మరల శ్రీధర దేవుని ఇలా అంటూ ఆవాహన చేసి పూజ చేయాలి.
ఓం హ్రీం శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః ఆగచ్ఛ |
ఈ పూజానంతరము లక్ష్మీదేవిని ఓం శ్రియై నమః అంటూ పూజించాలి. ఆ తరువాత
ఈ క్రింది మంత్రాలతో షడంగ న్యాసం చేయాలి.
ఓం శ్రాం హృదయాయ నమః,
ఓం శ్రీం శిరసే నమః,
ఓం శ్రూం శిఖాయై నమః,
ఓం శ్రైం కవచాయ నమః,
ఓం శ్రౌం నేత్రత్రయాయ నమః,
ఓం శ్రః అస్త్రాయ నమః' అనంతరము స్వామివారి ఆయుధాలనూ ఆభరణాలనూ అవరోధ వ్రాతము (పరివారము) నూ ఈ మంత్రాలతో అర్చించాలి.
ఓం శంఖాయ నమః, ఓం పద్మాయ నమః,
ఓం చక్రాయ నమః, ఓం గదాయై నమః,
ఓం శ్రీవత్సాయ నమః, ఓం కౌస్తుభాయ నమః,
ఓం వనమాలాయై నమః, ఓం పీతాంబరాయ నమః,
ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః,
ఓం గురుభ్యో నమః, ఓం ఇంద్రాయ నమః,
ఓం అగ్నయే నమః, ఓం యమాయ నమః,
ఓం నిరృతయే నమః, ఓం వరుణాయ నమః,
ఓం వాయవే నమః, ఓం సోమాయ నమః,
విష్ణవే దేవ దేవాయ నమో వైప్రభవిష్ణవే ॥
విష్ణవే వాసుదేవాయ నమః స్థితి కరాయచ |
గ్రసిష్ణవే నమశ్చైవ నమః ప్రళయశాయినే ।
దేవానాం ప్రభవే చైవ యజ్ఞానాం ప్రభవే నమః |
మునీనాం ప్రభవే నిత్యం యక్షాణాం ప్రభవిష్ణవే ॥
జిష్ణవే సర్వ దేవానాం సర్వగాయ మహాత్మనే ।
బ్రహ్మేంద్ర రుద్ర వంద్యాయ సర్వేశాయ నమోనమః ||
సర్వలోక హితార్థాయ లోకాధ్యక్షాయవై నమః ।
సర్వగోప్తే సర్వకర్తే సర్వదుష్ట వినాశినే ॥
వరప్రదాయ శాంతాయ వరేణ్యాయ నమోనమః |
శరణ్యాయ సురూపాయ ధర్మకామార్థదాయినే ॥ (ఆచార31/24-29)
శంకరదేవా! ఏ విధంగా బ్రహ్మ స్వరూపుడు, అవ్యయుడు, పరాత్పరుడునైన విష్ణుభగవానుని స్తుతించి సాధకుడు తన హృదయంలో ఆయనను చూడగలిగి ధ్యానించాలి. తరువాత మూలమంత్ర జపాన్ని చేస్తూ ధ్యానించాలి. ఈ రకంగా చేయగలిగిన వానికి విష్ణువు వశుడౌతాడు. హే రుద్రదేవా! ఈ విధంగా ఒక రహస్య పూర్ణ పరమగుహ్య, భుక్తి ముక్తి ప్రద, విష్ణు ఉత్తమ (వైష్ణవోత్తమ) పూజా విధానాన్ని మీరు నాచే పలికించారు. విద్వాంసుడైన పురుషుడీ పూజను పఠించగానే విష్ణుభక్తశ్రేష్ఠుడై వెలుగొందుతాడు. దీనిని విన్నవారు, చెప్పినవారు విష్ణులోక ప్రాప్తి నొందుతారు. (అధ్యాయాలు 28-31)
No comments:
Post a Comment