర సంహారం ముందు విఘ్నం తొలగుటకు సాక్షాత్తు శివుడే కొబ్బరి కాయ కొట్టాడు గణపతి ముందు. 


దీని గురించి కంచి పరమాచార్య వారు విపులంగా చెప్పాలి. ఆర్థిక స్తోమత కలిగిన వారందరూ కనీసం ప్రతి శుక్రవారం గణపతికి కనీసం ఒక కొబ్బరికాయ కొట్టి పేదలకు, చిన్న పిల్లలకు పంచాలి. ఇది అన్ని రకాల అభివృద్ధిని ఇస్తుంది. ఇంకొక ఉపచారం - ప్రదక్షిణలు చేయుట. మనం ఒక పని జరగాలని గణపతిని కోరుకొని ప్రదక్షిణలు నిత్యం చేస్తూ ఉంటే కార్య సిద్ది కలుగుతుంది. ఒకవేళ ఈ రెండు విషయాలు లోకులు అర్ధమయ్యి అందరూ ఆ ఫలితాలను పొందడం మొదలుపెడితే, ఇప్పుడున్న గణపతి ఆలయాలు సరిపోవని, ఇంకా కొత్తవి చాలా కట్టవలసి వస్తుందని పరమాచార్యుల వారు చెప్పి ఉన్నారు.


కాబట్టి గణపతిని ప్రసన్నం చేసికొనుటకు మనం ఈ మర్గాలను పాటించవచ్చు.


ఓం శ్రీ గణేశాయ నమః   

Monday, 13 September 2021

స్వానందలోకం - ఇతరలోకాలు



బహుదేవతారాధనయే సనాతనధర్మం యొక్క ప్రాణం, సౌందర్యం. ఇష్టదేవతనే పరబ్రహ్మంగా, మిగిలిన దేవతలను అంశలుగా ఉపాసించి, మోక్షం పొందే మార్గాన్ని సనాతన ధర్మం చూపింది. శైవులకు కైలాసం ఉత్కృష్ట లోకం కాగా, వైష్ణవులకు వైకుంఠం, శాక్తేయులకు మణిద్వీపం చేరుట లక్ష్యాలు. అలాగే గణేశోపాసకులకు స్వానందలోకం చేరుట పరమలక్ష్యం. 


గాణాపత్యాన్ని అనుసరించి స్వానందలోకం మధ్యలో ఉంటుంది. అందులో సిద్ధి బుద్ధి సమేతుడైన గణపతి ఉంటాడు. స్వానందలోకానికి తూర్పున వైకుంఠం, దక్షిణాన కైలాసం, పశ్చిమాన మణిద్వీపం, ఉత్తారాన జ్ఞానమార్గం ఉంటాయి. అందుకే గణపతి ఉపాసనలో గణపతికి తూర్పున లక్ష్మీనారాయణులను, దక్షిణాన శివపార్వతులను, పశ్చిమాన రతీమన్మధులను, ఉత్తరాన భూదేవి వరహాస్వామి వారిని ప్రతిష్టించి ఉపాసిస్తారు. గణేశుడు మధ్యలోనున్న పూర్ణబ్రహ్మం, ఆదిమూలం. ఇంకా గణపతికి అంగదేవతలు, అనేకమంది పరివార దేవతలు చుట్టూతా ఉంటారు. లక్ష్మీనారాయణులు ధర్మానికి, శివపార్వతులు అర్ధానికి, రతీమన్మధులు కామానికి, వరహాస్వామిభూదేవులు మోక్షానికి సంకేతాలు. అనగా గణాపతి ఒక్కడిని గట్టిగా పట్టుకుంటే నాలుగు పురుషార్ధాలు వస్తాయి. భౌతికమైన సుఖాలు కలుగుతాయి, ఆధ్యాత్మిక గమ్యం నెరవేరుతుంది. అంటే ఆదిశంకరులు ప్రతిపాదించిన పంచాయాతనం అన్నమాట.


భూస్వానందంలో అనగా మోర్గావ్ క్షేత్రంలో సైతం గణపతికి నాలుగు దిక్కులా పైన చెప్పుకున్న నలుగురు దేవతలు కొలువై ఉంటారు. లక్ష్మీనారాయణులు వైష్ణవానికి, శివపార్వతులు శైవానికి, రతీమన్మధులు శక్తేయానికి సంకేతాలు కాగా భూదేవి-వరహా స్వామి వారు సౌరానికి; యోగ, జ్ఞాన మార్గాలకు సంకేతాలు. అంటే అన్ని మతాల పరమలక్ష్యం గణేశుడే అని సారం. మీరు ఏ మార్గంలో వెళ్ళినా, చివరకు గణపతినే చేరతారు. ఇక్కడొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే బౌద్ధం, జైనం వంటి అవైదిక, నాస్తిక మతాలు కూడా ఉత్తరభాగంలోనే ఉంటాయని గాణాపత్య ఆగమాలు చెబుతున్నాయి. అందుకే గణేశోపాసన అవైదిక, నాస్తిక మతాల్లో సైతం ఉన్నది. బౌద్ధులు, జైనులు కూడా గణాపతిని పూజిస్తారు. ఇలా గాణాపత్యం ఏ ఒక్క మతాన్ని తిరస్కరించక, అందరూ దేవతలను, అన్ని మార్గాలను సత్యమని అంగీకరిస్తూ పూర్ణబ్రహ్మమైన గణేశుడిని చేరే మార్గం చూపెడుతుంది. 


