ప్రాణేశ్వరీ విద్య
(సర్పవిష, దుష్ట ఉపద్రవ హరం)
సూత మహర్షి అనుగ్రహ భాషణం నైమిషారణ్యంలో ఇలా కొనసాగింది.
"ఋషులారా! ఇపుడు మీకు పరమ శివుని ద్వారా గరుత్మంతుని కుపదేశింపడిన ప్రాణేశ్వర మహా మంత్రాన్ని విన్నవిస్తాను. ఐతే, దానికి ముందు ఏయే స్థానాల్లో, సమయాల్లో పాము కాటేస్తే చావు తప్పదో తెలుసుకుందాం.
శ్మశానం, పుట్ట, పర్వతం, నుయ్యి, చెట్టు తొఱ్ఱ- వీటిలో నివసించే పాము కాటువేసినపుడు ఆపేసిన చోట మూడు ప్రచ్ఛన్నరేఖలు ఏర్పడితే మాత్రం ఆ కాటు వేయబడిన ప్రాణులు మిగలరు. మూల, ఆశ్లేష, మఘ మరియు షష్టి రోజున, కర్కాటక, మేషరాశుల్లో వచ్చే నక్షత్రాల్లో పాము కాటుకు గురైనవారు బ్రతకరు. కటి, కణత, సంధిభాగాలు, ముఖము, గొంతుల పై పాము కాటు వేస్తే ఇక ఆ ప్రాణి బ్రతకడం జరగదు. (అనుబంధం –1 చూడండి). దినంలో మొదటి భాగంలో మొదటి అర్ధయామ భాగం సూర్యునిచే భోగింపబడుతుంది. ఆ దివాకర భోగం తరువాత గణనాక్రమం ప్రకారం ఇతర గ్రహాల భోగం వుంటుంది. అలాగే రాత్రి కాలంలో జ్యోతిష్కులు కాల చక్రాధారంగా గ్రహాలను కాలసర్పాలను ఈ విధంగా జోడించారు.
శేషుడు - సూర్యుడు, వాసుకి చంద్రుడు, తక్షకుడు -మంగళుడు, కర్కోటకుడు - బుధుడు, పద్ముడు - గురుడు, మహాపద్ముడు-శుక్రుడు, శంఖుడు -శని, కులికుడు - రాహువు.
రాత్రయినా పగలైనా బృహస్పతి (గురుడు) భోగకాలం వచ్చినపుడు సర్పాలు దేవతలనైనా అంతం చేయగలవు. కాబట్టి ఈ కాలంలో పాముకాటుకి విరుగుడు లేదు, చావు తప్పదు. పగలు శని భోగమూ అంతే.
No comments:
Post a Comment