Wednesday 3 January 2024

శ్రీ గరుడ పురాణము (52)

 

సూర్యుని ప్రసన్నం చేసుకోవడానికి సూర్యగాయత్రిని కూడా పఠించి పూజ చేయవచ్చును. ఆ మంత్రాలను జపించిన తరువాత సూర్య మరియు గాయత్రి మంత్రాలను సకలీకరణం చేయాలి.


ఓం ఆదిత్యాయ విద్మహే, విశ్వభావాయ ధీమహి, తన్నః సూర్యః ప్రచోదయాత్ ॥


తరువాత సాధకుడు దిక్కుల్లో మూలల్లో వాటి అధిపతులనూహించుకొని వారికి ఈ మంత్రాలను చదువుతూ నమస్కరించాలి.


ఓం ధర్మాత్మనే నమః, తూర్పు 

ఓం యమాయ నమః, దక్షిణం 

ఓం దండనాయకాయ నమః, పశ్చిమం 

ఓం దైవతాయ నమః, ఉత్తరం

ఓం శ్యామపింగలాయ నమః, ఈశాన్యం 

ఓం దీక్షితాయ నమః, అగ్ని కోణం 

ఓం వజ్రపాణయే నమః, నైరృత్యం 

ఓం భూర్భువః స్వః నమః, వాయుకోణం

మహేశా! ఆ తరువాత సాధకుడు చంద్రాదిగ్రహాలను కూడా తూర్పు దిక్కుతో మొదలు పెట్టి క్రమంగా ఈశాన్యం దాకా తిరుగుతూ ఈ క్రింది మంత్రాలు చదువుతూ నమస్కారసహితంగా పూజించాలి.


ఓం చంద్రాయ నక్షత్రాధిపతయే నమః ।

ఓం అంగారకాయ క్షితిసుతాయ నమః | 

ఓం బుధాయ సోమ సుతాయ నమః |

ఓం వాగీశ్వరాయ సర్వవిద్యాధిపతయే నమః ।

ఓం శుక్రాయ మహర్షయే భృగుసుతాయ నమః ।

ఓం శనైశ్చరాయ సూర్యాత్మ జాయ నమః ।

ఓం రాహవే నమః |

ఓం కేతవే నమః |


అనంతరం ఈ క్రింది మంత్రాలతో సూర్యదేవుని పూజించి అర్ఘ్యాది ప్రదానానికై ఆవాహన చేయాలి.


ఓం అనూరుకాయ నమః ।

ఓం ప్రమథనాథాయ నమః |

ఓం బుధాయ నమః ।


'ఓం భగవన్నపరిమితమయూఖమాలిన్ సకల జగత్పతే సప్తాశ్వవాహన చతుర్భుజ పరమసిద్ధి ప్రద విస్ఫులింగ పింగలతత్ ఏహ్యేహి ఇదమర్ఘ్యం మమ శిరసిగతం గృహ్ణ గృహ్ణ గృహ్ణ తేజోగ్రరూపం అనగ్న జ్వలజ్వల ఠఠ నమః'


No comments:

Post a Comment