ఓం శ్రీ గణేశాయ నమః 

Sunday, 12 September 2021

గాణాపత్యానికి కేంద్రబిందువు మోర్గావ్ క్షేత్రం



గణేశోత్సవాలు అనాగానే గుర్తుకు వచ్చేది మహారాష్ట్ర. తరతరాలుగా గాణాపత్యం వర్ధిల్లింది ఇక్కడే. అందులోనూ గాణాపత్యానికి కేంద్రబిందువు మోర్గావ్ క్షేత్రం. ఇది అష్టవినాయక క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ గణపతి పేరు మయూరేశ్వరుడు. వైష్ణవులకు శ్రీ రంగం, శైవులకు కాశీ ఎంత పవిత్రమో, గాణాపత్యులకు ఈ మోర్గావ్ క్షేత్రం అంత విశేషం. ఇది స్వర్గలోకం కంటే ఉన్నతమైనదని, ఈ మోర్గావ్ క్షేత్రంలో స్వామిని దర్శిస్తే, బ్రహ్మ పదివి అడిగినా వరిస్తుందని పురాణవచనం. ఈ క్షేత్రంలో స్వామి విగ్రహాన్ని చూసినంత మాత్రం చేతనే ఎన్నో వేల జన్మల పాపాలు దగ్ధమవుతాయని పురాణంలో చెప్పబడింది. ఆ స్వయంభూః స్వామి విగ్రహాన్ని చూడగానే భక్తులకు ప్రశాంతత ఆవరిస్తుంది. ఈ మోర్గావ్ క్షేత్రం గురించి స్కాంద పురాణంలో విశేషంగా చెప్పబడింది. ఇక్కడ గణపతి చుట్టు, గ్రామం చుట్టూ కూడా అనేక దేవతలు ప్రతిష్టితమై ఉన్నారు.


శివునకు కైలాసం, విష్ణవులు వైకుంఠం, లలితాపరమేశ్వరికి మణిద్వీపం ఎలాగో, అలాగే గణపతి ఉండే లోకం పేరు స్వానంద లోకం. గణాపతిని స్వానందేశుడు అంటారు. స్వా అంటే ఆత్మ. ఆత్మానందాన్ని ఇచ్చే లోకం స్వానందలోకం, ఆత్మానందాన్ని ఇచ్చే స్వామి స్వానందేశుడు, ఆయనే మన గణనాథుడు. ఆనందానికి అధిదేవత గణేశుడు. అందుకే ఆయన రూపాన్ని చూసినా, స్మరించినా తెలియని ఆనందం కలుగుతుంది.


మోర్గావ్ క్షేత్రాన్ని భూస్వానందం అంటారు, అనగా ఈ భూమి మీదనున్న స్వానందలోకం. మయూరేశ్వరుడిని భూస్వానందేశ్వరుడు అంటారు. గణపతి భక్తులు తమ జీవితంలో ఒక్కసారైన దర్శించాల్సిన క్షేత్రం మోర్గావ్. ఇది మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉంది. 


భూస్వానందేశో విజయతే 

ఓం శ్రీ గణేశాయ నమః 

Saturday, 11 September 2021

గాణాపత్యం



శివుడిని  పరబ్రహ్మంగా ఆరాధించేవారిని శైవులనీ, విష్ణువును పరబ్రహ్మంగా ఆరాధించేవారిని వైష్ణువులనీ, శక్తిని ప్రత్యేకంగా ఉపాసించేవారిని శాక్తేయులు, సూర్యారాధకులను సౌరులను, సుబ్రహ్మణ్యారాధకులను స్కాందులని అన్నట్లుగానే గణపతిని పరబ్రహ్మంగా పూజించేవారిని గాణాపత్యులు అంటారు. గాణాపత్యం కూడా సనాతనధర్మంలో అనాదిగా ఉన్న మతమే. గాణాపత్యానికి కూడా శైవ, వైష్ణవ, శాక్తేయాలకు ఉన్నన్ని ఆగమాలు, తంత్రశాస్త్రాం, పురాణకథలు, స్మృతిప్రమాణాలు, ఆరాధాన పద్ధతులు, విస్తారమైన వివరణలు, ఆచార్య పరంపర ఉన్నాయి. అనేకమైన ఋషులు, ద్రష్టలు సైతం మనకు గాణాపత్యంలో కనిపిస్తారు. గణపతికి ఏ పూజ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏమేమి సమర్పించాలి, ఎలా సమర్పించాలి వంటి అనేక విషయాలు గాణాపత్యం విస్తారంగా చెబుతుంది.  


శైవులకు ప్రదోషం, మాసశివరాత్రి, మహాశివరాత్రి ఇత్యాదులు, వైష్ణవులకు ఏకాదశులు, శాక్తేయులకు అష్టమి, పూర్ణిమాది తిథులు ఎలా విశేషామో అలాగే గణేశ భక్తులకు చవితి తిథి అంత పవిత్రం. ప్రతి ఏకాదశికి ఒక పేరు, ఒక పురాణ కథ ఉన్నట్లుగానే ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష, కృష్ణ పక్ష చవితులకు ప్రత్యేక పేర్లు ఉన్నాయి. గాణాపత్య ఆగమాల్లో వాటికి ప్రత్యేక కథలు ఉన్నాయి. ఆరాధన విధులు చెప్పబడ్డాయి. అవేగాక ఇతర పర్వదినాలకు గణపతికి ఉన్న సంబంధం, ఆయా తిథుల్లో గణపతిని పూజించాల్సిన విధులు వాటిల్లో చెప్పబడ్డాయి. మనకు ఇప్పటి వరకు తెలిసింది వినాయక నవరాత్రులు, సంకటహర చవితులు మాత్రమే. కానీ అవి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి.  


