Tuesday, 2 January 2024

శ్రీ గరుడ పురాణము (51)

 


విష్ణుధ్యానం - సూర్యార్చన


“శంఖ చక్రగదాధారీ! భగవాన్ శ్రీహరీ! మేమంతా దేవదేవేశ్వరుడు, శుద్ధ రూపుడు, పరమాత్మయగు విష్ణుదేవులు మీరేనన్న జ్ఞానాన్ని పొందియున్నాము. విష్ణు సహస్రనామాలను విని పరమానందభరితులమైనాము. విష్ణు ధ్యానవర్ణనను విని ధన్యులము కాగోరుచున్నాము” అన్నాడు కాలకంఠుడు.


చెప్పసాగాడు ఖగవాహనుడు.


“జ్ఞానరూపుడు, అనంతుడు సర్వవ్యాపి, అజన్ముడు, అవ్యయుడునగు హరియే సర్వ దుఃఖాలనూ హరిస్తాడు. ఆయన అవినాశి, సర్వత్రగామి, నిత్యుడు, అద్వితీయ బ్రహ్మ. సంపూర్ణ సంసారానికి మూలకారణం, సమస్త చరాచర జగత్పాలకుడైన పరమేశ్వరుడు ఆయనే సంపూర్ణ జగత్తుకు ఆధారం అయనే అయినా, స్వయంగా నిరాధారుడు.



పరమాత్మ ప్రాపంచిక ఆసక్తులకు అతీతుడు, నిర్ముక్తుడు. ముక్తయోగులకు ధ్యేయమైనవాడు. మీరడిగిన ధ్యాన వర్ణనను సూర్యపూజతో మొదలు పెడతాను. ఒకప్పుడిది భృగుమహర్షికి బోధింపబడింది.


ఓం ఖఖోల్కాయ నమః - ఇది 


సూర్య భగవానుని మూలమంత్రం. సాధకునికి భోగాన్నీ మోక్షాన్నీ ప్రసాదించే మంత్రమిది. సూర్యదేవుని ఈ క్రింది మంత్రాలతో అంగన్యాసం చేసి ఆయనను పూజించాలి.


ఓం ఖఖోల్కాయ త్రిదశాయ నమః ।

ఓం విచిఠఠ శిరసే నమః । 

ఓం జ్ఞానినేఠఠ శిఖాయై నమః ।

ఓం సహస్రరశ్మయేఠఠ కవచాయ నమః |

ఓం సర్వతేజోధిఽపతయే ఠఠ అస్త్రాయ నమః |

ఓం జ్వల జ్వల ప్రజ్వలప్రజ్వల ఠఠ నమః | 


సాధకుని యొక్క సర్వపాపాలనూ నశింపజేసే ఈ సూర్యమంత్రాలను అగ్నిప్రాకార మంత్రాలని కూడా అంటారు.


No comments:

Post a Comment