తరువాత కమలాంకిత గర్భయైన ఆ మండలంలో నీలకంఠుని పూజించాలి. దాని అగ్ని కోణంలో అర్ధచంద్రాకారయుక్తమైన ఒక మంగళమయ అగ్ని కుండాన్ని నిర్మించాలి. అప్పుడు అగ్నిదేవుని అస్త్రయుక్తంగా హృదయాదులలో న్యాసం చేయాలి. తరువాత మండలంలోనున్న కమల కర్ణికపై సదాశివునికీ దిశలలో అస్త్రాలకీ పూజచేయాలి. అంతట పంచతత్త్వాలలో నుండు పృథ్వీ, జల తత్త్వ శక్తులకు విడివిడిగా వంద వంద ఆహుతులను అయిదేసిమార్లు అర్పించి ప్రసన్నతాపూర్వకంగా త్రిశూలధారియైన శివుని ధ్యానించాలి.
అనంతరం ప్రాయశ్చిత్తశుద్ధికై ఎనిమిదిమార్లు ఆహుతులివ్వాలి. ఈ ఆహుతులను అస్త్రబీజమైన 'హుంఫట్' అనే మంత్రంతో అర్పించడం శ్రేష్ఠం. ఈ ప్రకారంగా సంస్కారాన్ని శుద్ధిని సాధించిన సాధకుడు సాక్షాత్తు శివస్వరూపుడే కాగలడు.
శివుని యొక్క విశేషపూజలో సాధకుడు మొదట
ఓం హాం ఆత్మ తత్త్వాయ స్వాహా
ఓం హీం విద్యాతత్త్వాయ స్వాహా
ఓం హూం శివతత్త్వాయ స్వాహా
అని ఉచ్చరిస్తూ ఆచమనం చేయాలి. తరువాత మానసిక రూపంతో కర్ణేంద్రియాలను స్పర్శించాలి. భస్మధారణ చేసి తర్పణాది క్రియలను ఈ మంత్రాలతో చేయాలి.
'ఓం హాం ప్రపితా మహేభ్యః స్వధా,
'ఓం హాం మాతా మహేభ్యః స్వధా'
ఓం హాం నమః సర్వ మాతృభ్యః స్వధా'
ఇలాగే తన పితరులందరికీ తర్పణాలిచ్చుకొని సాధకుడు ప్రాణాయామం చేసి ఆచమన, మార్జనలనాచరించి ఈ క్రింది శివగాయత్రి మంత్రాన్ని జపించాలి.
'ఓం హాం తన్మహేశాయ విద్మహే,
వాగ్విశుద్ధాయ ధీమహి
తన్నోరుద్రః ప్రచోదయాత్ |'
(అనుబంధం - 2 చూడండి)
పిమ్మట ఈ క్రింది మంత్రాలను జపించాలి.
ఓం హాం హీం హూం హైం హౌం హః
శివ సూర్యాయ నమః |
ఓం హం ఖఖోల్కాయ సూర్యమూర్తయే నమః ।
ఓం హ్రాం హ్రీం సః సూర్యాయ నమః ।
ఈ మంత్రాలను సూర్యోపస్థానం చేసి, సూర్య మంత్రాలతోనే సూర్యరూపుడైన మహేశ్వరుని పూజించడంలో భాగంగా జపించాలి.
No comments:
Post a Comment