శైవం, శాక్తేయం, స్కాందం (కౌమారం), సౌరం, వైష్ణవం లో గణపతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. (రామానుజుల శ్రీవైష్ణవం గురించి కాక ఇక్కడ ప్రస్తావించేది ఆదిశంకరుల వైష్ణవం గురించి). గణపతి ఉపాసన లేకుండా మిగితా 5 మతాల్లో ఉపాసన పూర్ణత్వానికి వెళ్ళదు. గణపతికి చెందిన శాస్త్రాలు తెలుసుకోవడం గణపతి భక్తులకు ఎంతో సంతోషాన్ని కలగజేయడమే కాదు, గాణాపత్యం రక్షించబడుటకు సహాయపడుతుంది. 


ఓం శ్రీ గణేశాయ నమః  

Thursday, 9 September 2021

శ్రీ హనుమద్భాగవతము (37)



తుదకు బ్రహ్మ దేవుని ఆజ్ఞానుసారముగా వారు స్నాతక మహోత్సవమునకు వచ్చారు. కాని వారు అరిభయంకరరూపములను ప్రదర్శింపసాగారు. వారి భీకరాకారములను చూసి దేవాంగనలు భయపడి హాహాకారములు చేశారు. అపుడు లీలావతారుడైన శ్రీ ఆంజనేయుడు మహాకాలసన్నిభమైన తన వాలముతో యమధర్మరాజును బంధించి గగనానికి ఎత్తినవాడై, లోకాలయందు త్రిప్పుతూ పరమపదాన్ని చూపాడు.


"పరంధామమును చూసిన యమధర్మరాజు పరమానందభరితుడై గర్వాన్ని వీడీ "శ్రీహరిహర స్వరూపుడైన శ్రీ ఆంజనేయుని అనేక విధాల స్తుతించాడు. శ్రీ ఆంజనేయస్వామి తన వాలముతో శనైశ్చరుని తలపై మోదగా ఆయన అధో ముఖుడయ్యాడు. శ్రీ ఆంజనేయుడు సాక్షాత్తుగా భగవంతుడని గ్రహించి గర్వాన్ని వీడి శనైశ్చరుడు అనేక విధముల స్తుతించాడు. శ్రీ యమధర్మరాజు, శ్రీ శనైశ్చరుడు ఆంజనేయునితో 'జగద్రక్షకా! నీ నిజస్వరూపమును "తెలిసికొనలేక 'అజ్ఞానులమై గర్వించాము, 'అహంకరించాము. 'మమ్ములను క్షమించు. 'సర్వగుణసంపన్ను'రాలు, మహాశక్తి స్వరూపిణీ అయిన మా సహోదరిని పరిణయమాడి, మమ్ములననుగ్రహించు. భక్తజనమందారా! నీ నామస్మరణము చేయు నీ భక్తులను మేము ఏమాత్రము పీడింపము. మేము వారికి ఆయురారోగైశ్వర్యములను ప్రసాదిస్తాము. - ఇది సత్యము' అని పలికారు. ఆ ప్రదేశంలో గల వారందరు యమధర్మరాజ శనైశ్చర గర్వభంగమును చూసి పరమాఃశ్చర్యచకితులై శ్రీ ఆంజనేయుని అనేక విధముల స్తుతించారు.


శ్లో॥ జ్యేష్ఠశుద్ధ దశమ్యాం చ భగవాన్భాస్కరో నిజాం | 

సుతాం సువర్చలాం నామ పాదాతీత్యా హనూమతే ॥


జ్యేష్ఠ శుద్ధ దశమి యందు శుభముహూర్తమున శ్రీసూర్యభగవానుడు తనకుమార్తె అయిన సువర్చలా దేవిని శ్రీ ఆంజనేయునకు కన్యాదానం చేశాడు. ఆ సమయములో సప్తఋషులు వధూవరుల ప్రవరలను ఇలా పలికారు.


శ్రీ ఆంజనేయ ప్రవర 

ముత్తాత అంగిరసుడు 

తాత మరీచుడు 

తండ్రి వాయుదేవుడు

కౌండిన్యగోత్రము


శ్రీ సువర్చలాదేవి ప్రవర 

ముత్తాత బ్రహ్మదేవుడు 

తాత కశ్యపప్రజాపతి 

తండ్రి శ్రీ సూర్య భగవానుడు 

కాశ్యప గోత్రము


ఆ సమయమందు పుష్పవృష్టి కావించిరి. ఆనక దుందుభులను మోగించారు. బ్రహ్మాదులు అనేక విధాల స్తుతించారు. గంధర్వులు గాన మొనరించారు. అప్సరసలు నృత్యములను చేశారు. కిన్నెర కింపురుషాదిగా గల వారందరూ జయజయ ధ్వానాలు చేశారు.


Wednesday, 8 September 2021

శ్రీ హనుమద్భాగవతము (36)



శ్లో॥ తతో హనుమానేకం స్వం-పాదం కృత్వోదయాచలే 

అస్తాద్రావేక పాదం చ-తిష్ఠన్న భీముఖో రవేః | 

సాంగోపనిషదో వేదాన్-అవాస్య కపి పుంగవః 

భాస్కరం తోషయామాస-సర్వవిద్య విశారదః ||


శ్రీ ఆంజనేయుడు ఒక పాదమును ఉదయాద్రిపై, మరొక పాదమును అస్తాద్రిపై ఉంచి శ్రీ సూర్యభగవానునకు అభిముఖముగా నిలబడి సాంగోపాంగముగా సకల వేదాలను అభ్యసించి సకలవిద్యాకోవిదుడై తన గురుదేవుడైన సూర్యుని సంతోషపఱచాడు.


శ్లో॥ తస్య బుద్ధించ విద్యాం చ బలశౌర్యపరాక్రమమ్ |

విచార్య తస్మై ప్రదదౌ స్వస్య కన్యాం సువర్చలామ్ || (6వ పటలం)


శ్రీ ఆంజనేయుని సద్బుద్ధిని, విద్యను, బలపరాక్రమాదులను చూసి శ్రీసూర్యభగవానుడు తన కుమార్తెయైన సువర్చలను అతనికి సమర్పించుటకు సంకల్పించాడు.


