అంగన్యాసానంతరము సాధకుడు ఈ దిగువ నీయబడిన మంత్రాలతో సూర్యాది నవగ్రహాలకు 'మానసీపూజ'ను సంపన్నం గావించాలి.
ఓం సః సూర్యాయ నమః
ఓం సోం సోమాయ నమః
ఓం మం మంగలాయ నమః
ఓం బుం బుధాయ నమః
ఓం బృం బృహస్పతయే నమః,
ఓం భం భార్గవాయ నమః,
ఓం శం శనైశ్చరాయ నమః,
ఓం రం రాహవే నమః,
ఓం కం కేతవే నమః,
ఓం తేజశ్చండాయ నమః ।
ఈ విధంగా సూర్య దేవాదులను పూజించి ఆచమనం చేసి ఆపై ఈ క్రింది మంత్రాలతో చిటికెన వ్రేలితో మొదలెట్టి అన్ని వేళ్ళతో కరన్యాస, అంగన్యాసాలను చేయాలి.
ఓం హం హృదయాయ నమః,
ఓం హీం శిరసే స్వాహా,
ఓం హూం శిఖాయై వౌషట్,
ఓం హైం కవచాయ హుం,
ఓం హౌం నేత్రత్రయాయ వౌషట్,
ఓం హః అస్త్రాయ ఫట్ |
తరువాత భూతశుద్ధి గావించి మరల న్యాసం చేయాలి. అర్ఘ్యస్థాపన చేసి ఆ జలాన్ని తన శరీరంపై జల్లుకోవాలి. తరువాత శివునితో పాటు నందీశ్వరాదులను పూజించాలి. 'ఓం హౌం శివాయ నమః' అనే మంత్రంతో పద్మస్థితుడైన పరమశివుని పూజించిన పిమ్మట నంది, మహాకాల, గంగ, యమున, సరస్వతి, శ్రీవత్స, వాస్తుదేవత, బ్రహ్మ, గణపతిలనూ తదుపరి తన గురుదేవునీ సాధకుడు అర్చించాలి.
No comments:
Post a Comment