మహర్షులారా! ఇపుడు శ్రీధరభగవానుని అనగా విష్ణుదేవుని మంగళమయమైన పూజా విధానాన్ని వర్ణిస్తాను. సాధకుడు ముందుగా ఈ క్రింది మంత్రాలతో అంగన్యాసమును చేయాలి.
ఓం శ్రాం హృదయాయ నమః,
ఓం శ్రీం శిరసే స్వాహా,
ఓం శ్రూం శిఖాయై వషట్,
ఓం శైం కవచాయ హుం,
ఓం శ్రౌం నేత్రత్రయాయ వౌషట్,
ఓం శ్రః అస్త్రాయ ఫట్.
అనంతరం శంఖ, చక్ర, గదాది స్వరూపిణీ ముద్రలను ప్రదర్శించి వాటిని ధరించి యున్న ఆత్మస్వరూపుడైన శ్రీధర భగవానుని ఇందాకటి మంత్రంతో ధ్యానించాలి. స్వస్తిక లేదా సర్వతో భద్రమండలాన్ని సిద్ధం చేసి శ్రీ భగవానుని ఆసనాన్ని పూజించి ఆ స్వామిని
ఓం శ్రీధరాసన దేవతా ఆగచ్ఛత
అని ఆవాహనం చేయాలి.
ఈ క్రింది మంత్రాలతో ఆసన పూజ చేయాలి.
ఓం సమస్త పరివారాయాచ్యుతా సనాయ నమః ఆపై
ఓం ధాత్రే నమః,
ఓం విధాత్రే నమః లతో మొదలెట్టి ధాతా, విధాతా గంగాది దేవతలను ఈ క్రింది మంత్రాలతో పూజించాలి.
ఓం గంగాయై నమః, ఓం యమునాయై నమః, ఓం ఆధార శక్ష్యై నమః, ఓం కూర్మాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం పృథివ్యై నమః, ఓం ధర్మాయ నమః, ఓం జ్ఞానాయ నమః, ఓం వైరాగ్యాయ నమః, ఓం ఐశ్వర్యాయ నమః, ఓం అధర్మాయ నమః, ఓం అజ్ఞానాయ నమః, ఓం అవైరాగ్యాయ నమః, ఓం అనైశ్వర్యాయ నమః, ఓం కందాయ నమః, ఓం నాలాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం విమలాయై నమః,
ఓం ఉత్కర్షిణ్యై నమః, ఓం జ్ఞానాయై నమః, ఓం క్రియాయై నమః, ఓం యోగాయై నమః, ఓం ప్రహ్వ్యై నమః, ఓం సత్యాయై నమః, ఓం ఈశానాయై నమః, ఓం అనుగ్రహాయై నమః,
No comments:
Post a Comment