"బ్రహ్మాది దేవతలు జగత్కల్యాణార్థమై సువర్చలను వివాహమాడవలసినదిగా శ్రీ ఆంజనేయుని అనేక విధాలుగా 

ప్రార్ధించారు. సుమేరు పర్వతముపై శ్రీ సువర్చలాంజనేయుల కళ్యాణమహోత్సవము జరిగింది. సకల దేవతలు, మహర్షులు, ఆ మహోత్సవములో పాల్గొని చరితార్థులైయ్యారు. శ్రీ ఆంజనేయుని స్నాతకోత్సవములో ఒక విచిత్రసంఘటన సంభవించింది.


సంప్రదాయానుసారముగా శ్రీ ఆంజనేయుడు తపమొనరించుటకు బయలు దేరాడు: ఆ సమయములో తపమునకు పోవద్దనీ, తమ సహోదరిని- కళ్యాణమాడి గృహస్థాశ్రమమును స్వీకరించవలసినదనీ బావమరుదులు బావగారిని ప్రార్థించు సమయమాసన్నమయ్యింది. పురోహితులు శ్రీ ఆంజనేయుని బావమరుదులను పిలిచారు. వారు సంయమినీపురాధీశ్వరుడు దండధరుడు అయిన యమధర్మరాజు, గ్రహేశ్వరుడైన శనైశ్చరుడు. వారు శ్రీ ఆంజనేయుని పరిపూర్ణతత్త్వము గ్రహించలేక గర్వితులై స్నాతకోతవ్సమునకు రాకుండా విలంబనమొనరింప సాగారు. వారి మనోగతభావాలను సర్వసాక్షి అయిన శ్రీ ఆంజనేయుడు గ్రహించాడు.


వినాయక చవితి నాడు కూడా తులసి వద్దు !!

 


Tuesday, 7 September 2021

శ్రీ హనుమద్భాగవతము (35)



“నీకు సర్వవిధముల శుభము కలుగుగాక అని సూర్యభగవానుడు ఆశీర్వదించగా కేసరీనందనుడు గురు దేవునకు సాష్టాంగ నమస్కారము చేసాడు.


విద్వాంసుడైన పవనకుమారుడు గంధమాధనపర్వతమునకు తిరిగివచ్చి తన తల్లిదండ్రుల చరణములకు నమస్కరించాడు. తల్లిదండ్రుల సంతోషములకు అవధులు లేకపోయాయి. ఆ సమయములో వారి ఇన్టిలో ఒక గొప్ప ఉత్సవము జరుపబడినది. గంధమాదనపర్వతముపై హర్షోల్లాసములతో కూడిన ఉత్సవము ఇంత సుందరముగా ఇన్త పెద్దయెత్తున ఇంతకు పూర్వమెప్పుడును జరిగి ఉన్డలేదు. ఇట్టి దానినెవ్వరు చూచి కూడా ఉండలేదు. వానర సముదాయమంతా మహదానందమున మగ్నమైయుండింది. అందఱు తమ ప్రాణములకంటెను ప్రియుడైన అంజనానందనుని మనసారా ఆశీర్వదించారు.


శ్రీ సువర్చలా కల్యాణ రహస్యము


విశ్వకర్మకు ఛాయ అనే సర్వగుణ సంపన్నురాలగు పుత్రిక కలదు, ఆమె సూర్య దేవుని ఉపాసించింది. విశ్వకర్మ తన పుత్రికమనస్సును తెలుసుకొన్నవాడై ఆమెను సూర్యభగవానునకు అర్పించెను. శ్రీ సూర్య భగవానుడు ప్రచండమైన అగ్ని తేజముతో విరాజిల్లి ఉన్నాడు. ఛాయా దేవి ఆ మహా తేజాన్ని భరించలేక తల్లికి తెలిపింది. తన భార్య వలన విషయమును తెలుసుకొన్నవాడై విశ్వకర్మ తన తపశ్శక్తితో సూర్యుని నుండి ప్రచండ తేజమును వేరు చేసాడు. దానినే సూర్య గోళమని అంటారు. తన నుండి వేరైన తేజఃపుంజముపై శ్రీ సూర్య భగవానుడు తనదృష్టిని సారించాడు. ఆ మహా తేజము నుండి సూర్యుని మానసపుత్రిక, అయోనిజ, అతిలోక సౌందర్యవతి, సకలసద్గుణ సంపన్నురాలు, శ్రీపార్వతీ దేవియొక్క పూర్ణాంశ అయిన సువర్చల ఆవిర్భవించింది. బ్రహ్మాది దేవతలందఱు ఆ మహా తేజమును చూసి పరమాశ్చర్యచకితులైరి. ఇంద్రాది దేవతలు బ్రహ్మ దేవుడు సువర్చలా దేవికి భర్త ఎవ్వరు కాగలరని ప్రశ్నించారు. అందులకు బ్రహ్మ ఇట్లు పలికాడు,


శ్లో! ఈశ్వరస్య మహత్తేజో-హనునూమాన్దివి భాస్కరమ్ 

ఫలబుద్ధ్యాతు గృష్ణాయాత్ - కస్య భార్యా భవిష్యతిః |


సదాశివుని తేజోరూపుడగు శ్రీ ఆంజనేయుడు ఆకాశంలోనున్న సూర్యుని ఫలమనుకొని పట్టుకొనుటకు ప్రయత్నింపగలడు. 'ఆ హనుమంతునకు సువర్చల భార్య కాగలదు. కాలానుసారముగ శ్రీహరిహర తేజము శ్రీ ఆంజనేయునిగా అవతరిస్తుంది.


శ్లో ఆంజనేయస్తతః కాలే- బ్రహ్మచర్యపరాయణః 

సమర్థోఽపి మహా తేజః సంపశ్యన్లోక సంగ్రహమ్ | - 

సూర్యమండల ముత్పత్య - వేదాధ్యయన కారణాత్ 

స ప్రశయ మువాచేదం-నమస్కృత్య దివాకరమ్ | 


శ్రీ ఆంజనేయుడు బ్రహ్మచర్యనిష్ఠాగరిష్టుడు, సర్వజ్ఞానసంపన్నుడు, సర్వసమర్థుడునైనా లోకానికి ఆదర్శము చూపటం కోసం వేదాధ్యయనమును కారణముగా చేసుకుని సూర్య భగవానునకు నమస్కరించాడు. విద్యార్థియై పరావిద్యను అర్థించాడు. అందులకు శ్రీసూర్య భగవానుడు సానందముగ సమ్మతించాడు.


Monday, 6 September 2021

శ్రీ హనుమద్భాగవతము (34)



దివాకరుడు తప్పించుకొనుటకు ప్రయత్నించాడు, కాని సమీరకుమారునకు ఈ విషయంలో ఎట్టి కష్టమున్నట్లు కనబడలేదు. అతడు చాలా వినయముతో 'దేవా! రథము వేగముగా పయనిస్తే నా అధ్యయనముకు ఏమి ఆటంకము కలుగుతుంది? మీకు ఎలాంటి అసౌకర్యము కలుగురాదు. నేను మీ ఎదుట కూర్చుంటాను. రథ వేగముతో పాటు నేను ముందుకు పయనిస్తానని పలికాడు.


మారుతాత్మజుడు సూర్యదేవుని వైపు ముఖము పెట్టి ఆయనకు ముందుగా సహజరూపంతో పయనిస్తూ ఉండేవాడు.


సూర్యనారాయణునకీ విషయమున ఏ మాత్రం ఆశ్చర్యము కలుగలేదు. సమీరకుమారునిశక్తి యెట్టిదో ఆయనకు తెలుసు. అంతేకాక అతడు స్వయముగా జ్ఞానులలో శ్రేష్ఠుడనీ, శాస్త్రమర్యాదను కాపాడుటకు, తనకు కీర్తిని కలిగించటానికి ఇలా తన దగ్గరకు వచ్చి తన విద్యాభ్యాసము చేయకోరుచున్నాడని సుర్యదేవునకు తెలుసు.


సూర్యభగవానుడు వేదాది శాస్త్రములను, సమస్తవిద్యల అంగోపాంగములను, వాటి రహస్యములను ఎంత శీఘ్రముగా బోధించగకడో అంత త్వరగా బోధించేవాడు. హనుమానుడు శాంతభావముతో దానిని వినేవాడు. ప్రశ్నోత్తరములకు గాని, శంకాసమాధానములకు గాని అక్కడ అవసరము లేకుండెను, ఆదిత్యుడు హనుమంతునకు సంవత్సరములు గాని నెలలు గాని కాక కొన్ని దినములలోనే వేదాదిశాస్త్రములను, ఉప శాస్త్రములను, మిగిలిన విద్యలను బోధించాడు. హనుమంతునిలో సహజంగానే సర్వవిద్యలు నివసించియున్నవి. యథావిధిగా విద్యాభ్యాసము పూర్తియైనవి. ఆయన అన్నిటిలోను పారంగతుడయ్యాడు.


అమితభక్తితో గురుచరణములకు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి చేతులు జోడించి ఆంజనేయుడు 'ప్రభూ! గురు దక్షిణ రూపమున మీరు మీ అభీష్టమును వ్యక్తము చేయవలసినది' యని సూర్యుని ప్రార్థించాడు.


‘నాకేమీ అవసరము లేదు. కాని నీవు నా అంశతో పుట్టినవాడు, వాలికి సోదరుడైన సుగ్రీవునకు రక్షకునిగా ఉన్డునట్లు మాట ఇవ్వు, అట్లా చేసిన నాకు ఎంతో సంతోషము కలుగుతుందీ అని నిష్కాముడగు సూర్యుడు ప్రత్యుత్తరమిచ్చాడు.


‘మీ ఆజ్ఞ నాకు శిరోధార్యము. నేనుండగా సుగ్రీవున కెట్టి ఆపదా సంభవించదు. ఇది నా ప్రతిజ్ఞ' అని అనిలాత్మజుడు గురువు ఎదుట ప్రతిజ్ఞ చేసాడు.

Sunday, 5 September 2021

శ్రీ హనుమద్భాగవతము (33)



కౌపీనమును, యజ్ఞోపవీతమును ధరించి పలాశదండమును, మృగ చర్మమును తీసుకొని బ్రహ్మచారియైన హనుమానుడు సూర్యభగవానుని వైపు చూసి ఆలోచించసాగాడు. ఋషులశాపము తెలిసిన అంజనా దేవి వెంటనే పుత్రునితో ఇట్లా పలికిఇంది. ‘కుమారా! సూర్యుని దూరము నీకొక లెక్క లోనిది కాదు. నీ శక్తి హద్దు లేనిది. అరుణఫలమని తలంచి నీవు బాల్యమున ఎవనిని పట్టుకొనదలచి ఎగిరితివో, అతడు ఈ సూర్యుడే. ఆయనతో నీవు ఆటలాడుకున్నావు. నీవలన రాహువు భయపడి ఇంద్రుని దగ్గరకు పారిపోయినాడు. నిన్ను చూసి ఇన్ద్రుడు కూడా భయపడిపోయినాడు. కుమారా ! నీవు చేయలేని కార్యమేదీ లేదు. నీకు సంభవముకానిదేదీ లేదు. వెళ్ళు, సూర్యుని నుండి చక్కగా జ్ఞానమును పొందు. నీకు శుభమవుతుందీ.


ఇక చెప్పేదేమి? ఆంజనేయుడు తల్లిదండ్రుల చరణములకు మ్రొక్కి వారి ఆశీస్సుల పొందాడు. మరుక్షణమే యతడు ఆకాశమునకు ఎగురగా ఎదుట సూర్యుని సారథి అయిన అరుణుడు కనపడ్డాడు. హనుమంతుడు తండ్రి పేరు చెప్పి తనను పరిచయము చేసుకున్నాడు. అరుణుడు అత సూర్యుని చూపాడు.


అంజనానందనుడు ఎంతో శ్రద్ధతో భువన భాస్కరుని చరణములకు ప్రణమిల్లాడు. సరళత్వము మూర్తీభవించినవాడు, నిశ్చలహృదయుడు. వినమ్రుడు బద్ధాంజలియై ఎదుట నిలువబడియున్న వాడైన పవనకుమారుని చూసి సూర్యదేవుడు 'కుమారా! ఇక్కడెందుకు ఉన్నా' వని అడిగాడు.


హనుమానుఢ అత్యంత వినయముతో ఇట్లా ప్రత్యుత్తరమిచ్చాడు. దేవా! ఉపనయనము గావించి నా తల్లి నన్ను విద్యాధ్యయనమునకై నీకడకు పంపినది. దయ యుంచి నాకు జ్ఞానమును ఉపదేశింపుము’.


ఆదిత్యు డిట్లు పలికాడు - “కుమారా! చూడుము నాస్థితి చాలా విచిత్రమైనది. నేను అహర్నిశలు రథముపై పరుగెడుతుంటాను, ఈ అరుణుడు రథ వేగాన్ని తగ్గించటం ఎరుగడు, ఆకలిదప్పుకలను, నిద్రను త్యజించి నిరంతరం రథమును నడుపుతుంటాడు, ఈ విషయాన్ని పితామహునితో చెప్పుకొనే అధికారము కూడా నాకు లేదు. రథము నుండి దిగుటకు కూడ నాకు వీలు లేదు. ఇలాంటి పరిస్థితిలో నేను నీకు శాస్త్రముల ఎట్లా బోధిస్తాను? ఏమి చేయవలెనో నీవే ఆలోచించి చెప్పు. నీవంటి ఆదర్శబాలుని శిష్యునిగా స్వీకరించుట నాకిష్టమే”.


Saturday, 4 September 2021

శ్రీ హనుమద్భాగవతము (32)



ఇట్లా ధ్యానమునఁదలి తన్మయత్వముచే అతనికి ఆకలి దప్పులు కూడ కలుగుట లేదు. అంజనా దేవి మధ్యాహ్నము నందును, సాయంకాలమందును తనప్రియపుత్రుని వెదకుటకు పోయేది. తన పుత్రుడు ఉండు ప్రదేశము ఆమెకు తెలుసు. అందువలన ఆమె వనములు, పర్వతములు, సరోవరములు, సెలయేళ్ళు అన్నింటియందు తిరిగి తిరిగి హనుమానుని వెదకి తెచ్చెది. అప్పుడు తల్లి యొక్క పట్టుదలతో ఆహారమును తినేవాడు. ఇట్లా ప్రతిదినము జరుగుచుండేది. ఒళ్ళు తెలియనంతగా హనుమంతుడు తన కారాధ్యుడగు శ్రీరాముని ప్రేమలో లీనమయ్యేవాడు, అతని ముఖము నుండి కేవలము "రామ రామ’ యను రెండక్షరములు నిరంతరము బయటవచ్చేవి.


సూర్యుని దగ్గర విద్యనభ్యసించుట


అంజనా దేవి తన పుత్రుని మానసిక స్థితిని చూసి అప్పుడప్పుడు విచారించుచుండేది. తండ్రియైన కేసరి కూడా ఆలోచనామగ్నుడయ్యేవాడు. హనుమంతుడు విద్యనభ్యసించుటకు అగినవయస్సు గలవాడయ్యాడు. 'ఇపుడు ఇతనిని గురువు దగ్గరకు విద్యాభ్యాసమునకై పంపాలి. దీనివలన ఇతని ఈ దశ మారవచ్చు'నని తల్లిదండ్రులు ఆలోచించారు. వారికి జ్ఞానమూర్తియైన తమ పుత్రుని విద్యాబుద్ధులు, బలపౌరుషములు తెలియును. అంతేకాక బహ్మాది దేవతలు కుమారునకిచ్చిన వరముల విషయము కూడా తెలుసు. సామాన్యజనులు మహాపురుషులను అనుకరిస్తారు. సమాజమున అవ్యవస్థ ఏర్పడుతుందన్న భావముతో మహాపురుషులు స్వేచ్ఛగా ప్రవర్తించరు. వారెల్లపుడు శాస్త్రమర్యాదను మనస్సులో ఉన్చుకొని నియమానుకూలంగా వ్యవహరిస్తారు. అందువలన అప్పుడప్పుడు కరుణాసముద్రుడైన భగవానుడు భూతలముపై అవతరిస్తూ ఉంటాడు. ఆయన సర్వజ్ఞాన సంన్నుడైనా విద్యాప్రాప్తికై గురుగృహమునకు వెళతాడు, అచట గురువును అనేక విధాళుగా సేవించి బహు శ్రద్ధతో ఆయన నుండి విద్యను నేర్చుకుంటాడు. గురువును సేవచే సంతుష్టి పఱచి శ్రద్ధతోను భక్తి తోను పొందిన విద్యయే ఫలవంతమవుతుంది. అందువలన అంజనా దేవి కేసరి విద్యాభ్యాసమునకై హనుమంతుని గురుగృహమునకు పంపించుటకు నిశ్చయించుకున్నారు.


తల్లిదండ్రులు మహోల్లాసముతో హనుమంతునకు ఉపనయన సంస్కారము చేసారు. విద్యాప్రాప్తికై గురుచరణముల దగ్గరకు వెళ్ళుటకు అనుజ్ఞ లభించినది; కాని అతడు సర్వగుణ సంపన్నుడైన ఏ  ఆదర్శ గురువు దగ్గరకు వెళ్ళాలి? అంజనా దేవి ప్రేమాధిక్యముతో ఇట్లు పలికింది 'కుమారా! సర్వశాస్త్ర మర్మజ్ఞుడు, సర్వలోకములకు సాక్షిగా ఉన్నవాడు సూర్య దేవుడు. సమయము వచ్చినపుడు నీకు విద్య చెప్పెదనని ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. అందువలన నీవు ఆయనకడకు వెడలి శ్రద్ధాభక్తులతో విద్య నార్జింపుము'.

Friday, 3 September 2021

శ్రీ హనుమద్భాగవతము (31)



అంజనా దేవి శ్రీ రామావతారకథను చెప్పడం ఆరంభించినపుడు బాలుడైన హనుమానుని మనస్సు అంతా పైకథ యందే లగ్నమై ఉండేది. ఆ సమయంలో నిద్రా దేవి అతనిని ఆవహించేది కాదు. తల్లికి కునుకు వస్తే అతడామెను పట్టుకొని ఊపుతూ 'అమ్మా! ఇంకా చెప్పు, చెప్పు. తరువాత ఏమి జరిగినదని అడుగుతుండేవాడు'.  


తరువాత మళ్ళి తల్లి చెప్పేది. శ్రీ రామకథా శ్రవణము వలన హనుమానునకు తృప్తి కలుగకపోయేది. మాటిమాటికి శ్రీరామునికథను వినిపించమని అతడామెను నిర్బంధించేవాడు. అంజన మహోల్లాసపూర్వకంగా కథను వినిపించును, హనుమంతుడు దానిని తన్మయత్వముతో వినుచుండును. ఆ సమయమున అతని నేత్రములు అశ్రుపూర్ణములయ్యేవి, శరీరమంతా కపించిపోతుండేది. నేను ఖూడా ఆ హనుమానుడనే అయితే ఎంత బాగుండెదో అని అతను అన్కొనేవాడు.


కథను వినిపిస్తూ అంజనా దేవి కుమారుని నాయనా! నీవు కూడా అట్టి హనుమంతుడవు అవుతావా' అని అడిగేది. ‘తప్పకుండ ఆ హనుమంతుడనే అవుతానమ్మా' అని హనుమానుడు సమధానమిచ్చెడివాడు. 'కాని ఆ శ్రీ రాముడు రావణుడు ఎక్కడున్నారు! రావణుడు జననియైన సీతా దేవి పై దృష్టి వేసినచో నేను వానిని నలిపివేస్తానని చెప్పేవాడు. అంజనా దేవి ఇలా పలికేది - "కుమారా! నీవు ఖూడా ఆ హనుమానువే అవ్వు. ఇప్పటికీ 'లంక'లో రావణుడు రాజ్యము చేస్తున్నాడు. అయోధ్యాధిపతియైన దశరథునకు పుత్రునిగా శ్రీరాముడవతరించినాడు. నీవు త్వరగా పెద్దవాడివికమ్ము. శ్రీరామునకు సాహాయ్యపడుటకు నీవు త్వరగా బలపరాక్రమసంపన్నుడవు కమ్ము.” . 


'అమ్మా! నాలో శక్తికి లోటేమున్నదీ అని పలికి హనుమంతుడు రాత్రియందు మంచం మీది నుండి క్రిందకు దూకి, తన భుజములను చూపి తల్లి ఎదుట తాను అమితశక్తిశాలినని నిరూపించుకొనేవాడు. అంజన నవ్వుతూ తన ప్రియపుత్రుని ఒడి లోనికి తీసుకుని వీపు నిమురుతూ మధురస్వరముతో ప్రభువు గుణెములను గానము చేస్తూ నిద్రబుచ్చుచుండేది. హనుమంతుడు అంజనా దేవి ఒడిలో సుఖంగా నిద్రించుచుండేవాడు. సహజమైన అనురాగముతో హనుమానుడు మాటికి శ్రీరాముని కథను వినుచుండేవాడు. అట్లు వింటూ అతడు మాటిమాటికి శ్రీరాముని స్మరించుకొనుచుండేవాడు. తత్ఫలితముగా అతనికి శ్రీరామస్మరణము ముందుముందు తీవ్రంగా కాసాగింది. మెల్లమెల్లగా అతని సమయములో ఎక్కువ భాగము శ్రీరాముని ధ్యానంలోనూ, స్మరణములోను గడచిపోయేది. అతడొకప్పుడు అరణ్యమునందు, మఱియొకప్పుడు పర్వతగుహలోను, ఒకప్పుడు నదీతటమునందును, ఇంకొకప్పుడు దట్టమగు పొదరింటిలోను ధ్యానస్థుడయ్యేవాడు, అతని నేత్రములనుండి ప్రేమాశ్రువులు ప్రవహించుచుండెడివి.


Thursday, 2 September 2021

శ్రీ హనుమద్భాగవతము (30)



తాపసులిట్లా శపించటం వలన పవనకుమారుని తేజస్సు ఓజస్సు తఱగిపోయింది. అతడు మిక్కిలి సౌమ్యస్వభావము గలవాడయ్యాడు. అప్పటి నుండి అతడు తక్కిన వానర బాలుర వలె ఆశ్రమములలో శాంతస్వభావముతో విహరింపసాగాడు. మృదువగు ఇతని నడవడిచే ఋషులందఱు చాల ప్రసన్నముగా ఉన్డసాగారు.


మాతృబోధ

బాలునిపై తల్లి జీవితప్రభావము, ఆమె ఉపదేశప్రభావము ఎక్కువగా ప్రసరిస్తుంది. ఆదర్శమాతలు తమ పుత్రులను శ్రేష్ఠులుగా, ఆదర్శవంతులుగా తీర్చిదిద్దుతారు, ఇలాంటి ఉదాహరణలెన్నో పురాణములలోను, ఇతిహాసములలోను లభిస్తాయి.


హనుమానుని తల్లియైన అంజనా దేవి పరమ సదాచారిణి, తాపసి, సద్గుణసంపన్నురాలైన ఆదర్శమాత. ఆమె కుమారునికై ఎంత తత్పరతతో కఠోరమైన తపము ఒనరించినదో అంతటి తత్పరతతో ప్రాణప్రియుడైన తన బాలుని జీవితాన్ని చక్కదిద్దుటకు శ్రద్ధవహించింది. ఆమె హనుమానుని వీరకృత్యముల చూసి మనస్సులో మగ్ధురాలవుతూ, అతనికి ప్రోత్సాహాన్ని కలుగ జేస్తూ ఉండెది.


పూజానంతరము రాత్రులయందు పరుండుటకు పూర్వము ఆమె తన ప్రియపుత్రునకు పురాణకథలను, ఆదర్శపురుషుల కథలను వినిపిస్తూ పుత్రుని మనస్సును వాటి వైపునకు ఆకర్షించుటకు ప్రయత్నించుచుండేది. తాను బోధించిన మహాపురుషుల జీవితచరిత్రలను గూర్చి మాటిమాటికి కుమారుని అడుగు చుండేది. బాలుడు నేర్చుకోవలసిన విషయమేమున్నది? సర్వజ్ఞుడు, సర్వాంతర్యామీ అయిన ఈశ్వరునకు తెలియని రహస్యమేమి ఉంటుంది! కాని లీలలో అప్పుడప్పుడు హనుమంతుడు అజ్ఞుని వలె సరిగ్గా సమాధానములను ఇచ్చెడివాడు కాడు. తల్లి మరల కథలను వినిపించి వాటిని బాలునిచే కంఠస్థము చేయిస్తూ ఉండేది. కరుణాసముద్రుడైన భగవానుని అవతారములకు సంబంధించిన కథలన్నీ హనుమంతుని జిహ్వాగ్రము పైననే ఉంటాయి. ఆయన ఆ కథలనన్నింటిని తన తోటి వానర బాలురకు ఎంతో ప్రేమతోను, ఉత్సాహముతోను వినిపించెడి వాడు.


Wednesday, 1 September 2021

శ్రీ హనుమద్భాగవతము (29)



మెల్లమెల్లగా హనుమంతుడు 'విద్యాధ్యయనమునకు తగిన వయస్సు గలవాడయ్యాడు, కాని ఇతని అల్లరి మాత్రం అలాగే ఉండింది. తల్లిదండ్రులు కూడా చాలా చింతితులయ్యారు. వారు తమ ప్రియపుత్రునుకు ఎన్నో విధాలుగా బోధించారు, ఎన్నో విధాలుగా యత్నించారు. కాని అతడు తన అల్లరిని మానలేదు. ‘చివరకు అంజనా దేవి, కేసరి ఋషుల దగ్గరకు వెళ్ళారు, ఋషులు కూడా తమ కష్టగాథలను వారికి తెలియజేసారు. ఆ దంపతులు వినయపూర్వకముగా ఋషులకు ఇలా విన్నవించుకొన్నారు. “ తపోధనులారా! మాకీ బాలుడు ఎన్నో దినములు పిమ్మట కఠోర తపఃప్రభావముచే లభించినాడు. మీరు ఇతన్ని అనుగ్రహించండి. విద్యాసంపన్నుడయ్యేటట్లు ఇతనిని ఆశీర్వదించండి. మీ దయ వలన ఇతని స్వభావము మారవచ్చు. దీనులమైన మమ్ము - కరుణించండి.” 


'ఇతనికి అమితమైన తన బలపరాక్రమములన్నా గర్వము మెండుగానున్నది. తన బలమును మర్చిపోతే ఇతనికి యథార్థమైన మేలు కలుగుతుందని ఋషులు తలంచారు.


'ఈ బాలుడు దేవతలకు హితమును చేకూర్చగలడు, భగవానుడైన శ్రీరామచంద్రునకు అనన్య భక్తుడవుతాడు. అనుగతుడగు భక్తునకు బలాహంకారం ఉన్డుట ఉచితము కాదు, దీనభావముతోనే ప్రభువునకు సేవ చేయగలుగుతాడు’ అని కొందఱు వయోవృద్ధులైన ఋషులు భావించారు.


ఈ కారణముతో భృగువు యొక్క అంగిరసుని యొక్క వంశములలో జన్మించిన ఋషులు హనుమంతునిట్లు శపించారు – 'వానరవీరా! నీవే బలమును ఆశ్రయించి మమ్ము బాధించుచున్నావో దానిని మా శాపముచే మోహితుడవై బహు కాలము మఱచిపోతావు. నీ బలమును గూర్చి నీవేమీ తెలుసుకోలేవు. ఎవరైన నీ కీర్తిని గుర్తుకు తెచ్చినపుడు నీ బలము పెరుగుతుంది.'*


* బాధ'సే యత్ సమాశ్రిత్య బలమస్మాన్ ప్లవంగమ ॥ 

తద్ దీర్ఘ కాలం వేత్తాసి నాస్మాకం శాపమోహితః | 

యదా తే స్మార్యతే కీర్తి స్తదా తే వర్ధతే బలమ్ || (వా. రా. 7-86-34, 35)